
దేవగఢ్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ లక్ష్యంగా ప్రధాని మోదీ ఆరోపణలు గుప్పించారు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయడానికి కాంగ్రెస్ యువరాజు కుట్రలు సాగిస్తున్నాడని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాలే పరమావధిగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను బలహీనపర్చడం కోసం రిజర్వేషన్లు అంతం చేయడానికి ప్రయతి్నస్తున్నాడని చెప్పారు.
బుధవారం జార్ఖండ్‌లో రెండు ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో జేఎంఎం ప్రభుత్వం అక్రమ వలసదార్లను ప్రోత్సహించిందని, సర్కారు అండతో వారంతా శాశ్వత నివాసితులుగా మారిపోయారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల విషయంలో కాంగ్రెస్ ఉద్దేశాలు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. యువ రాజు తండ్రి(రాజీవ్ గాం«దీ)రిజర్వేషన్లను వ్యతిరేకించారని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment