Cancellation of reservations
-
రిజర్వేషన్ల రద్దుకు ‘యువరాజు’ కుట్రలు: మోదీ
దేవగఢ్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ లక్ష్యంగా ప్రధాని మోదీ ఆరోపణలు గుప్పించారు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయడానికి కాంగ్రెస్ యువరాజు కుట్రలు సాగిస్తున్నాడని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాలే పరమావధిగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను బలహీనపర్చడం కోసం రిజర్వేషన్లు అంతం చేయడానికి ప్రయతి్నస్తున్నాడని చెప్పారు. బుధవారం జార్ఖండ్‌లో రెండు ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో జేఎంఎం ప్రభుత్వం అక్రమ వలసదార్లను ప్రోత్సహించిందని, సర్కారు అండతో వారంతా శాశ్వత నివాసితులుగా మారిపోయారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల విషయంలో కాంగ్రెస్ ఉద్దేశాలు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. యువ రాజు తండ్రి(రాజీవ్ గాం«దీ)రిజర్వేషన్లను వ్యతిరేకించారని గుర్తుచేశారు. -
Lok sabha elections 2024: కమలానికి పెనుసవాళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా కృషిచేస్తున్న కమల దళానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనా«థ్ తదితర కీలక నేతలు సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు విపక్షం నుంచి ఎదురుదాడి, మిత్రపక్షాల కారణంగా తలెత్తుతున్న చిక్కులు, కొన్ని వర్గాల్లో నానాటికీ పెరుగుతున్న అసంతృప్తి వంటివి బీజేపీలో అలజడి సృష్టిస్తున్నాయి. రిజర్వేషన్ల రద్దు అంశంపై రగడ ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఇప్పటిదాకా సొంతంగా 432 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. మరో పది నుంచి పదిహేను మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. మొత్తం 445 మంది అభ్యర్థులను బరిలో నిలిపినా, 370 సీట్ల లక్ష్యం సాధించాలంటే 80 శాతానికి పైగా స్థానాల్లో కచి్చతంగా నెగ్గాల్సి ఉంటుంది. కానీ, అందుకు ప్రతిబంధకాలు లేకపోలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. రిజర్వేషన్లు, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని పదేపదే ఆరోపిస్తున్నాయి. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక, ఆప్ నేత సంజయ్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ రిజర్వేషన్లు, రాజ్యాంగంపై బీజేపీని ఇరుకున పెడుతున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ ఇటీవల వైరల్ చేసిన అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో తర్వాత రిజర్వేషన్ల రద్దు అంశంపై జనంలో చర్చ మొదలైంది. రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదని, అలాంటి ఆలోచనే లేదని నరేంద్ర మోదీ, అమిత్ షా ఎన్నికల ప్రచార సభల్లో హామీ ఇస్తున్నప్పటికీ, దేశంలో 80 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల్లో అనుమానాలు పూర్తిగా తొలగిపోవడం లేదు. మరో ఐదు విడతల్లో 350కి పైగా స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. రిజర్వేషన్ల రద్దు వ్యవహారం ఓటర్లపై తప్పనిసరిగా ప్రభావం చూపుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అందుకేనా 400 సీట్లు? మళ్లీ బీజేపీని గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చేయడం ఖాయం అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. రాజ్యాంగంతోపాటు కీలకమైన చట్టాలను మార్చడానికే ‘అబ్కీ బార్ చార్ సౌ పార్’ నినాదాన్ని బీజేపీ తెరపైకి తెచి్చందని కాంగెరస్ అధ్యక్షుడు ఖర్గే సహా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. న్యాయం, సమానత్వం, పౌర హక్కులు, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ద్వేషిస్తోందని, నియంతృత్వ పాలన తీసుకురావడమే ఆ పార్టీ లక్ష్యమని విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపైనా ప్రధాని నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాల్సి వచి్చంది. సాక్షాత్తూ బాబాసాహెబ్ అంబేడ్కర్ దిగివచి్చనా రాజ్యాంగాన్ని మార్చలేరని ఆయన పలు సభల్లో చెప్పారు. అయినప్పటికీ రాజ్యాంగ మార్పుపై బీజేపీ నేతలు అనంతకుమార్ హెగ్డే, అరుణ్ గోవిల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి సంకటంగా మారాయి. రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం తమకు లేదని మోదీ పదేపదే స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా విపక్షాల దాడిని సమర్థంగా తిప్పికొట్టడంలో బీజేపీ విఫలమవుతోంది. రాజ్యాంగం మార్పుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొన్ని వర్గాల ప్రజలు నమ్ముతున్నట్లే కనిపిస్తోంది. ఇంకోవైపు రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తమ జనాభా ఉన్న స్థానాల్లోనూ తమ వర్గం వారికి టిక్కెట్లు ఇవ్వలేదని రాజ్‌పుత్‌లు బీజేపీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. మహాపంచాయతీలు నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలతో వివాదం కర్ణాటకలో బీజేపీ మిత్రపక్షమైన జేడీ(ఎస్) సిట్టింగ్ ఎంపీ, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కర్ణాటకలో రెండో విడత పోలింగ్‌కు రెండు రోజుల ముందు ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతోంది. ప్రజ్వల్ రేవణ్ణను జేడీ(ఎస్) నుంచి బహిష్కరించినప్పటికీ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. -
Lok sabha elections 2024: ఫేక్ రాజకీయం!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏప్రిల్ 23న తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మతపరమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను వారికి తిరిగిస్తామని ప్రకటించారు. అయితే మొత్తంగా రిజర్వేషన్లనే రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్టుగా మారి్ఫంగ్ చేసిన వీడియో తాజాగా దేశవ్యాప్తంగా వైరలవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర నష్టం చేయగల ఈ పరిణామాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర హోం శాఖ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. దీంతో సంబంధముందంటూ అసోంలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక ఈ నకిలీ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ విస్తృతంగా షేర్ చేసిందంటూ పీసీసీ చీఫ్ అయిన సీఎం రేవంత్‌రెడ్డికి ఏకంగా సమన్లు జారీ చేశారు! సోమవారం హైదరాబాద్ వచ్చి మరీ రేవంత్, పీసీసీ సోషల్ మీడియా ఇన్చార్జి, మరికొందరు కాంగ్రెస్ నేతలకు నోటీసులిచ్చారు! అమిత్ షా మార్ఫింగ్ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారన్నది రేవంత్‌పై ఆరోపణ. రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్న ఈ పరిణామంతో డీప్ ఫేక్ ముప్పు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది...దేశం ఇప్పుడు సమాచార యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. సాంకేతికత సమాచారాన్ని ఎంత వేగంగా ప్రచారం చేస్తోందో అంతే వేగంగా దేశాన్ని ప్రమాదంలోనూ పడేస్తోంది. ముఖ్యంగా కృత్రిమ మేధతో పుట్టుకొచి్చన వికృత శిశువు ‘డీప్ ఫేక్’ ఎన్నికల్లో పెద్ద అస్త్రంగా మారిపోయింది. పారీ్టలు ఫేక్ వీడియోలతో తమ ప్రత్యర్థులపై దు్రష్పచారం చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫేక్ వీడియోలు విపరీతంగా కలకలం రేపడమే గాక ఓటర్లపైనా బాగా ప్రభావం చూపాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఫేక్ వీడియోల జోరు మామూలుగా లేదు! పలు పార్టీలు తమ చేతికి మట్టి అంటకుండా డీప్ ఫేక్‌లను వీలైనంతగా వాడుకుంటున్నాయి. చౌక బేరండీప్ ఫేక్‌లను రూపొందించడానికి అవసరమైన కృత్రిమ మేధ సాధనాలు కారుచౌకగా అందుబాటులో ఉన్నాయి. కొన్నయితే ఉచితం కూడా! దాంతో పారీ్టలన్నీ ఓటర్లను ప్రభావితం చేయడానికి ఎడాపెడా డీప్ ఫేక్‌లను తయారు చేసి వదులుతున్నట్టు వాటి నిర్వాహకులే చెబుతున్నారు. టీవీ వార్తలు మొదలుకుని ఫేస్బుక్, వాట్సాప్ వంటి గ్లోబల్ ప్లాట్‌ఫాంల దాకా నకిలీ వార్తల రూపకల్పన, ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. ఇవి ఒకసారి జనంలోకి వెళ్లాక ఏం చేసినా నష్ట నివారణ కష్టమే.ఏఐ వాడకం..బీజేపీతోనే మొదలు... » ప్రచారంలో సాంకేతికతను వాడకంలో అధికార బీజేపీ ఎంతో ముందంజలో ఉంది. » ఆ పార్టీ 2012లోనే మోదీ త్రీడీ హాలోగ్రామ్‌ను వాడింది! దీని ద్వారా ఒకేసారి అనేక ప్రదేశాల్లో ప్రచారంలో పాల్గొనవచ్చు. » ఈ వ్యూహాన్ని 2014 లోక్‌సభ ఎన్నికల్లో విస్తృతంగా అమలు చేశారు. » ప్రచారం కోసం డీప్‌ఫేక్‌లను వాడిన తొలి నేతగా ఢిల్లీ బీజేపీ ఎంపీ, సినీ నటుడు మనోజ్ తివారీ నిలిచారు. 2020లో ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ హిందీ, హర్యాణ్వీ, ఇంగ్లిష్ భాషల్లో ఓటర్లనుద్దేశించి మూడు వీడియోల్లో ప్రసంగించారు. వీటిలో హిందీ వీడియో మాత్రమే అసలుది. మిగతా రెండూ డీప్ ఫేక్‌లు. కానీ ఏ మాత్రమూ గుర్తించలేనంత పకడ్బందీగా తివారీ గొంతు, పెదవుల కదలిక తదితరాలను మార్చారు! గతి తప్పుతున్న వ్యూహం అధికారికంగా, బహిరంగంగా జరిగే డీప్ ఫేక్ వ్యవహారాన్ని మించి ప్రత్యర్థులపై బురదజల్లేలా ‘అనైతిక ప్రచారం’ జోరుగా సాగుతోంది. వాట్సాప్‌లో అంతర్జాతీయ నంబర్లు, ఇన్స్టా్రగాంలో బర్నర్ హ్యాండిల్స్ తదితరాల ద్వారా ఇలాంటి కంటెంట్ ప్రజలను చేరుతోంది. రాజకీయ ప్రత్యర్థుల వీడియోలు, ఆడియోలకు అభ్యంతరకర, అశ్లీల కంటెంట్‌ను జోడిస్తూ డీప్ ఫేక్‌లు హోరెత్తిస్తున్నాయి. పలు సంస్థలు ఇలాంటి కంటెంట్ తయారీతో పాటు దాన్ని వైరల్ చేసే బాధ్యతనూ తీసుకుంటున్నాయి. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా నిర్మాణ కారి్మకుల ఫోన్ నంబర్ల సాయంతో డీప్ ఫేక్‌లను విచ్చలవిడిగా వైరల్ చేశారు. అభ్యర్థులు అవినీతిపరులని చూపేందుకు డబ్బులు తీసుకుని ఓటేయాలని ఓటర్లను బెదిరిస్తున్నట్టు, డబ్బు పంచుతున్నట్టు వీడియోలు, ఆడియోలు రూపొందించి ప్రచారం చేశారు. ప్రత్యర్థులపైనే గాక సొంత పారీ్టలోనూ శత్రువులపైనా కొందరు ఇలాంటి ప్రచారాలకు దిగుతున్నారు!చట్టాలకావల మన దేశంలో డీప్ ఫేక్ ఎన్నికల సమగ్రతకే ముప్పుగా మారుతోంది. ప్రస్తుత చట్టాలేవీ డీప్ ఫేక్ను స్పష్టంగా నిర్వచించడం లేదు. వ్యక్తిగత కేసుల్లో ఐటీ చట్టంతో కలిపి, పరువు నష్టం, నకిలీ వార్తలు, వ్యక్తి ప్రతిష్టకు భంగం, ప్రైవసీ ఉల్లంఘన వంటి చట్టాలను వాడుతూ పోలీసులు నెట్టుకొస్తున్నారు. నిరాశపరిచిన మ్యూనిచ్ ఒప్పందం డీప్ ఫేక్‌లను నియంత్రించాలంటూ గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలపై కేంద్రం ఒత్తిడి తెస్తోంది. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు కృత్రిమ మేధ సాధనాలను వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటూ ప్రముఖ టెక్ కంపెనీలు మ్యూనిచ్ సదస్సులో ఒప్పందానికి వచి్చనా ఆచరణలో పెద్దగా జరిగిందేమీ లేదు. గతేడాది తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలాంటిదే జరిగింది. కాంగ్రెస్‌కు ఓటేయాలంటూ బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ ప్రజలకు పిలుపునిస్తున్న వీడియో క్లిప్ పోలింగ్‌కు ముందు రోజు తెగ వైరలైంది. దాన్ని లక్షలాది మంది చూశారు. ఇదీ కృత్రిమ మేధ సాయంతో రూపొందిన డీప్ ఫేక్ వీడియోనే.నోట్ దీజ్ పాయింట్స్» భారత్‌లో జనాభాలో సగానికి పైగా, అంటే ఏకంగా 76 కోట్ల పై చిలుకు ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. » కనుక ఆన్లైన్ ప్రచారం శరవేగంగా ప్రజలను చేరుతోంది. » రీల్స్, షార్ట్స్ ప్రపంచాన్ని ఏలుతున్న ఈ రోజుల్లో ఒక్క క్లిక్, ఒక్క స్వైప్‌తో ఓటరు అభిప్రాయాన్ని మార్చొచ్చు. కనీసం ప్రభావితం చేయొచ్చు. » పార్టీ అభిమానులు పెద్దగా పట్టించుకోకున్నా తటస్థ ఓటర్లను ఇలాంటి ప్రచారం ప్రభావితం చేయగలదు. » ఈ అంశాన్ని తమ అభిమాన పార్టీలకు సానుకూలంగా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. » అందుకే కృత్రిమ మేధతో పుట్టుకొచ్చే ‘మానిప్యులేటెడ్ కంటెంట్’ ఈ లోక్‌సభ ఎన్నికల్లో అనేక రెట్లు పెరగనుందని అంచనా. తప్పుడు ప్రచారంతో ఒక్క ఓటర్ మనసు మార్చినా అది స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు గొడ్డలిపెట్టే. ఈ తప్పుడు ప్రచార సరళి మీద ఈసీ దృష్టి పెట్టి ప్రజాస్వామ్యానికి చేటుగా మారుతున్న డీప్‌ఫేక్‌లను నియంత్రించాల్సిన అవసరముంది. నష్టం జరగకముందే చర్యలు తీసుకోవాలి– కేంద్ర ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్ ఎస్‌వై ఖురేషీ–సాక్షి, నేషనల్ డెస్క్ -
వన్నియార్లకు రిజర్వేషన్లు కుదరదన్న సుప్రీం
న్యూఢిల్లీ: వన్నియార్లను (వన్నియకుల క్షత్రియులు) ప్రత్యేకంగా గుర్తించేందుకు గణనీయమైన ప్రమాణాలు లేవని గురువారం సుప్రీంకోర్టు వెల్లడించింది. అందువల్ల వీరికి ఎంబీసీల్లో కేటాయించిన 10.5 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీరికి రిజర్వేషన్ ఇవ్వాలన్న సిఫార్సుకు కేవలం జనాభాను మాత్రమే ప్రాతిపదికన తీసుకున్నారని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవైతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఎంబీసీల్లోని 115 కులాల్లో వీరిని ప్రత్యేకంగా చూసేందుకు కావాల్సిన ఆధారాల్లేవని తెలిపింది. అందువల్ల వీరికి రిజర్వేషన్లు కల్పిస్తూ 2021లో చేసిన చట్టం ఆర్టికిల్ 14, 15, 16కు వ్యతిరేకమని, రిజర్వేషన్ల రద్దుపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్ధిస్తున్నామని తెలిపింది. అంతర్గత రిజర్వేషన్లకు కులం ఒక కారణం కావచ్చు కానీ అదొక్కటే కారణం కాకూడదని తెలిపింది. ఎంబీసీ, డీఎన్‌సీలకు కేటాయించిన 20 శాతం రిజర్వేషన్లలో అంతర్గతంగా వన్నియార్లకు 10.5 శాతం రిజర్వేషన్ కేటాయించడం ఇతర వర్గాలను దెబ్బతీస్తుంద న్నది. ఈ విషయాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న అభ్యర్ధనను కూడా కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈ కోటా కింద జరిపిన నియామకాలపై తాజా తీర్పు ప్రభావం ఉండదని తెలిపింది. వన్నియార్లకు ప్రత్యేక రిజర్వేషన్ రా జ్యాంగ విరుద్ధమని తమిళనాడుహైకోర్టు గతేడాది తీర్పునిచ్చింది. -
ఊరెళ్లే దారేది..?
- సమైక్య సమ్మెతో రవాణా కష్టాలు - దసరా ప్రయాణాలపై తీవ్ర ప్రభావం - ఆర్టీసీ బస్సుల్లేక అవస్థలు - ప్రయివేటు బస్సుల దోపిడీ - విద్యుత్ సంక్షోభంతో తిరగని రైళ్లు - భారీగా రైలు రిజర్వేషన్ల రద్దు ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ప్రయివేటు బస్సుల చార్జీలు భగ్గుమంటున్నాయి. విద్యుత్ సంక్షోభంతో రైళ్లు ఆగిపోతున్నాయి. అరకొర నడిచినా కిటకిటలాడిపోతున్నాయి. ఈ పరిస్థితిలో ఊరెలా వెళ్లాలి? బంధువుల్ని ఎలా కలుసుకోవాలి? దసరా పండగెలా జరుపుకోవాలి?... లక్షలాది నగర ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. పండగ రోజుకల్లా ఊరు చేరే దారి కోసం వెతుకుతున్నారు. విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : దసరా సెలవులకు సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్న వారు రెండు, మూడు నెలల ముందే రైళ్లలో రిజర్వేషన్ చేయించుకున్నారు. రోడ్డు మార్గంలో వెళ్లాలనుకున్న వారు నాలుగైదు రోజుల ముందు రిజర్వేషన్ చేయించుకుంటే సరిపోతుందని ధీమాగా ఉన్నారు. ఇంతలో 70 రోజుల కిందట రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించడంతో అంతా తారుమారైంది. సీమాంధ్రలో ఉద్యమం ప్రారంభమైంది. స్వల్ప వ్యవధిలో అత్యంత ఉధృత రూపం దాల్చింది. కనీవినీ ఎరగని రీతిలో ఆర్టీసీ కార్మికులంతా ఆందోళన బాట పట్టారు. ఆగస్టు 12వ తేదీ అర్థరాత్రి నుంచి సీమాంధ్ర జిల్లాల్లో ఎక్కడి ఆర్టీసీ బస్సులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయివేటు ఆపరేటర్ల పంట పడింది. సాధారణ రోజుల్లో విశాఖ నుంచి విజయవాడకు రూ.250 వసూలు చేసే ప్రయివేట్ ఆపరేటర్లు ప్రస్తుతం రూ.500 వసూలు చేస్తున్నారు. విశాఖ నుంచి తిరుపతికి రూ.1100 వసూలు చేస్తే ప్రస్తుతం రూ.1500 వసూలు చేస్తున్నారు. కార్లు అద్దెకు తీసుకుని వెళ్దామన్నా ట్రావెల్స్ సంస్థలు కూడా అద్దెల్ని అమాంతం పెంచాయి. ఈ బాధలు పడలేక రైల్లో గమ్యస్థానాలు చేరుకోగలిగే అవకాశమున్న వారు రైళ్లను ఆశ్రయిస్తుండటంతో నిరీక్షణ జాబితా చాంతాడంత అవుతోంది. ప్రయాణపు తేదీకి బెర్తు ఖరారవుతుందో, లేదో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్రయాణాలను రద్దు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. రెండు, మూడు నెలల కిందటే దసరా సెలవుల్లో ప్రయాణాలు ఖరారు చేసుకుని టికెట్లు రిజర్వ్ చేయించుకున్న వారికి విద్యుత్ ఉద్యోగుల సమ్మె తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రైళ్ల రాకపోకలు తీవ్ర ఆలస్యం కావడం, విద్యుత్ సమస్య, డీజిల్ ఇంజిన్లు అందుబాటులో లేక ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం, అనేక రైళ్లు రద్దు కావడంతో ముందస్తు రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. మూడు రోజులుగా వేలాది మంది తమ టికెట్లు రద్దు చేసుకున్నారు. జనరల్ బోగీల్లోనైనా ఊరు వెళ్లాలనుకున్న సామాన్యులు కిక్కిరిసిన రైళ్లను చూసి జడుసుకుంటున్నారు. ప్రయివేటు విమాన సంస్థలు సైతం ఈ పరిస్థితులను సొమ్ము చేసుకునేందుకు తెగబడ్డాయి. విశాఖపట్నం నుంచి చెన్నైకి సాధారణ రోజుల్లో రూ.4000 వరకు టికెట్ చార్జీ వసూలు చేసే ప్రయివేట్ విమాన సంస్థలు అమాంతం రూ.6000 వరకూ పెంచేశాయి. హెదరాబాద్ టికెట్ ధరను కూడా భారీగా పెంచాయి. ఈ కష్టాలు పడేకన్నా ఉన్నచోటే దసరా పండుగ జరుపుకొనేందుకు అత్యధిక శాతం ప్రజలు సిద్ధమవుతున్నారు.