Updates..
తెలంగాణలో ముగిసిన రాహుల్ తొలి విడత బస్సు యాత్ర
►ఆర్మూర్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఖానాపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్
►మూడు రోజులపాటు సాగిన యాత్ర
►18న రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి యాత్ర ప్రారంభించిన రాహుల్, ప్రియాంక..
►ములుగు నియోజక వర్గం నుంచి ఆర్మూర్ వరకు సాగిన యాత్ర
►ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, చొప్పదండి, ఆర్మూర్ నియోజక వర్గాలలో సాగిన యాత్ర
►ఆర్మూర్ నుంచి హైదరాబాద్‌కు రోడ్ మార్గంలో రాహుల్
►శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్న రాహుల్
ఆర్మూర్‌లో రాహుల్ కార్నర్ మీటింగ్
►ఒక్క కుటుంబం వద్ద తెలంగాణ బందీ అయింది: రాహుల్ గాంధీ
►కేసీఆర్ లూటీ చేసిన డబ్బును వెనక్కి రప్పిస్తా
►కాంగ్రెస్ బస్సు యాత్ర మూడో రోజు కొనసాగుతోంది..
►జగిత్యాలలో రాహుల్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరగబోతోంది. దొరలు తెలంగాణను రాజ్యమేలుతున్నారు.. దీన్ని సహిద్దామా?. దోపిడీ సొమ్మంతా బీఆర్‌ఎస్ నేతల జేబుల్లోకి వెళ్తోంది. బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు ఒక్కటే. ఈ మూడు పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయి. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు కోసం ఎంఐఎం పోటీ చేసి సాయం చేస్తోంది.
►కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూడు చక్కెర ఫ్యాక్టరీలను ప్రారంభిస్తాం. వరి ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లిస్తాం. తెలంగాణతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. నా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేశారు, ఇల్లు లాక్కున్నారు. పసుపు పంటకు 12వేల నుంచి 15వేల మద్దతు ధర ఇస్తాం. బడ్జెట్ కేటాయింపుల్లో ఓబీసీలకు ఎన్ని నిధులు ఇస్తున్నారు. కుల గణన చేయడానికి మోదీ, కేసీఆర్ ఎందుకు ముందుకు రావడంలేదని ప్రశ్నించారు.
►నేడు మూడోరోజు కాంగ్రెస్ విజయభేరీ యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు కరీంనగర్ వీపార్క్ హోటల్ నుంచి రాహుల్ గాంధీ బయలుదేరనున్నారు. మొదట చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గం గంగాధర వద్ద కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అయితే, మల్యాలలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాల్సి ఉండగా.. పర్యటన రద్దు చేసుకున్నారు. షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు. అనంతరం, జగిత్యాల పట్టణంలో కార్నర్ మీటింగ్‌లో రాహుల్ ప్రసంగించనున్నారు.
షెడ్యూల్ ఇలా..
►మధ్యాహ్నం వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లిలో కార్నర్ మీటింగ్
►మధ్యాహ్నం కోరుట్లలో సమావేశం
►ఆ తర్వాత ముక్కాస్ కన్వెన్షన్‌లో భోజన విరామం
►అనంతరం నిజామాబాద్ జిల్లాకు చేరుకోనున్న రాహుల్ గాంధీ
►ఆర్మూర్ బహిరంగ సభ తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లిపోనున్న రాహుల్ గాంధీ.
కోదండరామ్‌తో రాహుల్ భేటీ..
కరీంనగర్ వీపార్క్ హోటల్‌లో రాహూల్ గాంధీని తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధ్యక్షుడు కోదండరామ్ కలుసుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడినట్టు కోదండరామ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: నేడు బీజేపీ తొలి జాబితా.. 70 స్థానాల్లో అభ్యర్థులు ఫిక్స్!
Comments
Please login to add a commentAdd a comment