కనక దుర్గమ్మ దేవాలయ ఈవో ఎం. పద్మ
విజయవాడ: ప్లాస్టిక్ ఫ్రీ టెంపుల్‌గా విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాన్ని తీర్చిదిద్దుదామంటూ నూతన ఈవో పద్మ సలహా ఇచ్చారు. దుర్గ గుడి నూతన ఈవోగా నియమితులైన ఎం.పద్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మాడపాటివారి సత్రంలో దుర్గగుడి పాలకమండలి సమావేశం ఏర్పాటు చేశారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆమె అద్యక్షతన మొట్టమొదటి పాలకమండలి సమావేశం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు.
ఫిబ్రవరి చివరి వారంలో శివాలయం తెరుద్దామని అనుకుంటున్నామని చెప్పారు. దుర్గ గుడిలో రేట్లు గురించి కూడా చర్చించామని వెల్లడించారు. త్వరలో ఈ విషయం గురించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శివరాత్రికి శివాలయ దర్శనం ఇవ్వాలని అనుకున్నాం..కానీ మూహూర్తలు లేనందువల్ల ఫిబ్రవరిలో నెలాఖరులో శివాలయం దర్శనం కల్పించేలా చూస్తామని చెప్పారు. భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా, అగమ శాస్త్రం అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటానని వెల్లడించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా, దుర్గగుడి ఈవోగా రెండు బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని చెప్పారు.
ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారని, దేవస్థానంలో ఆఫీసు ఏర్పాటు చెయ్యాలని ప్రతిపాదించారు..అలా చెయ్యటం వల్ల దేవాలయంలో అవినీతి తగ్గి భక్తులకు మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న కార్యక్రమాలు అధ్యయనం చేసి ఇక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ పారదర్శకంగా ఉండే విధంగా అమలు చేయ్యటం జరుగుతుందన్నారు. ప్రతి నెల మొదటి వారంలో పాలకమండలి సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment