ప్రకటనలో ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అని ఉండాల్సిన చోట ‘ఆంధ్రజ్యోతి ప్రభుత్వం’ అని ఉన్న దృశ్యం
కడప కల్చరల్: ‘పిచ్చి కుదిరింది.. తలకు రోకలి చుట్టండి..’అనే సామెత ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోంది. ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం ఓ తెలుగు పత్రిక వార్తా ఏజెన్సీకి అప్పగించిన విషయం తెలిసిందే. ‘ఫలానా పత్రిక ఏజెన్సీ ద్వారా’ అంటూ పత్రికలకు అందే సమాచారంలో తెలియజేస్తారు. అయితే ఆ పత్రికపై ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఇష్టం తారాస్థాయికి పెరిగిందేమో.. ఏకంగా సర్కారు పేరే మార్చేశారు.
మంగళవారం జిల్లా సమాచార శాఖ ద్వారా అందిన దేవాదాయ శాఖ ప్రెస్‌నోట్‌లో ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అని ఉండాల్సిన చోట ‘ఆంధ్ర జ్యోతి ప్రభుత్వం’అని ఉండటం గమనార్హం. దీన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. దీనిపై జిల్లా సమాచార శాఖ ఏడీని అడిగితే ఆ ప్రకటన అమరావతి కార్యాలయం నుంచి వచ్చిందని, యథాతథంగా పత్రికలకు పంపామని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment