ఆలయాల్లో వరుణయాగం | Varuna Japam at temples | Sakshi
Sakshi News home page

ఆలయాల్లో వరుణయాగం

Published Fri, Aug 26 2016 11:52 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

ఆలయాల్లో వరుణయాగం - Sakshi

ఆలయాల్లో వరుణయాగం

 
నెల్లూరు(బృందావనం): దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ఆలయాల్లో శుక్రవారం గో పూజలు, వరుణసూక్త పారాయణం, వరుణజపం, వరుణయాగాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రంగనాయకులపేటలోని శ్రీదేవీ, భూదేవీ సమేత తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో ఈఓ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షణలో పాలకమండలి చైర్మన్‌ మంచికంటి సుధాకర్‌రావు, సభ్యుల ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు కిడాంబి జగన్నాథాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 
  • మూలాపేటలోని భువనేశ్వరీ సమేత మూలస్థానేశ్వరాలయంలో పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం, బాలాజీశర్మ, శ్రీశైలం భార్గవశర్మ, ధూర్జటి వేణుగోపాలశర్మ, శ్రీరామకవచం కోటేశ్వరశర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈఓ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆలయ పాలకమండలి చైర్మన్‌ ఆల్తూరు గిరీష్‌రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.
  • మూలాపేటలోని ద్రౌపతీదేవి సమేత కృష్ణ ధర్మరాజస్వామి ఆలయంలో అర్చకులు మునిలక్ష్మయ్య, చక్రపాణి, రాజగోపాల్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. పాలకమండలి చైర్మన్‌ కంచి నాగేశ్వరరావు, పాలకమండలి సభ్యులు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement