
సాక్షి, ఢిల్లీ: ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని.. తెలుగులో ట్వీట్ చేశారు. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నానని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.
అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను.
— Narendra Modi (@narendramodi) April 13, 2021
ఆనందాల హరివిల్లు ఉగాది: గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
అమరావతి: శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పండుగ అన్ని వర్గాలకూ శాంతి, సామరస్యం, ఆనందాన్ని తీసుకురావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. ఆయన సోమవారం ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు లోగిళ్లలో ఆనందాల హరివిల్లు అయిన ఉగాది పండుగ ప్రతి ఇంటా శుభం కలుగజేయాలని ఆకాంక్షించారు. ప్రజలంతా కరోనా నిబంధనలను పాటిస్తూ ఉగాది పండుగ జరుపుకోవాలని ఆయన సూచించారు.
చదవండి:
ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఉగాది కానుక వచ్చేసింది
ఉగాది పండుగను ఇలా జరుపుకోవాలి!
Comments
Please login to add a commentAdd a comment