సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) 86వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రతా బలగాలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రతలో సీఆర్పీఎఫ్ పాత్ర అత్యంత కీలకమని అభివర్ణించారు. సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్‌లో.. దేశం పట్ల సీఆర్పీఎఫ్ జవాన్ల అంకితభావం, అవిశ్రాంత సేవ నిజంగా అభినందనీయమన్నారు. వారు ఎల్లప్పుడూ ధైర్యం, నిబద్ధతలతో దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి పాటుపడుతున్నారన్నారు.
ఇదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సీఆర్‌పీఎఫ్ జవాన్లకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఆర్‌పీఎఫ్ ప్రారంభమైనప్పటి నుంచి జాతీయ భద్రతను తన మిషన్‌గా తీసుకుంది. దళంలోని వీర సైనికులు తమ ప్రాణాలను లెక్కచేయక దేశరక్షణకు తమ శక్తిమేరకు కృషి చేసి, విజేతలుగా నిలుస్తున్నారన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన సీఆర్‌పీఎఫ్ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు.
1939లో బ్రిటిష్ వారు సీఆర్‌పీఎఫ్‌ను స్థాపించారు. నాడు ఈ దళం పేరు క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఈ దళం పేరును సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌గా మార్చారు. జునాగఢ్, హైదరాబాద్, కతియావార్, కశ్మీర్ రాచరిక రాష్ట్రాలను భారతదేశంలోకి చేర్చడంలో సీఆర్‌పీఎఫ్ కీలక పాత్ర పోషించింది. అలాగే రాజస్థాన్, కచ్, సింధ్ సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టడంలోనూ సీఆర్‌పీఎఫ్ ముఖ్యపాత్ర పోషించింది.
Greetings to CRPF personnel and their family members on their Raising Day.
Since its inception, the @crpfindia has taken national security as its mission. The brave soldiers of the force have exerted all their might to accomplish this goal without ever caring for their lives and… pic.twitter.com/NhbmeRZvi3— Amit Shah (@AmitShah) July 27, 2024
Comments
Please login to add a commentAdd a comment