
సాక్షి, విజయవాడ : ఉగాది నాటికి అర్హులైన ప్రతి పేదవారికి ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. కాగా దీని కింద ఇప్పటికే సెంట్రల్ నియోజకవర్గంలో 35 వేల మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన జగనన్న వసతిదీవెన ద్వారా రూ. 10వేలు విద్యార్థుల ఖాతాలో జమయ్యాయని వెల్లడించారు. విద్య పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని పేర్కొన్నారు. ప్రజల వద్దకు ప్రభుత్వం వెళ్లాలనే గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే చంద్రబాబు బస్సు యాత్రలు చేపడుతున్నారని మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment