house for poor
-
పేదల ఇళ్లకు రూ.4,376 కోట్లు
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.4,375.82 కోట్లు వెచ్చించింది. రాష్ట్రంలో ఇళ్లులేని పేదలకు పక్కా గృహ యోగం కల్పించేందుకు 30.75లక్షల మంది పేద మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాక.. 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ + 2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. గత నెల 12వ తేదీ నాటికి 7.42 లక్షల (5.85 లక్షల సాధారణ + 1.57 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేశారు. ఇలా స్థలం, ఇంటితో కలిపి పేదింటి మహిళల పేరిట రూ.10లక్షలు, ఆపైన విలువైన స్థిరాస్తిని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తోంది. రూ.3,694 కోట్ల మేర బిల్లుల చెల్లింపులు ఇళ్ల లబ్ధిదారులకు ఖరీదైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన సీఎం జగన్ ప్రభుత్వం అక్కడితో ఆగకుండా ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షల చొప్పున సాయం చేస్తోంది. యూనిట్‌కు రూ.1.80 లక్షలు బిల్లు మంజూరు చేస్తోంది. స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణ సాయం కూడా చేస్తోంది. ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై ఇవ్వడం ద్వారా మరో రూ.40 వేలు చొప్పున మేలు చేస్తోంది. 17వేలకు పైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో నిర్మిస్తున్న కొత్త ఊళ్లల్లో ఉచితంగా నీటి, విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఇవ్వడం, డ్రెయిన్లు, రోడ్లు లాంటి వసతులను ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇలా సబ్సిడీపై 4,69,897 మెట్రిక్ టన్నుల సిమెంట్ సరఫరాకు రూ.247.23 కోట్లు, 33,303 టన్నుల ఇనుముకు రూ.224 కోట్లు వెచ్చించింది. ఉచితంగా ఇసుక పంపిణీతో పాటు, ఇతర సామాగ్రిని సబ్సిడీపై అందించేందుకు మరో రూ.210.59 కోట్లు ఖర్చుచేసింది. దీంతో ఈ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,375.82 కోట్లు ఖర్చుచేయగా ఇందులో రూ.3,694 కోట్ల మేర లబి్ధదారులకు బిల్లుల రూపంలో చెల్లింపులు చేపట్టారు. -
మళ్లీ మోకాలడ్డు.. రాజధానిలో పేదల ఇళ్లపై చంద్రబాబు అండ్ కో అక్కసు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధానిలో పేదలు ఉండటానికి వీల్లేదంటున్న చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీ పెద్దలు వారి పంతం నెగ్గించుకున్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆర్–5 పేరుతో ఓ జోన్‌ను సృష్టించి, ఆ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలకు రాజధాని రైతుల ముసుగులో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోన్న చంద్రబాబు అండ్ కో తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. సీఎం జగన్.. 50 వేల మందికి పైగా పేద అక్కచెల్లెమ్మలకు అక్కడ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి, వేగంగా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మరోమారు కోర్టు ద్వారా మోకాలడ్డారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు రాజధానిలో పేదల ఇళ్ల కోసం మొత్తం భూమిలో 5 శాతం కేటాయించాలని చట్టం తీసుకొచ్చి, దాన్ని తమ స్వప్రయోజనాల కోసం అమలు చేయకుండా తుంగలో తొక్కిన టీడీపీ పెద్దలు.. ఇప్పుడూ పేదలకు తీరని ద్రోహమే చేశారు. రాజధానిలో పేదలు వచ్చి చేరితే అదో పెద్ద మురికి వాడగా మారుతుందని, వారి వల్ల తమ స్థలాలకు రేట్లు పడిపోతాయంటూ పేదలను కించపరుస్తూ తమ న్యాయవాదుల ద్వారా దారుణంగా వాదనలు వినిపించిన టీడీపీ పెద్దలు.. కోర్టుల్లో తమకున్న బలాన్ని మరోసారి రుజువు చేశారు. రాజధానిలో పేదలకు ఇచ్చిన స్థలాల్లో ప్రభుత్వం చేపట్టబోతున్న ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ రైతుల ముసుగులో వారు దాఖలు చేయించిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా స్టే విధించింది. పేదల ఇళ్ల నిర్మాణానికి విస్తృత ప్రజా ప్రయోజనాలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపింది. అందువల్ల ఇళ్ల నిర్మాణానికి అనుమతినివ్వడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. ఆర్–5 జోన్లో పేదల ఇళ్ల నిర్మాణం పూర్తయితే పూడ్చలేని నష్టం జరుగుతుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు ఫలించని కుట్ర సీఆర్డీఏలో పేదల ఇళ్లు నిర్మించకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన సృష్టించిన సంఘాలు ఆది నుంచి అడ్డుపడుతూ వస్తున్న విషయం తెలిసిందే. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద 2020లోనే ప్రభుత్వం రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. గత చంద్రబాబు ప్రభుత్వ తప్పులను సరిదిద్ది పేదలకు రాజధానిలో 5 శాతం భూమిని కేటాయించడమే కాక, ఆ భూమిలో ఇళ్ల స్థలాలు ఇచ్చి, అందులో ఇళ్లు నిర్మించేందుకు వీలుగా ఆర్ 5 జోన్‌ను సృష్టిస్తూ సీఆర్డీఏ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. ఆ చట్టాన్ని, ఆ జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అవసరమైన భూమిని గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లకు బదలాయించేందుకు అనుమతినిస్తూ జారీ చేసిన జీవోను సవాలు చేయిస్తూ టీడీపీ పలువురి చేత హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయించింది. చంద్రబాబు, ఆయన సృష్టించిన సంఘాలు హైకోర్టులో 18 కేసులు, సుప్రీంకోర్టులో 5 కేసులు వేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకునేందుకు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. సీఎం జగన్ మూడేళ్లపాటు వారితో న్యాయ పోరాటం చేశారు. దీంతో అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టు కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించేందుకు నిరాకరించాయి. ఇళ్ల పట్టాలు జారీ చేసుకోవచ్చంటూ ప్రభుత్వానికి అనుమతినిచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. అలా పంపిణీ చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అనంతరం ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు అండ్ కో విశ్వప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర మంత్రులు, అధికారులను కలిసి రకరకాల ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ వారి పాచికలు పారలేదు. మళ్లీ మరో కుట్ర దీనిపై ఓర్వలేని తెలుగుదేశం పార్టీ పెద్దలు మరో కుట్రకు తెరలేపారు. పేదల కోసం చేపట్టనున్న ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు హైకోర్టులో మళ్లీ పిటిషన్లు దాఖలు చేయించారు. ఇళ్లు కట్టకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలన్నారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల న్యాయమూర్తులు జస్టిస్ సోమయాజులు, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పు వెలువరించింది. పిటిషనర్లు తమ వాదనల సందర్భంగా లేవనెత్తిన అంశాలన్నింటితో ఏకీభవించిన త్రిసభ్య ధర్మాసనం.. ప్రభుత్వం, సీఆర్డీఏ వాదనల్లో ఒక్క దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం విశేషం. ఇతర ప్రాంతాల వారికి ఇవ్వచ్చో లేదో చూడాలి రాజధాని నిర్మాణంలో ఇళ్లు కోల్పోయే వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇతర ప్రాంతాల వారికి రాజధానిలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు చట్ట నిబంధనలు అనుమతిస్తాయా? లేదా? అన్నది లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఇళ్ల పట్టాల మంజూరు హైకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో, భవిష్యత్తులో తాము పట్టాల మంజూరుకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, ఇప్పుడు చేపట్టే ఇళ్ల నిర్మాణం కోసం ఖర్చు చేసిన డబ్బు మొత్తం వృథా అవుతుందని ధర్మాసనం తెలిపింది. ఈ డబ్బంతా ప్రజా ధనమని గుర్తు చేసింది. పన్నుదారుల డబ్బు ఇలా వృథా అవుతుంటే మౌనంగా చూస్తూ ఉండలేమంది. సీఆర్డీఏ నుంచి తీసుకున్న భూములకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి డబ్బు చెల్లించలేదని, డబ్బు చెల్లించనప్పుడు ఆ భూములు ప్రభుత్వ పరం కావని తెలిపింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై నిరుపేదల పక్షాన సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏ పరిధిలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 1,402 ఎకరాల్లో 50,793 మంది మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. రూ.1,829.57 కోట్ల వ్యయంతో అన్ని మౌలిక వసతులతో ఇళ్ల నిర్మాణాలకు గత నెల 24వ తేదీన సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. ఆరు నెలల్లో తమ దశాబ్దాల సొంతింటి కల నెరవేరబోతోందని పేదింటి అక్కాచెల్లెమ్మలు ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో కోర్టు తీర్పుతో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తమ న్యాయవాదులకు దిశా నిర్దేశం చేసింది. వాళ్లు పెట్టరు.. పెట్టే వారిని పెట్టనివ్వరు ఎన్నో ఏళ్ల నుంచి రైల్వే స్థలాల్లో భయం భయంగా బతుకుతున్నాం. సీఎం జగన్ పుణ్యమా అంటూ ఇళ్ల స్థలం ఇచ్చారు. ఇప్పుడేమో ఇళ్లు నిర్మించవద్దంటూ కోర్టు తీర్పు ఇచ్చిందని అంటున్నారు. టీడీపీ వాళ్లు కూడా ప్రజల్ని పరిపాలించడానికి, మంచి చేయడానికే ఉన్నామని చెబుతున్నారు. అలాంటప్పుడు ఇలా పేదల ఇళ్లపై కోర్టుకు వెళ్లడం ఏమిటో అర్థం కావడం లేదు. వాళ్లు పెట్టరు.. పెట్టే వాళ్లను పెట్టనివ్వరు. గతంలో పెన్షన్ రావాలంటే ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సివచ్చేది. జగన్ వచ్చాక ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా తుదకు న్యాయం గెలుస్తుంది. – చిలక పార్వతమ్మ, సలాం హోటల్ సెంటర్ ఇది టీడీపీ నాయకుల కుట్ర అమరావతిలో చట్ట ప్రకారం కేటాయించాల్సిన పేదల ఇళ్ల స్థలాలను సైతం టీడీపీ స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టును ఆశ్రయించి అడ్డుకోవడం దుర్మార్గం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేద ప్రజల పట్ల విశ్వాసం ఉంది కాబట్టే రాజధాని ప్రాంతంలో 50 వేల మందికి పైగా ఇళ్లు కేటాయించారు. టీడీపీ రైతుల ముసుగులో కోర్టుకు వెళ్లి పేదలను మోసగిస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జగన్మోహన్రెడ్డే ముందంజలో ఉన్నారు. ఆయన సాధించి తీరుతారు. – రెడ్డి నిర్మల, బాబూ జగ్జీవన్‌రామ్ కాలనీ వారి విజయం తాత్కాలికమే రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదనే ఉద్దేశంతోనే వాళ్లు వివిధ కారణాలను చూపిస్తూ కోర్టుకు వెళ్లారు. వారు అనుకున్నదే చేశారు. అమరావతిలో డబ్బున్న వాళ్లే ఉండాలని వాళ్ల ఉద్దేశం. వారు ఎన్ని చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పకుండా తుది విజయం సాధిస్తారు. ఆ నమ్మకం మాకు ఉంది. కేటాయించిన స్థలాల్లోనే ఇళ్లు నిర్మించి ఇస్తారని గట్టిగా నమ్ముతున్నాం. వాళ్ల విజయం తాత్కాలికమే. న్యాయస్థానాల్లో తుది విజయం పేద ప్రజలదే. – షేక్ మీరాబి, నులకపేట రాజధాని అంటే వాళ్లే ఉండాలా? రాజధాని అమరావతిలో చంద్రబాబు, ఆయన సామాజికవర్గం వాళ్లు మాత్రమే వుండాలా? మాలాంటి పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇస్తుంటే చంద్రబాబు, ఆయన సామాజిక వర్గం వాళ్లు అడ్డుకోవడం దుర్మార్గం. పేదలంతా ఏకమై పోరాటం చేస్తే చంద్రబాబు ఆయన సామాజిక వర్గం రాజధాని అమరావతిలో ఉండగలరా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేదలంతా అండగా నిలుస్తాం. తుదకు మావైపే న్యాయం నిలుస్తుంది. – కొండపనేని సీత, ఇప్పటం, తాడేపల్లి మండలం రైతుల ముసుగులో తెలుగుదేశం పార్టీ నాటకం రైతుల ముగుసులో టీడీపీ నాటకం ఆడుతోంది. ఈ మధ్యకాలంలో చదువుకున్న పిల్లలు చెబితే తప్ప టీడీపీ నిజ స్వరూపం మాకు తెలియలేదు. రైతుల ముసుగులో కోర్టుకు వెళ్లిన వారు రాజధాని ప్రాంతంలో పేద వాళ్లకు ఎలా నివాస స్థలాలు ఇస్తారంటూ ఫిర్యాదు రాశారని చెప్పారు. ఇలా చేయడం దుర్మార్గం. పేదల కడుపు కొట్టడం ధర్మం కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే మా అందరికీ న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. – దాడి శాంతకుమారి, నులకపేట మా వల్లే మీరు సుఖంగా ఉంటున్నారు డబ్బున్న వాళ్ల ఇళ్లలో పని చేయాలంటే మాలాంటి వారు ఎక్కడెక్కడో గుడిసెల్లో ఉంటూ వచ్చి పోవాలి. కాబట్టి మాలాంటోళ్లం రాజధానిలో ఉండకూడదనేది వారి పంతం. పేదలకు ఇళ్లు కట్టించకూడదని టీడీపీ వాళ్లు కోర్టును ఆశ్రయించడం చాలా బాధగా ఉంది. మాలాంటి వారు ఉంటేనే మీలాంటి వారు ఇళ్లల్లో సుఖంగా ఉంటారు. ఇప్పటికైనా అది ఆలోచించి కోర్టులో వేసిన కేసును వెనక్కు తీసుకుంటే బాగుంటుంది. – కొప్పుల పద్మ, పోలకంపాడు -
అమరావతి అందరిదీ
పేద వర్గాలపై పెత్తందారుల దోపిడీలను సహించి భరించే కాలం పోయింది. ఈ మార్పు ఇక మీదట రాజకీయాలను శాసిస్తుంది. అలాంటి మార్పులకు మనసా వాచా కర్మణా సహకరించే ప్రభుత్వంగా, మీ అన్నగా.. నిరుపేద అక్కచెల్లెమ్మల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనతో ‘సామాజిక అమరావతి’కి పునాదిరాయి వేస్తున్నా. ఇక నుంచి అమరావతి మనందరిది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పేదలకు మేలు జరిగే ప్రతి విషయంలో మనందరి ప్రభుత్వానికి, చంద్రబాబు పెత్తందారుల కూటమికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పేదలకు మంచి జరగకూడదని రాక్షస బుద్ధితో అడ్డుకుంటున్న వారితో పెద్ద యుద్ధమే చేస్తున్నామన్నారు. సోమవారం సీఆర్డీఏ పరిధిలో పేదలకు 50,793 ఇళ్ల నిర్మాణం, 45 సామాజిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో సీఎం జగన్ మాట్లాడారు. తొలుత తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లేఅవుట్ వద్దకు చేరుకున్న సీఎం జగన్ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వెంకటపాలెం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుని లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... వెంకటపాలెంలో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం ఆ తర్వాత కూడా బుద్ధి మారలేదు.. సీఆర్డీఏలో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద కుటుంబ సభ్యులందరికీ ఇళ్లç స్థలాలు ఇవ్వకుండా, ఇళ్లు కట్టించకుండా చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు సృష్టించిన ఊరుపేరూ లేని సంఘాలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ – 5 అడ్డు తగిలాయి. వీరంతా మొదట పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు వీల్లేదన్నారు. ఇందుకోసం ఏకంగా హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లిన దౌర్భాగ్యమైన పరిస్థితిని మన రాష్ట్రంలో మాత్రమే చూస్తున్నాం. ఈ పెద్దమనుషులు, పెత్తందార్లు, పేదల వ్యతిరేకులంతా హైకోర్టులో 18 కేసులు, సుప్రీం కోర్టులో 5 కేసులు వేశారు. ఈ కేసులను పరిష్కరించేందుకు మీ తరపున మీ బిడ్డ మూడేళ్ల పాటు పోరాటం చేస్తూ వచ్చాడు. దేవుడు, ప్రజల చల్లని ఆశీస్సులు ఎప్పుడూ మంచికే ఉంటాయి. హైకోర్టు, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వమే కేసులు గెలిచింది. అనుమతులు తెచ్చుకుని మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఆ తర్వాత కూడా వారి బుద్ధి మారలేదు. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపలేకపోయారు కాబట్టి పేదల ఇళ్ల నిర్మాణానికి అడ్డు తగిలేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో వారు ఎక్కని గడప దిగని గడప లేదు. కలవని కేంద్ర మంత్రీ, కేంద్ర సెక్రటరీలు కూడా లేరు. ఇంతమందిని కలిశాక చివరి ప్రయత్నంగా మళ్లీ హైకోర్టులో కేసు వేశారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ ఎక్కడా ఉండదు. చరిత్రలో నిలిచిపోయే రోజు ఇంతమంది పెత్తందార్లు ఒక్కటై పేదవాడికి ఇళ్లు రాకూడదని అడ్డుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నించిన పరిస్థితులు దేశ చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోతాయి. ఇలా పేదల శత్రువులతో ఎంతో సంఘర్షణ, ఎన్నెన్నో అవరోధాలను అధిగమించి విజయం సాధించి పేదల ఇళ్లకు శంకుస్థాపన చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీ ఇళ్ల నిర్మాణానికి, మీ ఇంటి కలల సాకారానికి ఇవాళ ఇక్కడ పునాదులు కూడా వేస్తున్నాం. అక్కచెల్లెమ్మల సొంతింటి కలల సాకారానికి మనం చేసిన సామాజిక న్యాయ పోరాటం చరిత్ర ఉన్నంత వరకూ ఎప్పడూ మర్చిపోలేనిది. పెత్తందారులపై పేదవాడు, పేదల ప్రభుత్వం సాధించిన విజయంగా చరిత్రలో పదిలంగా ఉంటుంది. గతంలో ఎన్నడూ చూడలేదు అమరావతిని పేరుకేమో రాజధాని అంటారు. రాజధానిలో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఒక సెంటు స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిస్తామంటే అడ్డుపడి కోర్టులకు వెళ్లారు. పేదలకు ఇళ్లు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ (సామాజిక అసమతుల్యత) వస్తుందని, కులాల సమతుల్యం దెబ్బతింటుందని న్యాయస్థానాల్లో వాదించిన చరిత్ర వీళ్లది. ఇలాంటి పెత్తందారులున్న వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం. ఇంత దుర్మార్గమైన మనుషులను, మనస్తత్వాలను, వాదనలను, రాతలను, టీవీల్లో డిబేట్లను, రాజకీయ పార్టీలను గతంలో ఎప్పుడూ చూడలేదు. నయా జమీందార్ల మొసలి కన్నీరు పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంటే ఈ నయా జమీందార్లు, పెత్తందార్లంతా అడ్డుతగిలే కార్యక్రమం చేశారు. తెలుగు భాష ఏమైపోతుందని మొసలి కన్నీరు కారుస్తారు. ఈ పెత్తందార్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను మాత్రం ఇంగ్లీష్ మీడియం బడులకే పంపిస్తారు. మన పిల్లలు మాత్రం తెలుగు బడులకే పోవాలంటారు. నా అక్కచెల్లెమ్మలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అడుగులు ముందుకు వేస్తే రకరకాల కోర్టు కేసులు వేశారు. పేదవాడు ఎప్పుడూ పేదవాడుగానే మిగిలిపోవాలన్న పెత్తందారీ ఆలోచనకు ఇవొక నిదర్శనాలు. మీ బిడ్డ పేదల కోసం అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు, వివక్షకు చోటివ్వకుండా బటన్ నొక్కి రూ.2.25 లక్షల కోట్లు పంపిస్తే దాన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. మీ బిడ్డ మాదిరిగా పరిపాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించండి గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. చంద్రబాబు హయాంలో కన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల వృద్ధి రేటు తక్కువ. మరి మీ బిడ్డ ఈ రోజు ఎలా చేయగలుగుతున్నాడు? ఆ రోజు గజదొంగల ముఠా ఎందుకు చేయలేకపోయింది? మీ బిడ్డ హయాంలో ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు ఎలా వస్తున్నాయి? చంద్రబాబు హయాంలో ఎందుకు రాలేదు? ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఏ పేదవాడు, అవ్వాతాతలు ఇబ్బంది పడకూడదని వలంటీర్, సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చాం. లంచాలు, వివక్షకు తావివ్వకుండా ఒకటో తారీఖునే అది ఆదివారమైనా, పండగరోజైనా సరే తెల్లవారుజామునే తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి చేతిలో పెన్షన్ డబ్బులు పెడుతున్నారు. ఈ వ్యవస్థను కూడా పెత్తందార్లు, పేదల వ్యతిరేకులు అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. హీరోయిజంగా చిత్రీకరిస్తున్నారు ఏ సమాజమైనా, కుటుంబమైనా నిన్నటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్ బాగుండాలని కోరుకుంటుంది. అలాంటి వారి ఎదుగుదలకు సహకరిస్తే దాన్ని మంచి ప్రభుత్వం అంటారు. అలాంటి ఎదుగుదలను, అభివృద్ధిని అడ్డుకుంటే, వ్యతిరేకిస్తే దాన్ని దుర్మార్గం, అమానుషత్వం, రాక్షసత్వం అంటారు. విచిత్రమేంటంటే పేదలకు మంచి చేయడాన్ని అడ్డుకుంటూ దాన్ని వారు హీరోయిజంగా చిత్రీకరిస్తున్నారు. ఈ రోజు ఉదయాన్నే ఈనాడు పేపర్లో చూశా. వాళ్లు రాసిన రాతలు చూసి ఆశ్చర్యం అనిపించింది. దిగజారుడుతనం ఏ స్థాయికి వెళ్లిందంటే చంద్రబాబు బినామీల అమరావతిలో ఉండేందుకు అమెరికా, సింగపూర్ల నుంచి మనుషులు రావచ్చట. కానీ ఇదే అమరావతిలో చుటు్టపక్కల ఉన్న పేదలకు మాత్రం ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని ఈనాడులో రాస్తారు. ఇంత దిక్కుమాలిన పెత్తందారులు, పేదల వ్యతిరేక భావజాలం ఎక్కడైనా ఉంటుందా? జగనన్నను టచ్ కూడా చేయలేరు ఎన్నికల సీజన్ రాగానే కొందరు రోడ్డెక్కి మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడు పేదలను పీక్కుతిన్నాడు. పవన్‌కళ్యాణ్ ఎన్నో పార్టీలు మార్చాడు. బీఎస్పీ, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం.. ఇలా ఎన్ని పార్టీలైనా మార్చగలడు. మా జగనన్నను ఓడిస్తారా.. ఎంతమంది వచ్చినా ఆయన్ను టచ్ కూడా చేయలేరు.ఇంకొకడు జగనన్నతో పోటీ అంటూ నడుస్తున్నాడు. నువ్వెంత నీ స్థాయి ఎంత? పెత్తందార్ల కోటలను బద్దలుకొట్టి, పేదల పక్షాన నిలిచి సుప్రీంకోర్టు దాకా వెళ్లి వారిని గెలిపించి జగన్ చరిత్రను తిరగరాశారు. పేదలకు ఇళ్ల స్థలాలు వద్దు అని కోర్టుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు. – జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మీరొచ్చాకే బడుగు వర్గాలకు ధైర్యం వచ్చింది మీరు పాదయాత్ర చేస్తే రోడ్లపై పసుపు నీళ్లు చల్లిన వ్యక్తులను ఇక్కడ చూశాం. మా సమస్యలు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. జగనన్న వచ్చిన తర్వాత మాకు ధైర్యం, భరోసా వచ్చింది. జగన్ పేదల పక్కనుంటే చంద్రబాబు పెత్తందార్ల తరఫున యుద్ధం చేస్తున్నాడు. కోర్టులలో సైతం జగన్ గెలిచి ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం చేపట్టారు. జీవితకాలం పేద వాడి గుండెల్లో మీ పేరు నిలిచిపోతుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలను లక్షాధికారులను చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుంది. – బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పాలకుడంటే ప్రజల కన్నీటిని తుడిచేవాడు.. పాలకుడంటే పాలించేవాడే కాదు, ప్రజల సంక్షేమాన్ని కోరుతూ వారి కన్నీటిని తుడిచేవాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త అర్థం చెప్పారు. మేం మీకు రుణపడి ఉంటాం. మీరే మా ధైర్యం అన్నా. మీకు పక్కనే ఉన్న వెంకన్న స్వామి, కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. మాకు పట్టాలు ఇచ్చినప్పుడు చాలా సంతోషం వేసింది, ఇప్పుడు ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. మేం అనేక పథకాల ద్వారా కూడా లబ్ధిపొందుతున్నాం. నగదు రూపంలో మొత్తం రూ.1,89,250, స్థిరాస్తి రూపంలో రూ.పది లక్షల నుంచి రూ. పదిహేను లక్షలు వరకు లబ్దిపొందాను. – రోజా, లబ్ధిదారు, మంగళగిరి వలంటీర్లపై బురద జల్లుతున్నారు నేను సొంత ఇల్లులేక, అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు పడ్డాను, నాకు ఏ ప్రభుత్వంలో ఇల్లు రాలేదు, కానీ, మీరు రాగానే మంజూరైంది, మా పేదల తరఫున మీరు నిలబడి చేసిన న్యాయపోరాటానికి మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. నేను వైఎస్సార్ ఆసరా ద్వారా లబ్ధి పొందాను, నా కొడుకు ఈ రోజు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడంటే మీరే కారణం. అన్నా.. నేను నాలుగేళ్లుగా వలంటీర్‌గా సేవలు అందిస్తున్నాను, ఈ మధ్యకాలంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మాపై బురద జల్లుతున్నారు. మీరు మాకు ధైర్యం ఇచ్చారు, థాంక్యూ అన్నా. – స్వప్న, లబ్దిదారు, రాణిగారితోట, విజయవాడ తూర్పు నియోజకవర్గం -
అమరావతిలో ఇళ్ల నిర్మాణం.. సీఎం సంకల్పానికి తార్కాణం
మంగళగిరి/సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు కట్టడం ఒక ఎత్తయితే.. అమరావతి రాజధానిలో అది మరొక ఎత్తని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృఢ సంకల్పానికి ఇది తార్కాణమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎంపీ నందిగం సురేష్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలోని జగనన్న లేఅవుట్లో ‘నవరత్నాలు–పేదలందరికే ఇళ్లు’ పథకం ద్వారా నిర్మిస్తున్న గృహాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న ప్రాంతాన్ని ఆదివారం వారు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఆర్డీఏ పరిధి అమరావతి రాజధానిలో పేద, బడుగు, బలహీనవర్గాలు ఉండటానికి వీల్లేదని.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని చంద్రబాబు, ఆయన సామాజికవర్గం మాత్రమే ఇక్కడ నివసించాలని కుట్రతో కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. అయినా.. ముఖ్యమంత్రి పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు 50 వేలకు పైగా ఇళ్ల పట్టాలను ఇవ్వడమే కాక అక్కడ ఇళ్లను సైతం నిర్మించి ఇచ్చేందుకు చేస్తున్న కృషి ఆయన దృఢ సంకల్పానికి నిదర్శనమని మంత్రులు కొనియాడారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణం జరగదని, పేదలకు ఇళ్లు రావని టీడీపీతో పాటు ఆయన తోక పారీ్టలు చెప్పినా, ఎన్ని కుట్రలు చేసినా పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చి తీరుతున్నామన్నారు. ఇది రాష్ట్రంలో చారిత్రక ఘట్టమని, రాష్ట్ర ప్రజలంతా పండుగ చేసుకుంటుంటే చంద్రబాబు మాత్రం కడుపుమంటతో రగలిపోతున్నాడన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇళ్లు.. ఇక అమరావతిలో ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజతో పాటు సామాజిక మౌలిక వసతులకు సంబంధించి అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, డిజిటల్ లైబ్రరీ, ఈ–హెల్త్ సెంటర్ల భవన నిర్మాణాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని మంత్రులు తెలిపారు. గ్రీన్ సోషల్ ఫారెస్ట్‌లో భాగంగా లేఅవుట్లో అభివృద్ధి చేసిన చెరువు వద్ద, ఇతర ప్రాంతాల్లో 30వేల మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరుగుతుందన్నారు. సీఆర్డీఏ పరిధిలోని 25 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలను అతి త్వరలోనే పూర్తిచేసేందుకు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన షీర్వాల్ టెక్నాలజీతో ఇళ్లను శరవేగంగా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారన్నారు. సీఆర్డీఏ పరిధిలో దాదాపు 35వేల ఇళ్లను ఈ టెక్నాలజీతో నిర్మిస్తారని వారు చెప్పారు. ఇక్కడ ప్రతి ఇంటికీ నీరు, విద్యుత్ సౌకర్యంతో పాటు పూర్తిస్థాయిలో రహదారులు, డ్రైనేజి వ్యవస్థలను ఏర్పాటుచేసి గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లుగా ఆరు నెలల్లో తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ లక్ష్మీశా తదితరులు పాల్గొన్నారు. -
నేడు సీఆర్డీఏలో పేదల ఇళ్లకు శ్రీకారం
సాక్షి, అమరావతి: అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందన్న పెత్తందారుల వితండ వాదాలకు చెక్ పెడుతూ నిరుపేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏలో 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సోమవారం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. గూడు లేని పేద అక్కచెల్లెమ్మలకు స్థిరనివాసం సమకూర్చి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎల్లో ముఠా కుట్రపూరితంగా సృష్టించిన అడ్డంకులను అధిగమించి సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాలు, 25 లేఅవుట్లలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు ఈ ఏడాది మే 26న ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించిన విషయం తెలిసిందే. ఒక్కో ప్లాట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే రూ.1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు ఉచితంగా పంపిణీ చేయడమే కాక.. ఆయా లేఅవుట్లలో రూ.384.42 కోట్లతో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. అలాగే.. విద్య, ఆరోగ్య సేవలు అందించేందుకు రూ.73.74 కోట్లతో 11 అంగన్వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్ లైబ్రరీలు, 12 ఆస్పత్రుల నిర్మాణం కూడా చేపట్టనుంది. లేఅవుట్ల పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసేందుకు రెండు దశల్లో రూ.168 లక్షలతో 28,000 మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. ఒకొక్కరికి రూ.10 లక్షల నుంచి రూ.15లక్షల ఆస్తి.. ఇలా ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాటుతో ఒక్కో పేద అక్కచెల్లెమ్మ చేతుల్లో దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పైగా విలువైన స్థిరాస్తిని పెట్టబోతోంది. ఈ లెక్కన ఏపీ గృహ నిర్మాణ సంస్థ ద్వారా సీఆర్డీఏలోని ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో రూ.1,829.57 కోట్ల వ్యయంతో పేదలకు పక్కా గృహాలను సమకూరుస్తోంది. మహిళా సాధికారతే లక్ష్యంగా.. నిజానికి.. సీఎం జగన్ ప్రభుత్వం తొలి నుంచి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ వస్తోంది. మహిళలు తమంతట తాము నిలదొక్కుకునేలా వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తోంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద మహిళల పేరిట స్థలాలు, ఇళ్లు అందిస్తోంది. ఇందులో భాగంగా.. దేశంలో ఎక్కడాలేని విధంగా 71,811 ఎకరాల్లో 30.65 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరిట ఉచితంగా రూ.76,625 కోట్ల మార్కెట్ విలువైన భూములను పంపిణీ చేశారు. ఇలా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో 17వేలకు పైగా ఊళ్లనే కొత్తగా నిర్మిస్తున్నారు. పంపిణీ చేసిన స్థలాల్లో ఇప్పటికే రూ.57,375 కోట్ల వ్యయంతో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. కాలనీల్లో రూ.32,909 కోట్ల వ్యయంతో నీటి సరఫరా, విద్యుత్, ఇంటర్నెట్, డ్రైనేజీ, సీవరేజీ, రోడ్లు వంటి మౌలిక వసతులను కల్పిస్తున్నారు. రూ.లక్షల కోట్ల సంపద సృష్టి మరోవైపు.. ప్రతి పేద అక్కచెల్లెమ్మకు ఇంటి స్థలం, ఇల్లు సమకూర్చడం ద్వారా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపదను రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తోంది. ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వడమే కాక.. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం సమకూరుస్తోంది. అంతేకాక.. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్ ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని సబ్సిడీపై అందించడంతో మరో రూ.40 వేల మేర లబ్ధి చేకూరుస్తోంది. మోడల్ హౌస్ చాలా బాగా వచ్చింది లేఅవుట్లో తొలుత నాకు కేటాయించిన స్థలంలో మోడల్ హౌస్ నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. సెంటు స్థలంలో ఇల్లు బాగా వచ్చింది. ఇల్లు కట్టుకోవడమే కలగా మిగిలిపోతుందని అనుకున్నా. కానీ, జగనన్న స్థలం ఇవ్వడమే కాక ఇల్లు కట్టించి నా కలను సాకారం చేశాడు. సెంటు స్థలంలో ఇల్లు ఎలా వస్తుందని అన్న వారు దీనిని చూడాలి. సొంతింటి కల సాకారం చేసిన సీఎం జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. – ఈపూరి జీవరత్నం, కృష్ణాయపాలెం -
జగనన్న కాలనీలు.. సౌకర్యాల నిలయాలు
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు సందడిగా సాగుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా జాతీయ స్థాయి ప్రమాణాలకు మించి లోగిళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. గత సర్కారు హయాంలో కంటే అదనంగా 116 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లను కడుతున్నారు. ఉచితంగా గృహోపకరణాలు, కాలనీల్లో మెరుగైన మౌలిక వసతులు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇళ్ల నిర్మాణం ద్వారా వైఎస్సార్ – జగనన్న కాలనీల్లో పేదలకు ఉత్తమ జీవన ప్రమాణాలు సమకూరనున్నాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా పేదలందరికీ 30.76 లక్షల ఇళ్ల పట్టాలను అక్క చెల్లెమ్మల పేరుతో పంపిణీ చేసి, రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణంలోనూ అంతే వేగంగా ముందుకు వెళుతోంది. ఇళ్ల స్థలాలు పొందిన వారికి రెండు దశల్లో మొత్తం 28,30,227 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నాడు అలా ►టీడీపీ సర్కారు హయాంలో 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు, 24 చదరపు అడుగుల్లో టాయిలెట్ నిర్మించారు. ►ఒక బెడ్ రూం, వంటగదితో కూడిన లివింగ్ రూమ్ నిర్మించారు. ►2014–19 మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.8,082.89 కోట్లతో 6,03,986 ఇళ్లను మాత్రమే నిర్మించారు. ►మౌలిక సదుపాయాల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. నేడు ఇలా ►ఉత్తమ జీవన ప్రమాణాలతో ఇళ్లు నిర్మించేలా డిజైన్. ►340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం. ►ఒక బెడ్రూం, లివింగ్ రూం, కిచెన్, టాయిలెట్, వరండా. ►ఉచితంగా రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, నాలుగు బల్బ్‌లు, సింటెక్స్ ట్యాంక్. ►కాలనీల్లో రహదారులు, డ్రైనేజీ, ఇతరత్రా సౌకర్యాల కల్పన -
ఈ ఏడాది 15 లక్షల మంది పేదలకు ఇళ్లు: కొడాలి నాని
సాక్షి, గుడివాడ: రాష్ట్రంలో ఈ ఏడాది 15 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టించాలనే సంకల్పంతో నేటి నుంచి ఈ నెల 4 వరకు శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభించామని పౌర సరాఫరాలశాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. లబ్ధిదారుల నుంచి అపూర్వ స్పందన వస్తోందన్నారు. వైఎస్సార్ బీమా పేదలకు ఒక వరమని.. వైఎస్సార్ బీమాలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించి తెల్లరేషన్ కార్డు కలిగిన వారికి అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు. రాష్టంలో అభివృద్ధి, సంక్షేమం శరవేగంగా జరుగుతుంటే చంద్రబాబు నిరసన దీక్ష చేస్తున్నారని.. చంద్రబాబును పిచ్చి ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం ఉందని మంత్రి కొడాలి ఎద్దేవా చేశారు. ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో సుభిక్షంగా ఉన్నారన్నారు. ఈనెల 5 నుంచి కృష్ణా జిల్లాలో సాగునీరు విడుదల చేస్తామని మంత్రి కొడాలి నాని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ సామినేని శంకుస్థాపన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం షేర్ మహమ్మద్‌పేట, కొనకంచి, లింగగూడెం, ముచ్చింతల, వత్సవాయి, చిన్న మోదుగపల్లి గ్రామాల్లో వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నూతనంగా నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను శంకుస్థాపన చేశారు. మోపిదేవి మండలం కొత్తపాలెం, చల్లపల్లి, ఘటంసాల మండలాల్లో వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే రమేష్‌బాబు, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ నరసింహారావు శంకుస్థాపనలు చేశారు. అన్ని వసతులతో జగనన్న కాలనీలు: ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ వణుకూరులో 610 మంది లబ్ధిదారుల ఇళ్లకు శంకుస్థాపన చేశామని ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ అన్నారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్లు ఇస్తున్నారని.. రెండున్నర ఏళ్లలో 28 లక్షల మందికి ఇళ్లు కట్టిచ్చి ఇస్తామన్నారు. ‘‘50 వేల కోట్లు ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించింది. 1705 జగనన్న కాలనీలు నిర్మిస్తున్నాం. డ్రైనేజీ, నీరు, కరెంట్, రోడ్లు అన్ని వసతులతో ఇళ్ల నిర్మాణం జరుగుతుందని’’ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ తెలిపారు. -
పేదల ఇళ్లపై చంద్రబాబు నీచ రాజకీయాలు: వెల్లంపల్లి
సాక్షి, అమరావతి: రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 31 లక్షల మంది పేదలకు ఇళ్లు కేటాయించారని పేర్కొన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి కేంద్రకరించారన్నారు. రాజధాని పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. పేదలకు ఉచితంగా ఇచ్చే ఇళ్లపై చంద్రబాబు, దేవినేని ఉమా నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి నిప్పులు చెరిగారు. -
వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం
-
వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
ఒక్కో అక్క చెల్లెమ్మకు రూ. 5 లక్షల నుంచి 15 లక్షల ఆస్తి: సీఎం వైఎస్ జగన్
ప్రతి పేదవాడికి మామూలు ఇల్లు కాకుండా మంచి వసతులతో ఇంటిని ఇవ్వడం కోసం అడుగులు ముందుకు వేస్తున్నాం. తద్వారా నిరుపేదలైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు.. అగ్ర కులాల్లో ఉన్న పేద అక్క చెల్లెమ్మలందరి సొంతింటి కల నెరవేరుస్తున్నాం. ప్రతి ఇంటికి మౌలిక సదుపాయాల కోసం రూ.1.5 లక్షలు, ఇంటి నిర్మాణ వ్యయం రూ.1.80 లక్షలు, స్థలం రేటు ప్రాంతాన్ని బట్టి రూ.2 లక్షలు మొదలు దాదాపు రూ.7 లక్షల వరకు ఉంది. ఆ విధంగా ఒక్కో అక్క చెల్లెమ్మకు రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన ఆస్తిని ఇంటి రూపంలో ఇస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఇల్లు లేకుండా ఒక్క నిరుపేద కూడా ఉండకూడదు.. ఒక కోటి 24 లక్షల మంది పేదలు నివసించేందుకు వీలుగా ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. తద్వారా ఒక్కో అక్క చెల్లెమ్మ చేతిలో ఐదు లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల విలువగల ఆస్తి పెడుతున్నాం. ఇదివరకెన్నడూ లేని విధంగా రెండు దశల్లో రూ.50,944 కోట్లతో 28 లక్షలకు పైగా ఇళ్లు కట్టిస్తున్నాం. ఇది దేశ చరిత్రలోనే ఒక రికార్డు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కింద రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్–జగనన్న కాలనీల్లో తొలి దశలో ఒకే సారి రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాలకు గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల సొంతింటి అన్న పేదవాడి కలను నిజం చేస్తున్నామని, 175 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణంలో మొదటి దశ కార్యక్రమానికి ఇవాళ పునాదులు వేస్తున్నామని చెప్పారు. అన్ని కాలనీల్లో రూ.32,909 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల కల్పిస్తున్నామని తెలిపారు. ఇళ్ల నిర్మాణ ప్రారంభ మహోత్సవం ఒక పండగ వాతావరణంలో ఈ నెల 10వ తేదీ వరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. లబ్ధిదారులకు మూడు ఆప్షన్లు ఆప్షన్–1 : ఇంటి నిర్మాణ సామగ్రి, లేబర్ చార్జీలు ప్రభుత్వం ఇస్తుంది. లబ్ధిదారులే ఇల్లు నిర్మించుకుంటారు. ఆప్షన్–2 : ఇంటి నిర్మాణ సామగ్రి అక్క చెల్లెమ్మలు సొంతంగా తెచ్చుకుంటే దశల వారీగా పనుల పురోగతిని బట్టి ఆ డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తాం. ఆ విధంగా స్వయంగా ఇళ్లు నిర్మించుకోవచ్చు. ఆప్షన్–3 : అక్క చెల్లెమ్మలు ఇల్లు కట్టుకోలేమంటే, ప్రభుత్వమే మొత్తం బాధ్యత తీసుకుని ఇల్లు కట్టిస్తుంది. – గతంలో ఇల్లు కేవలం 200 అడుగులు మాత్రమే ఉంటే ఇవాళ 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. వరండా, బెడ్రూమ్, హాలు, కిచెన్, బాత్రూమ్, రెండు లైట్లు, రెండు ఫ్యాన్లు, 4 ఎల్ఈడీ బల్బులు, ఒక సింటెక్స్ ట్యాంక్ కూడా ఇస్తున్నాం. – ప్రతి ఇంటికి అవసరమైన 20 టన్నుల ఇసుకను లబ్ధిదారులకు ఉచితంగా అందించే ఏర్పాటు చేస్తున్నాం. లక్షలాది మందికి పని.. ఎకానమీ బూస్ట్ – తొలి దశలో కడుతున్న 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను బూస్ట్ చేస్తుంది. కోవిడ్ వల్ల చాలా రాష్ట్రాల ఆర్థిక స్థితి పడిపోయింది. జీఎస్డీపీలు తగ్గిపోయాయి. ఉత్పత్తి రంగం పడిపోయింది. కానీ మన దగ్గర ఈ ఇళ్ల నిర్మాణం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ బూస్టప్ అవుతుంది. – ఈ ఇళ్ల నిర్మాణం కోసం 69.70 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్, 7.44 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్, 310 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక, 233 కోట్ల ఇటుకలు, 223 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ వినియోగం ఉంటుంది. – ఇంకా ఈ ఇళ్ల నిర్మాణం వల్ల కార్మికులకు 21.70 కోట్ల పని దినాలు లభిస్తాయి. ప్రస్తుతం కోవిడ్‌తో పెద్దగా పని లేకుండా పోయిన తాపీ మేస్త్రీలు, రాడ్ బెండర్లు, కార్పెంటర్లు కూలీలు, ఇటుకల తయారీదారులు, ఎలక్ట్రీషియన్లు.. ఇలా దాదాపుగా 30 రకాల పనులు చేసే వారికి సొంత ఊళ్లలోనే ఉపాధి లభిస్తుంది. తక్కువ ధరకే నాణ్యమైన సామగ్రి – మార్కెట్ కంటే నాణ్యమైన ధరకు నిర్మాణ సామగ్రిని అందించేలా చర్యలు తీసుకున్నాం. అందు కోసం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాం. సిమెంట్ ధర తగ్గించి బస్తా కేవలం రూ.225కే అందిస్తున్నాం. స్టీల్ కూడా తక్కువ ధరకు, క్వాలిటీ సామగ్రి ఇచ్చేలా చూశాం. – ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ రోజు ప్రతి జిల్లాలో నాలుగవ జేసీని నియమిస్తున్నాం. వీరు ఈ కార్యక్రమాన్ని ఓన్ చేసుకుని, ప్రతిదీ పర్యవేక్షిస్తారు. వారికి కూడా న్యాయం చేస్తాం – రాష్ట్రంలో 3.74 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు సంబంధించిన స్థలాలపై కొందరు దుర్బుద్దితో కోర్టుల్లో కేసులు వేశారు. ప్రస్తుతం కోర్టులకు సెలవులు. ఈనెల 13న కోర్టులు తెరుస్తారు. అప్పుడు దీన్ని ప్రాధాన్యతగా తీసుకుని, ఈ అక్క చెల్లెమ్మలందరికీ న్యాయం చేయడానికి మీ తమ్ముడు, మీ అన్న జగన్ ప్రయత్నిస్తాడని తెలియజేస్తున్నాను. – ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గృహ ప్రవేశానికి మీరు రావాలన్నా.. నేను పుంగనూరులో 15 ఏళ్లుగా అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నా. నా జీవితంలో సొంతింట్లో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. మీ వల్ల నా సొంతింటి కల నెరవేరుతోంది. నా పిల్లలు మా మేనమామ ఇల్లు ఇచ్చాడు అని సంతోషంగా ఉన్నారు. నాకు ఇచ్చిన స్థలం విలువ రూ.4 లక్షలు అవుతుందన్నా.. నిర్మాణం కోసం నాణ్యమైన సామగ్రి ఇస్తున్నారు. నాది ఒక చిన్న కోరిక అన్నా.. మీరు మా గృహ ప్రవేశానికి రావాలని కోరుకుంటున్నా అన్నా. – అమరావతి, పుంగనూరు, చిత్తూరు జిల్లా ఎవరి సిఫారసు లేకుండా మంజూరైంది నేను ఏ నాయకుడి దగ్గరకు వెళ్లలేదు. మా వలంటీర్ దగ్గర దరఖాస్తు చేయగానే ఇల్లు మంజూరు అయింది. ఈ కరోనా కాలంలో కూడా మేం తినగలుగుతున్నామంటే మీ వల్లే అన్నా. మాది పేద కుటుంబం అన్నా. అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడేవాళ్లం. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నా, స్థలం ఇవ్వలేదు. మీరు మా పేదల పాలిట దేవుడిలా లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. నేను ఇల్లు స్వయంగా కట్టుకుంటున్నా. – అపరంజని, మార్టేరు గ్రామం, ప.గో.జిల్లా మౌలిక వసతులకు రూ.33 వేల కోట్లు – ప్రణాళిక బద్ధమైన గ్రామాలు, పట్టణాలుగా నిర్మితమవుతున్న ఈ 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో దాదాపు రూ.4,128 కోట్ల వ్యయంతో తాగు నీరు సరఫరా చేయబోతున్నాం. రూ.22,587 కోట్ల వ్యయంతో కాలనీల్లో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ.. మరో రూ.4986 కోట్లతో భూగర్భ కేబుళ్లతో విద్యుత్ కనెక్షన్లు.. ఇవన్నీ కాకుండా మరో రూ.627 కోట్ల వ్యయంతో భూగర్భ కేబుళ్ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించబోతున్నాం. – పార్కులు, స్కూళ్లు, సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌ల వంటి వాటి కోసం మరో రూ.567 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మొత్తంగా 30 లక్షల ఇళ్లకు అన్ని మౌలిక సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పేదవాడి కల నిజం చేస్తున్నాం – తొలి దశ కింద రూ.28,084 కోట్ల వ్యయంతో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ఇవాళ మొదలు పెడుతున్నాం. ఏడాదిలో అంటే జూన్ 2022 నాటికి పూర్తి చేసే విధంగా కార్యక్రమం రూపొందించాం. రెండో దశలో 12.70 లక్షల ఇళ్లను రూ.22,860 కోట్లతో వచ్చే ఏడాది జూన్‌లో మొదలు పెడతాం. – ఆ విధంగా మొత్తం రూ.50,944 కోట్ల వ్యయంతో 28.30 లక్షల ఇళ్లు జూన్ 2023 నాటికి పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నాం. 30 లక్షల ఇళ్ల స్థలాలు సేకరించడమే కాకుండా, పీఎంఏవైతో వాటిని అనుసంధానం చేసి, ఇళ్ల నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తున్నాం. ఇళ్లు కాదు.. ఊళ్లు, పట్టణాలు – మనం కడుతోంది కేవలం ఇళ్లు కాదు.. ఊళ్లు, పట్టణాలు అని చెప్పొచ్చు. ఏకంగా 17 వేల కాలనీలు ఇప్పుడు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. – ఇవి కాక సొంత స్థలాలు, పొజిషన్ సర్టిఫికెట్లు ఉన్న లబ్ధిదారులు మరో 4.33 లక్షల మందిని కలుపుకుని మొదటి దశలో మొత్తం 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి నాంది పలికాం. – 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా దాదాపు 4.95 కోట్లు. ఇప్పుడు మన ప్రభుత్వం దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కూడా కట్టిస్తోంది. ఒక్కో ఇంట్లో నలుగురు ఉంటారనుకుంటే, మొత్తం 1.24 కోట్ల మందికి మనం ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. ఈ లెక్కన రాష్ట్రంలో పెద్దవైన 3 లేక 4 జిల్లాల్లో ఉన్నంత జనాభాకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు, ఇళ్లు కట్టిస్తున్నాం. చదవండి: సీఎం జగన్‌కు ప్రవాసాంధ్రుల కృతజ్ఞతలు వచ్చే ఖరీఫ్‌కు పోలవరం నీళ్లు -
పేదల ఇళ్ల కోసం ప్రత్యేకంగా జేసీలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ – జగనన్న కాలనీల్లో పేదల ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్‌ను నియమించింది. వీరు వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చూడాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రెండు ఫేజ్‌ల్లో రూ. 50,944 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ జేసీలకు హౌసింగ్, ఎనర్జీ, రూరల్ వాటర్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఏపీ ఫైబర్ నెట్, గ్రామ, వార్డు శాఖల అధికారులు సహకరించాల్సి ఉంటుంది. మొదటి దశ జూన్ 2022, రెండో దశ జూన్ 2023 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. చదవండి: Andhra Pradesh: లక్షల్లో ఇళ్లు.. వేలల్లో ఊళ్లు Andhra Pradesh: రైతుకు ఫుల్ ‘పవర్’ -
'40 ఇయర్స్ ఇండస్ట్రీ విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం'
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ రోజు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. 25 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీయే లక్ష్యంగా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. పేదలకు ఇళ్ళ స్ధలాల కేటాయింపులపై విజయవాడ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. 'జిల్లా వ్యాప్తంగా 4 వేల ఎకరాల భూములు సేకరించాం. విజయవాడలోని పేదలకు రాజధానిలో సెంటు భూమి ఇవ్వాలని నిర్ణయించాం. ఎస్సీల స్థలాలు లాక్కుంటున్నామని చంద్రబాబు అవాకులు చవాకులు పేలుస్తున్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకొనే నువ్వు ప్రోత్సహించకపోయినా పర్లేదు కానీ విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం. టీడీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి. మీ ప్రభుత్వంలో గజం భూమి ఇవ్వలేని మీరు.. మేము సెంటు భూమి ఇస్తే మాపై విమర్శలా..? చదవండి: ‘ఆ ఖర్చుతో రాష్ణ ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చు’ జక్కంపూడిలో ఇళ్లు ఇస్తామంటూ విజయవాడలోని పేదల వద్ద టీడీపీ నేతలు అడ్డంగా దోచుకున్నారు. 5 వేల ఇళ్లుంటే 9 వేలకు పైగా ఇళ్లంటూ స్లిప్పులిచ్చి మోసం చేయడానికి సిగ్గులేదా..? పేదల రక్తంతో ఇల్లు కట్టి వారిని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. మా ప్రభుత్వంలొ పేదలకు ఇల్లిస్తే విమర్శలు చేస్తారా..? ఇళ్ల కోసం గత ప్రభుత్వానికి డబ్బులు కట్టిన వారికి మేం అన్యాయం చేయం. వారికి కూడా అన్ని విధాలుగా న్యాయం చేస్తాం. ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇల్లు ఇవ్వాలని జగన్ సంకల్పించారు. ప్రతిపక్షం ఎన్ని కుయుక్తులు పన్నినా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామని' మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో జక్కంపూడిలో 17వేల ఇళ్లు ఇస్తే జగన్ సీఎం అయ్యాక విజయవాడలో 80 వేల మందికి ఇళ్లు ఇవ్వడం శుభపరిణామం. టీడీపీ నేతలు విమర్శలు చేస్తుంటే మేము సహించం. పేదలకు ఇళ్లిస్తున్న ఘనత జగన్‌దే. ఓట్ల కోసమే గత ప్రభుత్వం ఇళ్ల పేరుతో నాటకాలాడి దోచుకుంది. మా ప్రభుత్వంలో వారికి న్యాయం చేస్తాం. అర్హులైన ప్రతిఒక్కరికి ఇళ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. చదవండి: చంద్రబాబు ఇక నీ ఆటలు...మాటలు సాగవు -
'35వేల మందిని అర్హులుగా గుర్తించాము'
సాక్షి, విజయవాడ : ఉగాది నాటికి అర్హులైన ప్రతి పేదవారికి ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. కాగా దీని కింద ఇప్పటికే సెంట్రల్ నియోజకవర్గంలో 35 వేల మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన జగనన్న వసతిదీవెన ద్వారా రూ. 10వేలు విద్యార్థుల ఖాతాలో జమయ్యాయని వెల్లడించారు. విద్య పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని పేర్కొన్నారు. ప్రజల వద్దకు ప్రభుత్వం వెళ్లాలనే గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే చంద్రబాబు బస్సు యాత్రలు చేపడుతున్నారని మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. -
అట్రాసిటీ చట్టంపై ఆర్డినెన్స్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం విషయంలో ఎన్డీయే ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకిచాల్సిన అవసరం లేదని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ పేర్కొన్నారు. అట్రాసిటీ చట్టంపై సుప్రీం కోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం ద్వారా రివ్యూ పిటివేషన్ వేశామని, ఒకవేళ తీర్పు అనుకూలంగా రాకపోతే అట్రాసిటీ చట్టంపై ఆర్డినెన్స్ తీసుకొచ్చి యథాతధ స్థితిలో ఉంచుతామన్నారు. ఈ విషయంలో ఎస్సీ, ఎస్టీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి.. ఆ తర్వాత బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. యూపీఏ హయాంలో 4.4 శాతం ఉన్న జీడీపీ... ప్రస్తుతం నరేంద్రమోదీ పాలనలో 7.7 శాతానికి పెరిగినట్లు తెలిపారు. మోదీ నాలుగేళ్ల పాలనలో దేశంలో అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. 2020 వరకు దేశంలోని ప్రతీ నిరుపేదకు సొంత ఇళ్లు నిర్మించాలన్నదే ప్రధాని ధ్యేయమని అన్నారు. జన్‌ధన్ యోజనతో 32 కోట్ల కుటుంబాలకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు తెరవడం జరిగిందన్నారు. ఇటీవలే జరిగిన పలు సర్వేల్లో నరేంద్రమోదీపై 65 శాతం నుంచి 70 శాతం ప్రజలు అనుకూలంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో బీజేపీ అనుకూలమైన వాతావరణం ఉందని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. దేశంలోని 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, త్వరలో జరగనున్న రాజస్థాన్, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
బాబు హామీకి దిక్కులేదు
సాక్షి, హైదరాబాద్: గృహ నిర్మాణ శాఖకు బడ్జెట్లో కేటాయించిన నిధులు కాగితాలకే పరిమితం అయ్యాయి. పేరుకు వందలకోట్ల రూపాయల నిధులు కేటాయించినా ఇప్పటి వరకూ పేదల కోసం ఒక్క ఇళ్లు కూడా మంజూరు చేయలేదు. ఈ ఏడాది బడ్జెట్లో ఈ శాఖకు రూ. 897 కోట్లు కేటాయించినప్పటికీ ఆ మేరకు నిధులు విడుదల కాలేదు. ఇళ్ల మంజూరు కోసం ఏడాదిగా లబ్ధిదారులు ఎదురు చూడటమే తప్ప ప్రయోజనం మాత్రం దక్కడం లేదు. నిధుల కొరత కారణంగా కొత్త ఇళ్లు మంజూరు చేసే పరిస్థితి లేకపోవడంతో ఇక కేంద్ర ప్రభుత్వంపై మాత్రమే ఆశలున్నాయి. గత ఏడాది గృహ నిర్మాణ శాఖకు బడ్జెట్లో రూ. 808 కోట్లు కేటాయించినా ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులకే ఆ నిధులు సరిపోయాయి. కనీసం ఒక్క రూపాయి కూడా పెండింగ్ బిల్లులు మంజూరు చేయలేకపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కొత్త ఇళ్లను కేటాయిస్తామని, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు యూనిట్ ధరను రూ. 1.50 లక్షలకు, ఇతర కులాలకు చెందిన లబ్ధిదారులకు లక్ష రూపాయలకు పెంచుతానని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ప్రతిపాదన పరిశీలనలో ఉన్నందున కొత్త ఇళ్ల మంజూరు ఆలస్యం అవుతోందని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరై కొంత వరకూ నిర్మాణాలు పూర్తిఅయ్యి ఆగిపోయిన ఇళ్లకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఇప్పటికీ అమలు కాలేదు. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసే రాజీవ్ ఆవాస్ యోజన (ఆర్‌ఏవై), ఇందిరా అవాస్ యోజన (ఐఏవై) పథకాల మంజూరు పైనే రాష్ట్రం ఆశలున్నాయి. ఆర్‌ఏవై పథకం కింద ఈ ఏడాది పట్టణ ప్రాంతాల్లో 25 వేల గృహాలకు నిధులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఐఏవై పథకం కింద వీటికి మూడింతల సంఖ్య ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కేంద్రానికి రాష్ట్ర అధికారులు ఇటీవల ప్రతిపాదనలు పంపారు. ఆ మేరకు ఇళ్లు ఇస్తే తప్ప గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు నిర్మించే పరిస్థితి కనిపించడం లేదు.