28నే ఉగాది! | Astrologers want Ugadi on march 28 | Sakshi
Sakshi News home page

28నే ఉగాది!

Published Sun, Mar 5 2017 3:57 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

28నే ఉగాది! - Sakshi

28నే ఉగాది!

కంచిపీఠ ఆస్థాన పంచాంగకర్త శ్రీనివాస గార్గేయ
యాదగిరిగుట్ట: శ్రీ హేమలంబ ఉగాది పండుగను ఈ నెల 28వ తేదీనే ప్రజలు జరుపుకోవాలని కంచిపీఠ ఆస్థాన పంచాంగకర్త సుబ్రమణ్య సిద్ధాంతి శ్రీనివాస గార్గేయ పిలుపునిచ్చారు. శనివారం యాదగిరిగుట్టలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాచీన గణితం, దృగ్గణితము అనే విధానంలో తెలిపిన విధంగా మార్చి 28 లేదా 29న ఉగాది పండుగ జరుపుకోవాలని సం దిగ్ధం నెలకొందని తెలిపారు. శాస్త్రీయ తను చాటి చెప్పే దృగ్గణిత మును ప్రామాణికంగా తీసుకుని మార్చి 28న పండుగను జరుపు కోవాలని కొడకండ్ల సిద్ధాంతి (పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి) తెలిపినట్లు వెల్లడించారు.

ప్రముఖ దేవాలయాల్లో అసత్యమైన పూర్వగణిత పంచాంగాలను వాడడం తో ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. 2007లో ఇలాగే శ్రీ సర్వజిత్‌ సంవత్సర ఉగాది పండుగ తేదీల విషయంలో వివాదం వస్తే ఆనాడు నలుగురు ఐఏఎస్‌ అధికారుల సమక్షంలో పండిత చర్చ చేసి దృగ్గణిత ప్రకారమే ప్రభు త్వం ఉగాది నిర్వహిం చిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఆరోజునే పండుగ సెలవు ప్రకటి స్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన వెంట బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గంగు భానుమూర్తి, యాదాద్రి ఆస్థాన సిద్ధాంతి కృష్ణమా చార్య, వాసుదేవ శర్మ, జగదీ శ్వర శర్మ, రామలింగేశ్వరశర్మ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement