srinivasa gargeya
-
ఉగాది 28నే జరుపుకోవాలి
ముఖ్యమంత్రికి శ్రీనివాస గార్గేయ సూచన సాక్షి, అమరావతి: ఉగాది పండుగను ఈ నెల 28నే జరుపుకోవాలని పంచాంగకర్త శ్రీనివాస గార్గేయ సిద్ధాంతి ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించారు. శుక్రవారం సచివాలయంలో కంచికామకోటి పీఠ సిద్ధాంతి ఎల్ సుబ్రహ్మణ్యం, హనుమంత వజ్జల సుబ్రహ్మణ్యంతో కలసి ఆయన బాబును కలిశారు. నాసా చెప్పిన పద్ధతిలో 29న పాడ్యమి లేదని కాబట్టి ఆరోజు ఉగాది చేయకూడదని, 28నే చేయాలని కోరారు. అనేక రాష్ట్రాల్లో ఈ నెల 28నే ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం శ్రీజైన్ శ్వేతాంబర సభ ప్రతినిధి దినేశ్ జైన్ సీఎంను కలిశారు. ఆత్మహత్య చేసుకున్న మెడికో బాలసంధ్యారాణి తండ్రి బాల సత్తెయ్య ముఖ్యమంత్రిని కలిసి ఆదుకోవాలని కోరగా ఆయన రూ.2 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. -
28నే ఉగాది!
కంచిపీఠ ఆస్థాన పంచాంగకర్త శ్రీనివాస గార్గేయ యాదగిరిగుట్ట: శ్రీ హేమలంబ ఉగాది పండుగను ఈ నెల 28వ తేదీనే ప్రజలు జరుపుకోవాలని కంచిపీఠ ఆస్థాన పంచాంగకర్త సుబ్రమణ్య సిద్ధాంతి శ్రీనివాస గార్గేయ పిలుపునిచ్చారు. శనివారం యాదగిరిగుట్టలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాచీన గణితం, దృగ్గణితము అనే విధానంలో తెలిపిన విధంగా మార్చి 28 లేదా 29న ఉగాది పండుగ జరుపుకోవాలని సం దిగ్ధం నెలకొందని తెలిపారు. శాస్త్రీయ తను చాటి చెప్పే దృగ్గణిత మును ప్రామాణికంగా తీసుకుని మార్చి 28న పండుగను జరుపు కోవాలని కొడకండ్ల సిద్ధాంతి (పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి) తెలిపినట్లు వెల్లడించారు. ప్రముఖ దేవాలయాల్లో అసత్యమైన పూర్వగణిత పంచాంగాలను వాడడం తో ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. 2007లో ఇలాగే శ్రీ సర్వజిత్ సంవత్సర ఉగాది పండుగ తేదీల విషయంలో వివాదం వస్తే ఆనాడు నలుగురు ఐఏఎస్ అధికారుల సమక్షంలో పండిత చర్చ చేసి దృగ్గణిత ప్రకారమే ప్రభు త్వం ఉగాది నిర్వహిం చిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ఆరోజునే పండుగ సెలవు ప్రకటి స్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన వెంట బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గంగు భానుమూర్తి, యాదాద్రి ఆస్థాన సిద్ధాంతి కృష్ణమా చార్య, వాసుదేవ శర్మ, జగదీ శ్వర శర్మ, రామలింగేశ్వరశర్మ ఉన్నారు. -
28నే ఉగాది జరుపుకోవాలి
యాదగిరిగుట్ట: శ్రీ హేమలంబ నామ ఉగాది పండుగను ఈనెల 28వ తేదీనే ప్రజలు జరుపుకోవాలని కంచిపీఠ ఆస్థాన పంచాంగకర్త సుబ్రమణ్య సిద్ధాంతి శ్రీనివాస గార్గేయ కోరారు. మార్చి 28వ తేదీనా లేక 29వ తేదీ రోజున ఉగాది పండుగ జరుపుకోవాలా అని సందిగ్ధం అందరిలోనూ ఉందని ఆయన తెలిపారు. శాస్త్రీయతను చాటి చెప్పే దృగ్గణితం ప్రామాణికంగా 28వ తేదీన పండుగ చేసుకోవాలని కొడకండ్ల సిద్దాంతి (పాలకుర్తి నృసింహరామ సిద్దాంతిఽ) తెలిపినట్లు ఆయన వెల్లడించారు. -
ముహూర్తం మంచిదేనా?