ఉగాది 28నే జరుపుకోవాలి
ముఖ్యమంత్రికి శ్రీనివాస గార్గేయ సూచన
సాక్షి, అమరావతి: ఉగాది పండుగను ఈ నెల 28నే జరుపుకోవాలని పంచాంగకర్త శ్రీనివాస గార్గేయ సిద్ధాంతి ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించారు. శుక్రవారం సచివాలయంలో కంచికామకోటి పీఠ సిద్ధాంతి ఎల్ సుబ్రహ్మణ్యం, హనుమంత వజ్జల సుబ్రహ్మణ్యంతో కలసి ఆయన బాబును కలిశారు. నాసా చెప్పిన పద్ధతిలో 29న పాడ్యమి లేదని కాబట్టి ఆరోజు ఉగాది చేయకూడదని, 28నే చేయాలని కోరారు.
అనేక రాష్ట్రాల్లో ఈ నెల 28నే ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం శ్రీజైన్ శ్వేతాంబర సభ ప్రతినిధి దినేశ్ జైన్ సీఎంను కలిశారు. ఆత్మహత్య చేసుకున్న మెడికో బాలసంధ్యారాణి తండ్రి బాల సత్తెయ్య ముఖ్యమంత్రిని కలిసి ఆదుకోవాలని కోరగా ఆయన రూ.2 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.