రుణమాఫీ ఖాతాల్లో భారీ కోత | formers bank accounts to cut short | Sakshi
Sakshi News home page

రుణమాఫీ ఖాతాల్లో భారీ కోత

Published Sat, Mar 21 2015 4:26 PM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

రుణమాఫీ ఖాతాల్లో భారీ కోత - Sakshi

రుణమాఫీ ఖాతాల్లో భారీ కోత

రుణమాఫీపై సీఎం కోతలు కోసిన కొద్దిసేపటికే రైతుల ఖాతాల కుదింపు
ఉగాది వేళ ప్రజలకు సంతోషాన్ని దూరం చేసిన బాబు సర్కార్



గుంటూరు:
నూతన తెలుగు సంవత్సరాది కోతలతో ప్రారంభమైంది. శనివారం తుళ్లురు మండలం అనంతవరంలో జరిగిన ఉగాది వేడుకల్లో పట్టిసీమ, రాజధాని నిర్మాణం, బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల కోతలు కోసిన కొద్దిసేపటికే.. రుణమాఫీలో భారీ కోతను విధించేందుకు ఏపీ సర్కారు సన్నద్ధమైంది. అందుకు వీలుగా నిబంధనల పేరుతో దాదాపు 30 లక్షల రైతుల ఖాతాలను కుదించింది.

ఇప్పటివరకు రెండు విడతల్లో రూ.18,500 కోట్లు రుణమాఫీ, వడ్డీకింద రూ.2500 కోట్లు వడ్డీ కింద.. మొత్తం కలిపి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చెల్లింపులు చేశామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పండ్ల తోటల రుణ మాఫీకి మూడు వేల కోట్లతోపాటు డ్వాక్రా సంఘాల్లోని ఒక్కో మహిళకు రూ.10 వేలు చెల్లించేందుకు అవసరమయ్యే రూ10 వేల కోట్లను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. అయితే చంద్రబాబు సీఎం అయ్యేనాటికి వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు ఉండగా, శనివారం ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం రైతులకు చెల్లించింది కేవలం రూ.18,500 కోట్లేనని తేలింది. మరో విషయమేంమంటే 2015-16 బడ్జెట్ లో బాబు సర్కార్ రుణమాఫీకి  కేటాయించింది కేవలం 4,300 కోట్లు మాత్రమే.

మరోవైపు రుణమాఫీలో భారీ కోత విధించే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 83.28 లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లోనుంచి దాదాపు 30 లక్షల ఖాతాలను కుదించారు. ఆధార్ కార్డు అనుసంధానం, ఇతర నిబంధనలను బూచిగా చూపి మొత్తం ఖాతాల సంఖ్యను  51.45 లక్షలకు తగ్గించివేశారు. రైతులకు చెందిన బంగారం, పాసు పుస్తకాలు కూడా నాలుగేళ్ల వరకు  బ్యాంకుల్లో ఉండవలసిందేననీ అంశాన్ని కూడా నిబంధనల్లో చేర్చారు. దీంతో అప్పుల కోసం రైతులు ప్రైవేటు వడ్డీవ్యాపారుల్ని ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement