చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి ఎలా అయ్యారు? | How to become Chandrababu as chief minister to AP? | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి ఎలా అయ్యారు?

Published Sat, Dec 13 2014 3:07 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

వాసిరెడ్డి పద్మ - Sakshi

వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్: హైదరాబాద్లో ఆధార్ కార్డు ఉంటే ఏపీలో రుణమాఫీ చేయడం కుదరదని అంటున్నారని, అయితే  చంద్రబాబు నాయుడి ఆధార్ కార్డు, ఓటు హక్కు హైదరాబాద్లో ఉంటే ఆయన ఏపీకి ముఖ్యమంత్రి ఎలా అయ్యారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. సీమాంధ్రలో ఓట్ల కోసం హైదరాబాద్ నుంచి జనాన్ని తరలించినప్పుడు ఈ విషయం గుర్తులేదా అని ఆమె అడిగారు. బాబు ప్రభుత్వం ప్రతిపథకానికి ఆధార్ను అడ్డుపెట్టుకొని కోతలు విధించడం దారుణం అన్నారు.

ఆధార్ కార్డు హైదరాబాద్ లో ఉండి, ఏపీలో భూములు ఉన్న రైతులు చాలా మంది ఉన్నారని తెలిపారు. ఆధార్ కార్డు విషయంలో నిజాయితీగా ఉండే రైతులతో అబద్దాలు చెప్పించే దుస్థితికి చంద్రబాబు దిగజారారని విమర్శించారు. రుణవిముక్తి పత్రాల పేరుతో రైతులను దగా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రుణమాఫీ టోల్ఫ్రీ నంబర్ కూడా పని చేయడంలేదన్నారు. ఎవరిని మోసగించడానికి చంద్రబాబు సన్మానాలు చేయించుకుంటున్నారని పద్మ ప్రశ్నించారు.
**

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement