Published
Sat, Mar 4 2017 6:51 PM
| Last Updated on Tue, Sep 5 2017 5:12 AM
28నే ఉగాది జరుపుకోవాలి
యాదగిరిగుట్ట: శ్రీ హేమలంబ నామ ఉగాది పండుగను ఈనెల 28వ తేదీనే ప్రజలు జరుపుకోవాలని కంచిపీఠ ఆస్థాన పంచాంగకర్త సుబ్రమణ్య సిద్ధాంతి శ్రీనివాస గార్గేయ కోరారు. మార్చి 28వ తేదీనా లేక 29వ తేదీ రోజున ఉగాది పండుగ జరుపుకోవాలా అని సందిగ్ధం అందరిలోనూ ఉందని ఆయన తెలిపారు. శాస్త్రీయతను చాటి చెప్పే దృగ్గణితం ప్రామాణికంగా 28వ తేదీన పండుగ చేసుకోవాలని కొడకండ్ల సిద్దాంతి (పాలకుర్తి నృసింహరామ సిద్దాంతిఽ) తెలిపినట్లు ఆయన వెల్లడించారు.