
ఉగాది సందర్భంగా ప్రత్యేక బస్సులు
బెంగళూరు : ఉగాది పండుగను పురస్కరించుకుని ఏపీఎస్‌ఆర్టీసీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు శుక్రవారం సాయంత్రం ఐదుగంటల నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈమేరకు గురువారం సాయంత్రం మీడియా ప్రకటన వెలువరించింది. ఏపీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో పొద్దుటూరు-7, కడప-5, హైదరాబాద్-5, నంద్యాల-5, కర్నూల్-10, విజయవాడ-2,ఒంగోలు-1, నెల్లూరు-4, తిరుపతికి 3 ఉన్నాయి. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక బస్సులు అర్ధరాత్రి 12 గంటల వరకూ ఉండనున్నాయి. మరిన్ని వివరాలకు 9945516544, 9945516545,08022874136 (మెజెస్టిక్)... 9945516543 (శాంతలా బస్ స్టేషన్)లలో సంప్రదించవచ్చు.