ఉగాది 2024 హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం కొత్త ఏడాదికి ఆరంభం. ఉగాది. 'యుగ' అంటే వయస్సు,'ఆది' ఉగాది అనే రెండు సంస్కృత పదాల నుండి వచ్చిందే ఉగాది. ఉగాది అనగానే ఇల్లంగా శుభ్రం చేసుకోవడం, మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల మాలలతో అలంకరించుకోవడం ఆనవాయితీ. అలాగే రకరకాల పిండి వంటలు, ఉగాది పచ్చడితో విందు చేసుకోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఇంకా ఉగాది అనగానే కవితా పఠనాలు, పంచాంగ శ్రవణాలు, దానధర్మాలు కూడా చేస్తారు.
కొంగొత్త ఆశయాలకు అంకురార్పణ చేసే శుభదినమే ఉగాది పర్వదినం. శిశిరం తర్వాత వసంతం వస్తుంది. అందుకే అంతా కొత్త.. కొత్తగా కళకళలాడుతూ ఉండాలనీ, ఉగాది పండగ వచ్చిందంటే సంప్రదాయ రీతిలో కొత్త దుస్తులు ధరించాలని కూడా పెద్దలు చెబుతారు. కన్నెపిల్లలైతే అందమైన లంగా ఓణీలు, లెహంగాలతో సీతాకోక చిలుకల్లా ముస్తాబవుతారు. ఇక మహిళల ప్రాధాన్యత చీరలకే. ప్రస్తుతం నారాయణ పట్టు, కాటన్,చేనేత లెహంగాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
కాలం మంచితనంతో నేసిన ఆనందాలే మన వేడుకలు. నలుగురు కలిసే చోట.. నవ్వుల విందులు వేసే చోట.. సంబరాలు నట్టింట కొలువుండే చోట .. పండగ కాంతి దేదీప్యంగా వెలగాలంటే మన చేనేతలతో మరింత కొత్తగా సింగారించుకోవాలి ఏడాది పొడవునా ఇంటింటా శుభాలు నిండాలి.
పదహారణాల లంగావోణీ
తెలుగింటి మగువల సంప్రదాయ ఆహార్యం లంగావోణీ. పదహారణాల పోలికతో హృదయాల్లో కొలువుండే అందమైన రూపం. అందుకే మార్కెట్లోకి ఎన్ని డిజైనర్ డ్రెస్సులు వచ్చినా లంగా– ఓణీ ప్రాభవం ఇసుమంతైనా తగ్గలేదు. ఈ ప్రకృతి పండగ మరింత శోభాయమానంగా జరపుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాయి మన చేనేతలు. చేనేత చీరలు
పచ్చని సింగారం కంచిపట్టు
సంప్రదాయ వేడుక ఏదైనా కంచిపట్టు లేకుండా పూర్తవదు అనేది మనందరికీ తెలిసిందే. సాధారణంగా లంగాబ్లౌజ్ ఒక రంగు కాంబినేషన్ తీసుకొని దుపట్టా కాంట్రాస్ట్ కలర్ వాడుకుంటే బెటర్.
మనసు దోచే ఇకత్
ప్లెయిన్ ఇకత్ ఫ్యాబ్రిక్‌ను లెహంగాకు తీసుకున్నప్పుడు బార్డర్, ఎంబ్రాయిడరీ లెహెంగాను ఇపుడుఫ్యాషన్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా అదేరంగు ఇకత్‌తో డిజైన్ చేసి, కాంట్రాస్ట్ ఓణీ జతచేస్తే అమ్మాయిలకు ఎవర్‌గ్రీన్ కాన్సెప్ట్. మంచి కాంట్రాస్ట్ కలర్స్‌తో ఇక్కత చీర ఏ మహిళకైనా నిండుదనాన్ని తీసుకొస్తేంది
చల్ల..చల్లగా గొల్లభామ
తెలంగాణకే ప్రత్యేకమైన గొల్లభామ చేనేతకు అంతర్జాతీయంగానూ పేరుంది. కాటన్ మెటీరియల్ అనగానే పెదవి విరిచేవారికి కూడా సరైన ఎంపిక అవుతుంది. గొల్లభామ కాటన్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన లెహెంగా, దీని మీదకు కలంకారీ దుపట్టాను ఉపయోగించాను. తక్కువ ఖర్చుతో హ్యాండ్లూమ్స్‌ని పార్టీవేర్‌గానూ ఉపయోగించవచ్చు అనడానికి ఇదో ఉదాహరణ. సింపుల్ అనిపించే ఫ్యాబ్రిక్స్‌ని కూడా భిన్నమైన లుక్ వచ్చేలా హైలైట్ చేసుకోవచ్చు. గొల్లభామ చీరలు కూడా నిండుగా, ఈ వేసవిలో చల్లగా ఉంటాయి.
గ్రాండ్‌గా గద్వాల్, బెనారసీ పట్టు
వివాహ వేడుకల్లో అమ్మాయి అలంకరణ గ్రాండ్‌గా కనిపించాలంటే పట్టు లంగా ఓణీ సరైన ఎంపిక అవుతుంది. పెద్ద జరీ అంచు ఉన్న మెటీరియల్‌ను ఇందుకు ఎంచుకోవాలి. అలాగే ఓణీ కూడా జరీ బార్డర్‌తో ఉన్నది ఎంచుకుంటే కళగా కనిపిస్తారు. ఇక మగువలు గద్వాల్, కంచి, బెనారసీ పట్టు చీరల్లోమహారాణుల్లా మెరిసిపోతారు. ఈ ఉగాదిని గ్రాండ్‌గా సెలబ్రేషన్‌ల కోసం మీకు ఇష్టమైన సెలబ్రిటీల ఫ్యాషన్ దుస్తులను చూసి కూడా నచ్చింది ఎంపిక చేసుకోవచ్చు. అందరికీ శ్రీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు.
Comments
Please login to add a commentAdd a comment