Ugadi 2024: ఆన్‌లైన్‌లో ఆటా సాహిత్య వేదిక ఉగాది వేడుకలు | Ugadi 2024 Ata Ugadi cultural Vedika celebrated through online | Sakshi
Sakshi News home page

Ugadi 2024: ఆన్‌లైన్‌లో ఆటాసాహిత్య వేదిక ఉగాది వేడుకలు

Published Wed, Apr 17 2024 5:01 PM | Last Updated on Wed, Apr 17 2024 5:14 PM

 Ugadi 2024 Ata Ugadi cultural Vedika celebrated through online - Sakshi

అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఉగాది సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న  అంతర్జాలం వేదికగా  శారద సింగిరెడ్డి సారథ్యంలో నిర్వహించిన శ్రీ క్రోధి నామ సంవత్సర "తెలుగు వసంతం" సాహితీ ప్రియులను, తెలుగు భాషాభిమానులను ఆకట్టుకుంది. త్రిభాషా మహాసహస్రావధాని , ప్రణవ పీఠాధిపతులు వద్దిపర్తి పద్మాకర్,  తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం జాతీయ సాహిత్య పరిషత్తు ప్రాంత అధ్యక్షులు  ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి, శృంగేరి శారదా పీఠ ఆస్తాన పౌరాణికులు  డా. గర్రెపల్లి మహేశ్వర శర్మ, అవుసుల భానుప్రకాష్ అవధాని , అధ్యక్షులు సాహితీ గౌతమి కరీంనగర్ శ్రీ నంది  శ్రీనివాస్ ఆధ్వర్యంలో   ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. 

గణనాథుని కీర్తనతో రాలీ,నార్త్ కరోలీనా నుండి వైభవ్ గరిమెళ్ళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా , విశిష్ఠ అతిథుల వినోదభరిత విజ్ఞాన విశ్లేషణ, చతురత ఇమిడిన బోధన , సంస్కార సాంప్రదాయ సమ్మిళిత సుభాషిత సందేశాలతో రాశి ఫలాలు , పంచాంగ శ్రవణం, పద్య గద్య గాన ప్రసంగాదులతో ఆద్యంతం హృద్యంగా సాగిన ఈ సాహితీ  కార్యక్రమం ప్రేక్షకుల ప్రత్యేక మన్ననలందుకుంది.

కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మధు బొమ్మినేని పేరు పేరునా ప్రత్యేక అభినందనలను తెలిపారు. అలాగే  2024 సంవత్సరం అట్లాంటా లో జూన్ 7,8,9 తేదీలలో జరుగ నున్న18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్‌ఫరెన్స్‌కు అందరికీ పేరుపేరున సాదర ఆహ్వానాన్ని పలికారు. సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ కార్యక్రమానికి  నంది శ్రీనివాస్  వ్యాఖ్యాతగా వ్యవహరించగా  అతిథులందరూ ఉత్సాహంగా గడిపారు. చివరిగా ఆటా లిటరరీ సభ్యులు మాధవి దాస్యం విశిష్ఠ అతిథులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement