
దేశవ్యాప్తంగా శ్రీక్రోధి నామ ఉగాది వేడుకల సందడి నెలకొంది. తెలుగు ముంగిళ్లు మామిడి తోరణాలతో.. బంతి, చేమంతులపూల దండలతో ముస్తాబైనాయి. కొంగొత్త ఆశలు, ఆశయాలతో ఈ ఏడాదంతా శుభం జరగాలని కోరుకుంటూ తమ ఇష్టదైవాలకు మొక్కుకునే శుభ తరుణమిది. దీంతో దేవాలయ్యాన్నీ ముస్తాబైనాయి. ప్రత్యేకపూజలు ప్రార్థనలతో భక్తులు మునిగి తేలతారు.
ఈ క్రమంలో పాపులర్ యాంకర్ సుమ ఒక వీడియోను షేర్ చేసింది. పండగంటే పులిహోర లేకుండా ఎలా పులిహోర రడీ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. గలగల మాట్లాడుతూ, సందర్భోచితంగా పంచ్‌లు వేస్తూ, ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమ. దశాబ్దాలు తరబడి యాంకరింగ్ చేస్తున్నా బోర్ కొట్టని మాటల మూట సుమ.
Comments
Please login to add a commentAdd a comment