traditional attire
-
చేనేతను ఫ్యాషైన్ చేద్దాం!
ఇకత్ చీరతో వేడుకలో వెలిగిపోతాం. నారాయణపేట మెటీరియల్‌తో డిజైనర్ బ్లవుజ్ కుట్టించుకుంటాం. మన సంప్రదాయ వస్త్రధారణ మనల్ని ఫ్యాషన్ పెరేడ్లో తళుక్కుమని తారల్లా మెరిపిస్తోంది. ఇవి ఇంత అందంగా ఎలా తయారవుతాయి. ఒక డిజైన్ని విజువలైజ్ చేసి వస్త్రం మీద ఆవిష్కరించే చేనేతకారులు ఏం చదువుతారు... ఈ ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం చేశారు మిసెస్ ఇండియా (Mrs India) విజేత సుష్మ. ఈ వస్త్రాలను నేసే చేతులను, ఆ వేళ్ల మధ్య జాలువారుతున్న కళాత్మకతను దగ్గరగా చూడాలనిపించింది. పోచంపల్లి బాట పట్టారామె. కళాత్మకత అంతా చేనేతకారుల చేతల్లోనే తప్ప వారి జీవితాల్లో కనిపించలేదు. నూటికి రెండు–మూడు కుటుంబాలు ఆర్థికంగా బాగున్నాయి. మిగిలిన వాళ్లంతా ఈ కళను తమ తరంతో స్వస్తి పలకాలనుకుంటున్న వాళ్లే. మరి... ఇంత అందమైన కళ తర్వాతి తరాలకు కొనసాగకపోతే? ఒక ప్రశ్నార్థకం. దానికి సమాధానంగా ఆమె తనను తాను చేనేతలకు ప్రమోటర్‌గా మార్చుకున్నారు. చేనేతకారుల జీవితాలకు దర్పణంగా నిలిచే డాక్యుమెంటరీలు చిత్రీకరించారు. తాను పాల్గొనే ఫ్యాషన్ పెరేడ్లు, బ్యూటీ కాంటెస్ట్‌లలో మన చేనేతలను ప్రదర్శిస్తున్నారు. ఆ చేనేతలతోనే విజయాలు సొంతం చేసుకుంటున్నారు. స్వతహాగా ఎంటర్ప్రెన్యూర్ అయిన సుష్మా ముప్పిడి (Sushma Muppidi) మన హస్తకళలు, చేనేతలను ప్రపంచవేదిక మీదకు తీసుకెళ్లడానికి మార్గం సుగమం చేశారు.వైఫల్యమూ అర్థవంతమే! చీరాలకు చెందిన సుష్మ ముప్పిడి బీటెక్, ఎంబీఏ చేశారు. కొంతకాలం గుంటూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం, పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంతోపాటు మరో ప్రైవేట్ కాలేజ్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేశారు. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఉద్యోగం... ఈ జర్నీలో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఉద్యోగం కోసం తన హండ్రెడ్‌పర్సెంట్ ఇస్తోంది. పిల్లల కోసం గడిపే సమయం తగ్గిపోతోంది. వెనక్కి చూస్తే తనకు మిగిలిందేమిటి? సివిల్ సర్వీసెస్ ప్రయత్నం సఫలం కాలేదు. ఉనికి లేని సాధారణ ఉద్యోగంతో తనకు వచ్చే సంతృప్తి ఏమిటి? సమాజానికి పని చేయడంలో సంతృప్తి ఉంటుంది, తనకో గుర్తింపునిచ్చే పనిలో సంతోషం ఉంటుంది. ఇలా అనుకున్న తర్వాత యూత్‌లో సోషల్ అవేర్నెస్ కోసం కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ప్రయాణంలో అనుకోకుండా బ్యూటీ కాంపిటీషన్లో పాల్గొనవడం విజేతగా నిలవడం జరిగింది. సోషల్ ఇనిషియేటివ్, వెల్ స్పోకెన్, బెస్ట్ కల్చరల్ డ్రెస్, మిసెస్ ఫ్యాషనిష్టా వంటి గుర్తింపులతోపాటు ‘యూఎమ్బీ ఎలైట్ మిసెస్ ఇండియా 2024’ విజేతగా నిలిచారు. ఈ ఏడాది మార్చి ఒకటిన ఇటలీలోని మిలన్ నగరంలో, ఎనిమిదవ తేదీన ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో జరిగే ఫ్యాషన్ షోలలో భారత చేనేతలు అసోం సిల్క్, మల్బరీ సిల్క్లను ప్రదర్శించనున్నారు. జూన్‌లో యూఎస్, ఫ్లోరిడాలో జరిగే మిసెస్ యూనివర్సల్ వేదిక మీద మనదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు సుష్మ. ఇవన్నీ ఆత్మసంతృప్తినిచ్చే పనులు. ఇక తనకు రాబడి కోసం ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆఫీస్ నుంచి యూఎస్, దుబాయ్, సింగపూర్లలో డైమండ్ బిజినెస్ (Diamond Business) నిర్వహిస్తున్నారు. ‘‘జీవితంలో గెలవాలి, నా కోసం కొన్ని సంతోషాలను పూస గుచ్చుకోవాలి. నన్ను నేను ప్రశంసించుకోవడానికి సమాజానికి నా వంతు సర్వీస్ ఇవ్వాలి’’ అన్నారు సుష్మ. ‘‘వయసు దేనికీ అడ్డంకి కాదు. అంతా మన అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. మీ కలలను నిజం చేసుకోవాలంటే ఒక ముందడుగు వేయండి. సక్సెస్ అవుతామా, విఫలమవుతామా అనే సందేహాలు వద్దు. ఏ ప్రయత్నమూ చేయకపోవడం కంటే ప్రయత్నించి విఫలమైనా కూడా అది అర్థవంతమయిన వైఫల్యమే. కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోకూడదు’’ అని మహిళలకు సందేశమిచ్చారు. ఇది నా చేయూత పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిరిసిల్లలకు వెళ్లి స్వయంగా పరిశీలించాను. మన చేనేత కుటుంబాలు కళకు దూరం కాకుండా ఉండాలన్నా, ఇతరులు ఈ కళాత్మక వృత్తిని చేపట్టాలన్నా ఇది ఉపాధికి సోపానంగా ఉండాలి. అందుకోసం చేనేతలను కార్పొరేట్ స్థాయికి చేరుస్తాను. సమావేశాలకు ఉపయోగించే ఫైల్ ఫోల్డర్స్, ఇంట్లో ఉపయోగించే సోఫా కవర్స్, వేడుకల్లో ధరించే బ్లేజర్స్ వంటి ప్రయోగాలు చేసి మన చేనేతలను ప్రపంచవేదికలకు తీసుకెళ్లాలనేదే నా ప్రయత్నం. నేను ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎల్లలు దాటి విదేశాలకు విస్తరించాను. చదవండి: అన్నదాత మెచ్చిన రైతుబిడ్డకాబట్టి నాకున్న ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకుని మన చేనేతలను ప్రమోట్ చేయగలుగుతున్నాను. కలంకారీ కళ కోసం అయితే ప్రత్యేకంగా వర్క్‌షాప్ నిర్వహించి కలంకారీ కళాకారులకు ఉచితంగా స్టాల్స్ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేశాను. పారిస్, యూఎస్ కార్యక్రమాల తర్వాత ఆ పని. సివిల్స్ సాధించినా కూడా ప్రత్యేకంగా ఒక అంశం మీద సమగ్రంగా పని చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు నేను ఒక కళాత్మక సమాజానికి ఇస్తున్న సర్వీస్ నాకు అత్యంత సంతృప్తినిస్తోంది. ప్రపంచ ఫ్యాషన్ వేదిక మీద మన భారతీయ చేనేతకు ప్రాతినిధ్యం వహించాలి. మన నేతలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించాలనేది నా లక్ష్యం. – సుష్మ ముప్పిడి, మిసెస్ ఇండియా– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ప్రతినిధి -
పింక్ శారీలో ట్రెడిషనల్‌గా అందంగా మెరిసిన బాలీవుడ్ నటి (ఫోటోలు)
-
బొద్దుగా.. ఎంత ముద్దుగా ఉందో.. సంతోషంతో వెలిగిపోతున్న నటి పూర్ణ (ఫోటోలు)
-
టాలీవుడ్ బ్యూటీ.. చీరలో టీనేజీ కేరళ కుట్టి అనంతిక (ఫొటోలు)
-
... అద్దాల అందం
‘నిన్నటి ఆధునిక కళ నేటి సంప్రదాయ కళ’ అంటారు. కొన్ని దశాబ్దాల వెనక్కి వెళితే....లంబాడ గిరిజనుల సంప్రదాయ వస్త్రాధారణ కన్నుల పండగగా ఉండేది. ఇప్పుడు ఎక్కడో తప్ప సంప్రదాయ దుస్తులు ధరించే వారు కనిపించడం లేదు. ఇక సంప్రదాయ వస్త్రధారణ అనేది నిన్నటి కళేనా? ‘కానే కాదు’ అంటుంది బాలమణి. ఎనభై సంవత్సరాల బాలమణి పాతతరం ప్రతినిధి. ‘అయ్యో...మా కళలు మాకు దూరం అవుతున్నాయే’ అని నిట్టూర్చేది ఒకప్పుడు. ఇప్పుడు ఆమెలో నిన్నటి నిట్టూర్పు లేదు. ‘ఇదిగో మా కళలు మళ్లీ మా దగ్గరికి వస్తున్నాయి’ అనే సంతోషం ఆమె కళ్లలో మెరుస్తుంది....కల్చరల్ ఐడెంటిటీగా భావించే ‘లంబాడీ ఎంబ్రాయిడరీ’కి మళ్లీ ప్రాధాన్యత పెరిగింది. సేవాలాల్, మేరీమా, పన్నీ భవానీ పూజలు, తీజ్...మొదలైన పండగలకు సంప్రదాయ దుస్తులు వేసుకోవడం తప్పనిసరిగా మారింది. ప్రత్యేక కార్యక్రమాల్లో సెలబ్రిటీలు కూడా బంజార సంప్రదాయ దుస్తులు ధరిస్తున్నారు. దీంతో వీటిని రూ. 30వేల నుండి రూ. 2లక్షల వరకు ఖర్చుపెట్టి మరీ తయారు చేయించుకుంటున్నారు.సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్ పాటల చిత్రీకరణకు ఈ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.మహిళలు వేసుకునే సంప్రదాయ దుస్తులను పేట్యి, పేట్, గుంగుటో, కాంట్లీపేటీ, పులియ, గున్నో ...ఇలా ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తారు. వారు ధరించే ఆభరణాలు టోబ్లీ(చెవులకు పెట్టుకునేవి), హస్లీ(మెడలో వేసుకునే కడియం), వాంగ్డీ, కస్తులు( కాళ్లకు వేసుకునే వంకులు), హారం( రూపాయి బిల్లలను అతికించి వెండితో తయారు చేసే ఆభరణం) బల్యా(గాజులు)లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పట్కారి వారు వీరికి దుస్తులు, ఆభరణాలు, అలంకరణ వస్తువులు తయారుచేస్తుంటారు.బాలమణికి, సోనియా రాథోడ్‌కి ఎన్నో తరాల దూరం ఉంది. అయితే సంప్రదాయ కళల పట్ల వారి అభిరుచి విషయంలో మాత్రం ఎలాంటి దూరం లేదు. ఒకరు తమ తరం కళను ఈతరంలో చూసుకోవాలనుకుంటున్నారు. మరొకరు అలనాటి సంప్రదాయ కళలకు వారధిగా ఉండాలనుకుంటున్నారు.ఒకరిది ఆశావాదం. మరొకరిది ఆ ఆశావాదాన్ని ఆచరణలో తీసుకొచ్చి పూర్వ కళలకు అపూర్వ వైభవాన్ని తీసుకువచ్చే నవ చైతన్యం.– ఈరగాని భిక్షం, సాక్షి, మహబూబాబాద్అద్దాల రవిక అందమే వేరు!నాకు 80 సంవత్సరాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి మా అమ్మానాయినలు, తర్వాత అత్తామామలు లంబాడ దుస్తులు తయారీ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. రెండు రూపాయిలకు రవిక కుట్టడం నుంచి నాకు తెలుసు, రవికలు, అద్దాలు, రంగు రంగుల అతుకులతో పేటీలు కుట్టి ఇస్తే వాళ్ల ఇండ్లల్లో పండే ప్రతీ పంట మాకు పెట్టేవాళ్లు. కాలం మారింది. ఇప్పుడు మాతోపాటు, ఇతర ప్రాంతాల్లో కూడా వీటిని కుడుతున్నారు. ఏ బట్టలు వేసుకున్నా రాని అందం అద్దాల రవికతో వస్తుంది – బాలామణికలర్ఫుల్గా!నాకు చిన్నప్పటి నుండి మా సంస్కృతి సంప్రదాయాలంటే బాగా ఇష్టం. మా తండాలో ఉత్సవాలు జరిగినప్పుడు అందరం సంప్రదాయ దుస్తులు వేసుకుంటాం. తీజ్తో సహా ఇతర పండుగలకు కలర్‌ఫుల్ దుస్తులతో ఆడవారు కన్పించే తీరు కన్నుల పండుగగా ఉంటుంది. వేడుకలు, ఉత్సవాలలో సంప్రదాయ దుస్తులను ధరించడానికి ఇష్టపడతాను. – డాక్టర్ సోనికా రాథోడ్పెద్దల బాటలో...గిరిజన సాంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి. వివాహాలు, ఇతర శుభ కార్యాక్రమాలలో సాంప్రదాయ దుస్తులు తప్పకుండా వేసుకోవాలి. అప్పుడు మన సంస్కృతి, సాంప్రదాయాన్ని పెద్దలు చూపిన మార్గాన్ని అనుసరించిన వారం అవుతాం. – పద్మ, సేవాలాల్ సేనా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు -
ట్రెడిషినల్ లుక్‌లో హీరోయిన్ ప్రణీత (ఫోటోలు)
-
బిగ్‌బాస్ బ్యూటీ శోభాశెట్టి ట్రెడిషనల్ లుక్.. అదిరిందిగా! (ఫొటోలు)
-
మృణాల్ అందానికి ఫిదా అయిపోయిన శ్రీలీల (ఫొటోలు)
-
Ugadi 2024: లంగావోణీ, లెహెంగా, బెనారసీ.. ఆ సందడే వేరు!
ఉగాది 2024 హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం కొత్త ఏడాదికి ఆరంభం. ఉగాది. 'యుగ' అంటే వయస్సు,'ఆది' ఉగాది అనే రెండు సంస్కృత పదాల నుండి వచ్చిందే ఉగాది. ఉగాది అనగానే ఇల్లంగా శుభ్రం చేసుకోవడం, మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల మాలలతో అలంకరించుకోవడం ఆనవాయితీ. అలాగే రకరకాల పిండి వంటలు, ఉగాది పచ్చడితో విందు చేసుకోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఇంకా ఉగాది అనగానే కవితా పఠనాలు, పంచాంగ శ్రవణాలు, దానధర్మాలు కూడా చేస్తారు. కొంగొత్త ఆశయాలకు అంకురార్పణ చేసే శుభదినమే ఉగాది పర్వదినం. శిశిరం తర్వాత వసంతం వస్తుంది. అందుకే అంతా కొత్త.. కొత్తగా కళకళలాడుతూ ఉండాలనీ, ఉగాది పండగ వచ్చిందంటే సంప్రదాయ రీతిలో కొత్త దుస్తులు ధరించాలని కూడా పెద్దలు చెబుతారు. కన్నెపిల్లలైతే అందమైన లంగా ఓణీలు, లెహంగాలతో సీతాకోక చిలుకల్లా ముస్తాబవుతారు. ఇక మహిళల ప్రాధాన్యత చీరలకే. ప్రస్తుతం నారాయణ పట్టు, కాటన్,చేనేత లెహంగాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. కాలం మంచితనంతో నేసిన ఆనందాలే మన వేడుకలు. నలుగురు కలిసే చోట.. నవ్వుల విందులు వేసే చోట.. సంబరాలు నట్టింట కొలువుండే చోట .. పండగ కాంతి దేదీప్యంగా వెలగాలంటే మన చేనేతలతో మరింత కొత్తగా సింగారించుకోవాలి ఏడాది పొడవునా ఇంటింటా శుభాలు నిండాలి. పదహారణాల లంగావోణీ తెలుగింటి మగువల సంప్రదాయ ఆహార్యం లంగావోణీ. పదహారణాల పోలికతో హృదయాల్లో కొలువుండే అందమైన రూపం. అందుకే మార్కెట్లోకి ఎన్ని డిజైనర్ డ్రెస్సులు వచ్చినా లంగా– ఓణీ ప్రాభవం ఇసుమంతైనా తగ్గలేదు. ఈ ప్రకృతి పండగ మరింత శోభాయమానంగా జరపుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాయి మన చేనేతలు. చేనేత చీరలు పచ్చని సింగారం కంచిపట్టు సంప్రదాయ వేడుక ఏదైనా కంచిపట్టు లేకుండా పూర్తవదు అనేది మనందరికీ తెలిసిందే. సాధారణంగా లంగాబ్లౌజ్ ఒక రంగు కాంబినేషన్ తీసుకొని దుపట్టా కాంట్రాస్ట్ కలర్ వాడుకుంటే బెటర్. మనసు దోచే ఇకత్ ప్లెయిన్ ఇకత్ ఫ్యాబ్రిక్‌ను లెహంగాకు తీసుకున్నప్పుడు బార్డర్, ఎంబ్రాయిడరీ లెహెంగాను ఇపుడుఫ్యాషన్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా అదేరంగు ఇకత్తో డిజైన్ చేసి, కాంట్రాస్ట్ ఓణీ జతచేస్తే అమ్మాయిలకు ఎవర్గ్రీన్ కాన్సెప్ట్. మంచి కాంట్రాస్ట్ కలర్స్‌తో ఇక్కత చీర ఏ మహిళకైనా నిండుదనాన్ని తీసుకొస్తేంది చల్ల..చల్లగా గొల్లభామ తెలంగాణకే ప్రత్యేకమైన గొల్లభామ చేనేతకు అంతర్జాతీయంగానూ పేరుంది. కాటన్ మెటీరియల్ అనగానే పెదవి విరిచేవారికి కూడా సరైన ఎంపిక అవుతుంది. గొల్లభామ కాటన్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన లెహెంగా, దీని మీదకు కలంకారీ దుపట్టాను ఉపయోగించాను. తక్కువ ఖర్చుతో హ్యాండ్లూమ్స్ని పార్టీవేర్‌గానూ ఉపయోగించవచ్చు అనడానికి ఇదో ఉదాహరణ. సింపుల్ అనిపించే ఫ్యాబ్రిక్స్‌ని కూడా భిన్నమైన లుక్ వచ్చేలా హైలైట్ చేసుకోవచ్చు. గొల్లభామ చీరలు కూడా నిండుగా, ఈ వేసవిలో చల్లగా ఉంటాయి. గ్రాండ్‌గా గద్వాల్, బెనారసీ పట్టు వివాహ వేడుకల్లో అమ్మాయి అలంకరణ గ్రాండ్‌గా కనిపించాలంటే పట్టు లంగా ఓణీ సరైన ఎంపిక అవుతుంది. పెద్ద జరీ అంచు ఉన్న మెటీరియల్‌ను ఇందుకు ఎంచుకోవాలి. అలాగే ఓణీ కూడా జరీ బార్డర్‌తో ఉన్నది ఎంచుకుంటే కళగా కనిపిస్తారు. ఇక మగువలు గద్వాల్, కంచి, బెనారసీ పట్టు చీరల్లోమహారాణుల్లా మెరిసిపోతారు. ఈ ఉగాదిని గ్రాండ్‌గా సెలబ్రేషన్ల కోసం మీకు ఇష్టమైన సెలబ్రిటీల ఫ్యాషన్ దుస్తులను చూసి కూడా నచ్చింది ఎంపిక చేసుకోవచ్చు. అందరికీ శ్రీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు. -
అఫ్గన్ నిజమైన సంస్కృతి ఇదే.. ‘నా దుస్తుల జోలికి రావొద్దు’
రబ్బరు బంతిని ఎంత బలంగా నేలకు కొడితే అంతే వేగంగా పైకి లేస్తుంది... జీవం లేని వస్తువే అంతటి ప్రతిఘటన చూపిస్తే.. మరి ప్రాణమున్న మనుషుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అణచివేత ధోరణికి పోరాటాలతో చరమగీతం పాడి హక్కులు సాధించుకున్న అనేకానేక స్ఫూర్తిదాయక కథలను చరిత్ర తన కడుపులో దాచుకున్నది. ఆధిపత్య భావజాలానికి ఎదురొడ్డి హక్కుల సాధనకు కృషి చేసిన మహనీయుల గాథలను ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉంటుంది. అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో అక్కడి మహిళలు ఇప్పుడు మరోసారి తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే వస్త్రధారణ, విద్య, ఉద్యోగం వంటి అంశాల్లో తాలిబన్లు అనుసరిస్తున్న వైఖరికి గట్టిగానే సమాధానం చెబుతున్నారు. నిజానికి ఆగష్టు 15న రాజధాని కాబూల్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత తాలిబన్ల గత అరాచక పాలనను గుర్తుచేసుకుని దేశ ప్రజలు.. ముఖ్యంగా మహిళలు ఎంతగా బెంబేలెత్తిపోయారో ప్రపంచం మొత్తం చూసింది. తాము మరోసారి నరకంలోకి వెళ్లడం ఖాయమని వారు చేసిన వ్యాఖ్యలు వారి దుస్థితికి అద్దం పట్టాయి. అలాంటి సమయంలో తమ తొట్టతొలి మీడియా సమావేశంలో మహిళలపై ఎలాంటి వివక్ష చూపబోమంటూ తాలిబన్లు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, అది కేవలం మాటల వరకే పరిమితమని తేలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కో ఎడ్యుకేషన్ రద్దు చేస్తూ ఫత్వా జారీ చేయడం, తమ ప్రభుత్వంలో మహిళలకు ఉన్నత పదవులు(మంత్రి) ఉండవని చెప్పడం స్త్రీల పట్ల వారు అనుసరించబోయే విధానాలను చెప్పకనేచెప్పాయి. ముఖ్యంగా పురుషుల తోడు లేకుండా ఆడవాళ్లు బయటకు రావద్దని చెప్పడం, వస్త్రధారణ పట్ల ఆంక్షలు విధించడం షరా మామూలే. అయితే, మహిళలు మాత్రం తాలిబన్ల కట్టుబాట్లకు తలొంచేది లేదని, తమ స్వేచ్చకు భంగం కలిగితే ఊరుకునేది లేదని గట్టిగానే గళం వినిపిస్తున్నారు. ఇప్పటికే పలు నిరసనలు చేపట్టిన స్త్రీలు.. సోషల్ మీడియా వేదికగా మరో ఉద్యమానికి తెరతీశారు. అఫ్గన్ సంస్కృతి ఇదే! సుదీర్ఘ కాలంగా అంతర్గత విభేదాలు, విదేశీ జోక్యంతో అతలాకుతలమైన అఫ్గనిస్తాన్ 20వ శతాబ్దం మధ్యలో ఆధునీకరణ వైపు అడుగులు వేసింది. ముఖ్యంగా 1950, 1960లలో పెద్దఎత్తున మార్పులతో మరింత ఉదార, పాశ్చాత్య జీవనశైలి విధానాలు అవలంబించే దిశగా పాలకులు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించే వీలు కలిగింది. కానీ, 1996 నుంచి 2001 వరకు తాలిబన్ల పాలనలో ఇవన్నీ తలకిందులయ్యాయి. షరియా చట్ట ప్రకారం పాలించిన తాలిబన్లు.. బుర్ఖా విషయంలో కఠిన నిబంధనలు అమలు చేశారు. ఇప్పుడు కూడా అదే వైఖరిని అవలంబిస్తే సహించేది లేదంటున్నారు అక్కడి మహిళలు. ‘#Afghanistanculture పేరిట ట్విటర్లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. #DoNotTouchMyClothes అంటూ తమ వస్త్రధారణ జోలికొస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా వందలాది మంది మహిళలు అఫ్గన్ సంప్రదాయ దుస్తులు ధరించిన తమ ఫొటోలను షేర్ చేస్తున్నారు. నెటిజన్లు కూడా వీరికి మద్దతుగా నిలుస్తున్నారు. హక్కుల పోరాటానికై మీరు చేసే ఉద్యమంలో మావంతు సాయం చేస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు. -వెబ్‌డెస్క్ This is another traditional Afghan dress from a different part of Afghanistan. I was a teenager in this pic. We will not let our culture to be appropriated by those who want to erase us. #DoNotTouchMyClothes #AfghanistanCulture pic.twitter.com/dMwnBS7vuT — Dr. Bahar Jalali (@RoxanaBahar1) September 12, 2021 Afghan women, cultural campaign, traditional dress.#AfghanistanCulture 🇦🇫 pic.twitter.com/Qey9mdzVDT — Mustafa Kamal Kakar (@MustafaKamalMKK) September 12, 2021 Black attire, Burqa, and Niqab are not and never been part of the Afghan Culture. Here's a few different types of traditional Afghan attire for women. It's colourful, modest, practical, and more importantly beautiful.#AfghanistanCulture #AfghanWomen #TalibanTerror https://t.co/OYs89B24LC pic.twitter.com/s8hq0CWaij — Zahra Sultani | زارا سلطانی (@zahrasultani_) September 12, 2021 చదవండి: ప్రఖ్యాత గ్లోబల్ టీచర్ ప్రైజ్ రేసులో హైదరాబాదీ! -
సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న చాను, ఫ్యాన్స్ ఫిదా
సాక్షి,న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి భారత్ పతకాల ఖాతా తెరిచిన కోట్లాది భారతీయుల మనసుదోచుకున్న మణిపూర్ మణిపూస మీరాబాయి చాను సంప్రదాయ దుస్తుల్లో మెరిసి పోతోంది. ట్రెడిషనల్ దుస్తులంటేనేఎప్పటికీ ఇష్టపడతానంటూ ఒక ఫోటోను ఆమె ట్విటర్లో అభిమానులతో పంచుకున్నారు. దీంతో అద్భుతంగా ఉన్నారంటూ ఫ్యాన్స్ కితాబిచ్చారు. మోడ్రన్ దుస్తులకంటే సాంప్రదాయక దుస్తులు మరింత మెరుగ్గా, అందంగా ఉంటాయని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ముంబైలో తన ఫ్యావరెట్ హీరో, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను మీరాబాయి చాను బుధవారం కలిశారు. ఈ ఫోటోలను కూడా ఆమె ట్వీట్ చేశారు. ఒలింపిక్ మెడల్ విజేతను కలవడం ఆనందంగా ఉందంటూ సల్మాన్ ఖాన్ కూడా ట్వీట్ చేశారు. మీరాబాయ్ క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్‌ను కూడా కలిసింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో రజత పతకాన్ని సొంతం చేసుకుని సగ్వంగా సొంత గ్రామానికి చేరుకున్న చాను, అప్పుడే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేసింది. మణిపూర్ ప్రభుత్వం చానుకు కోటి రూపాయల రివార్డుతోపాటు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పోర్ట్స్)గా నియమించనున్న సంగతి తెలిసిందే. (Mirabai Chanu: మరోసారి మనసు దోచుకున్న చాను, ప్రాక్టీస్ షురూ, ఫోటో వైరల్) బాలీవుడ్ స్టార్ హీరోతో మీరాబాయి క్రికెట్ స్టార్‌తో ఒలింపిక్ స్టార్ మీరాబాయి మీరాబాయి బర్త్‌డే వేడుకలు Always happy to be in my traditional outfits. pic.twitter.com/iY0bI69Yh5 — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) August 12, 2021 -
సంప్రదాయ వస్త్రధారణతో పోలీసులు సందడి
సాక్షి, కడప: శాంతి భద్రతల పరిరక్షణకు నిత్యం ఖాకీ చొక్కాలు ధరించి.. పని ఒత్తిడితో విధి నిర్వహణలో ఉండే పోలీసులు సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయ దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు. సంక్రాంతికి కడప సబ్ డివిజన్ పోలీసులు కొత్త సంప్రదాయంతో స్వాగతం పలికారు. ఎస్పీ అన్బు రాజన్ ఆధ్వర్యంలో కడప డిఎస్పీ సూర్యనారాయణ నేతృత్వంలో సిఐలు, ఎస్ఐలు సంప్రదాయ దుస్తులు ధరించారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఎస్పీ అన్బురాజన్ ఆకాంక్షించారు. కడప సబ్ డివిజన్ పోలీసులు ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
కేరళ సంప్రదాయ దుస్తుల్లో పీవీ సింధు
-
అదిరేటి డ్రస్సు మేమేస్తే..
తిరుచానూరు : అదిరేటి డ్రస్సు మేమేస్తే...బెదిరేటి లుక్కు మీరిస్తే.. అన్నట్టుగా సాగింది.. మిస్టర్ అండ్ మిసెస్ తిరుపతి సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు. ఈ పోటీలకు శిల్పారామం సాంస్కృతిక కళా మందిరం వేదికయ్యింది. తొలిసారిగా తిరుపతిలో నిర్వహించిన ఈ పోటీలకు యువతీ యువకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. తెలుగు సాంప్రదాయ కట్టుబొట్టుతో ఆడపడుచులు, పంచెకట్టుతో యువకులు ముసిముసి నవ్వులతో హొయలొలుకుతూ చేసిన ర్యాంప్ వాక్ సందర్శకులను ఉర్రూతలూగించింది. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో జరుగుతున్న ఆషాడం ఆనందలహరి సాంప్రదా య పోటీల్లో భాగంగా ఆదివారం సాయంత్రం సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు యువతులు 18 మంది, ఇద్దరు యువకులు మొత్తం 20 మంది పాల్గొన్నారు. ర్యాంప్ వాక్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. న్యాయనిర్ణేతలుగా శ్రీదేవి, రిజ్వాన్ ఫిరోజ్ వ్యవహరించారు. సోమవారం సాయంత్రం తెలుగు భాష విభాగంలో వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సుధ సంగీత కళాశాల చైర్మన్ సుధ, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణ, శిల్పారామం సిబ్బంది రాధాకృష్ణ, హరి, కృష్ణప్రసాద్, ఆనంద్, ప్రభాకర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.