
సాక్షి, కడప: శాంతి భద్రతల పరిరక్షణకు నిత్యం ఖాకీ చొక్కాలు ధరించి.. పని ఒత్తిడితో విధి నిర్వహణలో ఉండే పోలీసులు సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయ దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు. సంక్రాంతికి కడప సబ్ డివిజన్ పోలీసులు కొత్త సంప్రదాయంతో స్వాగతం పలికారు. ఎస్పీ అన్బు రాజన్ ఆధ్వర్యంలో కడప డిఎస్పీ సూర్యనారాయణ నేతృత్వంలో సిఐలు, ఎస్‌ఐలు సంప్రదాయ దుస్తులు ధరించారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఎస్పీ అన్బురాజన్ ఆకాంక్షించారు. కడప సబ్ డివిజన్ పోలీసులు ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.