ఉగాది రోజున అనిల్‌ రావిపూడి కొత్త సినిమా? | Anil Ravipudi New Film Announcement On Ugadi | Sakshi
Sakshi News home page

ఉగాది రోజున అనిల్‌ రావిపూడి కొత్త సినిమా?

Published Wed, Mar 14 2018 11:28 AM | Last Updated on Wed, Mar 14 2018 11:30 AM

Anil Ravipudi - Sakshi

అనిల్‌ రావిపుడి

తీసింది మూడు సినిమాలే. కానీ, యంగ్‌ హీరోలకు ఈ డైరెక్టర్‌ హాట్‌ ఫేవరెట్‌. పటాస్‌, సుప్రీం, రాజా ది గ్రేట్‌ ఇలా తీసిన ప్రతి సినిమాలో తన మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమాను విజయతీరాలకు చేర్చిన దర్శకుడు అనిల్‌ రావిపూడి. రీసెంట్‌గా రవితేజ ఖాతాలో హిట్‌ పడేసిన ఈ యువ దర్శకుడు ఉగాదికి తన కొత్త సినిమాను ప్రారంభించబోతున్నాడు. ఈసారి మల్టీస్టారర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
 
మొదటిసారిగా మల్టీ‍స్టారర్‌ సినిమాను తెరకెక్కిస్తున్న అనిల్‌ పెద్ద హీరోలతో ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటించబోతున్నట్లు సమాచారం.  తన మార్క్‌ కామెడీతోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. దిల్‌ రాజు బ్యానర్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎఫ్‌ 2( ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడానికి  అనిల్‌ రెడీ అవుతున్నాడు.  వెంకటేశ్‌కు జోడిగా తమన్నా నటించే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement