new film project
-
ఉగాది రోజున అనిల్ రావిపూడి కొత్త సినిమా?
తీసింది మూడు సినిమాలే. కానీ, యంగ్ హీరోలకు ఈ డైరెక్టర్ హాట్ ఫేవరెట్. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ ఇలా తీసిన ప్రతి సినిమాలో తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో సినిమాను విజయతీరాలకు చేర్చిన దర్శకుడు అనిల్ రావిపూడి. రీసెంట్గా రవితేజ ఖాతాలో హిట్ పడేసిన ఈ యువ దర్శకుడు ఉగాదికి తన కొత్త సినిమాను ప్రారంభించబోతున్నాడు. ఈసారి మల్టీస్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మొదటిసారిగా మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్న అనిల్ పెద్ద హీరోలతో ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ కలిసి నటించబోతున్నట్లు సమాచారం. తన మార్క్ కామెడీతోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎఫ్ 2( ఫన్ అండ్ ఫ్రస్టేషన్) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడానికి అనిల్ రెడీ అవుతున్నాడు. వెంకటేశ్‌కు జోడిగా తమన్నా నటించే అవకాశం ఉంది. -
‘కాలేజ్ పోరగాళ్లు’ సినిమా చిత్రీకరణ
మంచిర్యాలఅర్బన్ : సింగరేణి కార్మికుల పిల్లలు హైదరాబాద్‌కు పై చదువులకు వెళ్లి తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతున్నారా లేదా అనే అంశంతో మంత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న కాలేజ్ పోరగాళ్లు సినిమా చిత్రీకరణ మంగళవారం పట్టణ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. దర్శకుడు, నిర్మాత, కథ మాటల రచయిత అన్నం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ఏసీపీ గౌస్‌బాబా క్లాప్ కొట్టారు. మరో నాలుగు రోజుల పాటు మంచిర్యాల గోదావరి నది, క్వారీ తదితర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నట్లు దర్శకుడు అన్నం చంద్రశేఖర్ తెలిపారు. -
కొత్త సినిమాలేవీ అంగీకరించకూడదు!
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మినహా శ్రుతీహాసన్ వేరే కొత్త సినిమాలేవీ అంగీకరించకూడదని హైదరాబాద్ మూడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఓ ఉత్తర్వు జారీ చేసింది. హైదరాబాద్, చెన్నైలకు చెందిన పిక్చర్ హౌస్ మీడియా చేసిన ఫిర్యాదును పరిశీలించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశించింది. నాగార్జున, కార్తి హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం నిర్మిస్తోంది. ఇందులో శ్రుతీహాసన్‌ను నాయికగా తీసుకున్నారు. తొలి షెడ్యూల్ పూర్తవుతున్న నేపథ్యంలో శ్రుతీహాసన్‌కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాలనుకున్నారు. అయితే, తేదీలు ఖాళీ లేకపోవడం వల్ల ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నాననీ ‘ఇ-మెయిల్’ ద్వారా తమకు శ్రుతీహాసన్ తెలియజేశారట. ఆ విషయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పిక్చర్ హౌస్ మీడియా సంస్థ పేర్కొంది. ముందుగా సంప్రతించే శ్రుతి డేట్లు తీసుకున్నామనీ, ఆమె అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు తప్పుకోవడం వల్ల కోట్ల రూపాయల్లో తమకు నష్టం వాటిల్లడంతో పాటు, ఇతర నటీనటుల సమయం కూడా వృథా అవుతోందనీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారు శ్రుతీహాసన్పై కేసు పెట్టారు. ఈ కేసుని విచారించి ఇది సివిల్ అఫెన్స్ అనీ, తదుపరి ఆర్డర్లు వెలువడే వరకూ శ్రుతీహాసన్ కొత్త సినిమాలు అంగీకరించకూడదనీ న్యాయస్థానం ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. క్రిమినల్కేసు నమోదు చేసి, విచారణ చేయాలని పోలీసుల్ని ఆదేశించింది.