వి అండ్‌ వి ఫిక్స్‌ గురూ! | Venkatesh and Anil Ravipudi to team up for F2 | Sakshi
Sakshi News home page

వి అండ్‌ వి ఫిక్స్‌ గురూ!

Published Fri, Feb 2 2018 12:17 AM | Last Updated on Fri, Feb 2 2018 12:17 AM

Venkatesh and Anil Ravipudi to team up for F2  - Sakshi

వరుణ్‌ తేజ్‌, విక్టరీ వెంకటేష్‌

మల్టీస్టారర్‌ మ్యాచ్‌ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు ‘ఎఫ్‌ 2’ బ్యాచ్‌. ఈ బ్యాచ్‌ కెప్టెన్‌ అనిల్‌ రావిపూడి. ఒక లీడ్‌ ప్లేయర్‌ విక్టరీ వెంకటేష్‌ (వి). మరో లీడ్‌ ప్లేయర్‌ ప్లేస్‌లో చాలామంది పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా ఆ ప్లేస్‌ను హీరో వరుణ్‌ తేజ్‌ (వి) భర్తీ చేశారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌ 2’ (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)  టైటిల్‌తో ఓ మల్టీస్టారర్‌ మూవీ రూపొందనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ను మే నెలలో స్టార్ట్‌ చేయనున్నారని సమాచారం.

ఆల్రెడీ వెంకీ రెడీగా ఉన్నారు. ఈ నెల 9న విడుదల కానున్న ‘తొలిప్రేమ’ సినిమా తర్వాత వరుణ్‌ తేజ్‌ ఫ్రీ అయిపోతారు. ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్‌’ చిత్రాలతో హ్యాట్రిక్‌ విజయాలను ఖాతాలో వేసుకున్నారు అనిల్‌ రావిపూడి. ఇప్పుడు సెకండ్‌ హ్యాట్రిక్‌ని టార్గెట్‌ చేశారట. ఆ హ్యాట్రిక్‌ను ఈ మల్టీస్టారర్‌తో స్టార్ట్‌ చేయనున్నారు. అయితే ఇందులో ఎవరు ‘ఫన్‌’ క్యారెక్టర్‌ చేయబోతున్నారు? ‘ఫ్రస్ట్రేట్‌’ అయ్యే క్యారెక్టర్‌లో ఎవరు నటించబోతున్నారన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్స్‌ సెలక్షన్స్‌ కోసం చర్చలు జరుపుతున్నారట చిత్రబృందం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement