గురు సినిమాతో ఫుల్ ఫాంలోకి వచ్చేశాడు విక్టరీ వెంకటేశ్. కానీ ఈ మూవీ వచ్చి ఏడాది గడుస్తున్నా... వెంకీ నుంచి కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఆచితూచి స్ర్కిప్ట్స్‌కు ఓకే చెప్పడమే దీనికి కారణం అని తెలుస్తోంది. డైరెక్టర్ తేజతో ఓ సినిమా ఉంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ప్రస్తుతం హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) మల్టిస్టారర్‌లో వరుణ్‌తేజ్,వెంకటేశ్‌లు నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో హీరో హీరోయిన్లు అంటూ చాలా మంది పేర్లే వినిపించాయి. కానీ తాజాగా దిల్ రాజు అధికారికంగా ప్రకటించేశారు. వెంకీకి జోడిగా మిల్కీ బ్యూటిని, వరుణ్‌కు జోడిగా మెహరీన్‌ను తీసుకున్నుట్లు సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. జూన్‌లో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. అనిల్ రావిపూడి ఈ సినిమాను ఆద్యంతం వినోదంగా తెరకెక్కించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment