Sitara Ugadi Wishes: Mahesh Babu Daughter Sitara Shares Ugadi Special Video - Sakshi
Sakshi News home page

స్పెషల్‌ వీడియోతో సితార ఉగాది విషెస్‌.. ఎంత క్యూట్‌గా చెప్పిందో...

Published Sat, Apr 2 2022 2:05 PM | Last Updated on Sat, Apr 2 2022 3:10 PM

Mahesh Babu Daughter Sitara Wishes Everyone To Happy Ugadi - Sakshi

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సినీ ప్రముఖులు ప్రతి ఒక్కరు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు గారాల పట్టి సితార సైతం అభిమానులకు ఉగాది విషెస్‌ తెలియజేసింది. ప్రతి పండగకి అభిమానులకు శుభాకాంక్షలు చెప్పడం సితారకు అలావాటు. ఆ పండగ ప్రత్యేకత తెలుసుకొని మరి దానికి తగ్గట్టుగా రెడీ అయి విషెస్‌ తెలియజేస్తుంది.

ఉగాది పండక్కి కూడా సితార అదే ఫాలో అయింది.  ఉగాది సందర్భంగా ట్రెడిషనల్‌ లుక్‌లో ఓ బ్యూటిఫుల్‌ ఫోటోషూట్‌ చేయించుకుంది సితార. దానికి సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ..‘అందరికి ఉగాది శుభాకాంక్షలు’ అని అచ్చమైన తెలుగులో చెప్పింది.  ఆ వీడియో సితార డ్రెడిషనల్‌ లుక్‌లో యువరాణిలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

ఇటీవల సితార ఏ పోస్ట్‌ పెట్టినా అది నెట్టింట వైరల్‌ అవుతుంది. ఆ మధ్య‘ సర్కారు వారి పాట’ నుంచి కళావతి పాటకు స్టెప్పులేస్తే.. అది నెట్టింట చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత అదే సినిమాలో ‘ఎవ్రీ పెన్ని’ పాటకు తనదైన స్టైల్లో స్టెప్పులేసి ఔరా అనిపించింది.  తాజాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సితూ పాప పోస్ట్‌ చేసిన వీడియో కూడా వైరల్‌ అయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement