వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ గురువారం అనుమానాస్పద రీతిలో మరణించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమె మృతికి గల కారణాలను వైద్యులు వెల్లడించారు. శరీరంపై మొద్దుబారిన గాయాల ప్రభావం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.
ఇవానా ట్రంప్ మన్‌హాటన్‌లోని తన ఇంట్లో మెట్లపైనుంచి కాలుజారి పడటం వల్ల గాయాలపాలై మరణించారని అమెరికా మీడియాలో ప్రచారం జరిగింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
ఇవానా అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు ఆమె ఇంటి అడ్రస్ నుంచి తమకు గురువారం ఫోన్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. అక్కడి వెళ్లి చూస్తే ఆమె ఘటనా స్థలంలోనే మరణించి ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే అక్కడ నేరం జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు కన్పించలేదని స్పష్టం చేశారు.
ఇవానా మరణించిందని గురువారం ట్రుత్ సోషల్ వేదికగా వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్. ఆమె గొప్ప, అందమైన మహిళ అని పేర్కొన్నారు. ఆమెకు తన ముగ్గురు పిల్లలు డొనాల్డ్ జూనియర్, ఇవాంక, ఎరిక్‍లే సర్వసమని తెలిపారు. ఆమె పట్ల తామంతా గర్వపడుతున్నామని, ఇవానా ఆత్మకు శాంతి చేకూరాలని భావోద్వేగ సందేశం రాసుకొచ్చారు.
ఇవానా ట్రంప్ ఓ మోడల్. 1977లో అప్పుడు రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా ఉన్న ట్రంప్‌ను పెళ్లాడారు. ఈ దంపతులకు పెళ్లైన ఏడాదికే డొనాల్డ్ జూనియర్ పుట్టాడు. ఆ తర్వాత 1981లో ఇవాంక, 1984లో ఎరిక్ జన్మించారు. 1993లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ట్రంప్ మార్లా మ్యాపుల్స్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. 1999లో ఈమెతో కూడా విడిపోయి 2005లో మెలానియా ట్రంప్‌ను మూడో పెళ్లి చేసుకున్నారు.
చదవండి: 11ఏళ్ల తర్వాత హాలిడే.. ఎగ్జైట్‌మెంట్‌లో తాగి విమానంలో రచ్చ రచ్చ..
Comments
Please login to add a commentAdd a comment