Ivanka trunp
-
ఆ కారణం వల్లే ట్రంప్ మొదటి భార్య ఇవానా మృతి
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ గురువారం అనుమానాస్పద రీతిలో మరణించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమె మృతికి గల కారణాలను వైద్యులు వెల్లడించారు. శరీరంపై మొద్దుబారిన గాయాల ప్రభావం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఇవానా ట్రంప్ మన్‌హాటన్‌లోని తన ఇంట్లో మెట్లపైనుంచి కాలుజారి పడటం వల్ల గాయాలపాలై మరణించారని అమెరికా మీడియాలో ప్రచారం జరిగింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. ఇవానా అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు ఆమె ఇంటి అడ్రస్ నుంచి తమకు గురువారం ఫోన్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. అక్కడి వెళ్లి చూస్తే ఆమె ఘటనా స్థలంలోనే మరణించి ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే అక్కడ నేరం జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు కన్పించలేదని స్పష్టం చేశారు. ఇవానా మరణించిందని గురువారం ట్రుత్ సోషల్ వేదికగా వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్. ఆమె గొప్ప, అందమైన మహిళ అని పేర్కొన్నారు. ఆమెకు తన ముగ్గురు పిల్లలు డొనాల్డ్ జూనియర్, ఇవాంక, ఎరిక్లే సర్వసమని తెలిపారు. ఆమె పట్ల తామంతా గర్వపడుతున్నామని, ఇవానా ఆత్మకు శాంతి చేకూరాలని భావోద్వేగ సందేశం రాసుకొచ్చారు. ఇవానా ట్రంప్ ఓ మోడల్. 1977లో అప్పుడు రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా ఉన్న ట్రంప్‌ను పెళ్లాడారు. ఈ దంపతులకు పెళ్లైన ఏడాదికే డొనాల్డ్ జూనియర్ పుట్టాడు. ఆ తర్వాత 1981లో ఇవాంక, 1984లో ఎరిక్ జన్మించారు. 1993లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ట్రంప్ మార్లా మ్యాపుల్స్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. 1999లో ఈమెతో కూడా విడిపోయి 2005లో మెలానియా ట్రంప్‌ను మూడో పెళ్లి చేసుకున్నారు. చదవండి: 11ఏళ్ల తర్వాత హాలిడే.. ఎగ్జైట్మెంట్లో తాగి విమానంలో రచ్చ రచ్చ.. -
ట్రంప్ వెంటే ఇవాంకా..
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఆయన కూతురు ఇవాంకా కూడా భాగం కానున్నారు. ట్రంప్ సీనియర్ సలహాదారుల హోదాలో ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెద్ కుష్నర్ భారత్‌కు వస్తున్నారు. ట్రంప్‌తో పాటు ఉన్నత స్థాయి అధికారుల బృందం భారత పర్యటనలో పాలుపంచుకుంటోంది. ఫిబ్రవరి 24న ఫస్ట్ లేడీ మెలానియా తన భర్త ట్రంప్‌తో పాటు భారత్ వస్తున్నారని ఇప్పటికే ప్రకటించిన అమెరికా.. తాజాగా ట్రంప్‌తో పాటు వస్తున్న ఉన్నత స్థాయి అధికారుల బృందం వివరాలను ప్రకటించింది. వారిలో ఆర్థిక మంత్రి స్టీవెన్ నుచిన్, వాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రాస్, విద్యుత్ శాఖ మంత్రి డాన్ బ్రౌలిటీ, జాతీయ భద్రత సలహాదారు రాబర్ట్ ఒబ్రీన్ తదితరులున్నారు. 24న తాజ్ మహల్ ఫిబ్రవరి 24న వాషింగ్టన్ నుంచి ట్రంప్ నేరుగా అహ్మదాబాద్ చేరుకుంటారు. అక్కడ మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం మొతెరా క్రికెట్ స్టేడియంలో జరిగే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ట్రంప్ కుటుంబం నేరుగా ఆగ్రా వెళ్తుంది. సూర్యాస్తమయంలోపు తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. అక్కడ దాదాపు ఒక గంట పాటు గడుపుతారు. అనంతరం, ఢిల్లీ పయనమవుతారు. 25న రాజ్‌ఘాట్ ఫిబ్రవరి 25వ తేదీన ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్ వద్ద అధికారిక స్వాగతం లభిస్తుంది. అక్కడి నుంచి వారు రాజ్‌ఘాట్ వెళ్లి మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఆ తరువాత హైదరాబాద్ భవన్లో ట్రంప్, మోదీల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. ఉగ్రవాదంపై పోరులో సహకారం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరస్పర వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడం, రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారం, హెచ్1బీ వీసా విషయంలో భారత్ ఆందోళనలు.. మొదలైనవి వారి చర్చల్లో భాగం కావచ్చని సమాచారం. అలాగే, అమెరికా నుంచి 24 ఎంహెచ్–60 రోమియో హెలికాప్టర్లు, 6 అపాచీ హెలీకాప్టర్లను కొనుగోలు చేయడానికి సంబంధించి ఒప్పందం కుదిరే అవకాశముంది. సర్వం వచ్చేసింది ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఆయనకు అవసరమైన సమాచార, రక్షణ వ్యవస్థలను, ట్రంప్ అధికారిక హెలికాప్టర్ మెరైన్ వన్, రోడ్ షోలో పాలు పంచుకునేందుకు భారీ రక్షణ వ్యవస్థతో కూడిన ఎస్యూవీ తరహా వాహనం(డబ్ల్యూహెచ్‌సీఏ రోడ్‌రన్నర్. దీన్నే మొబైల్ కమాండ్ అండ్ కంట్రోల్ వెహికల్ అంటారు).. మొదలైన వాటిని తీసుకుని మూడు సీ 17 గ్లోబ్‌మాస్టర్ కార్గో విమానాలు అహ్మదాబాద్ చేరుకున్నాయి. అమెరికా నుంచి పలువురు సుశిక్షిత భద్రత సిబ్బంది కూడా వచ్చారు. ఢిల్లీలో భద్రత ఏర్పాట్లు ట్రంప్ కుటుంబానికి ఆతిథ్యమిచ్చే ఐటీసీ మౌర్య హోటల్ చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టారు. వారు ఉండే గ్రాండ్ ప్రెసిడెన్షియల్ ఫ్లోర్‌ను శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు. ట్రంప్ అందులోని చాణక్య సూట్లో ఉంటారని సమాచారం. గతంలో అందులో అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జిబుష్‌లు సేదతీరారు. ట్రంప్ బృందం వెళ్లేంతవరకు ఇతరులెవరికీ ఆ హోటల్లో గదులను కేటాయించరు. హోటల్లో ఉన్న మొత్తం 438 గదులను వారికే బుక్ చేశారు. కాగా, ఇరాన్– అమెరికాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటున్నారని, బహుళ అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారని భద్రత ఏర్పాట్లలో పాలుపంచుకున్న వర్గాలు వెల్లడించాయి. సాదర స్వాగతం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొతెరా క్రికెట్ స్టేడియం వరకు.. ట్రంప్, మోదీ పాల్గొనే రోడ్ షో మార్గంలో 28 వేదికలను ఏర్పాటు చేస్తున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ వేదికలపై ప్రదర్శనలు ఉంటాయన్నారు. అయితే, కొత్తగా నిర్మించిన మొతెరా స్టేడియాన్ని ఫిబ్రవరి 24న ప్రారంభించే కార్యక్రమం ఉండబోదని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జీసీఏ) స్పష్టం చేసింది. కేవలం నమస్తే ట్రంప్ కార్యక్రమం మాత్రమే జరుగుతుందని పేర్కొంది. సబర్మతి ఆశ్రమం సందర్శనపై సందిగ్దం అయితే ట్రంప్ దంపతులు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారా? లేదా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ నిర్ణయం తీసుకుంటుందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెల్లడించారు. -
ప్రపంచ బ్యాంకు సారథిగా ఇంద్రా నూయి?
న్యూయార్క్: ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ పదవి రేసులో పెప్సీకో మాజీ సీఈవో, జన్మతః భారతీయురాలైన ఇంద్రా నూయి పేరు తెరపైకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా న్యూయార్క్ టైమ్స్ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంక, ఇంద్రా నూయి పేరును ప్రతిపాదించారు. ఇంద్రా నూయిని మార్గదర్శిగా, స్ఫూర్తినీయురాలిగా పేర్కొంటూ ఇవాంకా గత ఆగస్ట్‌లో ఓ ట్వీట్ కూడా చేశారు. అయితే, తన నామినేషన్‌ను ఇంద్రా నూయి అంగీకరిస్తారా, లేదా అన్న దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ప్రపంచ బ్యాంకు ప్రస్తుత ప్రెసిడెంట్ జిమ్‌యాంగ్ కిమ్ ఫిబ్రవరిలో తన పదవి నుంచి తప్పుకోనున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ప్రైవేటు ఇన్ఫ్రా కంపెనీలో చేరనున్నట్టు ఆయన చెప్పారు. నిర్ణీత పదవీ కాలం కంటే మూడేళ్ల ముందే ఆయన తప్పుకుంటున్నారు. కిమ్ వారసుల ఎంపిక ప్రక్రియను ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ ముంచిన్, ఇవాంకా చూస్తున్నారు. ఈ కమిటీ అభ్యర్థుల నామినేషన్లతో కూడిన జాబితాను ట్రంప్ ముందు ఉంచనున్నారు. ఇవాంక మద్దతుతో నూయి ప్రధాన పోటీదారుగా మారడం ఆసక్తికరం. రేసులో మరో ఇద్దరు... ఇక ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ పదవికి....అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల మంత్రి డేవిడ్ మల్పాస్, ఓవర్సీస్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ రే వాష్బర్న్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిని ప్రపంచ బ్యాంక్ బోర్డ్ నియమిస్తుంది. అయితే అమెరికా అధ్యక్షడు నామినేట్ చేసిన వ్యక్తే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు కావడం రివాజు. వైట్ హౌస్ సీనియర్ సలహాదారు పదవిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కూతురిని నియమించడం పట్ల ఇప్పటికే విమర్శలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవి విషయంలో ఇవాంకా జోక్యం చేసుకోవడంతో ఈ విమర్శలు మరింతగా పెరుగుతున్నాయి. తన స్వప్రయోజనాల కోసం ఇవాంకా అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో తలదూర్చుతున్నారన్న విమర్శలున్నాయి. -
ట్రంప్‌పై బాంబు పేల్చిన పోర్న్‌స్టార్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌తో ఉన్న లైంగిక సంబంధాన్ని వెల్లడించకూడదని ఓ పోర్న్‌స్టార్‌కు ట్రంప్ వ్యక్తిగత లాయర్ ముడుపులు చెల్లించాడనే ఆరోపణలు కుదిపేస్తున్న నేపథ్యంలో అమెరికన్ టాబ్లాయిడ్ ‘ఇన్ టచ్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. ట్రంప్‌తో శృంగారంలో పాల్గొన్నట్టు భావిస్తున్న అడల్ట్ సినీతార స్టెఫానీ క్లిఫార్డ్ ఇంటర్వ్యూను ప్రచురించింది. మెలానియా బిడ్డను ప్రసవించడానికి నాలుగు నెలల ముందే ట్రంప్‌తో తాను ఎఫైర్ పెట్టుకున్నట్టు ఆమె ధ్రువీకరించింది. అప్పట్లో ట్రంప్ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ‘అప్రెంటిస్’ షోలో తనకు పాత్ర ఇస్తానని ఆఫర్ కూడా చేశాడని ఆమె తెలిపింది. కొంతకాలమే కొనసాగిన తమ బంధం సరదాగా సాగిపోయిందని, కూతురు ఇవాంక తరహాలో అందంగా, స్మార్ట్‌గా తాను ఉంటానని ట్రంప్ తనకు కితాబిచ్చాడని ఆమె చెప్పుకొచ్చింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా స్టార్మీ డానియెల్‌గా పేరొందిన క్లిఫర్డ్ తమ ఎఫైర్ బయటపెట్టకుండా ఉండేందుకు ట్రంప్ తన లాయర్ ద్వారా 1.30 లక్షల డాలర్లు చెల్లించాడని, తద్వారా రాజకీయ విమర్శలు రాకుండా ట్రంప్ ముందుజాగ్రత్తలు తీసుకున్నాడని వాల్‌స్ట్రీట్ జర్నల్ గతవారం కథనాన్ని ప్రచురించగా.. ఈ కథనాన్ని వైట్‌హౌస్ ఖండించింది. -
పురుషులు ఈ విషయాన్ని గుర్తించాలి: ఇవాంక
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో భాగంగా బుధవారం మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధి అంశంపై ప్లీనర్ జరిగింది. ఈ చర్చ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించగా.. ముఖ్య అతిథి ఇవాంకా ట్రంప్‌తోపాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచ్చార్, డెల్ సీఈవో క్వింటోస్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ఈ ప్లీనరీలో ఇవాంక మాట్లాడుతూ.. మహిళలు విభిన్న రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని అన్నారు. మహిళలు ఉద్యోగాలు చేస్తూ.. కుటుంబసభ్యులకు ఆర్థికంగా అండగా ఉంటున్నారని గుర్తుచేశారు. సాంకేతిక రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాలను మహిళలు అందిపుచ్చుకోవాలని సూచించారు. కొత్త ఆవిష్కరణలన్నీ ప్రైవేటు రంగంలోనే వస్తున్నాయని, ఏ రంగంలోనైనా సేవలు బాగుంటేనే ఆదరణ లభిస్తుందని అన్నారు. వ్యాపారాల్లో మహిళల భాగస్వామ్యం ఎంతో అవసరమని గుర్తుచేశారు. నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇవ్వడం ఎంతో ముఖ్యమని అన్నారు. అమెరికన్ వర్సిటీల్లో మహిళలకు సాంకేతిక విద్యను అందించడంపై ఎక్కువ శ్రద్ధా పెట్టామని తెలిపారు. మహిళలకు ప్రధానంగా నమ్మకం, సామర్థ్యం, మూలధనం ఉండాలని చెప్పారు. మహిళలు తమతో ఏ విషయంలో తీసిపోరని పురుషులు గుర్తించాలన్నారు. మహిళలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సిస్కో, మైక్రోసాఫ్ట్‌తో కలిసి మహిళాభివృద్ధికి తోడ్పడుతున్నామని తెలిపారు. భారత దేశంలో మహిళల భాగస్వామ్యం చాలా పెరిగిందని చందా కొచ్చర్ అన్నారు. భారతదేశం నుంచి మంచి క్రీడాకారిణులు అన్ని విభాగాల్లో ఉన్నారని తెలిపారు. నేడు భారత దేశ రక్షణమంత్రిగా మహిళ ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. దేశంలోని బ్యాకింగ్ రంగంలో 40శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని చెప్పారు. ఆత్మస్థైర్యం నింపినప్పుడే మహిళలు రాణించగలరని చెప్పారు. తన పిల్లలే తనకు స్ఫూర్తి అని చెప్పారు. మహిళల సాధికారిత కోసం తమ ఫౌండేషన్ ప్రధానంగా కృషి చేస్తున్నదని చెర్రీ బ్లెయిర్ తెలిపారు. -
మహిళతోనే మార్పు సాధ్యం
-
ఈ వంక రావమ్మా... ఇవాంకా!
సాక్షి, హైదరాబాద్: ఇవాంకా ట్రంప్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఈ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)కు ఆమె హాజరుకానుండడంతో గత పదిరోజులుగా ఇవాంకా పేరు చర్చనీయాంశమవుతోంది. అందం, ఆకర్షణ కలిగి ఉండడంతో పాటు అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుని గారాలపట్టి కావడంతో ఆ నోటా.. ఈ నోటా.. ఏ నోట విన్నా ఇవాంకా ట్రంప్ పేరే వినిపిస్తోంది. పత్రికలు, మీడియా ఆమె పర్యటన విశేషాలను, వార్తలను ప్రముఖంగా ప్రచురిస్తున్న నేపథ్యంలో ఇవాంకా గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నెట్టింట్లో ఇవాంకా హల్చల్ చేస్తోంది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఇవాంకా రాక గురించి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్ల గురించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రావమ్మా ఇవాంకా.. అంటూ ఆమెను భాగ్యనగరికి కొందరు ఆన్లైన్లో ఆహ్వానిస్తుండగా, మరికొందరు ఆమె పర్యటనపై సెటైర్లు వేస్తున్నారు. ఇవాంకా రాకపోకలు సాగించే మార్గాలను సుందరీకరిస్తుండడం, రోడ్లు బాగుచేయిస్తుండడం, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆమె బస చేసే వెస్టిన్ హోటల్ వరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తుండడంపై ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు చేస్తున్నారు. రాజధానిలో బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించే కార్యక్రమం, వీధికుక్కలను నియంత్రించే ప్రయత్నాల గురించి అయితే ఛలోక్తులు, విమర్శలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇవాంకా విందు చేసే ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని భారీ టేబుల్ గురించి, ఆమె తినే వంటకాల గురించి, ప్రయాణించే వాహనాల గురించి, ఆమె భద్రత గురించి గత వారం రోజులుగా చిత్ర విచిత్ర చర్చలు జరుగుతున్నాయి. ‘శతాబ్దాల రాతియుగపు సమాధుల నుంచి’ అంటూ ఫేస్బుక్లో వచ్చిన ఓ కవిత వైరల్ అయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని స్మార్ట్ఫోన్ల నిండా ఇవాంకా చిత్రాలు, విశేషాలే కనిపిస్తున్నాయి. ఈ వంక రావమ్మా... ఇవాంకా! ఇవాంకా మా ఊరికి రావాలంటే మా ఊరికి రావాలని కొందరు చేస్తున్న ఆన్లైన్ ఆహ్వానాలు నవ్వు తెప్పిస్తున్నాయి. వరంగల్‌కు వస్తే ఓరుగల్లు కోట చూపెడతామని, కల్లు తాపుతామని అభిమానంతో ఫేస్బుక్లో పెట్టిన పోస్టింగ్‌కు తండోపతండాలుగా లైకులు, కామెంట్లు వచ్చాయంటే ఆమె పర్యటనపై ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని మణికొండకు రావాలంటూ ఇవాంకా ట్రంప్‌తో వాట్సాప్‌లో డిస్కస్ చేసినట్టు, ఆమె అందుకు అంగీకరించినట్టు వచ్చిన మరో వీడియో కూడా అంతే వైరల్ అయింది. ఇవాంకా ఏ వంక ప్రయాణించాలన్నా సీఐఏ డేగకళ్ల అనుమతి ఉండాలని తెలిసినా ఆమె వస్తే మా ప్రాంతం బాగుపడుతుందేమోననే కోణంలో చేస్తున్న ఆహ్వానాలు, ఇవాంకా ఆతిథ్యం కోసం హైదరాబాద్‌లో చేస్తున్న ఏర్పాట్లపై వస్తున్న సెటైర్లు గత వారం రోజులుగా తెలుగు ప్రజలకు కనువిందు చేస్తున్నాయి. -
‘పారిశ్రామిక మహిళ’కు చేయూత
ఉద్యోగ అవకాశాల కోసం చూడటం కాదు.. ఉపాధి కల్పించే శక్తిగా ఎదగాలనే ప్రయత్నం చేస్తోంది యువత. ఈ ప్రయత్నంలో మహిళలకూ చేయూతనిచ్చేందుకు, ఆర్థికవృద్ధిలో వారినీ భాగస్వాములను చేసి ప్రోత్సహించేందుకు ‘జీఈఎస్’ (గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సమిట్–ప్రపంచ వాణిజ్య సదస్సు)ను నిర్వహిస్తున్నాయి పారిశ్రామికంగా బలపడాలనుకుంటున్న దేశాలు. అమెరికా, యూరప్ దేశాలతోపాటు భారత్ కూడా ఇందులో పాలుపంచుకుంటోంది. హైదరాబాద్ వేదికగా ఈనెల 28న ఈ సదస్సు భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో మహిళా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సాధిస్తున్న విజయాల గురించి మన దేశంలోని ఔత్సాహికులకు అవగాహన కల్పించేందుకు భారత్‌లోని అమెరికన్ కాన్సులేట్ ఓ మినీ సదస్సును ఆ దేశంలో నిర్వహిస్తోంది. భారత్ నుంచి విలేకరులను అమెరికా తీసుకెళ్లి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా వివరిస్తోంది. ఆన్లైన్ వేధింపులకు చెక్ పెట్టేలా... సాంకేతికతలో ఎంత వేగంగా పురోగతి సాధిస్తున్నామో అంతే వేగంగా సమస్యలు పుట్టుకొస్తు న్నాయి. ఈ మధ్య మరీ ఎక్కువైన సమస్య సామాజిక మాధ్యమాల దుర్వినియోగం. ఈ చిక్కు నుంచి బయట పడేసే వెబ్ అప్లికేషన్లు ఇప్పుడు స్టార్టప్స్ దశలో ఉన్నాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శరణార్థులకు ఎక్కడ సరైన సంరక్షణ, పని, తిండి, దొరుకుతుందనే వివరాలను చెప్పి... వాళ్లు అక్కడికి వెళ్లే మార్గాలను సూచించే యాప్‌లూ వస్తున్నాయి. ఈ రకమైన స్టార్టప్స్‌కూ విపరీతమైన డిమాండ్ ఉందని వాషింగ్టన్ డీసీలో అఫినిస్ ల్యాబ్స్ అనే ఇంక్యుబేటర్‌ను నిర్వహిస్తున్న భారతీయ–అమెరికన్, చెన్నైకి చెందిన షాహిద్ అమానుల్లా నిరూపిస్తున్నారు. ఈయన మహిళలు కంపెనీలు ప్రారంభించడానికి అవసరమైన నిధులను సమీకరించడమో లేదా అలాంటి వేదికలను వారికి పరిచయం చేయడమో చేస్తారు. అమెరికా వచ్చే వారికి ఫెమిగ్రెంట్స్ ప్రోత్సాహం... ఇన్‌స్టాగ్రామ్‌లో పబ్లిక్ కంటెంట్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న ఐకా అలియేవా, ఫేస్బుక్లో లాజిస్టిక్స్ అండ్ ఆపరేషన్స్ వింగ్‌లో ప్రోగ్రామ్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న లావణ్య పోరెడ్డి (హైదరాబాద్) కలిసి ‘ఫెమిగ్రెంట్స్’ నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. అమెరికాకు వలస వస్తున్న మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి ఈ నెట్వర్క్ తోడ్పడుతుంది. విమెన్ ఎంట్రప్రెన్యూర్స్‌గా విజయం సాధించి, స్థిరపడిన వాళ్లను కొత్త వారికి ఫెమిగ్రెంట్స్ పరిచయం చేస్తుంది. ప్రారంభంలో ఎలాం టి సమస్యలుంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఆర్థిక సహాయం వంటి వాటి గురించి అవగాహన కల్పిస్తారు. మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేయడమే తమ లక్ష్యమని చెప్తారు అలియేవా, లావణ్య. — వాషింగ్టన్ డీసీ నుంచి సరస్వతి రమ -
స్త్రీలపై వేధింపులను సహించొద్దు
టోక్యో: జపాన్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ మహిళా సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా శుక్రవారం మాట్లాడారు. మహిళలపై లైంగిక వేధింపులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరానివన్నారు. ‘పని ప్రదేశాల్లో స్త్రీలకు తగిన గౌరవం ఇవ్వడంలో విఫలమవుతున్నాం. వీటిలో మహిళలకు లైంగిక వేధింపులు ప్రధానమైనవి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదు’ అని ఆమె పేర్కొన్నారు. జపాన్‌లోని కొంత మంది ప్రముఖ మహిళల గురించి ఆమె తన ఉపన్యాసంలో ప్రస్తావించారు. కుటుంబంతో గడిపేందుకు మహిళలకు వేతనంతో కూడిన సెలవులు ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చిన జపాన్ ప్రధాని షింజో అబేను ఇవాంక ప్రశంసించారు. ఆర్థికవృద్ధిని సాధించడంలో మహిళల పాత్రను పెంచేలా అబే తీసుకొచ్చిన ‘వుమెనామిక్స్’ను పొగిడారు. -
మెలానియా ట్రంప్.. ఎందుకిలా?
-
మెలానియా ట్రంప్.. ఎందుకిలా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సతీమణి, అమెరికా ప్రథమ పౌరురాలైన మెలానియా ట్రంప్ వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ తో సమావేశం సందర్భంగా తలపై వస్త్రం కప్పుకుని కనిపించారు. ప్రస్తుతం ఈ అంశం అక్కడ చర్చనీయాంశమైంది. పోప్ ను కలిసే సందర్భంలో నల్లని రంగు దస్తులు ధరించడం ఆనవాయితీ. చేతులు పూర్తిగా కప్పిఉంచేలా డ్రెస్స్ ధరించిన మెలానియా, వైట్‌హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ తలపై వస్త్రంతో కనిపించి వాటికన్ సంప్రదాయాన్ని పాటించారు. ఇటీవల ట్రంప్ దంపతులు తమ తొలి విదేశీ పర్యటనలో భాగంగా సౌదీ అరేబియాకు వెళ్లగా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ఇస్లాం సంప్రదాయానికి విరుద్ధంగా నడుచుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తలపై వస్త్రం కప్పుకోకుండానే సౌదీలో ఆమె పర్యటించారు. మెలానియాతో పాటు ట్రంప్ కూతురు, వైట్‌హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ సైతం తలపై వస్త్రం కప్పుకోకుండానే సౌదీ పర్యటనకు రావడం తెలిసిందే. ఇస్లామిక్ సంప్రదాయ రాజ్యమైన సౌదీలో మహిళల పట్ల, మహిళల వస్త్రధారణ పట్ల పలు ఆంక్షలు ఉంటాయి. పర్యాటకులు, విదేశీయులకు మాత్రం ఈ ఆంక్షలపై సడలింపు ఉంటుంది. సౌదీలో వారి సంప్రదాయం, పద్ధతులు పాటించని మెలానియా, పోప్ ఫ్రాన్సిస్ తో సమావేశం సందర్భంగా బాధ్యతగా వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. 'వాటికన్ ప్రొటోకాల్ ప్రకారం ప్రథమ మహిళ లాంగ్ స్లీవ్స్ ధరించాలి. నల్లని రంగు దుస్తులు ధరించడంతో పాటు తలపై వస్త్రాన్ని కప్పుకుని హాజరవడం సంప్రదాయం. మరోవైపు సౌదీ పర్యటనలో ఆమె వస్త్రధారణ పలానా ఉండాలంటూ ఎలాంటి విజ్ఞప్తి రాలేదు. అందుచేత మెలానియా సౌదీ పర్యటనలో మామూలుగానే వ్యవహరించారని' మెలానియా వ్యక్తిగత అధికార ప్రతినిధి స్టెఫానీ గ్రిషమ్ వివరించారు. 2015 జనవరిలో అప్పటి ప్రథమ పౌరురాలు, బరాక్ ఒబామా సతీమణి మిషెల్లీ ఒబామా తలపై వస్త్రం కప్పుకోకుండానే సౌదీ పర్యటనకు వెళ్లడాన్ని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తప్పుబట్టారు. ఇలా చేయడం సౌదీని అవమానించడమేనని, దీనివల్ల అమెరికాకు శత్రువులు మరింత పెరిగిపోతారని విమర్శిస్తూ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.