అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌తో ఉన్న లైంగిక సంబంధాన్ని వెల్లడించకూడదని ఓ పోర్న్‌స్టార్‌కు ట్రంప్ వ్యక్తిగత లాయర్ ముడుపులు చెల్లించాడనే ఆరోపణలు కుదిపేస్తున్న నేపథ్యంలో అమెరికన్ టాబ్లాయిడ్ ‘ఇన్ టచ్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. ట్రంప్‌తో శృంగారంలో పాల్గొన్నట్టు భావిస్తున్న అడల్ట్ సినీతార స్టెఫానీ క్లిఫార్డ్ ఇంటర్వ్యూను ప్రచురించింది.
మెలానియా బిడ్డను ప్రసవించడానికి నాలుగు నెలల ముందే ట్రంప్‌తో తాను ఎఫైర్ పెట్టుకున్నట్టు ఆమె ధ్రువీకరించింది. అప్పట్లో ట్రంప్ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ‘అప్రెంటిస్’ షోలో తనకు పాత్ర ఇస్తానని ఆఫర్ కూడా చేశాడని ఆమె తెలిపింది. కొంతకాలమే కొనసాగిన తమ బంధం సరదాగా సాగిపోయిందని, కూతురు ఇవాంక తరహాలో అందంగా, స్మార్ట్‌గా తాను ఉంటానని ట్రంప్ తనకు కితాబిచ్చాడని ఆమె చెప్పుకొచ్చింది.
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా స్టార్మీ డానియెల్‌గా పేరొందిన క్లిఫర్డ్ తమ ఎఫైర్ బయటపెట్టకుండా ఉండేందుకు ట్రంప్ తన లాయర్ ద్వారా 1.30 లక్షల డాలర్లు చెల్లించాడని, తద్వారా రాజకీయ విమర్శలు రాకుండా ట్రంప్ ముందుజాగ్రత్తలు తీసుకున్నాడని వాల్‌స్ట్రీట్ జర్నల్ గతవారం కథనాన్ని ప్రచురించగా.. ఈ కథనాన్ని వైట్‌హౌస్ ఖండించింది.
Comments
Please login to add a commentAdd a comment