ivana trump
-
ఆ కారణం వల్లే ట్రంప్ మొదటి భార్య ఇవానా మృతి
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ గురువారం అనుమానాస్పద రీతిలో మరణించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమె మృతికి గల కారణాలను వైద్యులు వెల్లడించారు. శరీరంపై మొద్దుబారిన గాయాల ప్రభావం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఇవానా ట్రంప్ మన్‌హాటన్‌లోని తన ఇంట్లో మెట్లపైనుంచి కాలుజారి పడటం వల్ల గాయాలపాలై మరణించారని అమెరికా మీడియాలో ప్రచారం జరిగింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. ఇవానా అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు ఆమె ఇంటి అడ్రస్ నుంచి తమకు గురువారం ఫోన్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. అక్కడి వెళ్లి చూస్తే ఆమె ఘటనా స్థలంలోనే మరణించి ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే అక్కడ నేరం జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు కన్పించలేదని స్పష్టం చేశారు. ఇవానా మరణించిందని గురువారం ట్రుత్ సోషల్ వేదికగా వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్. ఆమె గొప్ప, అందమైన మహిళ అని పేర్కొన్నారు. ఆమెకు తన ముగ్గురు పిల్లలు డొనాల్డ్ జూనియర్, ఇవాంక, ఎరిక్లే సర్వసమని తెలిపారు. ఆమె పట్ల తామంతా గర్వపడుతున్నామని, ఇవానా ఆత్మకు శాంతి చేకూరాలని భావోద్వేగ సందేశం రాసుకొచ్చారు. ఇవానా ట్రంప్ ఓ మోడల్. 1977లో అప్పుడు రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా ఉన్న ట్రంప్‌ను పెళ్లాడారు. ఈ దంపతులకు పెళ్లైన ఏడాదికే డొనాల్డ్ జూనియర్ పుట్టాడు. ఆ తర్వాత 1981లో ఇవాంక, 1984లో ఎరిక్ జన్మించారు. 1993లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ట్రంప్ మార్లా మ్యాపుల్స్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. 1999లో ఈమెతో కూడా విడిపోయి 2005లో మెలానియా ట్రంప్‌ను మూడో పెళ్లి చేసుకున్నారు. చదవండి: 11ఏళ్ల తర్వాత హాలిడే.. ఎగ్జైట్మెంట్లో తాగి విమానంలో రచ్చ రచ్చ.. -
ట్రంప్ కుటుంబంలో తీవ్ర విషాదం
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మొదటి భార్య ఇవానా ట్రంప్ (73) గురువారం కన్నుముశారు. ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా తన సొంత సోషల్ మీడియా 'ట్రుత్ సోషల్' వేదికగా వెల్లడించారు. అయితే ఆమె మృతికి గల కారణాన్ని మాత్రం ట్రంప్ చెప్పలేదు. 'న్యూయార్క్ సిటీలోని తన నివాసంలో ఇవానా మరణించింది. ఆమె అందమైన, అద్భుతమైన మహిళ. గొప్ప స్ఫూర్తిదాయక జీవితాన్ని గడిపింది. ఆమెకు తన ముగ్గురు పిల్లలు డొనాల్డ్ జూనియర్, ఇవాంక, ఎరిక్లే సర్వస్వం. ఆమె పట్ల మేమూ గర్వపడుతున్నాం. ఇవానా ఆత్మకు శాంతి చేకూరాలి' అని ట్రంప్ భావోద్వేగ సందేశాన్ని రాసుకొచ్చారు. ఇవానా ట్రంప్ ఓ మోడల్. 1977లో అప్పుడు రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా ఉన్న ట్రంప్‌ను పెళ్లాడారు. ఈ దంపతులకు పెళ్లైన ఏడాదికే డొనాల్డ్ జూనియర్ పుట్టాడు. ఆ తర్వాత 1981లో ఇవాంక, 1984లో ఎరిక్ జన్మించారు. 1993లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ట్రంప్ మార్లా మ్యాపుల్స్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. 1999లో ఈమెతో కూడా విడిపోయి 2005లో మెలానియా ట్రంప్‌ను మూడో పెళ్లి చేసుకున్నారు. చదవండి: నిరసనల్లో వేల మంది.. పట్టించుకోని జంట.. ఫోటో వైరల్ -
ఫస్ట్ లేడీ.. నువ్వా నేనా?
అమెరికా ఫస్ట్‌లేడీని నేనంటే నేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్యలు మీడియాకెక్కారు. ఈ గొడవకు ట్రంప్ మాజీ(మొదటి)భార్య ఇవానా ఆజ్యం పోయగా.. ప్రస్తుత భార్య మెలానియా ఘాటుగా బదులిచ్చారు. నిజానికి ఫస్ట్ లేడీని నేనే అంటూ ఇవానా రెచ్చ గొట్టగా.. పుస్తకాలు అమ్ముకునేందుకు కొంద రు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, వాషింగ్టన్లో ఉండడమే నాకిష్టం అంటూ మెలానియా దీటుగా సమాధానమిచ్చారు. సవతుల పోరులో ఇరుక్కున ట్రంప్ మాత్రం ఏం మాట్లాడకుండా మౌనాన్ని ఆశ్రయించారు. అమెరికా అధ్యక్షుడి సతీమణిగా ‘ఫస్ట్ లేడీ’కి ఉండే హోదా, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ హోదా నాదంటే నాది అని మెలానియా, ఇవానాలు మీడియాకెక్కడం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. తాను మళ్లీ ఫస్ట్‌లేడీ కావచ్చునేమోనంటూ ట్రంప్ మొదటి భార్య ఇవానా ఈ చర్చకు తెరలేపారు. ట్రంప్‌తో ప్రేమ, పెళ్లి, విడాకుల్ని ప్రస్తావిస్తూ ఆమె రాసిన ‘రైజింగ్ ట్రంప్’ పుసక్తం ప్రచారం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వైట్ హౌస్ డైరెక్ట్ నంబర్ నా దగ్గరున్నా ట్రంప్‌తో మాట్లాడేందుకు అక్కడకు ఫోన్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ∙మెలానియా ఉంది. ఆమెకు ఎలాంటి అసూ యను కలిగించాలని అనుకోవడం లేదు. వాస్తవంగా నేనే ట్రంప్ మొదటి భార్యను.. అప్పుడు నేనే ఫస్ట్ లేడీని కదా ?’ అంటూ 68 ఏళ్ల ఇవానా ఈ వివాదానికి ఆజ్యం పోశారు. వివాదాలకు దూరంగా ఉండే మెలానియాకు ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ‘మెలానియా వాషింగ్టన్లో ఉండడానికి ఇష్టపడతారు. అమెరికా ఫస్ట్ లేడీగా తన బాధ్యతల్ని నిర్వహించడాన్ని గౌరవంగా భావిస్తారు. తన హోదాను, సమయాన్ని పిల్లలకు సాయపడటానికి ఉపయోగిస్తారే తప్ప పుస్తకాలు అమ్ముకోడానికి కాదు’’ అని మెలానియా అధికార ప్రతినిధి స్టిఫేని గ్రీషమ్ ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. ట్రంప్ రాసలీలల ప్రస్తావన మొదటి నుంచి జల్సారాయుడిగానే ట్రంప్ పేరుతెచ్చుకున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన మొదటి ఇద్దరికీ విడాకులిచ్చి ప్రస్తుతం మెలానియాతో ఉంటున్నారు. చెకొస్లోవియా మోడల్ ఇవానాను 1977లో ట్రంప్ మొదటి వివాహం చేసుకున్నారు. 1992లో వారిద్దరు విడిపోయారు. వారి సంతానమే డొనాల్డ్ ట్రంప్ జూనియర్(38), ఇవాంకా ట్రంప్ (34), ఎరిక్ ట్రంప్ (32). 1980లలో ట్రంప్, ఇవానాలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు.ట్రంప్‌ను ‘ది డొనాల్డ్’ అని ముద్దుపేరుతో పిలుచుకునేది ఇవానా. అయితే ఇప్పుడు ట్రంప్‌తో ప్రేమ, పెళ్లి, విడాకులు సహా పలు ఆసక్తికర అంశాల్ని ‘రైజింగ్ ట్రంప్’ పుస్తకంలో ఇవానా బయటపెట్టారు. ట్రంప్ వివాహేతర సంబంధాల బాగోతాన్ని అందులో వివరించారు. ‘మా వివాహ బంధం ముగిసిందని 1989లోనే నాకు అర్థమైంది. ఒక యువతి నా దగ్గరకు వచ్చి తన పేరు మార్లా అని, నా భర్తను ప్రేమిస్తున్నానని చెప్పింది. నేను వెంటనే బయటకు పో.. నేను నా భర్తను ప్రేమిస్తున్నానని గట్టిగా సమాధానమిచ్చాను’ అని పాత సంగతుల్ని పుసక్తంలో ఇవానా గుర్తుచేసుకున్నారు. మార్లా మేపుల్స్‌తో వివాహేతర సంబంధాన్ని 1990లో న్యూయార్క్ పోస్టు పత్రిక ‘బెస్ట్ సెక్స్ ఐ హావ్ ఎవర్ హాడ్’ పేరుతో ప్రకటించడంతో ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. 2005లో మెలానియాతో పెళ్లి 1993లో మార్లా మేపుల్స్ (52)ను ట్రంప్ వివాహం చేసుకున్నారు. వారిద్దరి సంతానమే టిఫాని ట్రంప్ (22). ఆరేళ్ల వైవాహిక జీవితం అనంతరం 1999లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక 2005లో మెలానియా(46)ను ట్రంప్ పెళ్లిచేసుకున్నారు. స్లొవేనియాలో పుట్టిన ఆమె పలు పత్రికలకు మోడల్‌గా పనిచేశారు. అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు. ప్రముఖ పత్రికలు వోగ్, హార్పర్స్ బజార్, బ్రిటిష్ జీక్యూ, ఓషియన్ డ్రైవ్ తదితర పత్రికల కవర్‌పేజీలపై ఆమె ఫోటోలు ప్రచురితమయ్యాయి. వారిద్దరి సంతానమే బర్రోన్ ట్రంప్ (10). –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ట్రంప్ ముగ్గురు భార్యల పంచాయితీ..
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చుట్టూ భార్యల పంచాయితీ తిరుగుతోంది. ఇప్పటికే ఆయన మొదటి భార్య పుస్తక రూపంలో గొంతును వినిపించడంతో భారీ చర్చ జరుగుతుండగా ఆమెకు ఇప్పుడు మరో భార్య తోడయ్యారు. ట్రంప్ ప్రస్తుత భార్య(మూడో భార్య) మెలానియా ట్రంప్ తాజాగా బరిలోకి వచ్చారు. ఇవానా ట్రంప్‌ను, ఆమె తర్వాత వచ్చిన మార్లా మ్యాపిల్స్ను పరోక్షంగా విమర్శించారు. 'రైజింగ్ ట్రంప్' అనే పేరిట ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ ఓ పుస్తకాన్ని రాసిన విషయం తెలిసిందే. ఆ పుస్తకంలోని ప్రమోషన్లో భాగంగా సోమవారం 'గుడ్ మార్నింగ్ అమెరికా' అనే కార్యక్రమంలో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా 'నేనే ట్రంప్‌కు అసలైన భార్యను. అమెరికా ప్రథమ పౌరురాలిని నేనే' అని ఇవానా ట్రంప్ ప్రకటించుకున్నారు. అలాగే మరికొన్ని ప్రైవేట్ విషయాలు చెప్పారు. వారిద్దరికి కలిగిన ముగ్గురు సంతానం పెంపకం గురించి కూడా వెల్లడించారు. అంతేకాదు, తనకు శ్వేత సౌదానికి వెళ్లేందుకు నేరుగా మార్గం ఉందని, తన మాజీ భర్తను ఎప్పుడంటే అప్పుడు కలుసుకోగలనని అన్నారు. టెలిప్రమోటర్ లేకుండానే 45 నిమిషాలపాటు ప్రసంగం చేయగలనని, చర్చలు జరపగలనని, ఎంటర్టైన్ చేయగలనని ఇలా ఎన్నో చేసే అవకాశం తనకు ఉందని చెప్పారు. కానీ, తనకు తన స్వేచ్ఛను అనుభవించడమే ఇష్టమని, అందుకే అలా చేయలేనని అన్నారు. పైగా వాషింగ్టన్లో ఉండేందుకు మెలానియా తెగ భయపడుతున్నట్లుందంటూ విమర్శించారు. దీంతో మెలానియా ట్రంప్ రంగంలోకి వచ్చారు. శ్వేతసౌద అధికారిక ప్రతినిధి ఒకరు మెలానియా తరుపున ఓ ప్రకటన చేశారు. 'వాషింగ్టన్లో ఉండటం అంటే మెలానియా ట్రంప్‌కు ఎంతో ఇష్టం. పైగా అమెరికా ప్రథమపౌరురాలిగా తనకు దక్కిన పాత్రను మెలానియా ఎంతో గౌరవంగా భావిస్తున్నారు. ఆమె తనకు దక్కిన గౌరవంతో చిన్నారులకు సహాయం చేసే పనుల్లో ఉన్నారు.. పుస్తకాలు అమ్ముకునే విషయంలో కాదు(ఇవానా ట్రంప్‌ను ఉద్దేశించి)' అని ఓ ప్రకటన విడుదల చేశారు. -
ట్రంప్ మొదటి భార్య పుస్తకంలో సంచలనాలు
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ ఓ పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు. రైజింగ్ ట్రంప్ అనే పేరిట రాసిన ఆ పుస్తకంలో ఆమె మొత్తం ట్రంప్‌తో తన వైవాహిక జీవితం, ట్రంప్ ఏ విధంగా ఎదిగారు? ట్రంప్ తనకు ఏ విధంగా దూరం అయ్యారు? ట్రంప్ ప్రైవేట్ జీవితం ఎలా ఉండేదివంటి ఎన్నో అంశాలు వెల్లడించారు. ముఖ్యంగా ట్రంప్‌తో తన వైవాహిక జీవితం బద్ధలవుతుందనే విషయం తనకు ముందే ఎలా తెలిసిందో ప్రత్యేకంగా వెల్లడించారు. డోనాల్డ్ ట్రంప్‌కు ఇవానా ట్రంప్‌కు 1977లో వారి వివాహం అయింది. కాగా, 1992వరకు ఆ బంధం నిలిచి విడాకులతో విడిపోయారు. అయితే, వారిద్దరు విడిపోతారనే విషయం ట్రంప్ భార్య ఇవానకు 1989లోనే తెలిసిందంట. ట్రంప్ మర్లా మ్యాపిల్స్ అనే మహిళను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లికంటే ముందే మర్లా నేరుగా ట్రంప్ మొదటి భార్య ఇవాను నేరుగా కలిసినట్లు తెలిపారు. 'మర్లా ఆ రోజు నేరుగా నీలిరంగుల దుస్తుల్లో వచ్చింది. నేను మర్లా.. నీ భర్తను ప్రేమిస్తున్నాను.. మరి నువ్వు? అని అడిగింది.. నేనన్నాను.. ఇక్కడ నుంచి వెంటనే వెళ్లిపో.. నేను నా భర్తను విపరీతంగా ప్రేమిస్తున్నాను అని వెళ్లగొట్టాను.. నేను ఆ రోజు ఎంతో షాకయ్యాను. అప్పుడే నాకు భయం పట్టుకుంది.. ఇక మా వివాహం ముగింపు దశకు వచ్చిందని' అంటూ ఆమె ఆ పుస్తకంలో రాశారు. ఇలా ఇంకా ఎన్నో షాకింగ్ విషయాలను ట్రంప్ మొదటి భార్య వివరించారు. వచ్చే వారమే ఈ పుస్తకం మార్కెట్లోకి అడుగు పెడుతోంది. -
నన్ను అంబాసిడర్ చేయాలి: ఇవానా ట్రంప్
తనను చెక్ రిపబ్లిక్ కు యూఎస్ అంబాసిడర్ గా నియమించాలని న్యూయార్క్ పోస్టుకు ఇచ్చిన ఓ ఇంటర్వూలో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ మాజీ భార్య ఇవానా ట్రంప్(67) అన్నారు. తనకు చెక్ మాట్లాడటం బాగా వచ్చని చెప్పుకొచ్చారు. చెక్ రిపబ్లిక్ తో పాటు ప్రపంచం మొత్తానికి తనను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. తాను రాసిన మూడు పుస్తకాలు నలభై దేశాల్లో 25 భాషల్లో లభ్యమవుతున్నట్లు చెప్పారు. ఇవానా పేరుతో తాను అందరికీ తెలుసని, తన పేరు చివర ట్రంప్ అనే పదం అవసరం లేదని అన్నారు. కాగా, తన కుటుంబ సభ్యులు ఇవాంక, ఎరిక్, డోనాల్డ్ జేఆర్, జారేద్ కుష్నేర్ లకు కార్యనిర్వహక కమిటీలో చోటు కల్పిస్తున్నట్లు డోనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. 1947లో జన్మించిన ఇవానా ట్రంప్ ను చెక్ రిపబ్లిక్ కు యూఎస్ అంబాసిడర్ గా నియమిస్తే.. 2014 నుంచి ఆ స్ధానంలో కొనసాగుతున్న ఆండీ శ్చాపిరో ను తొలగించాల్సివుంటుంది. 1993 నుంచి చెక్ రిపబ్లిక్ కు అమెరికా అంబాసిడర్ ను పంపుతోంది.