న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ ఓ పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు. రైజింగ్ ట్రంప్ అనే పేరిట రాసిన ఆ పుస్తకంలో ఆమె మొత్తం ట్రంప్‌తో తన వైవాహిక జీవితం, ట్రంప్ ఏ విధంగా ఎదిగారు? ట్రంప్ తనకు ఏ విధంగా దూరం అయ్యారు? ట్రంప్ ప్రైవేట్ జీవితం ఎలా ఉండేదివంటి ఎన్నో అంశాలు వెల్లడించారు. ముఖ్యంగా ట్రంప్‌తో తన వైవాహిక జీవితం బద్ధలవుతుందనే విషయం తనకు ముందే ఎలా తెలిసిందో ప్రత్యేకంగా వెల్లడించారు. డోనాల్డ్ ట్రంప్‌కు ఇవానా ట్రంప్‌కు 1977లో వారి వివాహం అయింది. కాగా, 1992వరకు ఆ బంధం నిలిచి విడాకులతో విడిపోయారు. అయితే, వారిద్దరు విడిపోతారనే విషయం ట్రంప్ భార్య ఇవానకు 1989లోనే తెలిసిందంట. ట్రంప్ మర్లా మ్యాపిల్స్ అనే మహిళను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ పెళ్లికంటే ముందే మర్లా నేరుగా ట్రంప్ మొదటి భార్య ఇవాను నేరుగా కలిసినట్లు తెలిపారు. 'మర్లా ఆ రోజు నేరుగా నీలిరంగుల దుస్తుల్లో వచ్చింది. నేను మర్లా.. నీ భర్తను ప్రేమిస్తున్నాను.. మరి నువ్వు? అని అడిగింది.. నేనన్నాను.. ఇక్కడ నుంచి వెంటనే వెళ్లిపో.. నేను నా భర్తను విపరీతంగా ప్రేమిస్తున్నాను అని వెళ్లగొట్టాను.. నేను ఆ రోజు ఎంతో షాకయ్యాను. అప్పుడే నాకు భయం పట్టుకుంది.. ఇక మా వివాహం ముగింపు దశకు వచ్చిందని' అంటూ ఆమె ఆ పుస్తకంలో రాశారు. ఇలా ఇంకా ఎన్నో షాకింగ్ విషయాలను ట్రంప్ మొదటి భార్య వివరించారు. వచ్చే వారమే ఈ పుస్తకం మార్కెట్‌లోకి అడుగు పెడుతోంది.
ట్రంప్ మొదటి భార్య పుస్తకంలో సంచలనాలు
Published Sat, Oct 7 2017 3:51 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment