Illinois University
-
మనుషులిద్దరు... గుండెచప్పుడు ఒకటే
భార్యాభర్తల బంధమంటే... ఇద్దరు మనుషులు ఒక జీవితమని తెలుసు. కానీ ఇద్దరు మనుషులు.. ఒకటే గుండె చప్పుడని ఇప్పుడు రుజువైంది. ఇష్టమైన వాళ్లు దగ్గరగా వస్తే గుండె వేగంగా కొట్టుకోవడం చాలా సినిమాల్లో కనిపించే సీన్. ఎక్కువకాలం బంధంలో ఉన్న స్త్రీ, పురుషుల గుండె చప్పుడు కూడా ఒకటే అవుతోందని ఇలినాయిస్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. ప్రొఫెసర్ ఓగోస్కీ నేతృత్వంలో జరిగిన ఈ పరశోధనా ఫలితాలు ఇటీవల ‘సోషల్ అండ్ పర్సనల్ రిలేషన్షిప్స్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఎక్కువకాలం రిలేషన్లో ఉన్న కొన్ని జంటలను తీసుకుని.. వాళ్ల మధ్య దూరం, వారిద్దరి గుండె చప్పుడును లెక్కించారు. 64 నుంచి 88 మధ్య వయసుండి... 14 నుంచి 65 ఏళ్లపాటు రిలేషన్షిప్లో ఉన్న పది జంటలను పరిశోధకులు రెండు వారాలపాటు పరీక్షించారు. ‘‘దూరంగా ఉన్నప్పుడు ఒకలా ఉన్న గుండెకొట్టకునే తీరు... ఇద్దరూ సమీపంలోకి వచ్చినప్పుడు క్రమంగా ఒక్కటి అవుతోంది. అంటే ఇద్దరూ దగ్గరగా ఉన్నప్పుడు ఒకరి గుండె మరొకరి గుండెను ప్రభావితం చేస్తోంది. ఒకసారి భార్య గుండె భర్త గుండెపై ఎఫెక్ట్ చూపిస్తే... మరోసారి భర్త గుండె భార్య గుండెను ప్రభావితం చేస్తోంది. ముప్ఫై, నలభై ఏళ్లు కలిసి జీవించిన జంటల హృదయం సైతం ఒకరికోసం ఒకరు అన్న అంకితభావంతో పనిచేస్తోంది’’అని ఒగోస్కీ చెప్పారు. -సాక్షి సెంట్రల్ డెస్క్ -
కోవిడ్-19: ఆ మాస్కులే ఉత్తమం!
వాషింగ్టన్: మహమ్మారి కరోనా కాలంలో ఫేస్‌మాస్కుల వినియోగం భారీగా పెరిగిపోయింది. కోవిడ్-19 బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు దాదాపు ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరిస్తున్నారు. కొంతమంది సర్జికల్, రిస్పిరేటర్ మాస్కులు ధరిస్తుంటే, చాలా మంది ప్రజలు ఇంట్లో అందుబాటులో ఉన్న వస్త్రంతో మాస్కు తయారు చేసుకుంటున్నారు. దీంతో క్లాత్ ఫేస్ కవరింగ్ మాస్కులకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అయితే ఇలాంటి మాస్కులు సురక్షితమేనా? వైరస్ కణాలను అడ్డుకోవడంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయా? లేదా అన్న సందేహాలు తలెత్తుతున్న నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మార్కెట్లో లభించే వివిధ రకాల మాస్కుల కంటే ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులే(సింగిల్ లేయర్‌వి అయినా సరే) ఉత్తమమైనవని పేర్కొన్నారు. (చదవండి: ‘కోవిడ్’ పెరుగుతున్నా మరణాలు ఎందుకు తక్కువ!) అదే విధంగా అవతలి వ్యక్తి దగ్గినపుడు, లేదా తుమ్మినపుడు వెలువడే నీటి తుంపరలు మనల్ని చేరకుండా ఆపడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. సాధారణ వస్త్రం (ఉదా: టీషర్టు క్లాత్)తో తయారు చేసిన మాస్కులు మెడికల్ మాస్కుల కంటే ఏమాత్రం తీసిపోవని, పైగా గాలి పీల్చుకోవడంతో పాటు అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు జర్నల్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ మెకానిక్స్ లెటర్స్ అధ్యయనంలో తమ పరిశోధనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నావల్ కరోనా వైరస్ కణాల పరిమాణంలో ఉన్న కణాలతో కూడిన డిస్టిల్డ్ వాటర్‌ను ఇన్‌హెల్లర్‌లో నింపి, ఓ ప్లాస్టిక్ పాత్రలో దానిని అధిక ద్రవ్యరాశి గల తుంపరల రూపంలో వాటిని వదిలిపెట్టారు. వివిధ రకాల మెటీరియళ్లతో వాటిని వడకట్టి, వేటికైతే కణాలను ఆపగల శక్తి ఎక్కువగా ఉందో పరిశీలించారు. (చదవండి: ఫేస్‌మాస్క్‌ల గురించి మనకు ఏం తెలుసు?) ఈ విషయం గురించి అధ్యయనకర్త తాహిర్ సైఫ్ మాట్లాడుతూ.. ‘‘పాత్రలో పడుతున్న ప్రతీ నానో- పార్టికల్‌ను అత్యాధునిక మైక్రోస్కోపు ద్వారా పరిశీలించాం. వాటిని లెక్కించాం. వివిధ రకాల ఫ్యాబ్రిక్లను అడ్డుపెట్టి లేదా నేరుగా నీటి తుంపరలను వదిలి, ఏ ఫ్యాబ్రిక్ ఎంతమేర కణాలను బ్లాక్ చేయగలిగిందో పరిశీలించినపుడు సాధారణంగా ఇంట్లో ఉపయోగించే వస్త్రాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించాం. నిజానికి శ్వాస పీల్చుకోకుండా అసౌకర్యాన్ని కలిగించే మాస్కుల వల్ల ఊపిరాడటం కష్టమవడమే గాకుండా, వైరస్ కణాలు కూడా లీకయ్యే అవకాశం ఉంటుంది. మరి అలాంటి మాస్కులు ధరించినా ఉపయోగం ఉండదు కదా. నిజానికి మెడికల్ మస్కులు అందరికీ అందుబాటులో లేకపోయిన్పటికీ ఇంట్లో వాడే కామన్ ఫ్యాబ్రిక్‌లతో కూడా వైరస్ బారిన పడకుండా రక్షించుకునే అవకాశం ఉంటుందని నిరూపించడమే మా ఉద్దేశం. ఈ ప్రయోగంలో మేం మొత్తం 11 రకాల వస్త్రాల(బెడ్షీట్లు, కర్చిఫ్లు వంటివి)ను పరిశీలించాం. ఇందులో కొత్తవాటితో పాటుగా వాడినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అత్యంత వేగంతో ప్రయాణించే 100 నానోమీటర్ పార్టికల్స్‌ను కూడా సమర్థవంతంగా అడ్డుకోగలవని నిరూపితమైంది. ఇలాంటివి సింగిల్ లేయర్ మాస్కులైనా సరే ఎదుటి వ్యక్తి మాట్లాడినపుడు, తుమ్మినపుడు లేదా దగ్గినపుడు మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు’’ అని చెప్పుకొచ్చారు. -
విషవాయువుతో బ్యాటరీ..!
గాలిలో కార్బన్ డయాక్సైడ్ మోతాదు పెరిగిపోతోందన్న వార్తలు తరచూ కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో భూమ్మీద మనిషి మను గడ కూడా కష్టమన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే బోలెడన్ని ప్రయత్నాలు చేస్తుండగా.. ఇల్లినాయి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇంకో ముందడుగు వేసి కార్బన్ డయాక్సైడ్‌తోనే పనిచేసే ఓ రీచార్జబుల్ బ్యాటరీని సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న లిథియం అయాన్ బ్యాటరీతో పోలిస్తే తక్కువ స్థలంలో ఎక్కువ విద్యుత్ నిల్వ చేసుకోగలగడం దీని ప్రత్యేకత. కచ్చితంగా చెప్పాలంటే లిథియం అయాన్ బ్యాటరీ కంటే 7 రెట్లు ఎక్కువ విద్యుత్ నిక్షిప్తం చేసుకోగలదీ కొత్త బ్యాటరీ. గతంలోనూ ఇలాంటి బ్యాటరీలు తయారు చేసినప్పటికీ అవి ఎక్కువసార్లు రీచార్జ్ చేసుకునేందుకు ఉపయోగపడేవి కావు. ఈ నేపథ్యంలో ఇల్లినాయి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొన్ని కొత్తరకం పదార్థాలను వాడటం ద్వారా ఒక్కో బ్యాటరీ కనీసం 500 సార్లు రీచార్జ్ చేసుకునేలా తయారు చేశారు. మాలిబిడనం డై సల్ఫైడ్ను కాథోడ్ తయారీలో వాడగా.. అయానిక్ లిక్విడ్, డైమిథైల్ సల్ఫాక్సైడ్లను ఎలక్ట్రొలైట్తోనూ ఉపయోగించడం ద్వారా తాము కొత్త బ్యాటరీని తయారు చేశామని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సలేహీ ఖోజిన్ తెలిపారు. వాణిజ్య స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ బ్యాటరీల తయారీకి ఇంకొంచెం సమయం పట్టే అవకాశమున్నట్లు చెప్పారు. -
యవ్వనంలో అతిగా తాగితే మెదడుకు చేటు!
వాషింగ్టన్: యవ్వనంలో విపరీతంగా మద్యం తాగితే అది మెదడుపై శాశ్వత ప్రభావం చూపుతుందని, తద్వారా మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని అమెరికాలోని ఇలియన్స్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. మెదడు శాశ్వత మార్పుల వలన నాడీవ్యవస్థ దెబ్బతిని భావవ్యక్తీకరణ సమస్యలతోపాటు ఒత్తిడి, ఆందోళన కలుగుతాయని వారు తెలిపారు. కౌమార దశలోనే అతిగా మద్యం తాగిన వారి మెదడులో శాశ్వత మార్పులు సంభవించడాన్ని గమనించామని భారత సంతతి శాస్త్రవేత్త, ఇలియన్స్ వర్సిటీ ప్రొఫెసర్ సుభాశ్ పాండే తెలిపారు. -
పరీక్షల ఒత్తిడిని తగ్గించే ఫేస్బుక్ లైకులు!
వాషింగ్టన్: ఫేస్బుక్లో లైకులు, కామెంట్లు, మెసేజ్‌ల ద్వారా పరీక్షల ఒత్తిడి తగ్గే అవకాశముందని ఓ పరిశోధనలో తేలింది. గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో దీని ప్రభావంపై అమెరికాలోని ఇల్లినాయిస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పరిశోధన చేశారు. తమకు మద్దతిస్తూ స్ఫూర్తినిచ్చే మెసేజ్‌లను చదవడం వల్ల వారిలో ఒత్తిడి 21 శాతం తగ్గిందని కనుగొన్నారు. వీరితో ఏడు నిమిషాల పాటు పరీక్ష రాయించగా వారు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా పరీక్ష రాసారని శాస్త్రవేత్తలు తెలిపారు. మొత్తం విద్యార్థుల్లో 41 శాతం మంది పరీక్షలు రాసేటప్పుడు, సన్నద్ధమయ్యేటప్పుడు ఒత్తిడికి లోనవుతున్నారని, దీని కారణంగా వారి మార్కులు తగ్గిపోయి, ప్రదర్శన మందగిస్తోందన్నారు. -
ఏ మొక్క ఎలా ఉందో చెబుతుంది
ఉపోద్ఘాతం లేకుండా నేరుగా విషయానికొద్దాం. ఫొటోలో కనిపిస్తున్నది అమెరికాలోని ఇల్లినాయీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వ్యవసాయ రోబో! ప్రత్యేకతలు ఏమిటంటే.. ఇది పంటలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు మాత్రమే కాకుండా... మంచి లక్షణాలు కలిగిన కొత్త వంగడాల తయారీలోనూ ఉపయోగపడుతుంది. పంటచేను చాళ్ల మధ్యలో ప్రయాణిస్తూ.. హైపర్‌స్పెక్ట్రల్ కెమెరాలు, సెన్సర్ల సాయంతో ఒక్కో మొక్క తాలూకూ వివరాలు అనేకం సేకరిస్తుంది. కాండం వ్యాసార్ధం, మొక్క ఎత్తు, ఆకుల రంగు, సైజు వంటి భౌతిక వివరాలతోపాటు ఉష్ణోగ్రత, గాల్లో తేమశాతం వంటి ఇతర వివరాలను కూడా సేకరిస్తుంది ఇది. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా ఈ వివరాలను విశ్లేషించుకుంటూ మొక్కలు బాగున్నాయా లేదా తెలుసుకోవచ్చు. లేదా ఏ మొక్కలో ఎలాంటి లక్షణాలు వద్ధి చెందుతున్నాయో గుర్తించి వాటిని కొత్త వంగడాల తయారీలోనూ వాడవచ్చు. భారతీయ సంతతి శాస్త్రవేత్త గిరీశ్ చౌదరి నేతత్వంలో ప్రస్తుతం ఈ రోబోను జొన్న పంటల పరిశీలనకు ఉపయోగిస్తున్నారు. దాదాపు 12 అడుగుల ఎత్తు పెరిగే కొత్తరకం జొన్న వంగడాన్ని ఇక్కడ వాడుతున్నారు. దీన్ని ఆహార పంటగా మాత్రమే కాకుండా... చొప్ప ద్వారా అధికమొత్తంలో ఎథనాల్‌ను ఉత్పత్తి చేయవచ్చు అన్నది ఆలోచన. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కలిసి తింటే కలదు ఆరోగ్యం!
న్యూయార్క్: కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తాజా అధ్యయనంలో తేలింది. తినే రుగ్మత(అతిగా తినడం.. లేదంటే అసలు తినకపోవడం) బారిన పడకుండా ఉండడానికి, భవిష్యత్తులో స్థూలకాయులుగా మారే ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ఈ పద్ధతే ఉత్తమమైనదని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. దాదాపు 200 కుటుంబాలపై అధ్యయనం చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య, అక్క, చెల్లి, తమ్ముడు, బంధువులు.. ఇలా అందరితో కలిసి కూర్చుండి తినడమే మేలంటున్నారు. ఇలా తినేటప్పుడు పిల్లల ఆహార అలవాట్లను తల్లిదండ్రులు దగ్గరగా పరిశీలిస్తారని, ఒకరు కాకపోయినా మరొకరు వారి తీరును పరిశీలించి సరిదిద్దడమే ఇందుకు కారణమని ఇల్లినాయిస్ యూనివర్సిటీకి చెందిన బార్బారా తెలిపారు. -
సముద్రపు నీటి నుంచి ఉప్పును తీసేసే పరికరం
వాషింగ్టన్: సముద్రపు నీటినుంచి ఉప్పును తొలగించి తాగునీటిగా మార్చే పరికరాన్ని భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వంలోని పరిశోధకులు రూపొందించారు. ఇందులో నానోమీటరు మందంగల మాలిబ్డినం డైసల్ఫైడ్‌తో చేసిన షీట్‌కు చిన్న రంధ్రాలుంటాయి. పెద్దమొత్తంలో నీటిని ఈ షీట్ మీదుగా పంపిస్తే ఉప్పుతోపాటు ఇతర పదార్థాలు తొలగించి మంచి నీరు లభిస్తుంది. ఇల్లినాయ్ వర్సిటీ పరిశోధకుల బృందం వివిధ లోహాలతో చేసిన పలుచని పొరలతో పరిశోధనలు చేయగా మాలిబ్డినం డైసల్ఫైడ్‌తో చేసిన పొరలతో మంచి ఫలితాన్నిచ్చిందని పరిశోధన సారథి ప్రొఫెసర్ నారాయణ ఆలూరు తెలిపారు.