ఏ మొక్క ఎలా ఉందో చెబుతుంది | Illinois university developed Agricultural Robot | Sakshi
Sakshi News home page

ఏ మొక్క ఎలా ఉందో చెబుతుంది

Published Sun, Feb 26 2017 3:10 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఏ మొక్క ఎలా ఉందో చెబుతుంది - Sakshi

ఏ మొక్క ఎలా ఉందో చెబుతుంది

అమెరికాలోని ఇల్లినాయీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వ్యవసాయ రోబో! పంటలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు మాత్రమే కాకుండా... మంచి లక్షణాలు కలిగిన కొత్త వంగడాల తయారీలోనూ ఉపయోగపడుతుంది.

ఉపోద్ఘాతం లేకుండా నేరుగా విషయానికొద్దాం. ఫొటోలో కనిపిస్తున్నది అమెరికాలోని ఇల్లినాయీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వ్యవసాయ రోబో! ప్రత్యేకతలు ఏమిటంటే.. ఇది పంటలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు మాత్రమే కాకుండా... మంచి లక్షణాలు కలిగిన కొత్త వంగడాల తయారీలోనూ ఉపయోగపడుతుంది.

పంటచేను చాళ్ల మధ్యలో ప్రయాణిస్తూ.. హైపర్‌స్పెక్ట్రల్‌ కెమెరాలు, సెన్సర్ల సాయంతో ఒక్కో మొక్క తాలూకూ వివరాలు అనేకం సేకరిస్తుంది. కాండం వ్యాసార్ధం, మొక్క ఎత్తు, ఆకుల రంగు, సైజు వంటి భౌతిక వివరాలతోపాటు ఉష్ణోగ్రత, గాల్లో తేమశాతం వంటి ఇతర వివరాలను కూడా సేకరిస్తుంది ఇది. ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఈ వివరాలను విశ్లేషించుకుంటూ మొక్కలు బాగున్నాయా లేదా తెలుసుకోవచ్చు. లేదా ఏ మొక్కలో ఎలాంటి లక్షణాలు వద్ధి చెందుతున్నాయో గుర్తించి వాటిని కొత్త వంగడాల తయారీలోనూ వాడవచ్చు.

భారతీయ సంతతి శాస్త్రవేత్త గిరీశ్‌ చౌదరి నేతత్వంలో ప్రస్తుతం ఈ రోబోను జొన్న పంటల పరిశీలనకు ఉపయోగిస్తున్నారు. దాదాపు 12 అడుగుల ఎత్తు పెరిగే కొత్తరకం జొన్న వంగడాన్ని ఇక్కడ వాడుతున్నారు. దీన్ని ఆహార పంటగా మాత్రమే కాకుండా... చొప్ప ద్వారా అధికమొత్తంలో ఎథనాల్‌ను ఉత్పత్తి చేయవచ్చు అన్నది ఆలోచన.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement