తెలంగాణ వైద్య ప్రదాయినికి బదిలీల విఘాతం
ఒకేసారి 40 మంది ప్రొఫెసర్లకు స్థానచలనం
కీలక విభాగాల్లో మూకుమ్మడి బదిలీలు
కొత్త వాళ్లు కుదురుకుని అలవాటుపడేందుకు కొంత సమయం
ఈలోగా వైద్యసేవలకు అంతరాయం.. జాప్యం కానున్న సర్జరీలు
గాంధీ ఆస్పత్రి: తెలంగాణ వైద్యప్రదాయిని, కోవిడ్ సంక్షోభ వేళ వేలాది మంది ప్రాణాలు కాపాడిన కోవిడ్ నోడల్ సెంటర్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి బదిలీల విఘాతం తగిలింది. సుమారు 2 వేల మంది ఇన్‌పేషెంట్లు, మరో మూడు వేల మంది అవుట్‌పేòÙంట్లకు వైద్యసేవలు అందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో పెద్దసంఖ్యలో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఒకేసారి బదిలీ చేయడం చర్చనీయాంశమైంది.
లాంగ్‌స్టాండింగ్ పేరిట బోధనాసుపత్రి నిర్వహణలో ఉన్న కీలకమైన ప్రొఫెసర్లను మూకుమ్మడిగా బదిలీ చేయడంతో గాంధీ ఆస్పత్రి నిర్వహణపై పెనుప్రభావం పడనుంది. ఆస్పత్రి సూçపరింటెండెంట్‌తోపాటు ఆయా విభాగాలకు చెందిన సుమారు 40 మంది ప్రొఫెసర్లను ఒకేసారి బదిలీ చేయడంతో మేజర్ సర్జరీల్లో జాప్యం నెలకొనే అవకాశం ఉంది. పోస్ట్‌గ్రాడ్యుయేట్ వైద్యులకు గైడ్‌లుగా వ్యవహరించే ప్రొఫెసర్లకూ బదిలీ కావడంతో పీజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. సీనియర్, జూనియర్ నిష్పత్తిలో కాకుండా నిష్ణాతులైన వైద్యులందరినీ ఇష్టారాజ్యంగా శుక్రవారం బదిలీ చేయడంపై వైద్యవర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది.
జనరల్ సర్జరీ విభాగంలో ఆరుగురు ప్రొఫెసర్లకు....
కీలకమైన గాంధీ జనరల్ సర్జరీ విభాగంలో ఆరుగురు ప్రొఫెసర్లను ఒకేమారు బదిలీ చేయడంతో సర్జరీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. నూతనంగా బదిలీపై వచ్చే ప్రొఫెసర్లకు ఇక్కడి పరిస్థితులు ఆకళింపు చేసుకునేందుకు కొంత సమయం పడుతుంది. అప్పటివరకు అరకొరగా ఉన్న అసోసియేట్, అసిస్టెంట్ వైద్యులతో నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. జనరల్ మెడిసిన్ విభాగంలో ఆరుగురు ప్రొఫెసర్లకుగాను ఐదుగురు బదిలీ అయ్యారు. అత్యంత కీలకమైన అనస్తీషియా విభాగంలో ముగ్గురు ప్రొఫెసర్లు, ఆరుగురు అసోసియేట్లు బదిలీ కావడంతో ఆపరేషన్లలో జాప్యం నెలకొనే పరిస్థితి ఏర్పడింది. ఆర్థోపెడిక్ విభాగంలో ముగ్గురు ప్రొఫెసర్లు బదిలీకాగా ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. గైనకాలజీ విభాగంలో నలుగురు ప్రొఫెసర్లు బదిలీ అయ్యారు.
ఒక్కో ప్రొఫెసర్ ఉన్న విభాగంలో కూడా
యూరాలజీ, సీటీ సర్జరీ, కార్డియాలజీ తదితర విభాగాల్లో ఉన్న ఒకే ఒక్క ప్రొఫెసర్‌ను కూడా బదిలీ చేయడంతో ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితిపై ప్రభావం పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment