Assistant Professors
-
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల డైరెక్ట్ నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదివారం విడుదల చేశారు. గతంలో తీసుకొచ్చిన గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. 12 విశ్వవిద్యాలయాల్లో దాదాపు 2,500కు పైగా బోధన సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నియామకాలను ఎలా చేపట్టాలనే దానిపై కొన్ని నెలల క్రితం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సు చేసిన మార్గదర్శకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. యూజీ, పీజీతో పాటు సాంకేతిక, ఫిజికల్ ఎడ్యుకేషన్ బోధించే అధ్యాపకుల నియామకానికి రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. నియామక ప్రక్రియలో మూడు దశలను అనుసరిస్తారు. ప్రతీ యూనివర్సిటీలోనూ కమిటీ ఏర్పాటు చేసి, రోస్టర్ విధానం, రిజర్వేషన్ విధానానికి సంబంధించిన ప్రక్రియలను పూర్తి చేస్తారు. దీనికి విశ్వవిద్యాలయం వీసీ నాయకత్వం వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆమోదించిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.. అకడమిక్ రికార్డ్, పరిశోధనలకు సంబంధించి 50 మార్కులను కేటాయిస్తారు. యూనివర్సిటీ వీసీ, ఉన్నత విద్యా మండలి సబ్జెక్ట్ నిపుణుడు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, డిపార్ట్మెంట్ ముఖ్యుడు మార్కుల స్క్రూటినీ చేస్తారు. అభ్యర్థికి సంబంధించి యూజీ నుంచి రీసెర్చ్ వరకూ వివిధ విద్యా స్థాయిల్లో మార్కులను ఖరారు చేస్తారు. మొత్తం వంద మార్కుల్లో ఇంటర్వ్యూకు 20 మార్కులు, టీచింగ్ నైపుణ్యానికి 30 మార్కులు ఉంటాయి. మిగతా 50 మార్కులను యూజీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ విభాగాల నుంచి అభ్యర్థి సాధించిన మార్కుల శాతం ఆధారంగా తీసుకుంటారు. నాలెడ్జ్ అండ్ స్కిల్స్‌కు 30 మార్కులు ఇస్తారు. ఈ మార్కులను టీచింగ్, బుక్ ఆథర్‌షిప్, జాయింట్ ఆథర్ షిప్, ఎడిట్ ఆథర్‌షిప్, కో–ఎడిటర్ ఆథర్‌షిప్, పోస్టు–డాక్టోరల్ షిప్‌గా విడగొడతారు. ఈ మార్కులను ఆయా సబ్జెక్టు లెక్చరర్లు పరిశీలించి, నిర్ణయిస్తారు. ఇంటర్వ్యూకు 20 మార్కులు ఇస్తారు. ఇందులో సబ్జెక్టు ప్రజెంటేషన్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, ఓవరాల్ పర్సనాలిటీ, నైపుణ్యాన్ని బట్టి మార్కులు వేస్తారు. -
హేరామ్.. ‘గాంధీ’ ఖాళీ
గాంధీ ఆస్పత్రి: తెలంగాణ వైద్యప్రదాయిని, కోవిడ్ సంక్షోభ వేళ వేలాది మంది ప్రాణాలు కాపాడిన కోవిడ్ నోడల్ సెంటర్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి బదిలీల విఘాతం తగిలింది. సుమారు 2 వేల మంది ఇన్‌పేషెంట్లు, మరో మూడు వేల మంది అవుట్‌పేòÙంట్లకు వైద్యసేవలు అందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో పెద్దసంఖ్యలో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఒకేసారి బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. లాంగ్‌స్టాండింగ్ పేరిట బోధనాసుపత్రి నిర్వహణలో ఉన్న కీలకమైన ప్రొఫెసర్లను మూకుమ్మడిగా బదిలీ చేయడంతో గాంధీ ఆస్పత్రి నిర్వహణపై పెనుప్రభావం పడనుంది. ఆస్పత్రి సూçపరింటెండెంట్తోపాటు ఆయా విభాగాలకు చెందిన సుమారు 40 మంది ప్రొఫెసర్లను ఒకేసారి బదిలీ చేయడంతో మేజర్ సర్జరీల్లో జాప్యం నెలకొనే అవకాశం ఉంది. పోస్ట్‌గ్రాడ్యుయేట్ వైద్యులకు గైడ్లుగా వ్యవహరించే ప్రొఫెసర్లకూ బదిలీ కావడంతో పీజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. సీనియర్, జూనియర్ నిష్పత్తిలో కాకుండా నిష్ణాతులైన వైద్యులందరినీ ఇష్టారాజ్యంగా శుక్రవారం బదిలీ చేయడంపై వైద్యవర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. జనరల్ సర్జరీ విభాగంలో ఆరుగురు ప్రొఫెసర్లకు.... కీలకమైన గాంధీ జనరల్ సర్జరీ విభాగంలో ఆరుగురు ప్రొఫెసర్లను ఒకేమారు బదిలీ చేయడంతో సర్జరీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. నూతనంగా బదిలీపై వచ్చే ప్రొఫెసర్లకు ఇక్కడి పరిస్థితులు ఆకళింపు చేసుకునేందుకు కొంత సమయం పడుతుంది. అప్పటివరకు అరకొరగా ఉన్న అసోసియేట్, అసిస్టెంట్ వైద్యులతో నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. జనరల్ మెడిసిన్ విభాగంలో ఆరుగురు ప్రొఫెసర్లకుగాను ఐదుగురు బదిలీ అయ్యారు. అత్యంత కీలకమైన అనస్తీషియా విభాగంలో ముగ్గురు ప్రొఫెసర్లు, ఆరుగురు అసోసియేట్లు బదిలీ కావడంతో ఆపరేషన్లలో జాప్యం నెలకొనే పరిస్థితి ఏర్పడింది. ఆర్థోపెడిక్ విభాగంలో ముగ్గురు ప్రొఫెసర్లు బదిలీకాగా ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. గైనకాలజీ విభాగంలో నలుగురు ప్రొఫెసర్లు బదిలీ అయ్యారు.ఒక్కో ప్రొఫెసర్ ఉన్న విభాగంలో కూడా యూరాలజీ, సీటీ సర్జరీ, కార్డియాలజీ తదితర విభాగాల్లో ఉన్న ఒకే ఒక్క ప్రొఫెసర్‌ను కూడా బదిలీ చేయడంతో ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితిపై ప్రభావం పడనుంది. -
హిమాచల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా దివ్యాంగ మహిళలు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు దివ్యాంగ మహిళలు అరుదైన ఘనత సాధించారు. అంధులైన వీరిద్దరూ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమితులయ్యారు. పట్టుదల, అంకితభావంతో తమ కలలను నిజం చేసుకున్నారు. రైతు కుటుంబంలో జని్మంచిన ముస్కాన్ ప్రముఖ గాయకురాలు. హిమాచల్‌ప్రదేశ్ నుంచి ఎన్నికల సంఘం యూత్ ఐకాన్‌గా ఇప్పటికే గుర్తింపు పొందారు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 2013లో రాజ్‌కియా కన్య మహావిద్యాలయలో సంగీతంలో ప్రవేశం పొందారు. ఇప్పుడు అదే విద్యాసంస్థలో సంగీతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ముస్కాన్ చురుగ్గా ఉంటున్నారు. సాధారణమధ్య తరగతి కుటుంబంలో జని్మంచిన ప్రతిభా ఠాకూర్ సైతం అంధురాలు. పీహెచ్డీ పూర్తిచేశారు. విద్యా రంగంలో సేవలు అందించాలన్నది ఆమె చిన్నప్పటి కల. రాజీవ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితురాలైంది. -
వెబ్సైట్లో అభ్యర్థుల జాబితా
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15 నుంచి 20 వరకు గ్రూప్–2 ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల జాబితాను సోమ వారం కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు పూర్తి వివరాలకు www.tspsc. gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పోస్టింగ్‌లు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఎంపికైన 72 మంది డాక్టర్లకు వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి సోమవారం పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు -
74 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య డైరెక్టరేట్ పరిధి లోని బోధనాసుపత్రుల్లో 74 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరిగింది. రాష్ట్రంలోని 9 ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఖాళీగా ఉన్న 225 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకోసం శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఇప్పటికే సివిల్ సర్జన్లుగా పనిచేస్తున్న డాక్టర్లను సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్‌కు ఆహ్వానించారు. 25 స్పెషాలిటీలకు 350 మందిని కౌన్సెలింగ్‌కి పిలిచారు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో 45, గాంధీలో 9, వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో 28, నిజామాబాద్ జీఎంసీలో 18, సిద్దిపేట జీఎంసీలో 10, ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏడు పోస్టులతోపాటు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న నల్లగొండ జీఎంసీ కోసం 49, సూర్యాపేట జీఎంసీ కోసం 44 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల అవసరముంది. అనస్థీషియా, అనాటమీ, ఫోరెన్సిక్ మెడిసిన్ స్పెషాలిటీలకు అర్హులైన డాక్టర్ల కొరత ఉంది. ప్రస్తుతం 74 పోస్టులు భర్తీ కాగా మిగిలిన వాటిని డిప్యుటేషన్ లేదా కాంట్రాక్టు పద్ధతిలో నియమించనున్నారు. ప్రస్తుతం ఎంపి క చేసిన వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చారు. -
వర్సిటీ ప్రొఫెసర్లకు పీహెచ్డీ తప్పనిసరి
న్యూఢిల్లీ: విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రత్యక్ష నియామకానికి పీహెచ్‌డీని తప్పనిసరి చేసినట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవడేకర్ చెప్పారు. 2021–22 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని, జాతీయ అర్హత పరీక్ష(నెట్)లో ఉత్తీర్ణతను మాత్రమే ఇకపై ఏకైక అర్హతగా పరిగణించబోమని తెలిపారు. అయితే కళాశాలల్లో నియామకాలకు.. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు నెట్ లేదా పీహెచ్డీ కనీస అర్హతగా కొనసాగుతుందని సీనియర్ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం పీజీ పట్టా కలిగి ఉండి నెట్లో అర్హత సాధించిన వారు లేదా పీహెచ్డీ పట్టా ఉన్న వారు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేయవచ్చు. ఇటీవల సవరించిన యూజీసీ నిబంధనలను జవడేకర్ బుధవారం వెల్లడిస్తూ..తీవ్ర వ్యతిరేకత రావడంతో అకడమిక్ పెర్ఫామెన్స్ ఇండికేటర్స్(ఏపీఐ)ని రద్దుచేసినట్లు తెలిపారు. కళాశాల లెక్చరర్లకు పరిశోధనను తప్పనిసరి చేస్తూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2021 నుంచి యూనివర్సిటీల్లో ప్రారంభ స్థాయి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా కూడా పీహెచ్డీ చేసిన వారే ఉంటారని అన్నారు. -
ఆచార్యులకు అడ్డగోలు ‘పరీక్ష’!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: యూజీసీ నిబంధనలు, రోస్టర్ పాయింట్లు, యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ.. అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరీక్ష నిర్వహించడంపై అభ్యర్థుల ఆందోళన ఉధృతమవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఆన్లైన్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరీక్షపై ఇప్పటికే కొంతమంది కోర్టులను ఆశ్రయించగా మరికొంతమంది ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమానికి సన్నద్ధమయ్యారు. అసంబద్ధ పద్ధతి అంటున్న అభ్యర్థులు రాష్ట్రంలో మొత్తం 13 యూనివర్సిటీల్లో 1190 ఖాళీలకు డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. గతంలో వర్సిటీల్లో నియామకాలన్నీ యూజీసీ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూ విధానంలో జరిగేవి. అయితే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ అసెంబ్లీలో హడావుడిగా తీర్మానం చేసింది. ఈ మేరకు అభ్యర్థులకు ఈ నెల 9 నుంచి 13 వరకు ఆన్లైన్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. ఇందులో ఇచ్చిన ప్రశ్నపత్రాలు చూసిన అభ్యర్థులు.. ఆన్లైన్ ద్వారా అధ్యాపకులను ఎంపిక చేయడాన్ని అసంబద్ధమైన పద్ధతిగా తేల్చిచెబుతున్నారు. అనేక తప్పుల తడకలతో, సిలబస్‌ను అతిక్రమించి ప్రశ్నపత్రాన్ని క్లిష్టంగా రూపొందించారని అంటున్నారు. భాషా సబ్జెక్టుల అభ్యర్థులకు తీవ్రనష్టం ఆన్లైన్ పరీక్షలో భాషా సబ్జెక్టులు కూడా ఉన్నాయి. తెలుగు, సంస్కృతం, హిందీతోపాటు తమిళం, కన్నడం భాషా సబ్జెక్టుల అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా మొదటి పేపర్‌కు సంబంధించి ఇంగ్లిష్‌లో మాత్రమే ప్రశ్నపత్రం ఇచ్చారు. వాస్తవానికి ఇంగ్లిష్‌తోపాటు మాతృభాషలో కూడా పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలి. తెలుగు సహాయ ఆచార్యుడి ఉద్యోగానికి ఆంగ్లంలో పరీక్ష నిర్వహించడమేమిటన్న ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నిర్వహించే పరీక్షల్లో కూడా ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలు ఇస్తుంటే ఇక్కడ ఒక్క ఇంగ్లిష్‌లోనే ప్రశ్నపత్రం ఇవ్వడంతో తాము నష్టపోయామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. లైఫ్ సైన్సెస్‌కు జరిగిన స్క్రీనింగ్ టెస్టులో సుమారు పది సబ్జెక్టు (బోటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మెరైన్ సైన్సెస్ తదితర)లకు కలిపి ఒకే ప్రశ్నపత్రం ఇచ్చారు. ఏ సబ్జెక్టుకు అనుగుణంగా ఆయా సబ్జెక్టు ప్రశ్నలు ఇవ్వాల్సి ఉండగా, అన్నింటికీ కలిపి ఒకే ప్రశ్నపత్రం ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నపత్రం రూపకల్పన సరిగా లేదు సాధారణంగా 50 నుంచి 60 శాతం ప్రశ్నలను అందరూ రాసే విధంగా, మిగిలిన 40 శాతం ప్రశ్నలను కొంత కఠినంగా ఇస్తుంటారు. కానీ ఏపీపీఎస్సీ ఇచ్చిన ప్రశ్నపత్రం సివిల్స్ ప్రశ్నపత్రం కంటే కఠినంగా, కేవలం వడపోతే లక్ష్యంగా ఉన్నట్టు ఉంది. అదేవిధంగా పరీక్షలకు కనీసం 40 రోజుల గడువును ఇవ్వాలనే విషయాన్ని మరిచి పరీక్ష నిర్వహించారు. ఆన్లైన్ పరీక్షలపై అవగాహన కల్పించే విధంగా మాక్ టెస్ట్‌లు నిర్వహించలేదు. –డాక్టర్ ఎం.వి. మణివర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఏయూ లోపభూయిష్టంగా పరీక్ష నిర్వహణ నెగెటివ్ మార్కులు పెట్టడంతో అధిక శాతం మంది అర్హత సాధించలేకపోతున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్ పరీక్షకు సైతం నెగెటివ్ మార్కింగ్ లేదు. ప్రశ్నల్లో అనేక తప్పులు దొర్లాయి. వీటికి ఏ విధంగా న్యాయం చేస్తారో చూడాల్సి ఉంది. పరీక్ష నిర్వహణ మొత్తం లోపభూయిష్టంగా ఉంది. –ఆరేటి మహేశ్, పరిశోధకులు, ఆంధ్రా విశ్వవిద్యాలయం పరీక్ష రద్దు చేయాలని గవర్నర్‌కు వినతి ఏపీపీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డాక్టరేట్స్, రీసెర్చ్ స్కాలర్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుళ్లి చంద్రశేఖర్ యాదవ్ శనివారం గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. విశాఖ విచ్చేసిన గవర్నర్‌ను శనివారం సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో కలిసి వినతిపత్రం అందించారు. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ నిరంకుశంగా పరీక్ష నిర్వహించడం అన్యాయమన్నారు. హైకోర్టులో కేసులు ఉండగా పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ చెలగాటమాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖాళీగా ఉన్న 1109 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్టు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు. ఏప్రిల్ 9 నుంచి 13 వరకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. గత భర్తీలో జరిగిన అవకతవకల నేపథ్యంలో ఈసారి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై 2015లో ఐదుగురి సభ్యులతో ఏర్పాటు చేసిన రాఘవులు కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని గంటా తెలిపారు. 14 యూనివర్సిటీల్లో ఉన్న 3258 పోస్టులను భర్తీ చేయాలని కమిటీ తేల్చగా.. ఇందులో 48 శాతం ఇప్పటికే భర్తీ జరిగినట్ట వెల్లడించారు. ప్రస్తుతం మిగిలిన పోస్టుల భర్తీ జరుగుతుందని, వీటిని భర్తీ చేసుందుకు రెండు దశలుగా ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తుందన్నారు. ఇందుకోసం 11 సెంటర్లు ఏర్పాటు చేశామని, ఈ నెల 25 నుంచి హాల్‌టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి సూచించారు. -
వారిని క్రమబద్ధీకరించండి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1,700 మంది కాంట్రాక్ట్, 472 మంది పార్ట్‌టైమ్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం లేఖ రాశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా వారి సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. పలు వర్సిటీల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం అధ్యాపకులను, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (కాంట్రాక్ట్)గా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ అధ్యాపకుల ధర్నాకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. -
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
కర్నూలు(హాస్పిటల్): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోధనాసుపత్రులు, మెడికల్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి పూనం మాలకొండయ్య గురువారం జీవో ఎంఎస్ నెం.108 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 198 ఖాళీలను డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అనాటమిలో 8, ఫిజియాలజిలో 8, బయోకెమిస్ట్రీలో 4, ఫార్మకాలజిలో 5, పాథాలజిలో 13, మైక్రోబయాలజిలో 4, ఫోరెన్సిక్ మెడిసిన్‌లో 5, ఎస్పీఎంలో 6, జనరల్ మెడిసిన్‌లో 8, జనరల్ సర్జరీలో 17, ఆబ్స్ట్రిక్ట్అండ్ గైనకాలజిలో 17, అనెస్తీషియాలో 13, పీడియాట్రిక్స్‌లో 13, ఈఎన్‌టిలో 3, డీవీఎల్‌లో 3, టీబీసీడీలో 7, సైకియాట్రిలో 7, రేడియోడయోగ్రోసిస్లో 13, రేడియోథెరపిలో 4, ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 3, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్‌లో 1, కార్డియాలజిలో 5, గ్యాస్ట్రో ఎంట్రాలజిలో 2, న్యూరాలజిలో 3, ఎండోక్రైనాలజిలో 1, నెఫ్రాలజిలో 1, సీటీ సర్జరీలో 4, ప్లాస్టిక్ సర్జరీలో 2, డెంటిస్టీలో 5 పోస్టులను భర్తీ చేయనున్నారు. -
తాత్కాలిక సచివాలయం వద్ద ఉద్రిక్తత
-
తాత్కాలిక సచివాలయం వద్ద ఉద్రిక్తత
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడులకు వినతి పత్రం ఇచ్చేందుకు యూనివర్సిటీల ప్రొఫెసర్లు సచివాలయం వచ్చారు. అయితే వినతిపత్రం తీసుకునేందుకు మంత్రులు గంటా, యనమల నిరాకరించారు. దీంతో మంత్రులకు వ్యతిరేకంగా ప్రొపెసర్లు నినాదాలు చేస్తూ వెలగపూడి సచివాలయం వద్ద యూనివర్సిటీల అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. -
మౌనం వెనుక మర్మమేమిటో..!
నిజామాబాద్ అర్బన్ : జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 128మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లను కేటాయించారు. వచ్చిన కొత్తలో నెలరోజుల పాటు కళాశాలకు వచ్చిన వీరిలో చాలామంది ఆ తరువాత మొహం చాటేశారు. కేవలం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) పరిశీలనకు వచ్చిన రెండుసార్లు మాత్రమే పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లు జిల్లాకు వచ్చారు. ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు. ఏడాది కాలంగా వైద్యవిద్య బోధన, రోగులకు వైద్యసేవలు అందించడానికి పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లు రావడం లేదు. వాస్తవానికి ఇక్కడికి కేటాయించిన ప్రొఫెసర్లందరూ కళాశాలలోనే తమకు కేటాయించిన నివాస గృహాల్లో ఉండాలి. అందుకు అనుగుణంగానే వారి కోసం అపార్ట్మెంట్లు నిర్మించారు. అందులో సకాల సౌకర్యాలనూ ఏర్పాటు చేశారు. కానీ ఉండే వారు లేక అవి బోసిపోతున్నాయి. చాలామంది వైద్యులు జిల్లాకే రావడం లేదు. హైదరాబాద్‌కు చెందిన 32మంది ప్రొఫెసర్లు అక్కడే ఉంటూ ప్రైవేట్ ప్రాక్టీసుల్లో నిమగ్నమయ్యారు. విజయవాడ నుంచి ఇద్దరు ప్రొఫెసర్లను ఇక్కడికి కేటాయించగా వీరు రెండుసార్లు మాత్రమే ఆస్పత్రికి వచ్చారు. కాకతీయ మెడికల్ కళాశాల నుంచి ఒక ప్రొఫెసర్‌ను ఇక్కడికి కేటాయించారు. ఆయన వైద్యవిద్యలో భాగమైన పోస్టుమార్టం నిర్వహించడంలో ప్రసిద్ధి. ఈ సేవలను అందించేందుకు ఇక్కడికి కేటాయించగా ఇప్పటి వరకు ఆయన కళాశాల వైపు చూడలేదు. నలుగురు స్త్రీ వైద్యనిపుణులు ఇక్కడికి కేటాయించగా, వీరు రెండు నెలల పాటు వైద్యసేవలు అందించి బదిలీ చేయించుకొని వెళ్లిపోయారు. ప్రస్తు తం ఆస్పత్రిలో 12 మంది స్త్రీ వైద్యనిపుణులు ఉం డాల్సింది, కానీ కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఉన్న ప్రొఫెసర్లు కూడా ఉదయం ఒక గంట మాత్రమే ఆస్పత్రికి వచ్చి వెళ్లిపోతున్నారు. దీంతో వైద్యసేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారుల మౌనం మెడికల్ కళాశాలకు గైర్హాజరవుతున్న ప్రొఫెసర్లపై చ ర్యలు తీసుకోవడంలో కళాశాల అధికారులు స్పందిం చడం లేదు. గతంలో వీరిపై చర్య తీసుకుంటే ఉన్నఫలంగా వెళ్లిపోతారని, దీంతో కళాశాలకు అనుమతికి ఇబ్బందులు వస్తాయని భావించారు. ప్రస్తుతం కళాశాలకు పూర్తిస్థాయి అనుమతి లభించింది. అయినా ప్రొఫెసర్లు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. విధులకు రాకుండా రిజిష్టరులో సంతకాలు లేకుండానే ప్రతి నెలా వేతనాలు మాత్రం పొందుతున్నారు. ఆయన వీరిపై కళాశాల ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోవడం లేదు. గైర్హాజరవుతున్న ప్రొఫెసర్లపై గత మార్చిలో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ సుబ్రమణ్యం నివేదిక అందించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయినా కళాశాల అధికారులు సాహసించలేదు. ఇటీవల కొంతమంది ప్రొఫెసర్లు తమ యూనియన్ నాయకులను తీసుకవచ్చి ఎవరూ ఏమనకూడదన్నట్లుగా వైద్యాధికారులపై చిందులు వేయించారు. అప్పటి నుంచి ప్రొఫెసర్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా త యారైందన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రొఫెసర్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో పేదల కోసం ఏర్పాటు చేసిన పెద్దాస్పత్రి, వైద్యకళాశాలలు సక్రమంగా కొనసాగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
బదిలీలపై డీఎంఈ ఉత్తర్వులు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: బోధనేతర విభాగంలోని సివిల్ అసిస్టెంట్ సర్జన్లను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా బోధన విభాగానికి, ఈ విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లను సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా బదిలీ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) కొట్టివేసింది. డీఎంఈ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధమని సభ్యులు డి.కె.పన్వర్, శివయ్యనాయుడులతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు వేర్వేరని స్పష్టం చేసింది. వివరాలిలా ఉన్నాయి... నాన్‌టీచింగ్ విభాగంలో పనిచేస్తున్న కొందరు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు తమను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా బదిలీ చేయాలంటూ డీఎంఈకి వినతిపత్రాలు సమర్పించారు. వాటిని పరిశీలించిన డీఎంఈ... అసిస్టెంట్ సర్జన్లకు పోస్టు గ్రాడ్యుయేషన్ అర్హత ఉందంటూ వారిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉన్న వారిని సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని సవాలు చేస్తూ తిరుపతిలోని స్విమ్స్ ఈఎన్టీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గౌరీపెద్ది శ్రీనివాస్ ఏపీఏటీలో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున న్యాయవాది డాక్టర్ కె.లక్ష్మీనర్సింహ వాదనలు వినిపిస్తూ, నిబంధనలను బేఖాతరు చేస్తూ డీఎంఈ ఏకపక్షంగా బదిలీ ఉత్తర్వులు జారీ చేశారని నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం డీఎంఈ చర్యను తప్పుపట్టింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు శిక్షణ ఇవ్వాలనుకుంటే వారిని ప్రతీ సంవత్సరం టీచింగ్ విభాగంలో ఏర్పడే ఖాళీల్లో నియమించాలని ప్రభుత్వానికి సూచించింది.