
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15 నుంచి 20 వరకు గ్రూప్–2 ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల జాబితాను సోమ వారం కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు పూర్తి వివరాలకు www.tspsc. gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.
అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పోస్టింగ్‌లు
అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఎంపికైన 72 మంది డాక్టర్లకు వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి సోమవారం పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు