group 2
-
Group 2: గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన
-
ఎల్లుండి గ్రూప్-2 కీ విడుదల: టీజీపీఎస్సీ చైర్మన్
సాక్షి,హైదరాబాద్:ఇటీవల జరిగిన గ్రూప్-2(Group-2) పరీక్ష ‘కీ’ని శనివారం(జనవరి 10) విడుదల చేస్తామని, ఇక నుంచి పరీక్షలు జరిగిన వారం పది రోజుల్లోనే ఫలితాలు వెల్లడిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) చైర్మన్ బుర్రా వెంకటేశం(Burra Venkatesham) తెలిపారు. బుధవారం వెంకటేశం మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు. ‘గతంలో జరిగిన తప్పిదాలు కమిషన్‌లో ఇకపై జరగవు. ఫలితాలు ఎప్పుడు వస్తాయో తెలియక అభ్యర్థులు సతమతమవుతున్నారు.ఇకపై వేచి చూసే ధోరణి ఉండదు.ప్రతీ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఏళ్ల తరబడి వేచి చూడకుండా ప్రతి ఏడాది పరీక్షలు జరగాలన్నది మా నిర్ణయం. టీజీపీఎస్సీని పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తున్నాం.సైంటిఫిక్ డిజైన్ ఇక్కడ లోపించింది అందుకే ప్రక్షాళన చేస్తున్నాం.సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను ఆయా శాఖకు సంబంధించిన అధికారులు చూస్తారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని పరీక్షల ఫలితాలు మార్చి 31కల్లా విడుదల చేస్తున్నాం.పెండింగ్ అనేది ఉండదు’అని వెంకటేశం తెలిపారు. -
TG: గ్రూప్-2 వాయిదాపై హైకోర్టు కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలకు లైన్ క్లియరైంది. ఈ నెల 15,16 తేదీల్లో ఉన్న పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.ఒకే తేదీల్లో గ్రూప్2, స్టాఫ్ సెలక్షన్ పరీక్షలుండడం వల్ల వాయిదా వేయాలని అభ్యర్థులు హైకోర్టుకు విన్నవించారు. వీరి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు గ్రూప్ 2 పరీక్ష తేదీల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కాగా, తెలంగాణలో 2016లో జరిగిన గ్రూప్ 2 పరీక్ష తర్వాత మళ్లీ ఇప్పుడు జరుగుతుండడం గమనార్హం. -
AP: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా
సాక్షి,విజయవాడ: ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. 2025 జనవరి 5న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్ మంగళవారం(నవంబర్ 12) ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మంది దాకా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు.ఇదీ చదవండి: రేణిగుంట ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల నిరసన -
తెలంగాణ గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ ఇవ్వాళ (గురువారం) విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.డిసెంబర్ 15, 16న గ్రూప్-2 పరీక్షలుఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహణడిసెంబర్ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1డిసెంబర్ 15న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్-2డిసెంబర్ 16న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3డిసెంబర్ 16న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్-4మొత్తం 783 గ్రూప్- 2 పోస్టుల భర్తీకి షెడ్యూల్ ప్రకారమైతే.. ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే..డీఎస్సీ, గ్రూప్ -2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో వాయిదా పడ్డాయి. దీంతో గ్రూప్-2 పరీక్షల కొత్త షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించారు. రాష్ట్రంలో గ్రూప్ -2 ఉద్యోగాలకు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. -
తెలంగాణ గ్రూప్-2 ఎగ్జామ్ వాయిదా
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా పడింది. అభ్యర్థుల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం.. డిసెంబర్‌కు పరీక్షను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నాం అధికారికంగా ప్రకటించింది.ఆగష్టు 7, 8వ తేదీల్లో షెడ్యూల్ ప్రకారం పరీక్ష జరగాల్సి ఉంది. అయితే.. డీఎస్సీ పరీక్షలు పూర్తి కాగానే వెంటనే గ్రూప్ పరీక్షలు ఉండటం తో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తొలుత పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. అభ్యర్థుల ఆందోళనలు ఉధృతం కావడంతో వాయిదాకే మొగ్గు చూపించింది. ఇదిలా ఉంటే.. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన చేసింది. కానీ వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా డిసెంబర్‌కు వాయిదా వేస్తూ.. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు వెల్లడించింది.మరోవైపు ఉద్యోగాభ్యర్థులతో సెక్రటేరియెట్‌లో ప్రభుత్వం చర్చలు జరిపింది. చర్చలు జరుగుతుండగానే.. వాయిదా ప్రకటన వెలువడడం గమనార్హం. గ్రూప్ 2 పోస్టులు పెంచుతాం అనే అంశం పై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు.గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని అడిగితే ప్రభుత్వం సానుకూలంగా స్పందించారు.డిసెంబర్ నెలలో గ్రూప్ 2 పెట్టాలని అడిగాం ప్రభుత్వం ఒకే అన్నది.మా డిమాండ్ల పై సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు.:::గ్రూప్ -2 అభ్యర్థులు గ్రూప్ 2, 3 వాయిదాకు ప్రభుత్వం అంగీకరించింది.త్వరలో మళ్ళీ పరీక్షల నిర్వహణ పై తేదీలు ప్రకటిస్తుంది.విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం ఇది కాదు..ఇది ప్రజా ప్రభుత్వం.:::ఎంపీ మల్లు రవి DSC పోస్టుల పై విద్యార్థులు పలు విజ్ఞప్తులు చేశారు.DSC ప్రాంతేతర అంశాల త్వరలో చర్చలు జరుపుతం అని సిఎం అన్నారు.8ఏళ్లుగా BRS విద్యార్థులకు అన్యాయం చేసింది. :::ఎంపీ బలరాం నాయక్ గత విద్యార్థులను కనీసం పట్టించుకోలేదుఇది ప్రజా ప్రభుత్వం అందుకే విద్యార్థులతో మాట్లాడింది.నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నిరుద్యోగుల సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది.ఇది విద్యార్థి ప్రభుత్వం.:::ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ -
సచివాలయాన్ని ముట్టడించిన నిరుద్యోగలు
-
AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. పాలనాపరమైన కారణాలతో పరీక్ష వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో వెల్లడిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగాల్సి ఉంది. -
T20 World Cup 2024: ఇలా జరిగిందా.. సౌతాఫ్రికా పని గోవిందా..!
టీ20 ప్రపంచకప్ 2024లో అజేయ జట్టుగా ఉన్న సౌతాఫ్రికాకు ఏ జట్టుకు ఎదురుకాని కష్టం వచ్చి పడింది. ఆ జట్టు ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడితే ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించే ప్రమాదంలో పడుతుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో గెలిచినా సెమీస్ అవకాశాలు ఇంకా సంక్లిష్టంగానే ఉన్నాయి. ఆ జట్టు సూపర్-8లో తమ చివరి మ్యాచ్‌లో ఓడితే ఏకంగా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది.గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌లు.. సూపర్-8లో రెండు మ్యాచ్‌లు గెలిచినా కేవలం ఒక్క ఓటమే సౌతాఫ్రికా కొంపముంచుతుంది. ఆ జట్టుకు ఇలాంటి అనుభవాలు కొత్త కానప్పటికీ.. ఈసారి మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం మంచి జట్టు కలిగి ఉండి కూడా ప్రపంచకప్ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంటుంది.ఇలా జరిగిందా..గ్రూప్-2లో భాగంగా సౌతాఫ్రికా రేపు (జూన్ 24) ఉదయం 6 గంటలకు (భారతకాలమానం ప్రకారం) జరుగబోయే మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓడి.. దీనికి ముందు జరిగే మ్యాచ్‌లో యూఎస్ఏపై ఇంగ్లండ్ 10 కంటే ఎక్కువ పరుగులు లేదా ఓవర్ మార్జిన్ తేడాతో గెలిస్తే.. వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరతాయి.అదెలా అంటే.. యూఎస్ఏపై ఇంగ్లండ్, సౌతాఫ్రికాపై వెస్టిండీస్ గెలిస్తే.. అప్పుడు మూడు జట్ల (వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా) ఖాతాల్లో తలో నాలుగేసి పాయింట్లు ఉంటాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ ఆధారంగా వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరతాయి. సౌతాఫ్రికా ఇంటిముఖం పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఇంగ్లండ్‌పై యూఎస్ఏ అయినా గెలవాలి లేదా విండీస్‌పై సౌతాఫ్రికా అయినా గెలవాలి. -
ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
-
APPSC Group 2 Prelims Result: గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి,విజయవాడ: గ్రూప్- 2 పరీక్ష ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం(ఏప్రిల్10) ప్రకటించింది. ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. జులై 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగనుందని తెలిపింది. 1:100 నిష్పత్తిలో గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. గత ఏడాది డిసెంబర్ 7న గ్రూప్ -2 నోటిఫికేషన్ జారీ అయింది. ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్ధాయిలో ఏడు వారాల్లో గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలీను ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్డ్ర వ్యాప్తంగా 899 పోస్టులకి గ్రూప్-2 పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొత్తం 4,04,037 మంది అభ్యర్ధులు గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షలు రాయగా 92 వేల మంది క్వాలిఫై అయ్యారు. త్వరలోనే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించనుంది. ఇదీ చదవండి.. వాలంటీర్లకు గాలం వేయడం నీ తరం కాదు -
Telangana: గ్రూప్ 1, 2, 3 పరీక్షల షెడ్యూల్ విడుదల
-
Telangana: గ్రూప్ 1, 2, 3 పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ బుధవారం విడుదల అయ్యింది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. అక్టోబర్ 21న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. అదే విధంగా నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్-1లో 563, గ్రూప్-2లో 783, గ్రూప్-3లో 1388 పోస్టుల భర్తీకి పరీక్షలు జరగనున్నాయి ముఖ్యమైన తేదీలు: అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నవంబర్ 17,18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షల -
APPSC Group-2: ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా పకడ్భందీ ఏర్పాట్ల మధ్య గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షల నిర్వహణను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షించారు. గ్రూప్-2 పరీక్షకు 4,83,535 అభ్యర్థులు దరఖాస్తు చేయగా 4,63,517 మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. పరీక్షలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదు. చిత్తూరు జిల్లాలో ఫేక్ అడ్మిట్ కార్డుతో పరీక్షకు హాజరైన ఒకరిని పట్టుకున్నారు. నకిలీ హాల్ టికెట్ తయారు చేసిన వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఏ ఉద్దేశంతో నకిలీ హాల్ టికెట్లతో పరీక్ష రాసేందుకు యత్నించారనే అంశంపై పోలీసులు విచారిస్తున్నారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫలితాలు వీలైనంత త్వరలో విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. జూన్, జూలైలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందన్నారు. మార్చి 17న గ్రూప్-1 పరీక్షను పకడ్భందీగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఇంటర్ పరీక్షల వల్ల గ్రూప్-1 పరీక్షకు సెంటర్లకు కొరత వచ్చే అవకాశం లేదన్నారు. గ్రూప్-1 పరీక్షను వాయిదా వదంతులు ఎవరూ నమ్మొద్దన్నారు. పరీక్షలు వాయిదా పడతాయనే వదంతులు నమ్మకుండా అభ్యర్థులు ప్రిపేర్ కావాలన్నారు. -
AP: నెలాఖరులో గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు
సాక్షి, విజయవాడ: ఈ నెలాఖరులోపు గ్రూప్ 1, గ్రూప్ -2 నోటిఫికేషన్లు ఇస్తామని, గ్రూప్-1లో 100, గ్రూప్-2 లో 900 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో నిర్వహించాలనుకుంటున్నామని చెప్పారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2022 గ్రూప్ వన్ ప్రక్రియను రికార్డుస్ధాయిలో తొమ్మిది నెలల్లో పూర్తి చేశామని గుర్తు చేశారు. ఈ గ్రూప్ వన్ ప్రక్రియ కూడా తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో రెండు పేపర్ల స్ధానంలో ఒకే పేపర్ ఉంటుందని తెలిపారు. గ్రూప్ వన్ మెయిన్స్ లో అయిదు పేపర్లకు బదులు నాలుగే ఉంటాయన్నారు. ఇందులో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ తరహాలో, రెండు పేపర్లు డిస్క్రిప్షన్ తరహాలో ఉంటాయని చెప్పారు. లాంగ్వేజ్ లో రెండు పేపర్లకి బదులు ఒక పేపర్ మాత్రమే ఉంటుందన్నారు. సిలబస్ లో ఎటువంటి మార్పులు ఉండవన్నారు. నిరుద్యోగ అభ్యర్ధులకు మేలు చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. యూపీఎస్సీ, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్లలో పరీక్షలను పరిశీలించిన తర్వాతే మార్పులు చేశామన్నారు. డిసెంబర్ లో 2200 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలోనే పరీక్షలు జరిపి జనవరిలో ఫలితాలు వెల్లడిస్తామన్నారు. APPSC Group-1&2 ఉద్యోగాల స్డడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్, ప్రీవియస్ పేపర్స్, ఆన్లైన్ టెస్టులు, సక్సెస్ స్టోరీల కోసం క్లిక్ చేయండి -
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నిరుద్యోగులకు వీలైనంత మేలు చేయాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనకి అనుగుణంగా గ్రూప్-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతంలోనే గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీవో జారీ చేసింది. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగుల అభ్యర్థనకు సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎం జగన్ ఆదేశాలతో అన్ని విభాగాలను మరోసారి ఖాళీల వివరాలని తెప్పించుకున్న జీఎడీ.. పరిశీలన తర్వాత అదనంగా 212 పోస్టులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే మొత్తం 720 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. చదవండి: దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ సాక్షి తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి -
ప్రవల్లిక కేసులో కోత ట్విస్ట్..
-
కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రవల్లిక లెటర్
-
సంచలన విషయాలుబయటపెట్టిన గ్రూప్-2 ప్రవళిక అన్నయ్య
-
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్స్ పోస్ట్‌ల భర్తీకి ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గ్రూప్- 1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు గ్రూప్-1లో 89 పోస్ట్‌లు, గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి ఈరోజు (ఆగస్ట్ 28) ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షలను నిర్వహించనుంది. -
కాసేపట్లో గ్రూప్-2 పరీక్షలపై హైకోర్టులో విచారణ
-
గ్రూప్-2 వాయిదా వేయండి.. టీఎస్పీఎస్సీ ముట్టడి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. ఆగష్టు 29, 30తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కార్యాలయాన్ని ముట్టడించడంతో ఉద్రిక్తత చోటు చేసుకోగా.. భారీగా ట్రాఫిక్ ఝామ్ అయ్యింది. ఇప్పటికే గ్రూప్ - 1 ప్రిలిమ్స్, గ్రూప్ 4 వంటి పరీక్షలను పూర్తి చేయగా.... గ్రూప్ - 2 నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. పేపర్ లీకేజీ వ్యవహారంతో బోర్డు ప్రతిష్ట మసకబారిపోగా.. ఇక నుంచైనా అప్రమత్తంగా ఉండాలని భావిస్తోంది. గ్రూప్-2 పరీక్షా కేంద్రాలకు కేటాయించిన ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోజుల్లో మిగతా ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్, కాలేజీలు యధావిధిగా నడుస్తాయని స్పష్టం చేసింది. మరోవైపు.. జీవో నెంబర్ 46 రద్దు కోరుతూ డీజీపీ కార్యాలయం ఎదుట కానిస్టేబుల్ అభ్యర్థులు సైతం ధర్నా చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. -
AP: ఉద్యోగాల వెల్లువ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరోసారి ఉద్యోగాల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం నగారా మోగించింది. కీలకమైన గ్రూప్–1, గ్రూప్–2కు సంబంధించి మొత్తం 1,000 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో గ్రూప్–1 పోస్టులు 100కాగా గ్రూప్–2 పోస్టులు 900 ఉన్నాయి. ఈ మొత్తం పోస్టుల భర్తీకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఉదయం గ్రూప్–1, 2 పోస్టుల భర్తీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని అధికారులు సీఎంకు వివరించారు. త్వరితగతిన ఈ పోస్టులను భర్తీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నోటిఫికేషన్ల జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని అధికారులు ఆయనకు తెలిపారు. వీలై నంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేయాలని సీఎం సూచించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర అంశాలపైనా దృష్టి సారించాలని ఆదేశించారు. బాబు పాలనంతా బూడిదే.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఐదేళ్లపాటు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. సరిగ్గా సాధారణ ఎన్నికలకు ముందు 2018 డిసెంబర్లో మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చారు. వీటి భర్తీకి పరీక్షలు కూడా నిర్వహించే సమయం లేకుండా కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ఈ వ్యవహారమని అప్పట్లోనే విద్యావేత్తలు, అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేలా తొలి రోజు నుంచే అడుగులు ముందుకు వేశారు. ఏపీపీఎస్సీ ద్వారా కూడా వేలాది పోస్టులను ఈ నాలుగేళ్లలో భర్తీ చేయించారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ న్యాయవివాదాల్లో చిక్కుకొని.. నిరుద్యోగులకు ఉద్యోగాలు అందని ద్రాక్షలా మారగా వాటన్నింటినీ పరిష్కరింపజేశారు. అంతేకాకుండా వాటిని భర్తీ చేయించారు. ఏపీపీఎస్సీ ద్వారానే ఈ నాలుగేళ్లలో 5 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. కీలకమైన గ్రూప్–1తో సహా ఇతర పోస్టులూ వీటిలో ఉన్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 4.5 లక్షల ఉద్యోగులు ఉండగా ఇప్పుడు వారి సంఖ్య 6 లక్షలకు పెరిగిందంటే ఏ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరిగిందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు, ఇతర సంస్థల్లో 15 నుంచి 20 లక్షల ఉద్యోగాలు యువతకు లభించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ ) రంగంలో ఉద్యోగాలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో 1.10 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉండగా ఒక్కోదానిలో కనీసంగా 10 మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించాయి. వలంటీర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పోస్టుల్లోనూ.. గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వ పథకాల లబ్ధిని అందించడానికి ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున ప్రభుత్వం గ్రామ, వార్డు వలంటీర్లను నియమించింది. మొత్తం 2.65 లక్షల మందికి గౌరవ వేతనం అందిస్తూ ఉపాధి కల్పించింది. అలాగే గతంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. ప్రైవేటు సంస్థలకు గుత్తాధిపత్యం ఇవ్వడం వల్ల వారికి ఉద్యోగ భద్రత, సరైన వేతనాలు అందేవి కావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కాంట్రాక్టు పోస్టులతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్నే ఏర్పాటు చేయించారు. బ్రోకర్లు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వారికి పూర్తి వేతనాలు చెల్లించడంతోపాటు ఈఎస్ఐ వంటి సదుపాయాలూ కల్పించారు. వీరికి అరకొర వేతనాలు ఉండగా జీతాలను భారీగా పెంచారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఏకంగా మినిమమ్ టైమ్ స్కేల్‌ను అమల్లోకి తెచ్చారు. ఫలితంగా ఆ ఉద్యోగులకు ఎంతో న్యాయం జరిగింది. చదువులు పూర్తవగానే ఉద్యోగాలు సాధించేలా శిక్షణ రాష్ట్రంలో విద్యార్థులను పూర్తి నైపుణ్యాలతో తీర్చిదిద్ది.. వారు చదువులు పూర్తిచేసి బయటకు రాగానే ఉద్యోగాలు సాధించేలా సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు చదువుతున్నప్పుడే వారికి అనేక ప్రతిష్టాత్మక సంస్థలతో శిక్షణ ఇప్పించి నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నారు. డిగ్రీ కోర్సుల్లోనూ ఇంటర్న్‌షిను తప్పనిసరి చేయించారు. డిగ్రీలో చేరే విద్యార్థులు కూడా పది నెలలు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసేలా కోర్సులను అమలు చేయిస్తున్నారు. విద్యార్థులు పూర్తిస్థాయిలో నైపుణ్యం పొందేలా అధికారులు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకు రాష్ట్రంలోని అన్ని కళాశాలలను వివిధ పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న 27,119 సంస్థలతో అనుసంధానించారు. శిక్షణ సమయంలోనే ఉద్యోగాలు.. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కోసం రాష్ట్రంలోని మైక్రో స్థాయి నుంచి మెగా పరిశ్రమల వరకు ఉన్నత విద్యా మండలి వాటిని విద్యా సంస్థలతో అనుసంధానం చేసింది. తయారీ, సేవా రంగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ సమయంలో మంచి పనితీరు కనబరిచేవారికి ఆ కంపెనీలే ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా 2018లో రాష్ట్రంలో ఏడాదికి 37 వేల మందికి మాత్రమే అవకాశాలు దక్కగా ఆ తర్వాత నుంచి ప్లేస్‌మెంట్స్‌లో భారీ వృద్ధి నమోదైంది. 2019–20లో 52 వేలకు, 2020–21లో 69 వేలకు, 2021–22లో 85 వేలకు ప్లేస్మెంట్లు పెరిగాయి. ఇక ఈ విద్యాసంవత్సరంలో 1.20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే ట్రిపుల్ ఐటీల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా భారీగా డిమాండ్ పెరిగింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో వీరికి ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. 2020–21 వరకు మొత్తం 13,208 మంది విద్యార్థులు నియామకాల కోసం నమోదు చేసుకున్నారు. వీరిలో 5,111 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభించాయి. ట్రిపుల్ ఐటీ నూజివీడు క్యాంపస్‌లో 2,610 మందికి, ఆర్కే వ్యాలీలో 2,501 మందికి ఐటీ కంపెనీలు కొలువులు ఇచ్చాయి. టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో, అలక్రిటీ, ఏడీపీ, అచలా, పర్పుల్ టాక్, పర్పుల్ కామ్, సెలెక్ట్, నుక్కడ్ షాప్స్, సెవ్యా, సినాప్సిస్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంటేషన్, రాంకీ, ఆర్వీ, హెటిరో, అటిబిర్, అమర్‌రాజా తదితర కంపెనీల్లో విద్యార్థులకు ఉద్యోగాలు దక్కాయి. అనలాగ్ డివైసెస్, ఫ్రెష్ డెస్క్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, సినాప్సిస్, జేవోటీటీఈఆర్, థాట్ వర్క్స్, ఏడీపీ, మేథ్ వర్క్స్, గోల్డెన్ హిల్స్ సంస్థలు అత్యధిక వేతనాలు అందించాయి. చదవండి: ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్ విడుదల -
తెలంగాణ గ్రూప్-2 పరీక్షల తేదీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-2 పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 29,30న గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు వారం ముందు నుంచే హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెల్లడించింది. ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పరీక్షా తేదీని నిర్ణయించామని అధికారులు పేర్కొన్నారు. కాగా, తెలంగాణలో గ్రూప్-2 పోస్టులకు సంబంధించి 783 పోస్టులకు గానూ 5,51,943 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. జనవరి 18 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించగా.. చివరి మూడు రోజుల్లోనే 1.10లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-2 పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు. చదవండి: నవీన్ హత్య కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన హసన్ -
రాణించిన నెదర్లాండ్స్ బ్యాటర్లు.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?
టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-2లో ఇవాళ (నవంబర్ 6) అత్యంత కీలకమైన మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలుత సౌతాఫ్రికా-నెదర్లాండ్స్, ఆతర్వాత పాకిస్తాన్-బంగ్లాదేశ్, భారత్-జింబాబ్వే జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెమీస్ రేసులో నిలిచిన భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్లకు ఈ మ్యాచ్‌లు అత్యంత కీలకంగా మారాయి. అడిలైడ్ వేదికగా భారతకాలమానం ప్రకారం ఉదయం 5:30 గంటలకు ప్రారంభమైన సౌతాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. స్టెఫాన్ మైబుర్గ్ (37), మ్యాక్స్ ఓడౌడ్ (29), టామ్ కూపర్ (35), కొలిన్ ఆకెర్మన్ (41 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించడంతో నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టగా.. అన్రిచ్ నోర్జే, ఎయిడెన్ మార్క్రమ్లకు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ అనంతరం ఇదే వేదికపై 9:30 గంటలకు పాకిస్తాన్-బంగ్లాదేశ్ తలపడనున్నాయి. సెమీస్ బెర్త్‌పై అరకొర ఆశలున్న పాకిస్తాన్ ఈ మ్యాచ్‌లో తప్పనసరిగా గెలవాల్సి ఉంది. ఇక, భారత్-జింబాబ్వే మ్యాచ్ విషయానికొస్తే.. మెల్బోర్న్ వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే, గ్రూప్-2లో అగ్రస్థానంతో సెమీస్‌కు దూసుకెళ్తుంది. -
T20 WC 2022: గండాలు దాటి.. నేరుగా టీమిండియా!
అప్డేట్: సూపర్-12లో నెదర్లాండ్స్.. సౌతాఫ్రికాను ఓడించడంతో టీమిండియా నేరుగా సెమీస్‌కు చేరుకుంది. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి పాకిస్తాన్ కూడా భారత్‌తో పాటు గ్రూప్-2 నుంచి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. టీ20 వరల్డ్‌కప్-2022లో గ్రూప్-1 సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఇక మిగిలింది గ్రూప్-2 బెర్త్‌లు. ఈ గ్రూప్ నుంచే ముందుగా సెమీస్ బెర్త్‌లు ఖరారవుతాయనుకుంటే, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు అనూహ్య విజయాలు సాధించి సెమీస్ రేసును రసవత్తరంగా మార్చాయి. రేపు (నవంబర్ 6) జరుగబోయే మ్యాచ్‌లతో ఈ గ్రూప్ సెమీస్ బెర్తులపై క్లారిటీ రానుంది. ప్రస్తుత సమీకరణలు, ఆయా జట్ల ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే.. రేపు జరుగబోయే మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్‌ను, భారత్.. జింబాబ్వేను, పాకిస్తాన్.. బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మొదటి రెండు మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా, టీమిండియా విజయాలు సాధిస్తే, ఆఖరి మ్యాచ్‌లో పాకిస్తాన్.. బంగ్లాదేశ్‌పై గెలిచినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. గ్రూప్-2 నుంచి అగ్రస్థానంలో భారత్, రెండో స్థానంతో సౌతాఫ్రికా సెమీస్‌కు చేరతాయి. పాకిస్తాన్ ఇంటిబాట పడుతుంది. రేపటి మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్, జింబాబ్వే జట్లతో ఏదో ఒకటి సంచలన విజయం సాధిస్తే తప్పా.. పై సమీకరణల్లో ఎలాంటి మార్పు ఉండదు. కాగా, ఫైనల్ ఫోర్ జట్లపై ఓ అంచనాకు రావడంతో సెమీస్‌లో ఏయే జట్లు తలపడబోతున్నాయన్న అంశంపై ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా టీమిండియా సెమీస్ చేరితే ఏ జట్టుతో తలపడాల్సి వస్తుందో అన్న టెన్షన్ ఫ్యాన్స్‌లో ఇప్పటినుంచే మొదలైంది. గ్రూప్-1 బెర్తులు ఎలాగూ ఖరారయ్యాయి కాబట్టి భారత్.. న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లలో ఏదో ఒక జట్టుతో తలపడాల్సి ఉంటుంది. రేపటి మ్యాచ్‌లో టీమిండియా.. జింబాబ్వేపై గెలిస్తే ఇంగ్లండ్‌తో, ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైతే న్యూజిలాండ్‌ను ఢీకొట్టాల్సి ఉంటుంది. -
T20 WC 2022: అదే జరిగింది.. భారత్, పాక్ సెమీస్‌కు..!
అప్డేట్: ఐసీసీ ప్రపంచకప్-2022 సూపర్-12లో ఆఖరి రోజైన ఆదివారం (నవంబరు 6) నెదర్లాండ్స్ చేతిలో ఓడిన సౌతాఫ్రికా ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో టీమిండియా నేరుగా సెమీస్‌కు అర్హత సాధించగా.. నామమాత్రపు మ్యాచ్‌లో జింబాబ్వేపై ఘన విజయం నమోదు చేసింది. మరోవైపు పాకిస్తాన్.. బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ICC Mens T20 World Cup 2022 : టీ20 వరల్డ్‌కప్-2022 కీలక దశకు చేరింది. గ్రూప్-1 నుంచి తొలి సెమీస్ బెర్త్ (న్యూజిలాండ్) ఇదివరకే ఖరారు కాగా, శనివారం రెండో స్థానంపై క్లారిటీ వచ్చింది. శ్రీలంకతో కీలక మ్యాచ్‌లో గెలుపొందిన ఇంగ్లండ్ సెమీస్‌లో అడుగుపెట్టింది. లంకపై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన బట్లర్ బృందం.. గ్రూప్-1 నుంచి రెండో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించింది. ఇక గ్రూప్-2 విషయానికొస్తే.. తొలుత ఈ గ్రూప్ నుంచి సెమీస్ బెర్త్‌లు ఈజీగా ఫైనల్ అవుతాయని అంతా ఊహించారు. అయితే చిన్న జట్లైన జింబాబ్వే, బంగ్లాదేశ్‌ల నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురుకావడంతో సెమీస్ రేసు రసవత్తరంగా మారింది. ఈ గ్రూప్‌లో ఇప్పటివరకు (నవంబర్ 5) అన్ని జట్లు చెరో 4 మ్యాచ్‌లు ఆడగా.. నెదర్లాండ్స్ అధికారికంగా, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు అనధికారికంగా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. పోతే.. సెమీస్ రేసులో మిగిలింది మూడు జట్లు. భారత్ (6 పాయింట్లు, +0.730), సౌతాఫ్రికా (5 పాయింట్లు, +1.441), పాకిస్తాన్ (4 పాయింట్లు, +1.117). ప్రస్తుత సమీకరణలు, అంచనాల ప్రకారమయితే భారత్, సౌతాఫ్రికా సునాయాసంగా సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. భారత్, దక్షిణాఫ్రికా తమ ఆఖరి మ్యాచ్‌ల్లో ఎదుర్కొనబోయే జట్లు (జింబాబ్వే, నెదర్లాండ్స్) చిన్నవి కాబట్టి, పై సమీకరణలు వర్కౌట్ అవుతాయని అందరూ అంచనా వేస్తున్నారు. ఇదే జరిగి.. సెమీస్ రేసులో ఉన్న మరో జట్టు పాక్.. తమ ఆఖరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారీ తేడాతో గెలిచినా ఎటువంటి ఉపయోగం ఉండదు. అయితే, పరిస్థితులు తలకిందులై ఏవైనా సంచలనాలు నమోదైందయ్యాయంటే మాత్రం అన్నీ ఒక్కసారిగా తారుమారవుతాయి. సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్ చేతిలో ఓడినా, భారత్.. జింబాబ్వే చేతిలో ఓడినా.. ఇవి జరిగి పాక్.. బంగ్లాపై భారీ విజయం సాధిస్తే.. గ్రూప్-2 నుంచి సెమీస్‌కు చేరే తొలి జట్టుగా పాకిస్తాన్, రెండో జట్టుగా భారత్ నిలుస్తాయి. ఒకవేళ సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్‌పై గెలిచి, పాకిస్తాన్.. బంగ్లాదేశ్‌పై భారీ తేడాతో గెలిచి, టీమిండియా.. జింబాబ్వే చేతిలో ఓడిందా సౌతాఫ్రికా, పాక్‌లు సెమీస్‌కు వెళ్తాయి. ఇన్ని సమీకరణల నడుమ గ్రూప్-2 నుంచి ఏ జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుందోనన్నది ఆసక్తికరంగా మరింది. -
జింబాబ్వే చేతిలో ఓడిపోవద్దు.. కష్టాలు కొనితెచ్చుకోవద్దు
ఇవాళ సౌతాఫ్రికాపై పాకిస్తాన్ గెలుపుతో గ్రూప్-2 సెమీస్ బెర్త్‌లు సంక్లిష్టంగా మారాయి. ఈ గ్రూప్ నుంచి భారత్, సౌతాఫ్రికాలు ఏ బాదరబందీ లేకుండా సెమీస్‌కు చేరతాయనుకుంటే పాక్ గెలుపుతో సమీకరణలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. చిన్న జట్టైన నెదార్లాండ్స్‌తో చివరి మ్యాచ్ ఆడాల్సి ఉండటంతో సౌతాఫ్రికా స్థానానికి ఎలాంటి ఢోకా లేనప్పటికీ.. టీమిండియానే ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వేపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్‌పై గెలిస్తే తొలి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకోనుండగా.. మరో బెర్తు కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంటుంది. ఏమాత్రం అటుఇటు జరిగి భారత్.. జింబాబ్వే చేతిలో ఓడినా.. పాక్.. తమ చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారీ తేడాతో గెలిచినా.. మెరుగైన రన్‌రేట్ ఆధారంగా పాకిస్తానే సెమీస్‌కు వెళ్తుంది. కాబట్టి.. భారత్ ఎట్టి పరిస్థితుల్లో జింబాబ్వేపై గెలిస్తేనే పాక్‌తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. భారత్.. జింబాబ్వేపై గెలిచి, పాకిస్తాన్.. బంగ్లాదేశ్‌పై భారీ తేడాతో గెలిచి, సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్ చేతిలో ఓడిందంటే భారత్, పాక్‌లు సెమీస్‌కు చేరకుంటాయి. అయితే ఇది అంతా ఆషామాషీ విషయం కాదు. గ్రూప్-2 నుంచి సెమీస్ రేసులో ఉన్న భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్ల పాయింట్ల వివరాలు.. భారత్.. 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఓ పరాజయంతో 6 పాయింట్లు (రన్‌రేట్=0.730) సౌతాఫ్రికా.. 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ పరాజయం, ఓ మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో 5 పాయింట్లు (రన్‌రేట్=1.402) పాకిస్తాన్..4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 2 పరాజయాలతో 4 పాయింట్లు (రన్‌రేట్=1.085) -
ఏపీలోని గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో అవకాశం
సాక్షి, అమరావతి: గ్రూప్–2 పోస్టుల భర్తీ కోసం గతంలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించి కోర్టు ఆదేశాల ప్రకారం సవరించిన అర్హుల జాబితాలోని అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు మరో అవకాశం కల్పిస్తున్నట్టు ఏపీపీఎస్సీ శుక్రవారం తెలిపింది. చదవండి: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్ల షెడ్యూల్ ఇదే.. అప్పట్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన, బయోడేటా సమర్పణకు కొంతమంది హాజరు కాలేకపోయారని పేర్కొంది. వారు ఈ నెల 5న విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన, బయోడేటా వివరాల సమర్పణకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరింది. -
గుడ్‌న్యూస్: గ్రూప్ 1, గ్రూప్ 2 కు ఇంటర్వ్యూ మార్కులూ తొలగింపు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలకు స్వస్తి పలికిన రాష్ట్ర ప్రభుత్వం.. పరీక్షల్లో ఆ మేర మార్కులనూ తగ్గించాలని భావిస్తోంది. ఇప్పటివరకు అన్ని పేపర్లతోపాటు ఇంటర్వ్యూ మార్కులు కలిపి ఉండే గరిష్ట మార్కులు ఉండగా.. ఇక ముందు కేవలం రాతపరీక్షల మొత్తమే గరిష్ట మార్కులు కానున్నాయి. ఈ క్రమంలో గ్రూప్–1 పరీక్ష మొత్తంగా 900 మార్కులకు, గ్రూప్–2 పరీక్ష మొత్తంగా 600 మార్కులకే ఉండనున్నాయి. ఈ మేరకు నియామక సంస్థలు పరీక్షా విధానానికి సంబంధించిన ప్రక్రియను దాదాపు కొలిక్కి తీసుకువచ్చాయి. చదవండి👉వీఆర్ఏల ఆగం బతుకులు.. కార్లు కడుగుడు.. బట్టలు ఉతుకుడు రాతపరీక్షే ఆధారం.. గ్రూప్–1, గ్రూప్–2 కొలువులకు, వైద్యారోగ్య సంస్థల్లో మెడికల్ ఆఫీసర్, ఆపైస్థాయిలో నేరుగా చేపట్టే నియామకాలకు ఇంటర్వ్యూలు, గురుకుల విద్యాసంస్థల్లో బోధన పోస్టులకు సంబంధించి డెమో రౌండ్ ఇప్పటివరకు కీలకంగా ఉండేవి. నియామకాల్లో జాప్యాన్ని నివారించడం, అవకతవకలకు అవకాశం లేకుండా చేయడం కోసం వీటిని రద్దుచేసి, రాతపరీక్షల ఆధారంగానే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయా ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష విధానంలో మార్పులపై నియామక సంస్థలు దృష్టి సారించాయి. ఇంటర్వ్యూలను రద్దు చేయడంతోపాటు వాటికి సంబంధించిన మార్కులను కూడా తొలగిస్తేనే మంచిదన్న ప్రతిపాదన చేశాయి. దీనిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. తగ్గనున్న మార్కులు ► ఇదివరకు గ్రూప్–1 పరీక్షను మొత్తంగా 1000 మార్కులకు నిర్వహించేవారు. అందులో 900 మార్కులకు వివిధ రాతపరీక్షలు, ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉండేవి. ఇక గ్రూప్–2 పరీక్షను 675 మార్కులకు నిర్వహించగా.. అందులో 75 మార్కులు ఇంటర్వ్యూలకు ఉండేవి. ఇప్పుడు ఇంటర్వ్యూల మార్కులను తొలగిస్తే.. గ్రూప్–1 పరీక్ష 900 మార్కులకు, గ్రూప్–2 పరీక్షను 600 మార్కులకే నిర్వహించే అవకాశం ఉంది. ► ప్రస్తుతం గురుకుల విద్యాసంస్థల్లో పీజీటీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ నియామకాల్లో రాతపరీక్షలతోపాటు డెమో (ప్రత్యక్ష బోధన పరీక్ష) ఉంది. ప్రభుత్వం గ్రూప్స్ పరీక్షలకు ఇంటర్వ్యూలను తొలగించడంతో డెమో విధానానికి స్వస్తి పలకాలని అధికారులు భావిస్తున్నారు. ► ఇప్పటివరకు వైద్యారోగ్య విభాగంలోని కొన్నిపోస్టులకు కేవలం ఇంటర్వ్యూల ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేస్తూ వచ్చారు. ఈసారి ఆయా పోస్టుల నియామకాలకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టడంపై బోర్డు కసరత్తు చేస్తోంది. సిలబస్‌లో మార్పులు లేనట్టే! ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూల రద్దుతో పరీక్ష విధానంలో మార్పులు అనివార్యమయ్యాయి. అయితే పరీక్షల సిలబస్‌లో మార్పులు అవసరం లేదని నియామక సంస్థలు భావిస్తున్నాయి. అయితే ఇంటర్వ్యూలు తొలగించినందున.. ఆయా సామర్థ్యాలకు సంబంధించిన అంశాలను రాతపరీక్షలో చేర్చే ప్రతిపాదన కూడా ఉంది. చదవండి👉 ఇంటర్వ్యూ రద్దుతో ‘రాత’ మారేనా! -
ఇంటర్వ్యూ రద్దుతో ‘రాత’ మారేనా!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూల రద్దుతో పలురకాల పోస్టుల భర్తీలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. నిర్దేశించిన పోస్టులకు ఇప్పటివరకు ఇంటర్వ్యూలతో కలిపి అర్హతల నిర్ధారణ జరిగేది. కానీ ప్రస్తుతం మౌఖిక పరీక్షల భాగాన్ని ప్రభుత్వం తొలగించడంతో పరీక్ష విధానంలో మార్పులపై నియామక సంస్థలు తర్జనభర్జన పడుతున్నాయి. ఇంటర్వ్యూల రద్దుతో ఆ భాగానికి (పార్ట్) నిర్దేశించిన మార్కులు తొలగించాలా? లేక ఆ మార్కులను రాత పరీక్షలో కలపాలా? అనే అంశంపై కసరత్తు ప్రారంభించాయి. మరోవైపు ఇంటర్వ్యూ తొలగింపుపై విద్యారంగ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం గమనార్హం. రెండు కేటగిరీల్లోనే కాదు.. ఇంటర్వ్యూల నిర్వహణ కేవలం గ్రూప్ ఉద్యోగాలకే పరిమితం కాలేదు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాలతో పాటు తెలంగాణ రాష్ట్ర మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టే వైద్యుల నియామకాలు, తెలంగాణ గురుకుల నియామకాల బోర్డు ద్వారా ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి, తదితరాలకు కూడా ఇంటర్వ్యూలు ఉన్నాయి. మరోవైపు జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు డెమో పరీక్షలు (తరగతి గదిలో పాఠాలు చెప్పడం) నిర్వహిస్తున్నారు. ఈ డెమో పరీక్షలు కూడా ఇంటర్వ్యూ విధానంలోకే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియలో పలు రకాల మార్పులు అనివార్యం కానున్నట్లు స్పష్టమవుతోంది. అర్హత పరీక్ష తప్పనిసరి తెలంగాణ రాష్ట్ర మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు, వైద్య, ఆరోగ్యశాఖ నిర్వహించే వైద్యుల నియామకాల్లో కొన్నింటికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా అర్హతలు నిర్ధారించుకుంటున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ రద్దు చేస్తే ఈ నియామకాలకు అర్హత పరీక్ష తప్పనిసరి కానుంది. దీంతో వారికి ప్రత్యేకంగా సిలబస్‌ను రూపొందించి పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు తెలంగాణ గురుకుల నియామకాల బోర్డు ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో ప్రిన్స్‌పల్, జేఎల్, డీఎల్ నియామకాల ప్రక్రియలోనూ మార్పులు తప్పవని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంటర్వ్యూ, డెమోకు బదులుగా ఇతర కేటగిరీల్లో వారి సామర్థ్యాలను పరిశీలించాలని బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. వేగం..పారదర్శకత వివిధ పోస్టులకు నిర్వహించే ఇంటర్వ్యూలకు సగటున అరగంట సమయం పడుతున్నట్లు బోర్డుల వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం గ్రూప్–1 కేటగిరీలో 503 పైగా ఉద్యోగాలున్నాయి. మెయిన్ పరీక్షల అనంతరం 1:3 పద్ధతిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిస్తే 1,509 మందిని ఇంటర్వ్యూ చేయాలి. ఒక్కో అభ్యర్థిని అరగంట చొప్పున రోజుకు కనీసం 25 మందిని ఇంటర్వ్యూ చేసినా ఈ ప్రక్రియ పూర్తికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. ఇక గ్రూప్–2 కేటగిరీలో పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో వేలల్లో అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇంటర్వ్యూల నిర్వహణ నియామక సంస్థలకు భారంగా మారుతోంది. ఈ పరిస్థితిని నివారించడం ద్వారా నియామకాల్లో వేగం పెంచడంతో పాటు అవకతకవకలకు ఆస్కారం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసిందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇంటర్వ్యూ సిలబస్ రాత పరీక్షలో.. గ్రూప్–1 ఉద్యోగ నియామకాల్లో ప్రస్తుతం మూడు అంచెల్లో నియామక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు 900 మార్కులు, ఇంటర్వ్యూకు 100 మార్కులున్నాయి. ఇంటర్వ్యూ రద్దుతో 100 మార్కులు తొలగించినప్పటికీ.. ఇంటర్వ్యూకు నిర్దేశించిన సిలబస్‌ను రాత పరీక్షలో కలపనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాత పరీక్ష సిలబస్‌లో మార్పులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతమున్న సిలబస్‌ను 2015లో విషయ పరిజ్ఞానం ఉన్న నిష్ణాతులతో కూడిన కమిటీ నిర్ణయించింది. ఇక గ్రూప్–2 నియామకాలకు పార్ట్–ఏ కింద ఆబ్జెక్టివ్ విధానంలో నాలుగు పేపర్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకు 600 మార్కులు ఉన్నాయి. పార్ట్–బీలో ఇంటర్వ్యూకు 75 మార్కులున్నాయి. ప్రస్తుతం ఇంటర్వ్యూకు మినహాయింపు ఇవ్వనుండడంతో అందుకు సంబంధించిన మార్కులు తొలగించి నాలుగు పేపర్లకు నిర్దేశించిన సిలబస్‌కు మరిన్ని అంశాలు అదనంగా జోడించే అవకాశం ఉంది. అపోహలు తొలగిపోతాయి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చేయడం మంచి పరిణామమే. ఇంటర్వ్యూలో అభ్యర్థి వ్యవహారశైలి, కమ్యూనికేషన్ సామర్ధ్యంతో పాటు విషయ పరిజ్ఞానాన్ని నేరుగా పరిశీలిస్తారు. కానీ చాలా మందిలో ఇంటర్వ్యూలపై అక్రమాలు జరుగుతాయని, పైరవీలకు ఆస్కారం ఉంటుందనే అపోహలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అపోహలు తొలగిపోతాయి. కేవలం మెరిట్ ఆధారంగా పూర్తి పారదర్శకంగా నియామకాలు జరుగుతాయనే నమ్మకం పెరుగుతుంది. అయితే అర్హత సాధించిన అభ్యర్థికి నియామక పత్రం ఇచ్చే ముందు జరిగే వైద్య పరీక్ష పక్కాగా నిర్వహిస్తే బాగుంటుంది. – ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్, ప్రిన్స్‌పాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓయూ అన్ని కేటగిరీల్లో పరిశీలించాల్సిందే.. రాష్ట్రస్థాయిలో ఉన్నత ఉద్యోగం అంటే గ్రూప్–1. ఈ నియామకాల్లో మౌఖిక పరీక్షలు ఉండడమే మంచిది. గ్రూప్–1 అధికారిపైన బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, శాఖాపరమైన కార్యక్రమాల నిర్వహణలో అతని పనితనం తెలియాలంటే అన్ని కేటగిరీల్లో అతని సామర్థ్యాలు పరిశీలించాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా అన్ని పరీక్షల్లో సామర్థ్యాలను చూడాలి. పైరవీల పేరిట సామర్థ్యాల పరిశీలనను కుదించడంతో సరైన అభ్యర్థుల ఎంపిక సాధ్యమవుతుందా అనేది ఆలోచించాలి. సివిల్స్‌లో ఇంటర్వ్యూ తప్పనిసరనే విషయం కూడా గమనంలోకి తీసుకోవాలి. – ప్రొఫెసర్ ఎన్.కిషన్, హెచ్ఓడీ, డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఓయూ -
రోజూ సైకిల్‌పై 18 కి.మీ. పయనం: గ్రూప్–2 విజేత
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: నాన్న చిరుద్యోగి.. ఆయన ప్రోత్సాహంతో ఎంత కష్టమైన 18 కిలోమీటర్లు రోజూ రాజమహేంద్రవరం వెళ్లి చదువుకున్నా.. ఇంటిలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగులు లేరని నాన్న అన్న మాట తనలో ప్రభుత్వం ఉద్యోగం సాధించాలన్న సంకల్పాన్ని దృఢపరిచింది. సచివాలయ సెక్రటరీ ఉద్యోగం వచ్చినా, ఇప్పుడు గ్రూప్–2లో ఈవోపీఆర్ అండ్ ఆర్డీగా విజయం సాధించగలిగినా నాన్న మాటలే స్ఫూర్తి అని అన్నారు రాయుడుపాకలు గ్రామానికి చెందిన దాసి చిన్నబ్బులు. రాయుడుపాకలు గ్రామానికి చెందిన ఒక ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగిగా పనిచేసే దాసి దేవదానం, వెంకటలక్ష్మిలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. చిన్నవాడైన చిన్నబ్బులు పదో తరగతి పాలచర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో, ఇంటర్ నుంచి ఎంఎస్సీ(ఆర్గానిక్), బీఎడ్ వరకు రాజమహేంద్రవరంలోనే చదివాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల నిత్యం 18 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లి వచ్చేవాడు. మన ఇంటిలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ లేరని తండ్రి దేవదానం అన్నమాట అతనికి స్ఫూర్తినిచ్చింది. దాంతో 2015 నుంచి గ్రూప్స్‌లో విజయం సాధించాలని కృషి చేశాడు. 2017లో జరిగిన గ్రూప్–2 పరీక్షల్లో రెండు మార్కుల తేడాతో అర్హత కోల్పోయాడు. అప్పుడు చాలామంది నీకు ఉద్యోగం రాదులే అని నిరుత్సాహపరిచారు. ఆ సమయంలో తండ్రి ప్రోత్సాహంతో 2019లో గ్రూప్–2, గ్రూప్–3లతో పాటు సచివాలయ ఉద్యోగాలు నోటిఫికేషన్లు అన్నీ ఒకేసారి వచ్చినప్పటికీ పక్కా ప్రణాళికతో నిబద్ధతతో చదివి పరీక్షలు రాసి విజయం సాధించాడు. వార్డు సచివాలయంలో శానిటేషన్ అసిస్టెంట్, గ్రేడ్–5 సచివాలయ సెక్రటరీ ఉద్యోగాలు వచ్చాయి. దీంతో కాతేరు గ్రామ సచివాలయం–2 సెక్రటరీగా విధుల్లో చేరారు. ఆ తరువాత గ్రూప్–3లో గ్రేడ్–4 పంచాతీ కార్యదర్శిగా ఉద్యోగం వస్తే వెళ్లలేదు. ఆ తరువాత గ్రూప్–2 పరీక్షల్లోను, ప్రిలిమినరీ, ఫైనల్ పరీక్షల్లో విజయం సాధించడంతో ఈవోపీఆర్ అండ్ ఆర్డీగా ఉద్యోగానికి నియమితుడయ్యాడు. తనకు గ్రూప్–1 సాధించడమే లక్ష్యమని దాసి చిన్నబ్బులు ఘంటాపథంగా చెబుతున్నారు. -
గ్రూప్ 2 ప్రొవిజనల్ లిస్ట్‌పై హైకోర్టు స్టే
సాక్షి,హైదరాబాద్ : గ్రూప్-2 కు సంబంధించిన ఫైనల్ ప్రొవిజనల్ లిస్ట్‌పై స్టే విధించినట్లు బుధవారం హైకోర్టు తెలిపింది .తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నియామకాలు చేపట్టారాదని టీఎస్‌పీఎస్సీనీ హైకోర్టు ఆదేశించింది. గతంలో గ్రూప్ 2 కేసులో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును దిక్కరిస్తూ టీఎస్పీఎస్సీ వ్యవహరించిందని గ్రూప్ 2 అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వైట్నర్, ట్యాంపరింగ్, స్క్రాచింగ్ చేసిన అభ్యర్థులను సెలక్ట్ చేయొద్దని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో గ్రూప్ 2 పరీక్షల్లో అందుకు సంబంధించిన జవాబులు తీసివేసి మిగిలిన వారికి ఇంటర్య్వూలలో 1:2 ప్రకారం నియామకాలు జరపాలని హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్లడించింది. అయితే తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు లెక్కచేయకుండా మళ్లీ అదే అభ్యర్థులను సెలక్ట్ చేసి ప్రొవిజనల్ లిస్ట్‌ను ప్రకటించింది. దీన్ని సవాలు చేస్తూ ఫైనల్ లిస్టుకు సెలక్ట్ కాని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు టీఎస్పీఎస్సీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నియామకాలు చేపట్టరాదని హైకోర్టు తెలిపింది. కాగా, తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. -
1,027 మందికి గ్రూప్–2 కొలువులు
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లుగా ఎదురు చూస్తున్న గ్రూప్–2 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. వివాదాలు, న్యాయ సమస్యలతో ఇన్నాళ్లూ ఆగిపోయిన పోస్టుల భర్తీ పూర్తయింది. 2015, 2016 సంవత్సరాల్లో జారీచేసిన గ్రూప్–2 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,032 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టగా అందులో 1,027 పోస్టులకు టీఎస్పీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది. 5 పోస్టులకు అభ్యర్థులు లభించకపోవడంతో వాటిని భర్తీ చేయలేదు. పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన కమిషన్ కార్యాలయంలో సమావేశం జరిగింది. అసలేం జరిగిందంటే.. గ్రూపు–2 పోస్టుల భర్తీకి అదే ఏడాది నవంబర్ 11, 13 తేదీల్లో రాత పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షల సమయంలో కొన్ని పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను ఒకరివి మరొకరికి ఇచ్చారు. దీనిని గుర్తించిన ఇన్విజిలేటర్లు వాటిని వెనక్కి తీసుకొని ఎవరి ఓఎంఆర్ షీట్లను వారికి ఇచ్చేశారు. అప్పటికే ఓఎంఆర్ షీట్ తీసుకున్న అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలను అందులో నమోదు చేశారు. తరువాత ఎవరి ఓఎంఆర్ షీట్లను వారికి ఇచ్చేయడంతో ఆ అభ్యర్థులు వైట్నర్ ఉపయోగించి తమ వ్యక్తిగత వివరాలను సరిదిద్దారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్లు కూడా టీఎస్పీఎస్సీకి నివేదికలు ఇచ్చారు. దీంతో టీఎస్పీఎస్సీ ఈ అంశంపై టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఘటనపై నివేదిక ఇచ్చింది. ఓఎంఆర్ షీట్లో వ్యక్తిగత సమాచారాన్ని తప్పుగా నమోదు చేసినందున, వైట్నర్ ఉపయోగించి సరిచేసిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలని, వైట్నర్ ఉపయోగించి పార్ట్–బీలోని జవాబులను కనుక దిద్దితే వాటిని పరిగణనలోకి తీసుకోవద్దని సిఫారసు చేసింది. దీని ఆధారంగా జవాబు పత్రాలను వాల్యుయేషన్ చేసింది. అందులో వైట్నర్ వాడిన 343 మంది సహా 3,147 మందికి 2017లో 1:3 నిష్పత్తి లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించింది. అయితే వైట్నర్ ఉపయోగించిన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించవద్దని కొంత మంది కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. వైట్నర్ ఉపయోగించిన వారిని తొలగించాలని తీర్పు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల మేరకు టీఎస్పీఎస్సీ వైట్నర్ ఉపయోగించిన 343 మందిని తొలగించి.. ఆ తర్వాత మెరిట్ లో ఉన్న 343 మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించింది. సింగిల్ జడ్జి తీర్పుపై వైట్నర్ ఉపయోగించిన బాధిత అభ్యర్థులు ధర్మాసనానికి అప్పీల్ చేసుకున్నారు. టెక్నికల్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని, పార్ట్–ఏలో వైట్నర్ ఉపయోగించిన వారిని పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. -
సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం
సాక్షి, అమరావతి: పారదర్శక విధానాలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దుచేయాలని నిర్ణయించారు. రాత పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ ఆధారంగా అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్ గురువారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణ, ఇంటర్వ్యూ విధానాలపై చర్చించారు. ఫలితాల వెల్లడికి సంబంధించి అవినీతి, అక్రమాలపై ప్రతి సందర్భంలో ఆరోపణలు వస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఏపీపీఎస్సీ జారీ చేస్తున్న నోటిఫికేషన్లు కూడా న్యాయ వివాదాలకు దారి తీస్తున్నాయని చెప్పారు. వీటిపై కూలంకషంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి పారదర్శక విధానాలపై చర్చించారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. పరీక్షల నిర్వహణ, పోస్టుల భర్తీలో అత్యుత్తమ పారదర్శక విధానాలకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే గ్రూప్–1, గ్రూప్–2సహా అన్ని విభాగాల ఉద్యోగాలకూ ఇంటర్వ్యూ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఐఐఎం, ఐఐటీల సహకారంపై దృష్టి.. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు సంబంధించి ఏటా జనవరి 1వ తేదీన క్యాలెండ్ విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల్లో పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో విశ్వసనీయత పెంచేందుకు ప్రఖ్యాత ఐఐఎం, ఐఐటీల సహకారం, భాగస్వామ్యాలను తీసుకోవడంపై విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. నవంబర్ చివరిలో ఖాళీల జాబితా సిద్ధం! ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నవంబర్ మూడోవారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల జాబితాను తయారు చేస్తారు. భర్తీ చేయాల్సిన పోస్టులు, బడ్జెట్ కేటాయింపులు తదితర ప్రతిపాదనలతో నవంబర్ నెలాఖరులోగా ముఖ్యమంత్రితో అధికారులు మరోసారి సమావేశం అవుతారు. అన్ని సన్నాహాలు పూర్తైన తర్వాత 2020 జనవరి 1వతేదీన ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ క్యాలెండర్ విడుదల చేయనుంది. దీనికి అనుగుణంగా ఏటా ఉద్యోగాల భర్తీ చేపడతారు. -
వెబ్సైట్లో అభ్యర్థుల జాబితా
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15 నుంచి 20 వరకు గ్రూప్–2 ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల జాబితాను సోమ వారం కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు పూర్తి వివరాలకు www.tspsc. gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పోస్టింగ్‌లు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఎంపికైన 72 మంది డాక్టర్లకు వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి సోమవారం పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు -
విద్యుత్ షాక్‌తో గ్రూప్-2 విద్యార్థిని కోమలి మృతి
-
మొదటి ప్రయత్నంలోనే విజయం
కర్నూలు (అగ్రికల్చర్): పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఓ యువకుడు నిరూపించారు. చిన్నతనం నుంచి క్రమశిక్షణ, తల్లిదండ్రులు, గురువుల సలహాలు, సూచనలు పాటిస్తూ మొదటి ప్రయత్నంలోనే ఆంధ్రపదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు–2 ద్వారా వ్యవసాయాధికారి పోస్టు సాధించారు. కర్నూలులో గుత్తి పెట్రోలు బంక్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని రామకృష్ణనగర్‌కు చెందిన వి.వెంకటేశ్వర్లు, రమాదేవి దంపతుల కుమారుడు వి.విజయ్‌కుమార్ అనంతపురం జిల్లా యాడికి మండల వ్యవసాయాధికారిగా నియమితులయ్యారు. తండ్రి ట్రెకోడెర్మా విరిడి కేంద్రాన్ని నడుపుతూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుండగా, కుమారుడు కూడా వ్యవసాయాధికారిగా ఎంపిక కావడం విశేషం. విజయ్‌కుమార్ 10వ తరగతి వరకు కర్నూలు సర్వేపల్లి విద్యానిలయంలో చదువుకున్నారు. ఇంటర్ మీడియట్ కర్నూలులోనే రత్నం కాలేజీలో చదివారు. ఎంసెట్ ద్వారా మహానంది వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీలో సీటు సాధించి అక్కడే ఎంఎస్సీ అగ్రికల్చర్ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత 2017 ఏప్రిల్‌లో గ్రూపు–2 వ్యవసాయాధికారి టెక్నికల్ నోటిఫికేషన్ వెలువడటంతో ఎలాగైనా పోస్టు సాధించాలని కష్టపడ్డాడు. ఎలాంటి కోచింగ్ లేకుండానే రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించి వ్యవసాయాధికారిగా ఎంపికయ్యారు. తల్లిదండ్రులు, గురువులు ఇచ్చిన ప్రోత్సాహంతో వ్యవసాయాధికారిగా ఎంపికయ్యాయని విజయకుమార్ చెబుతున్నారు. వ్యవసాయంలో రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు కృషి చేస్తానంటున్నారు. -
ఏడాదైనా ఎదురు చూపులే
సాక్షి, హైదరాబాద్ : గ్రూప్–2 ఉద్యోగాల భర్తీపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. రాతపరీక్ష రాసి ఏడాది గడిచినా నియామకాల ప్రక్రియ పూర్తి చేయకపోవడంపై ఆం దోళన వ్యక్తమవుతోంది. గ్రూప్–2 పరీక్షకు సంబంధించి కోర్టు పరిధిలో కేసు ఉండడంతో ఫలితాలు వెల్లడించడం లేదని టీఎస్పీఎస్సీ చెబుతుండగా.. పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అభ్యర్థుల నుంచి ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. గ్రూప్–2 కేటగిరీలో 439 ఉద్యోగాల భర్తీ కోసం 2015 డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నాయని క్షేత్రస్థాయి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మరో 593 పోస్టులను కలిపి మొత్తంగా 1,032 పోస్టులతో సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 7.89 లక్షల మంది పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది నవంబర్ 11, 13 తేదీల్లో టీఎస్పీఎస్సీ రాత పరీక్ష నిర్వహించగా 5.17 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలు ప్రకటించినా ఇప్పటికీ ఇంటర్వ్యూ తేదీలను మాత్రం ప్రకటించలేదు. కేసులతో చిక్కులు.. గ్రూప్–2 పరీక్షలో కొందరు జవాబు పత్రాల్లో వైట్నర్ వినియోగించారంటూ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. వైట్నర్ వినియోగం, డబుల్ బబ్లింగ్‌తో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. దీంతో నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. రాత పరీక్షతోపాటు ఫలితాల వెల్లడిలోనూ అవకతవకలు జరిగాయంటూ ఇంకొందరు కోర్టుకెక్కారు. భర్తీ ప్రక్రియలో 1:2 నిష్పత్తిలో జాబితా ప్రకటించాల్సి ఉండగా.. 1:3 నిష్పత్తిలో ఇచ్చారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. కేసు పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
గ్రూప్-2 పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
‘గ్రూప్–2’పై స్టే పొడిగింపు
వచ్చే నెల 14 వరకు పొడిగించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రూప్–2 నియామక ప్రక్రియపై విధించిన స్టే ఉత్తర్వులను హైకోర్టు జూలై 14 వరకు పొడిగించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ)కి మరో పది రోజుల గడువునిచ్చింది. తదుపరి విచారణను జూలై 4కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రూప్–2 మెరిట్ జాబితాలో అనర్హులకు చోటు కల్పించారని, నియామక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని ఆరోపిస్తూ హైదరాబాద్‌కు చెందిన వి.రామచంద్రారెడ్డి, పి.శ్రీచరణదాస్ మరో 34 మంది వేర్వేరుగా రెండు వ్యాజ్యాలు దాఖలు చేయడం తెలిసిందే. ఓఎంఆర్ షీట్లో రెండుసార్లు దిద్దరాదని (డబుల్ బబ్లింగ్), వైట్నర్ వాడరాదన్న నిబంధనను అతిక్రమించినందుకు టీఎస్పీఎస్సీ కొందరి జవాబుపత్రాల మూల్యాంకనం చేయకపోవడంతో పది మంది హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్‌ను హైకోర్టు ఏప్రిల్ 24న కొట్టేయడంతో వారంతా అనర్హులయ్యారు. అయినప్పటికీ వారి పేర్లు కూడా మెరిట్ జాబితాలో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. టీఎస్పీఎస్సీ చర్య వల్ల అర్హులకు అన్యాయం జరుగుతోందని, పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ జంబ్లింగ్ విధానాన్ని అనుసరించలేదని కూడా పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై గత ఆదేశాల కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమయం ఇవ్వాలని టీఎస్పీఎస్సీ కోరడంతో న్యాయమూర్తి అందుకు అనుమతిస్తూ తదుపరి విచారణను జూలై 4కి వాయిదా వేశారు. -
గ్రూప్–2 మెయిన్స్‌కు ఉచిత కోచింగ్
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ఎస్సీ, బీసీ–సీ కులాలకు చెందిన అభ్యర్థులకు గ్రూప్–2 మెయిన్స్‌కు ఉచిత కోచింగ్‌ను ఇప్పించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ప్రకాష్‌రాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కోచింగ్‌కు గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ఒకటిన్నర నెలల పాటు తిరుపతిలోని డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్, శ్రీ విద్య ఐఏఎస్ అకాడమీలో శిక్షణ ఇస్తామని తెలిపారు. దరఖాస్తు ఫారాలు, పూర్తి వివరాలను http;//www.chittor.ap.gov.in వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా పొందిన దరఖాస్తును పూర్తి చేసి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈ నెల 31వ తేదిలోగా అందించాలన్నారు. అభ్యర్థులు జిల్లాకు చెందిన వారై ఉండాలని, కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల లోపు ఉండాలన్నారు. దరఖాస్తుకు గ్రూప్–2 ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్, పొందిన మార్కుల జాబితా నకలు, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, తెల్లరేషన్ కార్డు/ ఆదాయ ధృవీకరణ పత్రం, విభిన్న ప్రతిభావంతులైతే 40 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలను జతచేసి అందించాలన్నారు. -
గడువు పెంపుపై గ్రూప్-2 అభ్యర్థుల మహా ధర్నా
-
గ్రూప్–2లో ‘డా.లక్ష్మయ్య’ విద్యార్థుల సత్తా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రూప్–2 ప్రిలిమినరీ పరీక్షలో తమ స్టడీ సర్కిల్‌కు చెందిన 415 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ పి.పద్మజారాణి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో తమ స్టడీ సర్కిల్ సహకారంతో విద్యార్థులను ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేసి, వారికి ఉచితంగా శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. వారిలో కూడా దాదాపు వెయ్యి మంది మెయిన్స్‌కు అర్హత సాధించారని, వీరందరికీ హైదరాబాద్‌లో మెయిన్స్‌కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సంస్థ చైర్మన్ డాక్టర్ లక్ష్మయ్య సన్మానించినట్లు తెలిపారు. -
‘గ్రూప్స్’ ఫలితాలు మరింత ఆలస్యం!
- పోస్టులివ్వని పలు శాఖలు.. గ్రూప్–1 ఫలితాల్లో జాప్యం - న్యాయ వివాదాలతో గ్రూప్–2 ఫలితాలు కూడా.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2011 గ్రూప్–1లో భాగంగా గతేడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలు వెల్ల డించలేని పరిస్థితి నెలకొంది. గ్రామీణాభివృద్ధి శాఖ, అగ్నిమాపక శాఖలు పోస్టులను ఇవ్వకపోవడంతో ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోంది. 2011లో జరిగిన గ్రూప్–1లో ప్రిలిమ్స్‌లో తప్పులు ఇచ్చిన వ్యవహారంలో కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దీంతో సుప్రీం కోర్టు మళ్లీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని 2014లో ఆదేశించింది. అప్పటికే రాష్ట్ర విభజన జరగడంతో మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో వేర్వేరుగా నిర్వహించాలని ధర్మాసనం సూచించింది. 2011లో జారీ చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్లో ప్రకటించిన 312 పోస్టుల్లో తెలం గాణకు 140 పోస్టులు వచ్చాయి. అందులో 2007 గ్రూప్–1కు సంబంధించిన 13 పోస్టులను అప్పటి అభ్యర్థులకు ఇవ్వాలని కోర్టు మరో తీర్పు ఇచ్చింది. దీంతో 140 పోస్టుల్లో 13 పోస్టులు తొలగించి 127 పోస్టులకు 2016 సెప్టెంబర్‌లో టీఎస్పీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించింది. వాటి మూల్యాంకనాన్ని అదే ఏడాది డిసెంబర్లో పూర్తి చేసింది. అయితే 2011లో నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం, తెలంగాణకు కేటాయించిన పోస్టుల్లో 127 పోస్టుల్లో 117 పోస్టులకు సంబంధించిన రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల వివరాలు టీఎస్పీఎస్సీకి అందాయి. అందులో గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి 7 జిల్లా పంచాయతీ అధికారి పోస్టులకు రోస్టర్, రిజర్వేషన్ వివరాలు రావాల్సి ఉన్నా 2 పోస్టులకు సంబంధించి మాత్రమే ఆ శాఖ పంపింది. మరో 5 పోస్టుల వివరాలను పంపించాల్సి ఉంది. అయితే తమ వద్ద పోస్టుల్లేవని ఆ శాఖ చెబుతోంది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేసి, టీఎస్పీఎస్సీకి పంపించాలని నెల కిందే ఆదేశించారు. అయినా ఇంతవరకూ ఆ పోస్టుల వివరాలు రాలేదు. డివిజనల్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు 8 ఉంటే ఆ శాఖ 3 పోస్టుల వివరాలే పంపింది. మరో 5 పోస్టులను సృష్టించి భర్తీ చేయాల్సి ఉంది. అగ్నిమాపక శాఖ నుంచి కూడా ఆ వివరాలు రాకపోవడంతో గ్రూప్–1 ఫలితాల వెల్లడి ఆగిపోయింది. గ్రూప్–2 ఫలితాల్లో తప్పని ఆలస్యం గ్రూప్–2 కేటగిరీలో 1,032 పోస్టుల భర్తీకి గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన పరీక్ష కేంద్రాల్లో ఒకరి ఓఎంఆర్ జవాబు పత్రాలు మరొకరికి వచ్చాయని, ఫలితంగా తప్పుడు బబ్లింగ్ జరిగిందని, వాటికి మార్కులు ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టు పరిశీలనలో ఉంది. దీంతో గ్రూప్–2 ఫలితాల వెల్లడి ఆగిపోయింది. గ్రూప్–1కు సంబంధించి రెండు శాఖల నుంచి పోస్టులు వచ్చాక, ఫలితాలను ప్రకటించి 1:2 నిష్పత్తిలో 254 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. గ్రూప్–2 అంశంపై కూడా కోర్టులో ఉన్న కేసు వ్యవహారం తేలాకా 1:2 రేషియోలో అభ్యర్థులకు ఇంటర్వూ్య నిర్వహించాల్సి ఉంది. దీంతో గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల భర్తీ మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. -
'కేటగిరీల వారీ కటాఫ్ మార్కులు ఉండాలి'
విజయవాడ: టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, దివ్యాంగుల ప్రాధమిక హక్కులను కాలరాస్తుందని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలో అన్ని తరగతుల వారికి జనరల్ కటాఫ్ మార్కులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, దివ్యాంగుల వారికి న్యాయం చేసేందుకు కృషి చేసిందన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కేటగిరీల వారిగా కటాఫ్ మార్కులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అందరికీ ఒకే కటాఫ్ కాకుండా ఆయా తరగతుల వారీ కటాఫ్ మార్కుల విధానాన్ని పాటించాలన్నారు. రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా తరగతుల వారీ కటాఫ్ ఉండాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొనాలని.. లేకుంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌లో ప్రజా ఉద్యమానికి సిద్దమని ఆయన హెచ్చరించారు. -
గ్రూప్ 2,3 అభ్యర్థుల ఆందోళన
ఆనం కళాకేంద్రం వద్ద ధర్నా వేరే ప్రాంతాల్లోని స్టడీసర్కిల్‌కు వెళ్లాలని అధికారుల సూచన నాయకులు, అధికారుల మధ్యలో నలిగిపోతున్న అభ్యర్థులు కంబాలచెరువు(రాజమమహేంద్రవరం): ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఆయా కులాలకు చెందిన వారికి స్టడీసర్కిళ్లలో గ్రూప్–2,3 ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా రాజమహేంద్రవరంలోని స్వయంకృషి స్టడీ సర్కిల్లో రాష్ట్రంలోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరంలకు చెందిన అభ్యర్థులు రెండు నెలలుగా శిక్షణ పొందుతున్నారు. వీరిలో గ్రూప్– 2లో బీసీ కార్పొరేష¯ŒS విద్యార్థులకు ప్రిలిమ్స్ శిక్షణ పూర్తవ్వగా, గ్రూప్– 3లో ఎస్సీ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. గ్రూప్–2లో 300 మందికిపైగా అభ్యర్థులకు ప్రభుత్వం నుంచి స్టైఫండ్ రావల్సి ఉంది. దూరప్రాంతాల నుంచి వచ్చిన వీరంతా గ్రూప్స్ శిక్షణ పొందుతూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రిలిమ్స్ రాశారు. మెయి¯Œ్సకు సిద్ధపడుతుండగా ప్రభుత్వం నుంచి రావాలి్సన రూ.8వేలు స్టైఫండ్ రాకపోవడంతో రూము అద్దెలు చెల్లించలేక, తినేందుకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులకు గురతున్నారు. అనుమతి రాక.. గ్రూప్–3లో శిక్షణ పొందుతున్న 254 మంది విద్యార్థుల విషయానికి వస్తే ప్రభుత్వం నుంచి స్వయంకృషి స్టడీసర్కిల్‌లో శిక్షణ పొందేందుకు పూర్తి అనుమతి రాకపోవడంతో వారందరినీ దూరప్రాంతాల్లోనున్న స్టడీసర్కిళ్లకు వెళ్లి శిక్షణ పొందాలని అధికారులు చెప్పడంతో అభ్యర్థులు అంతదూరం వెళ్లలేక ఆవేదన చెందుతున్నారు. స్టడీసెంటర్‌కు అనుమతి వస్తుందని అభ్యర్థులకు నిర్వాహకులు ఒక నెలనుంచి శిక్షణ ప్రారంభించారు. అయితే కొందరు అధికారులు, నాయకుల స్వార్థరాజకీయాలతో స్వయంకృషి స్టడీసెంటర్లో శిక్షణకు అనుమతి రాకుండా అడ్డుకుని గ్రూప్స్‌కి శిక్షణపొందే అభ్యర్థులను ఇబ్బందులపాలయ్యేలా చేస్తున్నారని స్టడీసెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై స్థానిక ఆనం కళాకేంద్రం వద్ద జరుగుతున్న ఒక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వస్తున్నారని తెలిసి అభ్యర్థులంతా అక్కడికి చేరుకుని ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై పై అధికారులతో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. పిల్లలను వదిలి ఎలా వెళ్లం నాకు చిన్న పిల్లలు ఉన్నారు. మా వారు ఉద్యోగం చేస్తున్నారు. వాళ్లను వదిలి ఎక్కడో వైజాగ్‌లో నున్న స్టడీసెంటర్‌కు వెళ్లి శిక్షణ పొందాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎలా వెళ్లగలం. సమయం తక్కువ ఉంది. వేరే ప్రాంతానికి వెళ్లి ఏం చేయగలం. –పి.సూర్యకుమారి, గ్రూప్–3 అభ్యర్థిని, రాజమహేంద్రవరం ఎక్కడో దూరప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతున్నాం మాకు ప్రభుత్వం నుంచి రావాలి్సన స్టైఫండ్ ఇంకా రాలేదు. స్టడీసెంటర్ నిర్వాహకులు శిక్షణ అయితే ఇస్తున్నారు కాని ఇక్కడ ఉండేందుకు మేము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. రూములకు అద్దె చెల్లించలేక, తినేందుకు డబ్బులు లేక అవస్థలు పడుతున్నాం. –వి,రాజేశ్వరరావు, గ్రూప్ 2 అభ్యర్థి, విశాఖపట్నం -
గ్రూప్ 2 కీ విడుదల
ప్రశ్నల వారీ ‘కీ’లను వెబ్సైట్లో పొందుపర్చిన ఏపీపీఎస్సీ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 982 గ్రూప్ 2 కేడర్ పోస్టులకు ఈనెల 26న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించి ఆయా సెట్లలోని ప్రశ్నల వారీగా ‘కీ’లను ఏపీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. వీటిని కమిషన్ వెబ్సైట్లో పొందుపర్చినట్లు కమిషన్ కార్యదర్శి వైవీఎస్టీ సాయి తెలిపారు. ఈ కీ సంబంధించిన అభ్యంతరాలను మార్చి 7వ తేదీలోగా రాతపూర్వకంగా పంపించాలని పేర్కొన్నారు. ఫార్మాట్ వెబ్సైట్లో అందుబాటులో ఉందని తెలిపారు. ఈ మెయిల్, ఎస్ఎంఎస్, వాట్సప్‌ల ద్వారా వచ్చే అభ్యంతరాలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రశ్న ఐడీలు లేని అభ్యంతరాలు కూడా అనుమతించబోమన్నారు. పోస్టల్ ఆలస్యానికి తమది బాధ్యత కాదని కార్యదర్శి పేర్కొన్నారు. గ్రూప్2లో వచ్చిన ప్రశ్నలు తమ టెస్టు సిరీస్లోనివేనని కొన్ని కోచింగ్ సెంటర్లు ప్రచారం చేసుకుంటున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని, అభ్యర్ధులు వీటిని నమ్మరాదని విజ్ఞప్తి చేశారు. సెట్ల వారీగా కాకుండా ప్రశ్నల వారీగా కీలను విడుదల చేయడంతో అభ్యర్థులు తొలుత ఒకింత గందరగోళానికి గురైనా తర్వాత అసలు సంగతి గుర్తించారు. కాగా, ఏపీపీఎస్సీ విడుదల చేసిన కీలో అనేక తప్పులు దొర్లాయని అభ్యర్థులు పేర్కొంటున్నారు. -
ఇబ్బందులే అసలు పరీక్ష
ఏలూరు సిటీ : గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ప్రశాం తంగా ముగిసింది. అడుగడుగునా సమస్యలు, ఇబ్బం దులు అభ్యర్థులకు పెద్ద పరీక్షగా మారాయి, విధిగా గుర్తింపు కార్డులు తీసుకురావాలనే నిబంధనపై అవగాహన కల్పించకపోవటంతో వందలాది మంది పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. ఆర్ట్స్ గ్రూప్ అభ్యర్థులకు ఈ పరీక్ష ఏపీపీఎస్సీ స్థాయిలో లేదని చెబుతుండగా, సైన్సు సబ్జెక్ట్ అభ్యర్థులకు మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది. జిల్లా వ్యాప్తంగా 65 పరీక్షా కేంద్రాల్లో 74.39 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎన్ని ఇబ్బందులో.. జిల్లాలో 39,828మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 10,201 మంది గైర్హాజరయ్యారు. 29,627 మంది స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరయ్యారు. 9 మంది స్పెషల్ ఆఫీసర్లు, 30మంది లైజాన్ ఆఫీసర్లు, కలెక్టర్ కె.భాస్కర్, జేసీ పులిపాటి కోటేశ్వరరావు, డీఆర్వో కట్టా హైమావతి, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ వీ.రమేష్‌బాబు, డీఈఓ ఆర్ఎస్ గంగాభవాని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. కలెక్టర్ భాస్కర్ ఏలూరులోని సీఆర్ఆర్ అటానమస్, సీఆర్ఆర్ ఉమెన్స్, సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీల్లోని కేంద్రాలను తనిఖీ చేశారు. ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, తణుకు, తాడేపల్లిగూడెం, పెదపాడు, పెదవేగి, నల్లజర్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఏలూరు రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీ పరీక్షా కేంద్రం వద్ద తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంకు చెందిన ఎస్.దివ్య గుర్తింపు కార్డు లేకుండా రావటంతో పరీక్ష రాసేందుకు అధికారులు నిరాకరించారు. గోడు చెప్పుకునే అవకాశాన్ని కూడా అధికారులు ఇవ్వకపోవటం గమనార్హం. చాలాచోట్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తడంతో వందలాది మంది అభ్యర్థులు పరీక్ష రాయకుండా వెనుదిరగాల్సి వచ్చింది. ఆర్టీసీ బస్సులు కిటకిటలాడాయి. టికెట్లు ఇచ్చేందుకు బస్సులను పలుచోట్ల నిలుపుదల చేయడంతో అభ్యర్థులు ఒత్తిడికి గురయ్యారు. సకాలంలో పరీక్ష కేంద్రానికి వెళ్లగలమో లేదోనని ఆందోళన చెందారు. నెలల తరబడి శిక్షణ పొందిన వారితోపాటు పరీక్షలో ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే ఆశతో అభ్యర్థులు తీవ్రంగా శ్రమించారు. చాలామంది ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. 9.30 గంటల నుంచి వారికి లోనికి అనుమతించారు. చంటి పిల్లలు ఉన్న వారు భర్త, బంధుగణంతో పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లగా వారి కుటుంబ సభ్యులు, బంధువులు చెట్లు, పుట్టలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదిలావుంటే.. వేసవి వచ్చేసిందా అన్నట్టు భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. -
గ్రూప్–2 హాల్‌టికెట్ల జారీలో గందరగోళం
⇒ పలువురికి డౌన్లోడ్ కాని హాల్‌టికెట్లు ⇒ తీవ్ర ఆందోళనలో అభ్యర్థులు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్ 2 కేటగిరీ ఉద్యోగాల భర్తీకోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఈనెల 26న నిర్వహించనున్న ప్రిలిమ్స్ పరీక్షకు హాల్‌టికెట్ల జారీ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఆదివారం నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ ప్రకటించడంతో అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకునేందుకు ప్రయత్నించారు. ఎక్కువమందికి హాల్‌టికెట్లు డౌన్లోడ్ కాలేదు. జారీ అయినవి కూడా తప్పులతడకగా ఉన్నాయి. కొందరికి అసలు దరఖాస్తు చేయనేలేదనే సమాచారం వచ్చింది. పలువురు బీసీ అభ్యర్థులకు ఓసీలుగా వచ్చింది. బీసీ–ఏ కులానికి చెందిన కొందరికి బీసీ–సీ అని వచ్చింది. గ్రూప్ 2లో 982 (442 ఎగ్జిక్యూటివ్, 540 నాన్ ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకోసం గత నవంబర్‌లో నోటిఫికేషన్ జారీచేయడంతో 6,57,010 మంది (తెలంగాణ వారితో కలిపి) దరఖాస్తు చేసుకున్నారు. రిజర్వేషన్ల అంశంపై వివాదం గ్రూప్ 2 నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ నిర్వహిస్తామన్నారే తప్ప రిజర్వేషన్ల ప్రకారం మెయిన్స్‌కు ఎంపికచేసే విధానం ఉండదని తెలపలేదని అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్ పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్ పూర్తిచేసిన అభ్యర్థులు తప్పనిసరిగా కంప్యూటర్ అప్లికేషన్ పరీక్షలో కూడా అర్హత సాధించాలన్న నిబంధనపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తప్పులు సరిచేస్తున్నాం:ఏపీపీఎస్సీ చైర్మన్ అభ్యర్థుల ఆందోళనల గురించి ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్తో ప్రస్తావించగా ఈ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. వీటిని సరిచేయిస్తున్నామన్నారు. కులం సమాచారం తప్పుగా వచ్చిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
గ్రూప్–2 దరఖాస్తులో సవరణలకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 పోస్టుల భర్తీకి గత నవంబరు 11, 13 తేదీల్లో నిర్వహించిన రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తాము దరఖాస్తు చేసిన ఫారంలోని బయోడేటా వివరాల్లో ఏమైనా తప్పులు ఉన్నా, వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌లో (ఓటీఆర్) పొరపాట్లు ఉన్నా సవరించుకునే అవకాశాన్ని టీఎస్పీఎస్సీ కల్పించింది. అభ్యర్థులు ఈనెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సవరించుకోవచ్చని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అదర్‌సిన్హా తెలిపారు. అభ్యర్థుల పేరు, తండ్రి పేరు, వికలాంగుల కేటగిరీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ, డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్టులు, న్యాయ విద్య అర్హతల్లో తేడాలు ఉంటే మార్పులు చేసుకోవచ్చని, సెల్ ఫోన్ నంబర్లు, అడ్రస్ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీ వరకే ఈ అవకాశం ఇస్తున్నామని, ఆ తరువాత గడువు పొడగించేది లేదని స్పష్టం చేశారు. -
మీ అంగీకారం తెలపండి
లేఖలు కోరిన ఏపీపీఎస్సీ సాక్షి, హైదరాబాద్: గ్రూప్ 2–1999 పోస్టులకు గాను మెరిట్ జాబితా ప్రకారం ఎంపికైన అభ్యర్థులంతా ఆయా పోస్టుల్లో చేరడానికి సుముఖమో కాదో లేఖలు అందించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం ప్రకటన జారీచేసింది. సుప్రీం ఆదేశాల మేరకు ఈనెల 23న కొత్తగా మెరిట్ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం ఇప్పటికే సర్వీసులో ఉన్న వారి స్థానాలు మార్పు జరిగి ఏదో ఒక పోస్టులోకి వెళ్తున్నందున వారినుంచి అంగీకారం తీసుకోలేదు. గతంలో ఎలాంటి పోస్టు అలాట్ కాని వారిని మాత్రమే వారంలోగా అంగీకార లేఖలు కోరింది. అందరినుంచి లేఖలు అడగాలని విన్నపాలు అందుతుండటంతో తాజా నిర్ణయం తీసుకుంది. -
నేడు గ్రూప్–2లో ఉచిత శిక్షణకు ఎంపికలు
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు గ్రూప్–2లో ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ఈ నెల 19, 20వ తేదీల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ–వెలుగు పీడీ రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే ఎంపిక ప్రక్రియకు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులతో హాజరుకావాలన్నారు. ఎంపికైన వారికి హైదరాబాద్ నుంచి ప్రముఖ అధ్యాపకులచే ప్రత్యక్ష ప్రసార మాధ్యమం ద్వారా ఉచిత శిక్షణ తరగతులు ఇస్తామన్నారు. వివరాలకు 08518–277499, 8522083879, 8341581022, 9177016174 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
20న తిరుపతిలో స్క్రీనింగ్ టెస్ట్
అనంతపురం ఎడ్యుకేషన్ : గ్రూప్–1 (ప్రిలిమ్స్), గ్రూప్–2 నియామకపు పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు ఈ నెల 20న ఉదయం 10 గంటలకు తిరుపతి బాలాజీనగర్‌లోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రోశన్న ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాజరుకావాలని ఆయన కోరారు. -
‘ఘంటా’ దిష్టిబొమ్మ దహనం
నిర్మల్ అర్బన్: గ్రూప్-2 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఆధ్వర్వంలో శుక్రవారం టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద చౌక్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఓఎంఆర్ షీట్లపై ఫొటోలు వేయకపోవడం, కోడింగ్, డీకోడింగ్ లేకపోవడం, అనుభవం లేని ఇన్విజిరేటర్లు విధులు నిర్వహించారన్నారు. బయోమెట్రిక్ విధానంలో విఫలం, 40శాతం అభ్యర్థుల వేలిముద్రలు మాత్రమే తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. గ్రూప్ - 2లో కొన్ని ప్రశ్నలు నక్సలైట్ నాయకుల పేర్లను, నక్సలైట్ల ఎన్కౌంటర్, జనశక్తి సంఘాల గురించి ఉన్నాయని, దీంతో అభ్యర్థుల్లో నక్సలిజం భావాలను పెంచారని ఆరోపించారు. వెంటనే చైర్మన్ పదవి నుంచి ఘంటా చక్రపాణిని తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అజీమ్, రాకేశ్‌రెడ్డి, నిఖిల్, వినీత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్-2లో అక్రమాలు: పీసీసీ
-
గ్రూప్-2లో అక్రమాలు: పీసీసీ
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ నిర్వహిం చిన గ్రూప్-2 పరీక్షల్లో అక్రమాలు, లోపా లు జరిగాయని పీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్ ఆరోపించారు. గాంధీ భవన్లో శనివారం ఆయన మాట్లాడుతూ, డీకోడింగ్ లేకుండా పరీక్ష జరిగిందని, ఓఎంఆర్ షీటుపై ఫొటోలు లేకుండా, బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయ కుండా.. ఎవరి పరీక్ష ఎవరు రాశారో తెలి యకుండా నిర్వహించారన్నారు. సింగరేణి ప్రశ్నపత్రాల లీకు, ఎంసెట్ లీకు, తాజాగా గ్రూప్-2 జరిగిన తీరుతో ప్రభుత్వ అసమ ర్థత బయటపడిందన్నారు. అవగాహన లేని ఇన్విజిలేటర్లతో పరీక్ష జరిగిందని, దీనివల్ల ఒకరి ప్రశ్నపత్రం మరొకరికి ఇచ్చారని.. తర్వాత తప్పులు తెలుసుకుని వైట్నర్తో తుడిచి, మరోసారి పేర్లు, నంబర్లు రాశారని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను కోర్టులు అంగీకరించవని, వీటిపై న్యాయ నిపుణులను సంప్రదించి నిరుద్యోగ అభ్యర్థుల తరఫున పోరాడు తామని ప్రకటించారు. -
నేటి నుంచి ఏపీ గ్రూప్-2 దరఖాస్తులు
-
నేటి నుంచి ఏపీ గ్రూప్-2 దరఖాస్తులు
డిసెంబర్ పది వరకు స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నిర్వహించనున్న గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ శుక్రవారం నుంచి ప్రారంభమవనుంది. కమిషన్ అధికారిక వెబ్సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పీఎస్సీ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో ఆన్లైన్ దరఖాస్తును పొందుపర్చనున్నారు. దరఖాస్తులను శుక్రవారం నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు సమర్పించవచ్చు. ఇందుకు సంబంధించిన ఫీజును డిసెంబర్ 10వ తేదీ రాత్రి 11:59 నిమిషాల వరకు చెల్లించే వీలుంది. దరఖాస్తులకు సంబంధించిన సమాచారమంతటినీ సమగ్రంగా ముందే ఒన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్టట్రేషన్లో నమోదు చేసుకుని అనంతరం దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు క్రీమిలేయర్, నాన్ క్రీమిలేయర్ నిబంధనలు వర్తించనున్నాయి. బీసీ అభ్యర్థులు తమ తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ.6లక్షల లోపుంటే నాన్‌క్రీమిలేయర్ పరిధిలోకి రానున్నారు. తహసీల్దార్ జారీచేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని నిర్దేశిత సమయంలో సమర్పించనివారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తారు. అభ్యర్థులు సమర్పించాల్సిన ధ్రువపత్రాలివే.. ♦ కులం, నివాస, పుట్టిన తేదీ ధ్రువపత్రాల ప్రొఫార్మా ♦ డిక్లరేషన్ ఆఫ్ ది అన్‌ఎంప్లాయిడ్ ♦ స్కూల్ స్టడీ సర్టిఫికెట్ ♦ స్థానిక ధ్రువపత్రం ♦ అంధులైతే మెడికల్ సర్టిఫికెట్ ♦ చెవిటి, మూగ అభ్యర్థులైతే సంబంధిత మెడికల్ సర్టిఫికెట్లు ♦ అంగవైకల్యం కలవారైతే అందుకు సంబంధించిన ధ్రువపత్రాలు ♦ బీసీ అభ్యర్థులు క్రీమిలేయర్ సర్టిఫికెట్ ♦ లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ ఆ నాలుగు పోస్టులకు ప్రొఫిషియన్సీ టెస్టు లేదు ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్లో కొన్ని పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని తప్పనిసరి చేసింది. ఆయా పోస్టుల వివరాల్ని అందులో పొందుపరిచింది. అయితే ఆ జాబితాలో కొన్ని ఇతర పోస్టులు పొరపాటున చేరాయి. పోస్టు కోడ్ నంబర్ 8, 13, 33, 34 పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం లేదని, వాటిని ప్రొఫిషియన్సీ టెస్టునుంచి మినహాయిస్తున్నామని కమిషన్ గురువారం ఒక సవరణ ప్రకటన జారీచేసింది. పోస్టు కోడ్ నంబర్లు 9, 10, 11, 12, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32 పోస్టులకు ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు. -
గ్రూప్-2కు పకడ్బందీ ఏర్పాట్లు
వికారాబాద్: పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వచ్చేనెలలో గ్రూప్-2 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ సభ్యుడు విఠల్ తెలిపారు. వచ్చేనెల 11, 13 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షల ఏర్పాట్లపై వికారాబాద్‌లో జేసీ సురేష్ పొద్దార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గ్రూప్-2 పరీక్షకు 8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్, అక్రమాలు చోటుచేసుకుంటే బాధ్యులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పరీక్షల సక్రమ నిర్వహణకు అధికార యంత్రాంగం సహకరించాలని ఆయన సూచించారు. కొత్త జిల్లాలు ఆవిర్భవించక ముందు 500 పోస్టుల ఖాళీలు భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించిందని, కొత్త జిల్లాల ఆవిర్భావం తరువాత అవసరాలను దృష్టిలో ఉంచుకొని వేయి పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఇప్పటివరకు నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఐదు వేలకు పైగా అభ్యర్థులు ఎంపికై పలు శాఖల్లో పనిచేస్తున్నారని గుర్తు చేశారు. మరో 5000మంది ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి ఎంపికకు సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రూప్-2 పరీక్షలు పూర్తి కాగానే మరో ఆరు వేల పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రెండున్నరేళ్ల కాలంలో 26 నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదు లక్షల మంది అత్యధికంగా ఒకేసారి గ్రూప్-2 పరీక్షలు రాశారని, ప్రస్తుతం ఒకేసారి 8 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారన్నారు. హెచ్ఎండీఏ పరిధిలోనే 400 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశామని, సుమారు 3.50 లక్షల మంది పరీక్షలు రాయడానికి దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. -
ఒకే పరీక్ష.. రెండు కటాఫ్ తేదీలా?
సాక్షి, హైదరాబాద్: రెండు విడతలుగా నోటిఫికేషన్ల కారణంగా గ్రూప్-2 జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి తంటా వచ్చి పడింది. ఒకే పరీక్ష రాయనున్నా.. గరిష్ట వయోపరిమితికి మాత్రం రెండు కటాఫ్ తేదీలు వర్తించనున్నాయి. దీంతో ప్రధాన (2015 డిసెంబర్ 30న జారీ చేసిన) నోటిఫికేషన్‌కు అర్హులైన వేల మంది జనరల్ అభ్యర్థులు ఈనెల 1న జారీ చేసిన అనుబంధ నోటిఫికేషన్‌కు అనర్హులవుతున్నారు. దీంతో తమకు అనుబంధ నోటిఫికేషన్‌లోని 593 పోస్టులకు కూడా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రెండింటికి ఒకేసారి, ఒకే పరీక్ష నిర్వహిస్తున్నందున... గరిష్ట వయోపరిమితి కటాఫ్ తేదీని ప్రధాన నోటిఫికేషన్లో పేర్కొన్నట్లుగా 2015 జూలై 1వ తేదీనే వర్తింపజేయాలని కోరుతున్నారు. వయో పరిమితి తంటాలు.. 439 గ్రూప్-2 పోస్టుల భర్తీకి 2015 డిసెంబర్ 30న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో జనరల్ అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 2015 జూలై 1వ తేదీ నాటికి 44 ఏళ్లుగా, ఎక్సైజ్ ఎస్సై పోస్టులకు మాత్రం 28 ఏళ్లుగా పేర్కొంది. రిజర్వేషన్ల నిబంధనలకు అనుగుణంగా వీటికి అదనంగా వయోపరిమితి సడలింపు వర్తిస్తుందని తెలిపింది. దీంతో 5.65 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పోస్టులు తక్కువగా ఉండటం, భారీగా దరఖాస్తులు రావడంతో పోస్టుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం ఆ పరీక్షలను వాయిదా వేయించింది. ఈ మేరకు ఇటీవల మరో 593 పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ రెండు నోటిఫికేషన్లలోని 1,032 పోస్టులకు నవంబర్ 12, 13 తేదీల్లో ఒకేసారి పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే మొదటి నోటిఫికేషన్‌లోని పోస్టులకు వయోపరిమితి లెక్కింపు గడువు 2015 జూలై 1 కాగా.. అనుబంధ నోటిఫికేషన్ పోస్టులకు మాత్రం వయో పరిమితి లెక్కింపు గడువు 2016 జూలై 1 కావడం గమనార్హం. దీంతో 2015 జూలై 2వ తేదీ తర్వాత గరిష్ట వయో పరిమితి పరిధి దాటిన వేలాది మంది అభ్యర్థులు అదనపు పోస్టులకు అనర్హులవుతున్నారు. గరిష్ట వయో పరిమితి కటాఫ్ తేదీని అనుబంధ నోటిఫికేషన్‌కు కూడా 2015 జూలై 1వ తేదీగా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
ప్రస్తుత నిబంధనల మేరకే గ్రూప్-2
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు, జోనల్ వ్యవస్థ రద్దుతో సంబంధం లేకుండా.. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలతోనే గ్రూప్-2 పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు పలు ఉద్యోగ పరీక్షల నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనుమతినిచ్చారు. ఈ మేరకు గురువారం లేదా శుక్రవారం గ్రూప్-2 అనుబంధ నోటిఫికేషన్ జారీకానుంది. మొత్తంగా 1,032 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రధాన నోటిఫికేషన్లో పేర్కొన్న 439 పోస్టుల కోసం 5.65 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా... అయితే తాజా అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మరింత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. సీఎంతో టీఎస్పీఎస్సీ చైర్మన్ భేటీ ఉద్యోగ పరీక్షల అంశంపై టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి బుధవారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. కొత్త జిల్లాల ఏర్పాటు, జోనల్ వ్యవస్థ రద్దు నిర్ణయాల నేపథ్యంలో... పోస్టుల భర్తీపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చించారు. అయితే ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలని సీఎం సూచించినట్లు తెలిసింది. దీంతో గ్రూప్-2 అనుబంధ నోటిఫికేషన్ జారీకి టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షలను అక్టోబర్ చివరి వారంలో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. దాదాపు 6 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున జాప్యం జరిగితే... నవంబర్ చివరి వారంలో పరీక్ష నిర్వహించే అవకాశాలున్నాయి. ఇండెంట్లు రాగానే గురుకుల టీచర్ల నోటిఫికేషన్ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాల్లో ఖాళీగా ఉన్న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన మేరకు 2,444 పోస్టుల భర్తీకి అవకాశముంది. వాటికి సంబంధించి ఆయా శాఖల నుంచి ఇండెంట్లు ఇప్పటికే అందాయి కూడా. అయితే కొత్తగా ఏర్పాటు చేసిన 180 మైనారిటీ గురుకులాలకు మంజూరు చేసిన పోస్టులు, మరికొన్ని పాత ఖాళీలు కలిపి మరో 3,292 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించి ఇండెంట్లు రావాల్సి ఉంది. అవి అందగానే మొత్తంగా 5,736 గురుకుల టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇండెంట్ల కోసం ఆయా శాఖల ఉన్నతాధికారులతో చర్చించి.. వచ్చే వారం పది రోజుల్లో ఈ నోటిఫికేషన్ జారీ చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. -
గ్రూప్-2లో స్క్రీనింగ్ టెస్ట్
మార్కులు, సిలబస్ ఖరారు ఆన్లైన్లో పరీక్షల నిర్వహణ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్-2 పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి పరీక్షల విధానం, సిలబస్‌పై ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం గ్రూప్2లో అత్యధికంగా ఉండే అభ్యర్థులను వడపోసేందుకు ముందుగా స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. గ్రూప్2కు నిర్దేశించిన 3 పేపర్లకు ఇది అదనంగా ఉంటుంది. వ డపోత అనంతరం మిగిలిన వారిని పోస్టులకు నిష్పత్తి ప్రకారం మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. వీరికి ఆన్లైన్లో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇదివరకు ఇచ్చిన జీవో 623కి సవరణ చేస్తూ ప్రభుత్వం తాజా జీవో విడుదల చేసింది. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్టు సిలబస్ ఎ:- కరెంటు అఫైర్స్-ఇష్యూస్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్ పాలిటిక్స్, ఎకనమిక్స్, సొసైటీ, సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్స్, స్పోర్ట్స్, కల్చర్ అండ్ గవర్నెన్స్ బి:- కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఫెడరలిజమ్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, యూనియ న్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, జ్యుడీషియరీ, జ్యుడికల్ రివ్యూ, లోకల్ గవర్నమెంట్, డైరక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, యూని యన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్ అండ్ లెజిస్టేటివ్ రిలేషన్స్ బిట్వీన్ యూని యన్ అండ్ స్టేట్ గవర్నెమెంట్స్, షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియా అడ్మినిస్ట్రేషన్. సి:- ఎకనమిక్ డెవలప్మెంటు ఆఫ్ ఇండియా-ఎకనామీ ఆఫ్ మీడీవల్ ఇండియా, ప్రి ఇండిపెండెన్స్ ఇండియన్ ఎకానమీ, డెవ లప్‌మెంటు ప్లాన్స్ అండ్ ఎకనమిక్ అండ్ ఇండస్ట్రియల్ పాలసీస్, లేబర్ పాలసీస్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్సు, రోల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా, ఎకనమిక్ డిస్పారిటీస్ బిట్వీన్ రీజియన్స్ అండ్ పాప్యులేషన్ కేటగిరీస్. మెయిన్స్ సిలబస్, మార్కులు సబ్జెక్టు మార్కులు పేపర్1: జనర్ స్టడీస్ 150 పేపర్2: 1.సోషల్ హిస్టరీ ఆఫ్ ఏపీ (ద హిస్టరీ ఆఫ్ వేరియస్ సోషల్, కల్చరల్ మూవ్మెంట్సు) 2. జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కానిస్టిట్యూషన్ 150 పేపర్3:- ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ కాంటెంపరరీ ప్రాబ్లెమ్స్ అండ్ డెవలప్మెంటు ఇన్ రూరల్ సొసైటీ విత్ స్పెషల్ రిఫరెన్సు టు ఏపీ 150 మొత్తం 450 -
గ్రూప్-2లో అదనంగా 500 పోస్టులు
రెండింతలు పెరిగిన ఖాళీల సంఖ్య ► అదనపు పోస్టుల్లో డిప్యూటీ తహసీల్దార్లే ఎక్కువ ► ఆర్థిక శాఖ వద్ద వివరాలు.. సీఎస్‌కు చేరిన ఫైలు ► సీఎం ఆమోదించగానే అదనపు నోటిఫికేషన్ ► జూన్ 2న పోస్టుల వివరాలను వెల్లడించే అవకాశం ► తొలివిడత నోటిఫికేషన్లో ఇప్పటికే 439 పోస్టులు ► తాజా పోస్టులతో కలిపితే మొత్తం 939 ఖాళీలు సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2లో అదనంగా 500 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెవెన్యూ విభాగం ఇచ్చిన తాజా ప్రతిపాదనలతో గ్రూప్-2 పోస్టుల సంఖ్య రెండింతలు పెరిగినట్లు తెలిసింది. అదనంగా గుర్తించిన పోస్టుల్లో ఎక్కువగా డిప్యూటీ తహశీల్దార్ పోస్టులున్నాయి. వివిధ శాఖలు తమకు పంపించిన ఖాళీల జాబితాను ఆర్థిక శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు పంపించినట్లు తెలిసింది. తొలుత 439 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుద్యోగులు, వివిధ పార్టీల ప్రతినిధుల విజ్ఞప్తులతో ఏప్రిల్ 24, 25 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. అదే సమయంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వెయ్యి పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీంతో అనుబంధ నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంది.. అదనంగా ఎన్ని పోస్టులను ప్రకటిస్తారని.. లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. వివిధ శాఖల నుంచి ఇటీవల ఆర్థిక శాఖకు చేరిన ఖాళీ పోస్టుల సంఖ్య 450 దాటింది. వీటికి తోడు తొలి నోటిఫికేషన్ సమయంలో పక్కనబెట్టినవి కూడా కలిపితే ఈ సంఖ్య 500కు చేరింది. దీంతో తొలి నోటిఫికేషన్లో ప్రకటించిన 439 పోస్టులతో కలిపితే మొత్తం పోస్టుల సంఖ్య 939కి పెరగనుంది. ఫైల్‌పై సీఎస్, సీఎం ఆమోదముద్ర పడితే అదనపు పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతే టీఎస్పీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ వెలువడుతుంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఈ అదనపు పోస్టులు, అనుబంధ నోటిఫికేషన్‌పై ప్రకటన చేసే అవకాశాలున్నాయి. -
గ్రూప్-2లో మరో 300 పోస్టులు!
ఫైలు సిద్ధం చేసిన ఆర్థిక శాఖ.. సీఎం ఆమోదం తర్వాత నోటిఫికేషన్ జిల్లాల్లో 212 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కలెక్టర్ల నివేదిక సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 కేటగిరీలో మరో 300 పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలు సిద్ధమైంది. ఇప్పటికే గుర్తించిన ఈ ఖాళీల జాబితాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు ఆర్థిక శాఖ పంపించింది. వీటిలో అత్యధికంగా డిప్యూటీ తహసీల్దార్ పోస్టులున్నాయి. అయితే రాజీవ్‌శర్మ జింబాబ్వే పర్యటనలో ఉండటంతో ఆయన తిరిగి వచ్చాక వచ్చే వారంలో ఈ ఫైలును పరిశీలించే అవకాశాలున్నాయి. అనంతరం ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశాక పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ నెల 24, 25 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలు వాయిదాపడటం తెలిసిందే. మరిన్ని పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించటంతో కొత్తగా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు.. నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందని లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. వెయ్యి పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించటం తెలిసిందే. తొలుత 439 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా ఖాళీలతో ఈ సంఖ్య 739కు చేరనుంది. వీటితో పాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు, ఇటీవల రిటైరైన ఉద్యోగుల వివరాలు సేకరిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో సీఎం ఇచ్చిన మాట ప్రకారం దాదాపు 4 వందలకు పైగా పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాల్లో కీలక పోస్టులు ఖాళీ.. జిల్లా, డివిజన్ స్థాయిలో ఖాళీగా ఉన్న కీలకమైన పోస్టుల వివరాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఇటీవలే రెవెన్యూ విభాగానికి పంపించారు. ముఖ్యమైన అధికారులు లేకపోవటంతో పని ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలుపై తీవ్ర ప్రభావం పడుతోందని నివేదించారు. వెంటనే ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్లు పంపిన ఖాళీల్లో ఎక్కువగా గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులే ఉన్నాయి. జెడ్పీ సీఈవోలు, డీఆర్డీఏ పీడీలు, ఎస్సీ బీసీ కార్పొరేషన్ల ఈడీలు, డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్, డీపీవో తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నివేదికల ప్రకారం జిల్లాల్లో మొత్తం 202 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో రెవెన్యూ విభాగానికి సంబంధించి 117, ఇతర విభాగాలకు సంబంధించి 85 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 32, నిజామాబాద్‌లో 29, వరంగల్‌లో 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
గ్రూప్-2 వాయిదా
- 3న జరగాల్సిన కానిస్టేబుల్ పరీక్ష కూడా.. అధికారులను ఆదేశించిన సీఎం - మరిన్ని పోస్టులతో రెండు నెలల తర్వాత గ్రూప్-2 పరీక్ష - 300 వరకూ పోస్టులు అదనంగా వచ్చే అవకాశం - కానిస్టేబుల్ పరీక్ష కొత్త తేదీపై త్వరలో ప్రకటన సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో జరగాల్సిన గ్రూప్-2, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ పరీక్షలు వాయిదాపడ్డాయి. గ్రూప్-2కు సంబంధించి మరిన్ని పోస్టులను పెంచేందుకు ఆ పరీక్షను రెండు నెలల పాటు వాయిదా వేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణిని ఆదేశించారు. కొత్త పోస్టులు వచ్చే వరకు ఆగాలని, అప్పుడు ఒకేసారి పరీక్ష నిర్వహించాలని సూచించారు. ఇక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష కారణంగా కానిస్టేబుల్ పరీక్షను వాయిదా వేశారు. ఈ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే ప్రకటించనున్నారు. అంచనాలకు మించి పోటీ రాష్ట్రంలో 439 గ్రూప్-2 పోస్టుల భర్తీకి గత డిసెంబర్ 30న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా... ఏకంగా 5,64,431 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 1,285 మంది పోటీపడుతున్నారు. వచ్చే నెల 24, 25 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు కూడా ప్రారంభించింది. అయితే పోటీ తీవ్రంగా ఉండడంతో నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమైంది. పోస్టుల సంఖ్య పెంచాలని, అప్పటివరకు పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనలు కూడా చేశారు. దీంతోపాటు గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచాలని అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ అంశంపై శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఆర్.కృష్ణయ్య తదితరులు సీఎం కేసీఆర్‌ను కలసి చర్చించారు. అనంతరం గ్రూప్-2 పరీక్ష వాయిదాకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి కొత్త తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని టీఎస్పీఎస్సీ అధికారులు చెబుతున్నారు. కానిస్టేబుల్ పరీక్షకు ‘ఆర్ఆర్బీ’ అడ్డంకి ఏప్రిల్ 3న జరగాల్సిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ పరీక్షను కూడా వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అదేరోజున రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) పరీక్ష ఉన్నందున నిరుద్యోగులు నష్టపోయే అవకాశముందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కానిస్టేబుల్ పరీక్షలకు మొత్తం 5.36 లక్షల మంది హాజరుకానున్నారు. 1,100 పరీక్షా కేంద్రాలను సైతం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. కానీ సీఎం ఆదేశాల మేరకు పరీక్షను వాయిదా వేసింది. తిరిగి పరీక్ష నిర్వహించే తేదీని త్వరలోనే వెల్లడిస్తామని బోర్డు అధికారులు తెలిపారు. ఇక ఎస్సై పోస్టులకు రాతపరీక్షను కేవలం ఇంగ్లిషులోనే కాకుండా తెలుగులో కూడా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎస్సై తుది పరీక్షలో ఇంగ్లిష్‌కు ఇచ్చే వెయిటేజీని తొలగించి గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు నష్టం జరగకుండా చూడాలని ప్రతిపక్షాలు, నిరుద్యోగులు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఇంకా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెల్లడించలేదు. గ్రూప్-2లో మరో 300 పోస్టులు! గ్రూప్-2 వాయిదా, పోస్టుల పెంపు నిర్ణయంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ప్రస్తుతమున్న 439 పోస్టులకు తోడుగా మరో 300 పోస్టులు పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది జూన్‌లో వివిధ శాఖలు పంపిన ఖాళీల వివరాల ప్రకారం రెండు వందలకుపైగా పోస్టులు ఇప్పటికే ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఈలోగా రిటైరైన ఉద్యోగులతో పాటు కొత్తగా వివిధ శాఖల్లో మంజూరైన పోస్టులను కలిపితే ఖాళీల సంఖ్య మరింత పెరగడం ఖాయం. దీంతో దాదాపు 300 పోస్టులు అదనంగా వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తక్కువ పోస్టులున్నాయనే కారణంగా చాలా మంది దరఖాస్తు చేయలేదని, పోస్టుల సంఖ్యను పెంచితే దరఖాస్తులకు మళ్లీ అవకాశమివ్వాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
గ్రూప్-2 యథాతథం
వాయిదా వదంతులను నమ్మవద్దు: టీఎస్పీఎస్సీ చైర్మన్ చక్రపాణి అన్ని పరీక్షలు టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించే యోచన టీచర్ పోస్టుల భర్తీపై ఇంకా ఇండెంట్ రాలేదని వెల్లడి ఏఈ పోస్టులకు ఎంపికైన వారి జాబితాలు ఆయా శాఖలకు అందజేత హైదరాబాద్: గ్రూప్-2 రాతపరీక్షలను వచ్చే నెల 24, 25 తేదీల్లో యథాతథంగా నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. ఈ పరీక్షను వాయిదా వేస్తారంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని, అభ్యర్థులందరూ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఇటీవల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులకు ఎంపికైన 904 మంది అభ్యర్థుల జాబితాల (శాఖల వారీగా కేటాయించిన ఉద్యోగుల జాబితాలు)ను ఆయా శాఖల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లకు గురువారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వారం రోజుల్లో పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని తెలిపారు. గ్రూప్-2 మినహా నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులన్నింటి భర్తీని ఈ నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే నెలలో గ్రూప్-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చక్రపాణి తెలిపారు. బయోమెట్రిక్ విధానం అమలుతోపాటు కేంద్రాల్లో జామర్లను ఏర్పాటు చే స్తామన్నారు. మరోవైపు ప్రభుత్వం వివిధ శాఖల్లోని ఖాళీలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేయాలని యోచిస్తోందని వెల్లడించారు. సింగరేణి సంస్థ కూడా తమ వద్ద ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరిందని, అయితే దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాలని చెప్పామన్నారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించిన ఇండెంట్ ఇంకా తమకు రాలేదని చెప్పారు. పరీక్షల్లో ఆన్లైన్ విధానం తీసుకువచ్చి పారదర్శకతకు, నిష్పక్షపాతానికి పెద్దపీట వేశామని... 2 వేల వరకు సివిల్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేశామని పేర్కొన్నారు. గతంలో ఏపీపీఎస్సీ ఇలా చేసిన దాఖలాలు లేవన్నారు. ఈ సివిల్ ఇంజనీర్ పోస్టుల రాతపరీక్ష, ఇంటర్వ్యూలో 394.5 మార్కులతో సుంకేపల్లి సాయికిరణ్ టాపర్‌గా నిలిచారని... తరువాత స్థానంలో వరుసగా నడిపల్లి శ్రీధర్, పాలమాకుల అశ్విన్, బండి శిరీష, గుగులోతు బావుసింగ్, రూపావత్ శ్రావంత్ ఉన్నారని చక్రపాణి వెల్లడించారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, రోడ్లు భవనాల శాఖలో భర్తీకి నోటిఫై చేసిన 931 పోస్టుల్లో 904 పోస్టులను భర్తీ చేశామని.. వారిలో 335 మంది మహిళ లు ఉన్నారని తెలిపారు. -
ఆ కుర్చీ మాకొద్దు!
కర్నూలు తహసీల్దార్‌గా రావడానికి జంకుతున్న అధికారులు ► ప్రొటోకాల్ పేరుతో వెయిటర్‌ను తలపించే పోస్ట్ ► వీఐపీల సపర్యలకు నెల ఖర్చు రూ.60వేలు ► రూ.3లక్షలకు పైగా బిల్లులు పెండింగ్ ► ఖర్చుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ఆర్ఐలు! కర్నూలు సీక్యాంప్: ఒకప్పుడు కర్నూలు తహ సీల్దార్ కుర్చీకి ఎంతో డిమాండ్. ఈ సీటును ఆశించే వారు ఫైరవీలు, పాలకుల సిఫారసు, డబ్బు, లాంటి అస్త్రాలను ఉపయోగించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. కర్నూలు తహసీల్దార్ పోస్టు అనగానే ఆమడదూరం జరుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మండల రెవెన్యూ అధికారి ఉద్వోగం వీఐపీల భోజనం, టిఫిన్ల మెనూ తీసుకునే వెయిటర్‌ను తలపిస్తోంది. దీంతో కర్నూలు తహసీల్దార్లుగా వచ్చిన వారు ఐదునెలలు తిరగకముందే ఇక్కడ ఉండలేం.. మమ్మల్ని బదిలీ చేయండని మంత్రులు, కలెక్టర్ల వెంట తిరుగుతున్నారు. ప్రొటోకాల్ డ్యూటీలో భాగంగా వీఐపీల టిఫిన్ నుంచి మధ్యాహ్న భోజనం, రాత్రి డిన్నర్‌కు అయ్యే ఖర్చు తహసీల్దార్ కార్యాలయమే చూసుకోవాలి. వీటికంతా ప్రతి రోజు రూ. 20నుంచి 30వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.60,000వేలు అవుతుంది. దీనికి ఉన్నతాధికారులు బిల్లులు పెట్టుకోమంటారు. అయితే, ఎప్పుడు మంజూరవుతుందో చెప్పలేని పరిస్థితి. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు రూ. 1.50 లక్షలకు పైగా పెండింగ్ బిల్లులు ఇప్పటి వరకు రాకపోవడమే ఇందుకు ఉదాహరణ. అడ్డదార్లు తొక్కుతున్న ఆర్ఐలు: ఖర్చుపెట్టిన బిల్లులు సకాలంలో రాకపోవడంతో ఆర్ఐలు తమ జేబునుంచి పైసలు తీయలేక జనం మీద పడుతున్నారు. దీంతో ఎలాంటి సర్టిఫికేట్ కావాలన్నా ఒక రేటు నిర్ణయించి వచ్చిన డబ్బులతో వీఐపీలకు సేవలు చేస్తున్నారు రెవెన్యూ సిబ్బంది. ఇదేంటని జనం ప్రశ్నిస్తే వీఐపీల ఖర్చు ఎవరు పెట్టుకుంటారని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. వీరికి పై స్థాయి అధికారులు మద్దతు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గ్రూప్2 ఆఫీసర్ వెయిటర్ అయిన వేళ: ఆర్ఐలు ఫీల్డ్‌వర్క్‌కు వెళ్లినప్పుడు నేరుగా తహసీల్దార్ వెళ్లి వీఐపీల మెనూ తీసుకోవాలి. ఉదయం ఏ హోటల్ నుంచి టిఫిన్ తెప్పించాలి, మధ్యాహ్నం,రాత్రి ఏ హోటల్ నుంచి భోజనం తెప్పించాలని వీఐపీలను ఒక గ్రూప్2 ర్యాంక్ స్థాయి ఉద్యోగి అడగడం ఇక్కడ సాధారణంగా మారింది. దీన్ని చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. సమయమంతా వీఐపీల సేవలో గడిచిపోతే జనానికి పనులు చేసేదెప్పుడనే ప్రశ్న తలెత్తుతుంది. సంవత్సరం క్రితం బిల్లులు పెండింగ్‌లో కిందటి సంవత్సరంలో తహసీల్దార్‌గా పనిచేసిన శేషఫణి తన పిరియడ్‌లో ప్రోటోకాల్ డ్యూటీ కోసం దాదాపు రూ.3లక్షలు ఖర్చుపెట్టారు. శేషఫణి ప్రస్తుతం బదిలీ అయి దాదాపు 5 నెలలు కావస్తున్నా ఇంతవరకు రూ.3 లక్షల బిల్లు విడుదల కాలేదు. ఎప్పటి బిల్లులు అప్పుడే క్లియర్ చేస్తున్నాం: సాధ్యమైనంత వరకు మా దగ్గర ఉన్న బిల్లులన్నీ పూర్తి చేశాం. జిల్లాలో వివిధ తహసీల్దార్ కార్యాలయాలకు పెండింగ్, విడుదల చేసిన బిల్లుల సమాచారాన్ని చేరవేశాం. ప్రోటోకాల్‌కు సంబంధించిన సమాచారం తహసీల్దార్ దగ్గర ఉంటుంది. డీఆర్ఓ గంగాధర్‌గౌడ్ -
రాశి కాదు.. వాసి ముఖ్యం
నిరుద్యోగులు తల్లిదండ్రుల కలలు నేరవేర్చాలి రాష్ర్ట నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జోన్ : గ్రూప్ టూ ఉచిత శిక్షణకు ఎంతమంది అభ్యర్థులు అర్హులయ్యారనేది ముఖ్యం కాదని, ప్రతిభ కనబర్చి ఎంతమంది ఉద్యోగాలు సంపాదించారన్నదే ముఖ్యమని, రాశి కన్నా వాసి ముఖ్యం అన్నట్లు ప్రతి ఒక్కరూ నిర్ధేశిత లక్ష్యంతో రెండు నెలలు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డులో ఆదివారం మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా ఇస్తున్న గ్రూప్2 శిక్షణ తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సిద్దిపేటలో కానిస్టేబుల్ పోస్టుల నియమకాల కోసం నిర్వహించిన పరీక్షను దృష్టిలో పెట్టుకొని శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. యువత నుంచి వచ్చిన స్పందనతో మరోసారి గ్రూప్2 పరీక్షకు ఉచిత శిక్షణ తరగతులను సొంతంగా నిర్వహిస్తున్నానన్నారు. ఉచితం అనగానే నిర్లక్ష్యం, అశ్రద్ధ ఉంటుందని అది మంచిదికాదన్నారు. ప్రముఖ కోచింగ్ సంస్థ డీజేఆర్కు శిక్షణ బాధ్యత అప్పగించి, తాను సొంతగా డబ్బులు చెల్లిస్తున్నానన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించినప్పుడే తన అశయం నేరవేరుతుందన్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చే పిల్లల ఆర్ధిక పరిస్థితి తనకు తెలుసని, వారిపై ఆర్ధిక భారం పడకుండా ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రుల అశలను, కలలను నిజం చేయాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. ఉచిత భోజన వసతి కల్పిస్తాం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 350 మంది విద్యార్ధులు భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించినప్పుడే తన ప్రయత్నానికి సార్ధకత చేకూరుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పేదవర్గాలకు నాణ్యతతో కూడిన శిక్షణను అందించేందుకు చేసే కృషిలో భాగంగానే 717 మందికి ఆర్హత పరీక్షలు నిర్వహించగా 350 ఆర్హత సాధించడం జరిగిందన్నారు. వీరందరికి రెండు నెలల పాటు శిక్షణ ఇప్పించి, శిక్షణ సమయంలో ఉచిత భోజన వసతి కల్పిస్తామన్నారు. అదే విధంగా స్టడీ మెటీరియల్‌ను అందిస్తామన్నారు. అంతకు ముందు డీ జేఆర్ సంస్థ చీఫ్ జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాన నగరాలకే పరిమితమైన శిక్షణ తరగతులను మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేటలో నిర్వహిస్తున్నామన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకు ముందు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుంటామని మంత్రి హరీశ్‌రావు యువతీయువకులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ రాగుల సారయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, నాయకులు చిన్నా, మచ్చవేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగ యువతకు వరం
నేటి నుంచి గ్రూప్2లో శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపు సిద్దిపేట జోన్: నిరుద్యోగ యువతి, యువకులకు ఆర్థిక భారం తగ్గించి ఉద్యోగ అవకాశాలను ముంగిట్లోకి తెచ్చేందుకు తాను స్వంతంగా నియోజకవర్గంలో గ్రూప్ 2 ఉచిత శిక్షణను నిర్వహించనున్నట్లు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శనివారం రాత్రి ఆయన ఫోన్ ద్వారా స్థానిక విలేకరులకు వివరాలు వెల్లడించారు. గత నెలలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు గ్రూప్2 శిక్షణ కోసం అర్హత పరీక్షను నిర్వహించామన్నారు. పరీక్షకు 750 మంది హాజరుకాగా ఉచిత శిక్షణకు 350 మంది అర్హత సాధించారని చెప్పారు. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఏర్పాటు చేసిన తరహాలోనే గ్రూప్ 2 పోటీ పరీక్షలకు 45 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక పత్తిమార్కెట్లో ప్రారంభించనున్నామన్నారు. అర్హత సాధించిన 350 మంది అభ్యర్థులు మధ్యాహ్నం రెండు గంటలకు పత్తి మార్కెట్ యార్డుకు హాజరు కావాలన్నారు.అర్హత సాధించిన వారంతా శిక్షణకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల
-
ఇంటర్వ్యూలు యథాతథం
► గ్రూప్-2నోటిఫికేషన్లో స్పష్టత ఇచ్చిన టీఎస్పీఎస్సీ ► రాతపరీక్షకు 600, ఇంటర్వ్యూకు 75 మార్కులు... ► రెండు జోన్లు, మల్టీ జోన్ పోస్టుల విధానమూ కొనసాగుతుంది సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 పోస్టులకు ఇంటర్వ్యూ విధానం యథాతథంగా కొనసాగుతుంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్లో టీఎస్పీఎస్సీ ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. పలు పోస్టులకు ఇంటర్వ్యూలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్రంలో గ్రూప్-2 పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుందా, ఉండదా అన్న చర్చ కొనసాగడం తెలిసిందే. అయితే అవి గ్రూప్ 2 పోస్టులు గెజిటెడ్ పోస్టులని, కేంద్ర సర్వీసుల్లో గ్రూప్-ఏ పోస్టులతో సమానమైనవని రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ ఇదివరకే కేంద్రానికి తెలియజేశాయి. ఆ మేరకే గ్రూప్-2 పోస్టులకు ఇంటర్వ్యూ విధానాన్ని కొనసాగిస్తూ నోటిఫికేషన్లో పరీక్ష విధానాన్ని వెల్లడించింది. గ్రూప్-2లో 600 మార్కులకు రాత పరీక్ష, 75 మార్కులకు ఇంటర్వ్యూ.. మొత్తంగా 675 మార్కులుంటాయి. ఇక రాష్ట్రంలో రెండు జోన్ల విధానం, మల్టీ జోన్ పోస్టుల విధానం ఉంటాయి. పోస్టులవారీగా విద్యార్హతలు... గ్రూప్- 2 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులతోపాటు ఇతర పోస్టులకు ఏదైనా డిగ్రీ చేసిన వారంతా అర్హులే. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఏదేని డిగ్రీతోపాటు నిర్ణీత శారీర దారుఢ్యమూ ఉండాలి. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు మాత్రం బీఎస్సీ అగ్రికల్చర్ లేదా బీఎస్సీ డ్రైలాండ్ అగ్రికల్చర్, పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ ప్రొటెక్షన్, ఆర్గానిక్ ఫార్మింగ్) చేసిన వారు అర్హులు. వీటి పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, కరీంనగర్‌లలో ఉంటాయి. వాటర్ వర్క్స్ టెక్నీషియన్ పోస్టులకు ఐటీఐ డ్రాట్స్‌మెన్ సివిల్, ఐటీఐ ఎలక్ట్రికల్, ఐటీఐ మెకానికల్ చేసి రెండేళ్ల అనుభవమున్న వారు అర్హులు. ఇందులో 10 సివిల్, 19 ఎలక్ట్రికల్, 15 మెకానికల్ పోస్టులున్నాయి. వాటర్ వర్క్స్‌లో పని చేసే ఉద్యోగులకు గరిష్ట వయోపరిమితి (రిటైర్మెంట్ వరకు) లేదు. వీటి పరీక్ష కేంద్రాలు హైదరాబాద్; కరీంనగర్, వరంగల్‌లలో ఉంటాయి. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు సీఏ/ఐసీడబ్ల్యూఏ చేసి రెండేళ్ల అనుభవమున్నవారు అర్హులు. ఈ పోస్టులకు దరఖాస్తులను బట్టి రాత పరీక్ష లేదా ఆన్లైన్ పరీక్షను (కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్టు) నిర్వహిస్తారు. ఎవరు అర్హులంటే... గ్రూప్-2లోని ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు డిగ్రీ చేసిన 18-28 ఏళ్ల మధ్య వయసున్న జనరల్ అభ్యర్థులు అర్హులు. సామాజిక రిజర్వేషన్లు అదనం. మిగతా పోస్టులకు డిగ్రీతో పాటు 18-44 ఏళ్ల వయసున్న జనరల్ అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ల ప్రకారం వయో పరిమితి సడలింపు ఇందుకు అదనం. సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు కనీస వయసు 20 ఏళ్లు. లా చేసిన వారికి ప్రాధాన్యం. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మినహా ఇతర పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం ఇచ్చిన వయోపరిమితి సడలింపుతో పాటు అదనంగా ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. వికలాంగులైతే సాధారణ సడలింపులకు తోడు మరో పదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. అయితే మొత్తంగా సడలింపు 58 ఏళ్లకు మించరాదు (ఎందుకంటే ప్రభుత్వోద్యోగులైన వికలాంగులకు మరో ఐదేళ్లవయోపరిమితి ఉంటుంది). పరీక్ష ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.120. ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, నిరుద్యోగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. హాల్ టికెట్లను పరీక్షకు 7 రోజుల ముందునుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి లెక్క ఇదీ.. ఎక్సైజ్ సబ్ఇన్స్పెక్టర్ మినహా ఇతర అన్ని పోస్టులకు.. విభాగం సాధారణ ప్రభుత్వం రిజర్వేషన్ మొత్తం గరిష్ట వయోపరిమితి ఇచ్చిన సడలింపు సడలింపు జనరల్ 34 10 0 44 ఎస్సీ, ఎస్టీ, బీసీ 34 10 5 49 ప్రభుత్వోద్యోగులు 34 10 5 49 ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్లు 34 10 3 47 ఎక్స్ సర్వీస్‌మెన్ 34 10 3 47 వికలాంగులు 34 10 10 54 సెన్సెస్‌లో పని చేసినవారు 34 10 3 47 -
గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల
⇒ 439 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రీన్ సిగ్నల్ ⇒ 311 గ్రేడ్-2 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, మెట్రో వాటర్‌వర్క్స్‌లో ⇒ 44 గ్రేడ్-2 టెక్నీషియన్, 2 డీజీఎం పోస్టులకూ నోటిఫికేషన్లు ⇒ అన్నింటికీ నేటి నుంచే ఆన్లైన్లో దరఖాస్తులు ⇒ అర్హతలు, వయోపరిమితి వివరాలు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. ప్రభుత్వం మూడు నెలల కిందట ఆమోదించిన 439 గ్రూప్ 2 పోస్టులతోపాటు వ్యవసాయశాఖలో 311 గ్రేడ్-2 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో) పోస్టులు, హైదరాబాద్ జల మండలిలో 44 గ్రేడ్-2 టెక్నీషియన్ పోస్టులు, 2 డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం-ఫైనాన్స్) పోస్టులతో కలిపి మొత్తం 796 పోస్టుల భర్తీకి బుధవారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రమణ్యన్ ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్ 2 రాత పరీక్షలను 2016 ఏప్రిల్ 24, 25 తేదీల్లో నిర్వహించాలని తాత్కాలికంగా తేదీలను ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని పోస్టులకూ గురువారం నుంచే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, వయోపరిమితి, సిలబస్ తదితర అంశాలను గురువారం నుంచి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందవచ్చన్నారు. ఏప్రిల్‌లోగా మరిన్ని పోస్టులు ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఆర్థికశాఖ ఇప్పటికే పంపిన దాదాపు 10 వేల పోస్టుల్లో గ్రూపు-2 పోస్టులతోపాటు గ్రూపు-3, గ్రూపు-4 వంటి పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులన్నింటికీ జనవరి లేదా ఫిబ్రవరిలో కేసీఆర్ ఆమోదం లభిస్తుందని కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. ఎంత ఆలస్యమైనా ఏప్రిల్ నాటికైతే ప్రభుత్వం నుంచి ఎలాగైనా ఆమోదం లభిస్తుందని పేర్కొంటున్నాయి. దీంతో ఆయా పోస్టులను సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా ఇదే నోటిఫికేషన్ పరిధిలోకి తేవచ్చని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. తప్పిన వయో పరిమితి తంటా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం గత జూలై 27న పదేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి ఏడాదిపాటు అమల్లో ఉంటాయిని అందులో పేర్కొంది. అయినప్పటికీ నియామక నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఏ సంవత్సరంలో (కేలండర్ ఇయర్) ఉత్తర్వులు జారీ చేస్తుందో ఆ సంవత్సరపు డిసెంబర్ 31 వరకు ఆ ఉత్తర్వులు వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31లోగా గ్రూప్-2 వంటి ప్రధానమైన నోటిఫికేషన్ రాకపోతే తమకు వయోపరిమితి పెంపు వర్తించక నష్టపోయే పరిస్థితి వ స్తుందని చాలా మంది అభ్యర్థులు ఆందోళన చెందారు. అయితే వారి ఆందోళనకు తెరదించుతూ టీఎస్పీఎస్సీ బుధవారం (డిసెంబర్ 30న) నోటిఫికేషన్లు జారీ చేసింది. ఫలితంగా అభ్యర్థులందరికీ ప్రభుత్వం ఇచ్చిన గరిష్ట వయోపరిమితి పెంపు వర్తించనుంది. ఇక ప్రభుత్వం మరిన్ని పోస్టులకు అనుమతి ఇచ్చినా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా ఇదే నోటిఫికేషన్ పరిధిలోకి తీసుకువచ్చే వీలుంది. దీంతో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో కొత్త పోస్టులు వచ్చినా.. ఇదే నోటిఫికేషన్ కిందకే వస్తాయి కనుక సమస్య ఉండదు. గ్రూపు-2తోపాటు ఇతర నోటిఫికేషన్ల వివరాలు నోటిఫికేషన్ నంబర్ కేటగిరీ పోస్టుల సంఖ్య దరఖాస్తులు ప్రారంభం దరఖాస్తుల ముగింపు తాత్కాలిక పరీక్ష తేదీ 20/2015 గ్రూప్-2 439 31/12/2015 09/02/2016 24/04/2015, 25/04/2015 17/2015 డీజీఎం 02 31/12/2015 22/01/2016 21/02/2016 18/2015 గ్రేడ్-2 టెక్నీషియన్ 44 31/12/2015 28/01/2016 మార్చిలో (తేదీ తరువాత ప్రకటిస్తారు.) 19/2015 గ్రేడ్-2 ఏఈవో 311 31/12/2015 25/01/2015 మార్చిలో (తేదీ తరువాత ప్రకటిస్తారు.). గ్రూప్-2లో కేటగిరీ వారీగా పోస్టులు కేటగిరీ పోస్టుల సంఖ్య గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్ 19 అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 110 గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్ 23 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (పంచాయతీరాజ్) 67 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 220 మొత్తం 439 -
గ్రూపు-2లో ఇప్పటికే 302 పోస్టులు
⇒ విభజన లెక్కలు తేలితే రెట్టింపునకు మించి రానున్న పోస్టులు ⇒ అందులో విభాగాధిపతుల కార్యాలయాల్లోనివే ఎక్కువ ఖాళీలు ⇒ డిగ్రీ స్థాయి గ్రూపు-4లో ఇప్పటికే 192 పోస్టుల భర్తీకి నిర్ణయం ⇒ డిగ్రీతో 147 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు గ్రీన్‌సిగ్నల్ ⇒ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు 1,543 పోస్టులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎక్కువ మంది నిరుద్యోగులు గ్రూపు-1, గ్రూపు-2, టీచర్లు, లెక్చరర్, గ్రూపు-4లోని జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ తదితర నియామక నోటిఫికేషన్ల కోసమే ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 25 వేల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించడంతో ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు వస్తాయన్న ఆంచనాల్లో మునిగిపోయారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఏయే నోటిఫికేషన్లు జారీ అవుతాయన్న ఆశల్లో పడ్డారు. ఉపాధ్యాయులు, లెక్చరర్ల వ్యవహారం రేషనలైజేషన్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో ముడిపడి ఉన్నందున.. మిగతా పోస్టులైన గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-4 నోటిఫికేషన్లపైనే ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఈసారి సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు ఎక్కువ వస్తుండటంతో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వీటికోసం సిద్ధమవుతున్నారు. గ్రూప్స్‌పై దృష్టి... ఎక్కువ మంది నిరుద్యోగులు శిక్షణ కేంద్రాల్లో చేరి మరీ శిక్షణ పొందుతున్న గ్రూపు-2 పోస్టులు 302 ఉన్నట్లు అధికారులు లెక్కతేల్చారు. ఇటీవల కేసీఆర్ భర్తీకి ఆమోదం తెలిపిన 17 వేల పోస్టుల్లో ఇవి కూడా ఉన్నాయి. రానున్న రోజుల్లో గ్రూపు-2లో భారీ సంఖ్యలో పోస్టులు రానున్నాయి. శాఖాధిపతి కార్యాలయాలు, సచివాలయంలోని ప్రధాన కేటగిరీలు అయిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ వంటి పోస్టులు గ్రూపు-2లోనే భర్తీ చేయాల్సి ఉంది. అయితే వాటిల్లో ఒక్కదానికి కూడా ఇంతవరకు క్లియరెన్స్ లభించలేదు. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయితే అధిక సంఖ్యలో ఖాళీలు ఏర్పడనున్నాయి. ఇవన్నీ టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సినవే. ఇక డిగ్రీ స్థాయి గ్రూపు-4లో గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 192 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. ఇంటర్మీడియెట్, పదో తరగతి అర్హతతో భర్తీ చేసే గ్రూపు-4 పోస్టుల వివరాలు రావాల్సి ఉంది. ఇవీ వేలల్లో ఉండనున్నాయి. గ్రూపు-1లో మాత్రం ఇప్పటివరకు ఒక డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, 12 అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టుల్లో మాత్రమే క్లియర్ వేకెన్సీలు ఉన్నాయి. ఉద్యోగుల విభజన పూర్తయితే ఇందులో మరిన్ని పోస్టులు రానున్నాయి. డిప్యూటీ కలెక్టర్లు, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు, పోలీసు డీఎస్పీ, డీఎస్పీ జైల్స్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ తదితర కేటగిరీల్లో విభజన తరువాతే పూర్తిగా ఖాళీల లెక్క తేలనుంది. మరోవైపు డిగ్రీ అర్హతతో 147 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కానుంది. ఎక్కువగా ఇంజనీర్ పోస్టులు త్వరలో భర్తీ చేయనున్న వాటిల్లో అత్యధికంగా 10,810 పోస్టులను పోలీసు విభాగంలోనే భర్తీ చేయనుండగా ఆ తరువాత స్థానంలో ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ ద్వారా 1,275 అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనుండగా డిపార్ట్మెంటల్ సెలెక్షన్ కమిటీల ద్వారా 200 అసిస్టెంట్ ఇంజనీర్, 68 సబ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. -
‘సమస్య’ తీరుతోంది!
గ్రూప్1లో ‘డేటా ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’కు మంగళం సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1, గ్రూప్-2 సిలబస్‌లో మార్పులు రాబోతున్నాయి. పరీక్ష విధానంలో పెద్దగా మార్పులు చేయకపోయినా.. సిలబస్‌లో మాత్రం మార్పులు తీసుకురావాలని సమీక్ష కమిటీ నిర్ణయించింది. ముఖ్యంగా చాలా మంది అభ్యర్థులకు ‘సమస్య’గా మారిన ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ అంశానికి ప్రాధాన్యత తగ్గించాలని భావిస్తోంది. గ్రూప్-1 ఐదో పేపర్‌గా ఉన్న ఈ అంశం స్థానంలో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ని ప్రవేశపెట్టాలని... ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ను 50 మార్కులకు కుదించాలని యోచిస్తోంది. దీనిపై 5న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. ప్రధానంగా గ్రూప్-1 మెయిన్స్ నాలుగో, ఐదో పేపర్లతో పాటు గ్రూప్-2లో పేపర్-2 సెక్షన్ 1లో, పేపర్-3 సెక్షన్-2లో మార్పులను తీసుకురావాలని భావిస్తోంది. గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1బీగా మార్పుచేస్తూ గతంలో ఉన్న ఉత్తర్వులను యథాతథంగా అమలు చేస్తేనే బాగుంటుందని కమిటీ అభిప్రాయపడుతోంది. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేయనుంది. ఈ పరీక్షల్లో మార్పులకు సంబంధించిన సిఫారసుల నివేదికను పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిశీలించిన అనంతరం ప్రభుత్వ ఆమోదం లభించాక అమల్లోకి వస్తాయి. చరిత్ర, రాష్ట్ర వివరాలు:గ్రూప్-2 రెండో పేపర్లోని సెక్షన్-1లో ఉన్న ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర స్థానంలో తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర సిలబస్‌ను ప్రవేశపెట్టాలని కమిటీ నిర్ణయించింది. ఇందులో శాతవాహనులు, కాకతీయులు, నిజాంల పాలన, ఆది హిందూ ఉద్యమం, నిజాం రాష్ట్ర జన సంఘం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల త్యాగాలు, తెలంగాణ భాష, సాంస్కృతిక వికాసం తదితర అంశాలను చేర్చబోతోంది. అలాగే పేపర్-3లో ఏపీ గ్రామీణాభివృద్ధి-సవాళ్లు స్థానంలో తెలంగాణ గ్రామీణాభివృద్ధి-సవాళ్లు అంశాన్ని చేర్చేందుకు కమిటీ సిద్ధమవుతోంది. ఇందులో వ్యవసాయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ప్రణాళిక, వ్యవసాయం, నీటి పారుదల రంగం, ఆదాయ స్థితిగతులు, రవాణా, పర్యాటక రంగాల స్థితిగతులు తదితర అంశాలు ఉంటాయి. ప్రధాన మార్పులు వీటిలోనే.. గ్రూప్-1లో ఒకటో పేపర్‌గా ఉన్న ‘జనరల్ ఎస్సే’లో తెలంగాణకు సంబంధించిన అంశాలతో సిలబస్‌ను మార్చుతారు. రెండో పేపర్లోని ‘ఆంధ్రప్రదేశ్‌లో వివిధ సాంస్కృతిక సామాజిక ఉద్యమాలు, సామాజిక చరిత్ర’ స్థానంలో ‘తెలంగాణలో వివిధ సాంస్కృతిక, సామాజిక ఉద్యమాలు, సామాజిక చరిత్ర, తెలంగాణ చరిత్ర, వారసత్వం, భౌగోళిక స్థితిగతు’లను చేర్చనుంది. మూడో పేపర్లోని ‘ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్రం తరువాత సామాజిక మార్పులు, భూ సంస్కరణలు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు బలాలు-బలహీనతలు’ స్థానంలో ‘తెలంగాణ రాష్ట్రంలో సామాజిక పరిస్థితులు, భూ సంస్కరణలపై సిలబస్’ను పొందుపరుస్తారు. ఇండియన్ పాలిటీ, సమాజం, పాలన తదితర అంశాలను కూడా దీనిలోనే చేర్చనుంది. నాలుగో పేపర్లో ఇప్పటి వరకు ఉన్న ‘భారతదేశ అభివృద్ధి సైన్స్, టెక్నాలజీ పాత్ర దాని ప్రభావం, లైఫ్ సెన్సైస్‌లో ఆధునిక పోకడలపై సాధారణ అవగాహన, పర్యావరణ సమస్యలు, అభివృద్ధి’ తదితర అంశాల్లోని ప్రధాన అంశాలను ఐదో పేపర్లోకి మార్చనుంది. నాలుగో పేపర్ స్వరూపాన్ని పూర్తిగా మార్చనుంది. ఇందులో భారతదేశ, తెలంగాణ ఆర్థిక అభివృద్ధి అంశాలను చేర్చనుంది. గత 15 ఏళ్లలో ఐదారు దఫాలుగా నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్‌లో చాలా మంది అభ్యర్థులు మొదటి నాలుగు పేపర్లలో మంచి మార్కులు సాధించినా... ఐదో పేపర్ అయిన ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’లో వెనుకబడి... ఇంటర్వ్యూకు వెళ్లలేకపోతున్నారని సమీక్ష కమిటీ పరిశీలనలో తేలింది. దీంతో ఐదో పేపర్లో ప్రస్తుతం ఉన్న ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ స్థానంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్‌ను ప్రవేశపెట్టబోతోంది. లైఫ్ సెన్సైస్‌లో ఆధునిక పోకడలు తదితర అంశాలు ఉండనున్నాయి. అయితే ఈ పేపర్లోని 150 మార్కుల్లో 100 మార్కులను వీటికి కేటాయించి... మిగతా 50 మార్కులను ‘డాటాఇంటర్ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ అంశాలకు కేటాయించే లా సిఫారసులను కమిటీ సిద్ధం చేసినట్లు తెలిసింది.