సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా పకడ్భందీ ఏర్పాట్ల మధ్య గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షల నిర్వహణను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షించారు.
గ్రూప్-2 పరీక్షకు 4,83,535 అభ్యర్థులు దరఖాస్తు చేయగా 4,63,517 మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. పరీక్షలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదు. చిత్తూరు జిల్లాలో ఫేక్ అడ్మిట్ కార్డుతో పరీక్షకు హాజరైన ఒకరిని పట్టుకున్నారు. నకిలీ హాల్ టికెట్ తయారు చేసిన వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఏ ఉద్దేశంతో నకిలీ హాల్ టికెట్లతో పరీక్ష రాసేందుకు యత్నించారనే అంశంపై పోలీసులు విచారిస్తున్నారు.
గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫలితాలు వీలైనంత త్వరలో విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. జూన్, జూలైలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందన్నారు. మార్చి 17న గ్రూప్-1 పరీక్షను పకడ్భందీగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఇంటర్ పరీక్షల వల్ల గ్రూప్-1 పరీక్షకు సెంటర్లకు కొరత వచ్చే అవకాశం లేదన్నారు. గ్రూప్-1 పరీక్షను వాయిదా వదంతులు ఎవరూ నమ్మొద్దన్నారు. పరీక్షలు వాయిదా పడతాయనే వదంతులు నమ్మకుండా అభ్యర్థులు ప్రిపేర్ కావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment