టీ20 ప్రపంచకప్ 2024లో అజేయ జట్టుగా ఉన్న సౌతాఫ్రికాకు ఏ జట్టుకు ఎదురుకాని కష్టం వచ్చి పడింది. ఆ జట్టు ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడితే ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించే ప్రమాదంలో పడుతుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో గెలిచినా సెమీస్ అవకాశాలు ఇంకా సంక్లిష్టంగానే ఉన్నాయి. ఆ జట్టు సూపర్-8లో తమ చివరి మ్యాచ్‌లో ఓడితే ఏకంగా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది.
గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌లు.. సూపర్-8లో రెండు మ్యాచ్‌లు గెలిచినా కేవలం ఒక్క ఓటమే సౌతాఫ్రికా కొంపముంచుతుంది. ఆ జట్టుకు ఇలాంటి అనుభవాలు కొత్త కానప్పటికీ.. ఈసారి మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం మంచి జట్టు కలిగి ఉండి కూడా ప్రపంచకప్ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంటుంది.
ఇలా జరిగిందా..
గ్రూప్-2లో భాగంగా సౌతాఫ్రికా రేపు (జూన్ 24) ఉదయం 6 గంటలకు (భారతకాలమానం ప్రకారం) జరుగబోయే మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓడి.. దీనికి ముందు జరిగే మ్యాచ్‌లో యూఎస్‌ఏపై ఇంగ్లండ్ 10 కంటే ఎక్కువ పరుగులు లేదా ఓవర్ మార్జిన్ తేడాతో గెలిస్తే.. వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరతాయి.
అదెలా అంటే.. యూఎస్‌ఏపై ఇంగ్లండ్, సౌతాఫ్రికాపై వెస్టిండీస్ గెలిస్తే.. అప్పుడు మూడు జట్ల (వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా) ఖాతాల్లో తలో నాలుగేసి పాయింట్లు ఉంటాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ ఆధారంగా వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరతాయి. సౌతాఫ్రికా ఇంటిముఖం పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఇంగ్లండ్‌పై యూఎస్‌ఏ అయినా గెలవాలి లేదా విండీస్‌పై సౌతాఫ్రికా అయినా గెలవాలి.
Comments
Please login to add a commentAdd a comment