రాణించిన నెదర్లాండ్స్‌ బ్యాటర్లు.. సౌతాఫ్రికా టార్గెట్‌ ఎంతంటే..? | T20 WC 2022: Netherlands Set 159 Runs Target To South Africa | Sakshi
Sakshi News home page

T20 WC 2022: రాణించిన నెదర్లాండ్స్‌ బ్యాటర్లు.. సౌతాఫ్రికా టార్గెట్‌ ఎంతంటే..?

Published Sun, Nov 6 2022 7:09 AM | Last Updated on Sun, Nov 6 2022 7:25 AM

T20 WC 2022: Netherlands Set 159 Runs Target To South Africa - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-2లో ఇవాళ (నవంబర్‌ 6) అత్యంత ​కీలకమైన మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలుత సౌతాఫ్రికా-నెదర్లాండ్స్‌, ఆతర్వాత పాకిస్తాన్‌-బంగ్లాదేశ్‌, భారత్‌-జింబాబ్వే జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెమీస్‌ రేసులో నిలిచిన భారత్‌, సౌతాఫ్రికా, పాకిస్తాన్‌ జట్లకు ఈ మ్యాచ్‌లు అత్యంత కీలకంగా మారాయి. 

అడిలైడ్‌ వేదికగా భారతకాలమానం ప్రకారం ఉదయం 5:30 గంటలకు ప్రారంభమైన సౌతాఫ్రికా-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. స్టెఫాన్‌ మైబుర్గ్‌ (37), మ్యాక్స్‌ ఓడౌడ్‌ (29), టామ్‌ కూపర్‌ (35), కొలిన్‌ ఆకెర్‌మన్‌ (41 నాటౌట్‌) ఓ మోస్తరుగా రాణించడంతో నెదర్లాండ్స్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో కేశవ్‌ మహారాజ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. అన్రిచ్‌ నోర్జే, ఎయిడెన్‌ మార్క్రమ్‌లకు తలో వికెట్‌ దక్కింది. 

ఈ మ్యాచ్‌ అనంతరం ఇదే వేదికపై 9:30 గంటలకు పాకిస్తాన్‌-బంగ్లాదేశ్‌ తలపడనున్నాయి. సెమీస్‌ బెర్త్‌పై అరకొర ఆశలున్న పాకిస్తాన్‌ ఈ మ్యాచ్‌లో తప్పనసరిగా గెలవాల్సి ఉంది. ఇక, భారత్‌-జింబాబ్వే మ్యాచ్‌ విషయానికొస్తే.. మెల్‌బోర్న్‌ వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే, గ్రూప్‌-2లో అగ్రస్థానంతో సెమీస్‌కు దూసుకెళ్తుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement