టీఎస్‌పీఎస్సీ నిర్వహిం చిన గ్రూప్-2 పరీక్షల్లో అక్రమాలు, లోపా లు జరిగాయని పీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్ ఆరోపించారు. గాంధీ భవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ, డీకోడింగ్ లేకుండా పరీక్ష జరిగిందని, ఓఎంఆర్ షీటుపై ఫొటోలు లేకుండా, బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయ కుండా.. ఎవరి పరీక్ష ఎవరు రాశారో తెలి యకుండా నిర్వహించారన్నారు. సింగరేణి ప్రశ్నపత్రాల లీకు, ఎంసెట్ లీకు, తాజాగా గ్రూప్-2 జరిగిన తీరుతో ప్రభుత్వ అసమ ర్థత బయటపడిందన్నారు.