- ఆనం కళాకేంద్రం వద్ద ధర్నా
- వేరే ప్రాంతాల్లోని స్టడీసర్కిల్‌కు వెళ్లాలని అధికారుల సూచన
- నాయకులు, అధికారుల మధ్యలో నలిగిపోతున్న అభ్యర్థులు
గ్రూప్ 2,3 అభ్యర్థుల ఆందోళన
Published Wed, Mar 8 2017 11:07 PM | Last Updated on Sat, Aug 18 2018 4:27 PM
కంబాలచెరువు(రాజమమహేంద్రవరం):
ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఆయా కులాలకు చెందిన వారికి స్టడీసర్కిళ్లలో గ్రూప్–2,3 ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా రాజమహేంద్రవరంలోని స్వయంకృషి స్టడీ సర్కిల్‌లో రాష్ట్రంలోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరంలకు చెందిన అభ్యర్థులు రెండు నెలలుగా శిక్షణ పొందుతున్నారు. వీరిలో గ్రూప్– 2లో బీసీ కార్పొరేష¯ŒS విద్యార్థులకు ప్రిలిమ్స్ శిక్షణ పూర్తవ్వగా, గ్రూప్– 3లో ఎస్సీ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. గ్రూప్–2లో 300 మందికిపైగా అభ్యర్థులకు ప్రభుత్వం నుంచి స్టైఫండ్ రావల్సి ఉంది. దూరప్రాంతాల నుంచి వచ్చిన వీరంతా గ్రూప్స్ శిక్షణ పొందుతూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రిలిమ్స్ రాశారు. మెయి¯Œ్సకు సిద్ధపడుతుండగా ప్రభుత్వం నుంచి రావాలి్సన రూ.8వేలు స్టైఫండ్ రాకపోవడంతో రూము అద్దెలు చెల్లించలేక, తినేందుకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులకు గురతున్నారు.
అనుమతి రాక..
గ్రూప్–3లో శిక్షణ పొందుతున్న 254 మంది విద్యార్థుల విషయానికి వస్తే ప్రభుత్వం నుంచి స్వయంకృషి స్టడీసర్కిల్‌లో శిక్షణ పొందేందుకు పూర్తి అనుమతి రాకపోవడంతో వారందరినీ దూరప్రాంతాల్లోనున్న స్టడీసర్కిళ్లకు వెళ్లి శిక్షణ పొందాలని అధికారులు చెప్పడంతో అభ్యర్థులు అంతదూరం వెళ్లలేక ఆవేదన చెందుతున్నారు. స్టడీసెంటర్‌కు అనుమతి వస్తుందని అభ్యర్థులకు నిర్వాహకులు ఒక నెలనుంచి శిక్షణ ప్రారంభించారు. అయితే కొందరు అధికారులు, నాయకుల స్వార్థరాజకీయాలతో స్వయంకృషి స్టడీసెంటర్‌లో శిక్షణకు అనుమతి రాకుండా అడ్డుకుని గ్రూప్స్‌కి శిక్షణపొందే అభ్యర్థులను ఇబ్బందులపాలయ్యేలా చేస్తున్నారని స్టడీసెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై స్థానిక ఆనం కళాకేంద్రం వద్ద జరుగుతున్న ఒక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వస్తున్నారని తెలిసి అభ్యర్థులంతా అక్కడికి చేరుకుని ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై పై అధికారులతో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
పిల్లలను వదిలి ఎలా వెళ్లం
నాకు చిన్న పిల్లలు ఉన్నారు. మా వారు ఉద్యోగం చేస్తున్నారు. వాళ్లను వదిలి ఎక్కడో వైజాగ్‌లో నున్న స్టడీసెంటర్‌కు వెళ్లి శిక్షణ పొందాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎలా వెళ్లగలం. సమయం తక్కువ ఉంది. వేరే ప్రాంతానికి వెళ్లి ఏం చేయగలం.
–పి.సూర్యకుమారి, గ్రూప్–3 అభ్యర్థిని, రాజమహేంద్రవరం
ఎక్కడో దూరప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతున్నాం
మాకు ప్రభుత్వం నుంచి రావాలి్సన స్టైఫండ్ ఇంకా రాలేదు. స్టడీసెంటర్ నిర్వాహకులు శిక్షణ అయితే ఇస్తున్నారు కాని ఇక్కడ ఉండేందుకు మేము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. రూములకు అద్దె చెల్లించలేక, తినేందుకు డబ్బులు లేక అవస్థలు పడుతున్నాం.
–వి,రాజేశ్వరరావు, గ్రూప్ 2 అభ్యర్థి, విశాఖపట్నం
Advertisement
Advertisement