
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలకు లైన్ క్లియరైంది. ఈ నెల 15,16 తేదీల్లో ఉన్న పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
ఒకే తేదీల్లో గ్రూప్2, స్టాఫ్ సెలక్షన్ పరీక్షలుండడం వల్ల వాయిదా వేయాలని అభ్యర్థులు హైకోర్టుకు విన్నవించారు. వీరి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు గ్రూప్ 2 పరీక్ష తేదీల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కాగా, తెలంగాణలో 2016లో జరిగిన గ్రూప్ 2 పరీక్ష తర్వాత మళ్లీ ఇప్పుడు జరుగుతుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment