సాక్షి,హైదరాబాద్:ఇటీవల జరిగిన గ్రూప్-2(Group-2) పరీక్ష ‘కీ’ని శనివారం(జనవరి 10) విడుదల చేస్తామని, ఇక నుంచి పరీక్షలు జరిగిన వారం పది రోజుల్లోనే ఫలితాలు వెల్లడిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) చైర్మన్ బుర్రా వెంకటేశం(Burra Venkatesham) తెలిపారు.
బుధవారం వెంకటేశం మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు. ‘గతంలో జరిగిన తప్పిదాలు కమిషన్‌లో ఇకపై జరగవు. ఫలితాలు ఎప్పుడు వస్తాయో తెలియక అభ్యర్థులు సతమతమవుతున్నారు.
ఇకపై వేచి చూసే ధోరణి ఉండదు.ప్రతీ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఏళ్ల తరబడి వేచి చూడకుండా ప్రతి ఏడాది పరీక్షలు జరగాలన్నది మా నిర్ణయం. టీజీపీఎస్సీని పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తున్నాం.సైంటిఫిక్ డిజైన్ ఇక్కడ లోపించింది అందుకే ప్రక్షాళన చేస్తున్నాం.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను ఆయా శాఖకు సంబంధించిన అధికారులు చూస్తారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని పరీక్షల ఫలితాలు మార్చి 31కల్లా విడుదల చేస్తున్నాం.పెండింగ్ అనేది ఉండదు’అని వెంకటేశం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment