హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా పడింది. అభ్యర్థుల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం.. డిసెంబర్‌కు పరీక్షను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నాం అధికారికంగా ప్రకటించింది.
ఆగష్టు 7, 8వ తేదీల్లో షెడ్యూల్ ప్రకారం పరీక్ష జరగాల్సి ఉంది. అయితే.. డీఎస్సీ పరీక్షలు పూర్తి కాగానే వెంటనే గ్రూప్ పరీక్షలు ఉండటం తో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తొలుత పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. అభ్యర్థుల ఆందోళనలు ఉధృతం కావడంతో వాయిదాకే మొగ్గు చూపించింది.
ఇదిలా ఉంటే.. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్‌లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన చేసింది. కానీ వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా డిసెంబర్‌కు వాయిదా వేస్తూ.. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు వెల్లడించింది.
మరోవైపు ఉద్యోగాభ్యర్థులతో సెక్రటేరియెట్‌లో ప్రభుత్వం చర్చలు జరిపింది. చర్చలు జరుగుతుండగానే.. వాయిదా ప్రకటన వెలువడడం గమనార్హం.
- గ్రూప్ 2 పోస్టులు పెంచుతాం అనే అంశం పై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు.
- గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని అడిగితే ప్రభుత్వం సానుకూలంగా స్పందించారు.
- డిసెంబర్ నెలలో గ్రూప్ 2 పెట్టాలని అడిగాం ప్రభుత్వం ఒకే అన్నది.
- మా డిమాండ్ల పై సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు.
:::గ్రూప్ -2 అభ్యర్థులు
- గ్రూప్ 2, 3 వాయిదాకు ప్రభుత్వం అంగీకరించింది.
- త్వరలో మళ్ళీ పరీక్షల నిర్వహణ పై తేదీలు ప్రకటిస్తుంది.
- విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం ఇది కాదు..ఇది ప్రజా ప్రభుత్వం.
:::ఎంపీ మల్లు రవి
- DSC పోస్టుల పై విద్యార్థులు పలు విజ్ఞప్తులు చేశారు.
- DSC ప్రాంతేతర అంశాల త్వరలో చర్చలు జరుపుతం అని సిఎం అన్నారు.
8ఏళ్లుగా BRS విద్యార్థులకు అన్యాయం చేసింది.
:::ఎంపీ బలరాం నాయక్
- గత విద్యార్థులను కనీసం పట్టించుకోలేదు
- ఇది ప్రజా ప్రభుత్వం అందుకే విద్యార్థులతో మాట్లాడింది.
- నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- నిరుద్యోగుల సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది.
- ఇది విద్యార్థి ప్రభుత్వం.
:::ఎంపీ అనిల్ కుమార్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment