గ్రూప్-2లో అక్రమాలు: పీసీసీ | Manavataray talked about group-2 | Sakshi
Sakshi News home page

గ్రూప్-2లో అక్రమాలు: పీసీసీ

Published Sun, Nov 13 2016 1:40 AM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM

Manavataray talked about group-2

సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ నిర్వహిం చిన గ్రూప్-2 పరీక్షల్లో అక్రమాలు, లోపా లు జరిగాయని పీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్ ఆరోపించారు. గాంధీ భవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ, డీకోడింగ్ లేకుండా పరీక్ష జరిగిందని, ఓఎంఆర్ షీటుపై ఫొటోలు లేకుండా, బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయ కుండా.. ఎవరి పరీక్ష ఎవరు రాశారో తెలి యకుండా నిర్వహించారన్నారు. సింగరేణి ప్రశ్నపత్రాల లీకు, ఎంసెట్ లీకు, తాజాగా గ్రూప్-2 జరిగిన తీరుతో ప్రభుత్వ అసమ ర్థత బయటపడిందన్నారు.

అవగాహన లేని ఇన్విజిలేటర్లతో పరీక్ష జరిగిందని, దీనివల్ల ఒకరి ప్రశ్నపత్రం మరొకరికి ఇచ్చారని.. తర్వాత తప్పులు తెలుసుకుని వైట్‌నర్‌తో తుడిచి, మరోసారి పేర్లు, నంబర్లు రాశారని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను కోర్టులు అంగీకరించవని, వీటిపై న్యాయ నిపుణులను సంప్రదించి నిరుద్యోగ అభ్యర్థుల తరఫున పోరాడు తామని ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement