గ్రూప్-2లో స్క్రీనింగ్ టెస్ట్ | Group 2 in the screening test | Sakshi
Sakshi News home page

గ్రూప్-2లో స్క్రీనింగ్ టెస్ట్

Published Thu, Aug 4 2016 3:20 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

గ్రూప్-2లో స్క్రీనింగ్ టెస్ట్

గ్రూప్-2లో స్క్రీనింగ్ టెస్ట్

మార్కులు, సిలబస్ ఖరారు
ఆన్‌లైన్లో పరీక్షల నిర్వహణ

 
 హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్-2 పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి పరీక్షల విధానం, సిలబస్‌పై ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం గ్రూప్2లో అత్యధికంగా ఉండే అభ్యర్థులను వడపోసేందుకు ముందుగా స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. గ్రూప్2కు నిర్దేశించిన 3 పేపర్లకు ఇది అదనంగా ఉంటుంది. వ డపోత అనంతరం మిగిలిన వారిని పోస్టులకు నిష్పత్తి ప్రకారం మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. వీరికి ఆన్‌లైన్లో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇదివరకు ఇచ్చిన జీవో 623కి సవరణ చేస్తూ ప్రభుత్వం తాజా జీవో విడుదల చేసింది.

గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్టు సిలబస్
ఎ:- కరెంటు అఫైర్స్-ఇష్యూస్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్ పాలిటిక్స్, ఎకనమిక్స్, సొసైటీ, సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్స్, స్పోర్ట్స్, కల్చర్ అండ్ గవర్నెన్స్
బి:- కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఫెడరలిజమ్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, యూనియ న్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, జ్యుడీషియరీ, జ్యుడికల్ రివ్యూ, లోకల్ గవర్నమెంట్, డైరక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, యూని యన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్ అండ్ లెజిస్టేటివ్ రిలేషన్స్ బిట్వీన్ యూని యన్ అండ్ స్టేట్ గవర్నెమెంట్స్, షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియా అడ్మినిస్ట్రేషన్.
సి:- ఎకనమిక్ డెవలప్‌మెంటు ఆఫ్ ఇండియా-ఎకనామీ ఆఫ్ మీడీవల్ ఇండియా, ప్రి ఇండిపెండెన్స్ ఇండియన్ ఎకానమీ, డెవ లప్‌మెంటు ప్లాన్స్ అండ్ ఎకనమిక్ అండ్ ఇండస్ట్రియల్ పాలసీస్, లేబర్ పాలసీస్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్సు, రోల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా, ఎకనమిక్ డిస్పారిటీస్ బిట్వీన్ రీజియన్స్ అండ్ పాప్యులేషన్ కేటగిరీస్.
 
 
మెయిన్స్  సిలబస్, మార్కులు
సబ్జెక్టు    మార్కులు
పేపర్1: జనర్ స్టడీస్    150
పేపర్2: 1.సోషల్ హిస్టరీ ఆఫ్ ఏపీ
(ద హిస్టరీ ఆఫ్ వేరియస్ సోషల్, కల్చరల్ మూవ్‌మెంట్సు)
2. జనరల్ ఓవర్‌వ్యూ ఆఫ్
ఇండియన్ కానిస్టిట్యూషన్    150
పేపర్3:- ప్లానింగ్ ఇన్ ఇండియా
అండ్ ఇండియన్ ఎకానమీ
కాంటెంపరరీ ప్రాబ్లెమ్స్ అండ్
డెవలప్‌మెంటు ఇన్ రూరల్ సొసైటీ
విత్ స్పెషల్ రిఫరెన్సు టు ఏపీ    150
మొత్తం    450
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement