వారిని క్రమబద్ధీకరించండి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1,700 మంది కాంట్రాక్ట్, 472 మంది పార్ట్‌టైమ్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం లేఖ రాశారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా వారి సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. పలు వర్సిటీల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం అధ్యాపకులను, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (కాంట్రాక్ట్)గా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ అధ్యాపకుల ధర్నాకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు.