Thamenin Veerabhadram
-
డాక్టర్ విఠల్.. ధన్యజీవి
హైదరాబాద్ : జీవించినంత కాలం ప్రజల కోసమే పనిచేసిన ధన్యజీవి డాక్టర్ ఏపీ విఠల్ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కొనియాడారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అభ్యుదయ వాదుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కమ్యునిస్టు మేధావి, ప్రజా వైద్యుడు డాక్టర్ ఏపీ విఠల్ సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా విఠల్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ.. విధానాలు, సిద్ధాంతాల పట్ల ఆయనకి ఉన్న అవగాహన ఎవరికీ లేదన్నారు. ఆయనతో స్నేహం చేయని వారు ఉండరని పేర్కొన్నారు. గురువుగా, సిద్ధాంత కర్తగా భావిస్తున్న తరుణంలోనే ‘నీవు మాస్ లీడర్‌వి’అని తనకు సర్టిఫికెట్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ విఠల్ చనిపోయేంత వరకు సీపీఎంని ప్రేమించారని పేర్కొన్నారు. మార్క్స్‌ని మార్క్సిస్టుగా పని చేయకుండా ఏ శక్తీ ఆపలేదని చెప్పడానికి డాక్టర్ విఠల్ ఒక ఉదాహరణ అని తమ్మినేని కొనియాడారు. కొండపల్లి పవన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.రామచంద్రమూర్తి, ప్రముఖ గేయ రచయితలు గోరేటి వెంకన్న, జయరాజు, టఫ్ అధ్యక్షురాలు విమలక్క, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు మన్నారం నాగరాజు, అంబేడ్కర్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ బహుదూర్, ప్రముఖ నవల రచయిత కె.వి.కృష్ణ కుమారి, మోదుగుపూల ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు, జి.రాములు, సీపీఐ నాయకుడు కందిమల్ల ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వరవరరావును తక్షణమే విడుదల చేయాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: విరసం అధ్యక్షుడు వరవరరావును అరెస్టు చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభ ద్రం ఖండించారు. తక్షణ మే ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, మానవ, ప్రజాస్వామ్య హక్కులపై తీవ్ర దాడి జరుగుతోందన్నారు. అబద్ధపు అభియోగాలు మోపి తన ప్రత్యర్థులను కేసుల్లో ఇరికిస్తోందన్నారు. దీనిలో భాగంగానే వరవరరావు, ప్రొఫెసర్ సత్యనారాయణ, జర్నలిస్టులు కూర్మనాథ్, క్రాంతి టేకుల ఇళ్లలో సోదాలు నిర్వహించారని విమర్శించారు. వరవరరావుది అక్రమ అరెస్టు: మంద కృష్ణ సాక్షి, హైదరాబాద్: ఒక లేఖ ఆధారంగా పౌరహక్కుల నేత వరవరరావును పుణే పోలీసులు అరెస్టు చేయడం దారుణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఆ లేఖ రాసింది మావోయిస్టులా? కాదా? అన్న విషయం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఈ లేఖను పోలీసులే సృష్టించారన్న పౌరహక్కుల నేతల ప్రశ్నకు సమాధానం చెప్పాలని మంగళవారం డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వెంటనే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. వరవరరావుపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలన్నారు. -
వారిని క్రమబద్ధీకరించండి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1,700 మంది కాంట్రాక్ట్, 472 మంది పార్ట్‌టైమ్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం లేఖ రాశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా వారి సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. పలు వర్సిటీల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం అధ్యాపకులను, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (కాంట్రాక్ట్)గా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ అధ్యాపకుల ధర్నాకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు.